లాభాల్లో దేశీ సూచీలు | Daily Stock Market Update In Telugu May 17 | Sakshi
Sakshi News home page

లాభాల్లో దేశీ సూచీలు

Published Tue, May 17 2022 9:49 AM | Last Updated on Tue, May 17 2022 9:59 AM

 Daily Stock Market Update In Telugu May 17 - Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో ఆరంభమయ్యాయి. ఏషియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో కదులుతుండటం దేశీ మార్కెట్లకు కలిసి వచ్చింది. దీంతో ఇటు సెన్సెక్స్‌, అటు నిఫ్టీ రెండు సూచీలు దూసుకుపోతున్నాయి. ఈ రోజు ఎల్‌ఐసీ ఐపీవో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ కానుండటంతో ఇన్వెస్టర్ల ఫోకస్‌ దానిపై కేంద్రీకృతమై ఉంది.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 53,285 పాయింట్లతో మొదలైంది. ఒక దశంలో 53,400 పాయింట్ల గరిష్టాలను టచ్‌ చేసినా.. అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. ఉదయం 9:45 గంటల సమయానికి 366 పాయింట్ల లాభంతో 53,340 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 124 పాయిం‍ట్లు లాభపడి 15,966 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement