ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ప్రభావం దేశీ స్టాక్ మార్కెట్‌పై పడింది. ఉదయం మార్కెట్ ఆరంభం అయినప్పటి నుంచి బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు వరుసగా నష్టాలు చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యవిధానం కట్టుదిట్టం చేయడంతో ఇన్వెస్టర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.
ఈరోజు స్టాక్ మార్కెట్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ నష్టాలతోనే ఆరంభమైంది. క్రితం రోజు 60,176 పాయింట్ల దగ్గర మార్కెట్ ముగియగా.. ఈ రోజు ఉదయం నష్టాల మధ్య 59,815 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత నష్టాలు కొనసాగుతూ ఉదయం 10 గంటల సమయానికి 403 పాయింట్లు నష్టపోయి 59,773 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 17,876 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చూడగా కోల్‌ఇండియా, టాటా స్టీల్, యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలు పొందాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో 0.17 శాతం క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment