లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ | Daily Stock Market Update In Telugu March 31 | Sakshi

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

Mar 31 2022 9:30 AM | Updated on Mar 31 2022 9:38 AM

Daily Stock Market Update In Telugu March 31 - Sakshi

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో సూచీలు సానుకూలంగా కదలాడుతుండటంతో దేశీ మార్కెట్‌ సూచీలు సైతం జోరు చూపిస్తున్నాయి. మరోవైపు ఎగిసిపడతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు కళ్లెం వేసేందుకు అమెరికా ప్రభుత్వం ఆయిల్‌ రిజర్వ్‌లు ఉపయోగిస్తామని ప్రకటించింది. దీంతో బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలను నాలుగు శాతం తగ్గాయి. ఇటు సింగపూర్‌, జపాన్‌, మార్కెట్లు సైతం పాజిటివ్‌గానే స్పందిస్తున్నాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58779 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ మొదైలంది. ఆ తర్వాత గరిష్టంగా 58,804 పాయింట్లను టచ్‌ చేసింది. అయితే ఆ తర్వాత అదే ఊపు కొనసాగించలేకపోయింది. ఉదయం 9:27 గంటల సమయంలో 91 పాయింట్ల లాభంతో 58,775 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 21 పాయింట్లు లాభపడి 17,519 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement