![INSACOG Said Omicron XBB Most Prevalent Variant Across India - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/3/Omicron.jpg.webp?itok=VlTKUzxw)
న్యూఢిల్లీ: కోవిడ్-19 సబ్ వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుండడం అందుకు బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర పరిశోధన సంస్థ, సార్స్ కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియ్ ఇన్సకాగ్(ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ) ఈ కొత్త వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌బీబీ వేగంగా విస్తరిస్తోందని సోమవారం ఓ బులిటెన్ విడుదల చేసింది. ఎక్స్‌బీబీతో పాటు బీఏ.2.75, బీఏ.2.10 సైతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిపింది.
‘ముఖ్యంగా ఈశాన్య భారతంలో బీఏ 2.75 ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, వ్యాధి వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరుతున్న సంఘటనల్లో ఎలాంటి పెరుగుదల లేకపోవటం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్, దాని ఉప రకాలు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. XBB అనేది భారత దేశం అంతటా ప్రస్తుతం ప్రభావం చూపుతున్న అత్యంత ప్రబలమైన వేరియంట్. నమోదవుతున్న కేసుల్లో 63.2 శాతం ఎక్స్‌బీబీ వేరియంట్‌వే. బీఏ.2.75 కేసులు 46.5 శాతం, ఎక్స్‌బీబీ దాని ఉపరకాలు 35.8 శాతం ఉన్నాయి. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1ల వ్యాప్తిపై ఇన్సకాగ్ నిశితంగా పరిశీలిస్తోంది.’ అని బులిటెన్‌లో పేర్కొంది ఇన్సకాగ్.
ఇదీ చదవండి: ఆధునిక భారతదేశ చరిత్రపై విస్తృత పరిశోధనలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment