India Omicron Cases: 156 New Omicron Cases Recorded In One Day - Sakshi
Sakshi News home page

India Omicron Update: ఒక్కరోజే 156 కొత్త కేసులు, మహారాష్ట్రను దాటేసిన ఢిల్లీ

Published Mon, Dec 27 2021 12:57 PM | Last Updated on Mon, Dec 27 2021 1:24 PM

Omicron Update: India Logs Highest Single Day Cases Total Rises To 578 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 156 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 578కి చేరింది. బాధితుల్లో 151 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ సోమవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. 

ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఢిల్లీ తొలిస్థానానికి చేరింది. దేశరాజధానిలో ఒక్కరోజే 63 కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 43 కేసులు ఉన్నట్టు ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో సోమవారం రాత్రి 11 గంటల నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. కేసులు పెరిగితే మరిన్ని ఆంక్షలు అమలుచేసేందుకు కేజ్రీవాల్‌ సర్కార్ ప్రణాళిక సిద్ధంచేసింది.
(చదవండి: అప్రమత్తమైన ఢిల్లీ.. రాత్రి 11 నుంచి 5 వరకు కర్ఫ్యూ)

కోవిడ్‌ కేసులు
ఇక కోవిడ్‌ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,531 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల్లో 315 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 7,141 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 75,841 యాక్టివ్‌ కేసులున్నాయి. 
(చదవండి: ఆ డాక్టర్‌ భార్యకూ ఒమిక్రాన్‌.. తెలంగాణలో ఇది మొదటిసారి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement