Covid Fourth Wave
-
Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు?
2019 డిసెంబర్ చివర్లో సాంప్రదాయంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. తర్వాత కొద్ది వారాల్లోనే ప్రపంచమంతా చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపించింది. మళ్లీ అదే డిసెంబర్లోనే మరో వేరియంట్ రూపంలో వైరస్ మనముందుకొచ్చింది. అసలు డిసెంబర్లోనే ఎందుకని వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇందుకు గల కారణాలేంటి? కరోనా ప్రధానంగా మూడు ప్రధాన మ్యుటేషన్లుగా మార్పు చెందింది. డిసెంబర్ 2020లో వ్యాప్తి చెందిన కరోనా ఆల్ఫా(B.1.1.7), బీటా(B.1.351), గామా(P.1)గా మార్పు చెందింది. మరుసటి ఏడాది 2021 డిసెంబర్లో ఉద్భవించింన ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మరుసటి ఏడాది డిసెంబర్ 2022లో ప్రధాన వేరియంట్ వ్యాప్తి చెందనప్పటికీ ఒమిక్రాన్‌లోనే BA.2, BA.5గా పరిణామం చెందింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న JN1 కూడా ఒమిక్రాన్ వేరియంట్లోని ఉపరకమే. ఇది కూడా డిసెంబర్లోనే వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్లోనే ఎందుకు? ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నుంచి కొవిడ్-19 కొత్త రకంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. శీతాకాలంలోని చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగానే వైరస్ మార్పు చెంది వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. డెల్టా వేరియంట్, మహమ్మారి మొదటి దశలోనూ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నేచర్ జర్నల్ పేర్కొంది. వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు ఉష్ణోగ్రత పడిపోతుంది. గాలి కూడా పొడిగా మారుతుంది. ఉత్తర అర్ధగోళంలోని దేశాలలో కోవిడ్-19 వ్యాప్తికి ఈ అంశాలే దోహదం చేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. చైనాలోని సిచువాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విశయాన్ని వెల్లడించారు. వెచ్చని పరిస్థితుల్లోని వారికంటే చల్లని పరిస్థితుల్లో నివసించేవారికి కరోనావైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వారి అధ్యయనం కనుగొంది. 'కొవిడ్-19 అనేది శ్వాసకోశ వైరస్. దీన్ని ఎదుర్కొనే క్రమంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి వైరస్, రెండోది మన శరీరం. వైరస్ నిరంతరం మార్పు చెంది వేరియంట్లుగా పరిణామం చెందుతోంది. మన శరీరం గత వేరియంట్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని కల్పించుకుంటే మరో రకమైన వేరియంట్ సవాళ్లను విసురుతోంది. అంటే కొత్త వేరియంట్‌కు మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది.' అని అమృత హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపు తెలిపారు. సెలవుల్లో పర్యటనలు.. కరోనా వేరియంట్ చైనాలో డిసెంబర్లోనే ఉద్భవించింది. నెలలోనే విపరీతంగా వ్యాప్తి చెందింది. ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో డిసెంబర్ నెలలో ఎక్కువగా సెలువులు ఉన్నాయి. క్రిస్టమస్ సెలవులు, చైనాలో జనవరిలో లునార్ న్యూ ఇయర్ వేడుకలు వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయి. ఈ సారి జేఎన్1 వేరియంట్ కూడా సరిగ్గా ఇదే సమయంలో వ్యాప్తి చెందుతోంది. అని డాక్టర్ దీపు తెలిపారు. భయం అవసరం లేదు.. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్ 1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇదీ చదవండి: Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు -
కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు!
ఆదిలాబాద్: కోవిడ్.. రెండేళ్ల క్రితం ప్రపంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం విదితమే. మహమ్మారి ముప్పు తప్పిందని భావిస్తున్న తరుణంలో మరోసారి తాజాగా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. జేఎన్–1 వేరియంట్ రూపంలో ముప్పు పొంచి ఉండటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో కొత్త వేరియంట్ ప్రభావం ఇంకా కనిపించనప్పటికి కేంద్రం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. వైరస్ కట్టడి దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 14న కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు జిల్లాలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కోవిడ్ టెస్టుల నిర్వహణతో పాటు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పీపీఈ కిట్స్, మాస్కులను సిద్ధంగా ఉంచారు. వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే శ్రేయస్కరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ కలవరం.. ప్రస్తుతం జేఎన్–1 వేరియంట్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 2020–21లో ప్రబలిన కోవిడ్ వైరస్‌తో జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. రెండేళ్లుగా కొత్తగా కేసులేమి నమోదు కాకపోవడంతో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అందరూ భావించారు. అయితే వైరస్ మళ్లీ కొత్త రూపంలో నమోదు కావడం జిల్లావాసులను కలవరానికి గురిచేస్తోంది. శీతాకాలం కావడంతో పాటు ఈ నెలాఖరు వరకు శుభ కార్యాలు ఎక్కువగా ఉండటం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు రానున్నాయి. వీటిల్లో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశముంటుంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కట్టడికి వైద్యారోగ్యశాఖ సన్నద్ధం! ప్రమాదకరమైన కొత్త వేరియంట్ కట్టడికి జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 14న మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ బోఽధనాసుపత్రితో పాటు పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సివిల్ కమ్యూనిటీ ఆసుపత్రులు కలిపి 96తో పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిర్ధారణ పరీక్షలతో పాటు పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించేలా వారికి దిశా నిర్దేశం చేశారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన మాస్కులు 1,47,270, పీపీఈ కిట్స్ 12,740ని సిద్ధంగా ఉంచారు. రిమ్స్, ఇతర ఆసుపత్రుల్లో కలిపి 1436 బెడ్స్‌ను సిద్ధం చేశారు. రిమ్స్‌లో వంద పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌తో కూడిన 455 పడకలు, 135 పడకలతో ఐసీయూ, వెంటిలేటర్స్‌తో కూడిన 157 పడకలను రిమ్స్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 19 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు. జిల్లాలో కోవిడ్ టెస్టుల వివరాలు : 7,40,181 పాజిటివ్‌గా తేలిన కేసులు : 19,707 జిల్లాలో సంభవించిన మరణాలు : 92 ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు : 5,52,815 సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు : 5,55,884 ప్రికాషన్ డోస్ తీసుకున్న వారు : 2,65,780 ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండాలి కొత్త వేరియంట్ కట్టడికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాం. వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్కులు, పీపీఈ కిట్లతో పాటు చికిత్సకు అవసరమైన మెడిసిన్‌ను అందుబాటులో ఉంచాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స పొందాలి. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో -
కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1
-
Covid XBB 1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్.. నాలుగో వేవ్ తప్పదా?
న్యూఢిల్లీ: దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ మహమ్మారి నుంచి బయపడినట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనాతో పాటు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితితో భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది. అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఎక్స్‌బీబీ రకం వేరియంట్‌ను ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించారు. అయితే భారత్‌లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ మున్ముందు పెరిగి దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ కోవిడ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాం వివరాల ప్రకారం XBB 1.16 వేరియంట్ కేసులు భారత్‌లోనే అధికంగా నమోదయ్యాయి. మనదేశంలో ఈ వేరియంట్ అధికారిక కేసుల సంఖ్య 48గా ఉంది. అమెరికా, సింగపూర్‌లో ఈ సంఖ్య 20 లోపే ఉండటం గమనార్హం. గత కొద్ది వారాలుగా భారత్‌లో ఈ వేరియంట్ కేసుల్లో సడన్ జంప్ నమోదైంది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో XBB 1.16 వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కోవ్‌స్పెక్ట్రం ప్రకారం XBB 1.16 వేరియంట్ XBB 1.15 నుంచి అవతరించలేదు. కానీ రెండూ XBB నుంచి వచ్చిన ఉపరకాలే. ప్రస్తుతానికి, కోవిడ్ XBB 1.16, XBB 1.15 లక్షణాల మధ్య ఎటువంటి తేడాలు లేవు. ఇది సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట వంటి లక్షణాలే ఉంటాయి. ఈ వేరియంట్ జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజీపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్ సర్వే వైరల్ -
కరోనా XBB వేరియంట్ గుప్పిట్లో భారత్.. ముప్పు తప్పదా?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సబ్ వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుండడం అందుకు బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర పరిశోధన సంస్థ, సార్స్ కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియ్ ఇన్సకాగ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) ఈ కొత్త వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌బీబీ వేగంగా విస్తరిస్తోందని సోమవారం ఓ బులిటెన్ విడుదల చేసింది. ఎక్స్‌బీబీతో పాటు బీఏ.2.75, బీఏ.2.10 సైతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిపింది. ‘ముఖ్యంగా ఈశాన్య భారతంలో బీఏ 2.75 ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, వ్యాధి వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరుతున్న సంఘటనల్లో ఎలాంటి పెరుగుదల లేకపోవటం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్, దాని ఉప రకాలు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. XBB అనేది భారత దేశం అంతటా ప్రస్తుతం ప్రభావం చూపుతున్న అత్యంత ప్రబలమైన వేరియంట్. నమోదవుతున్న కేసుల్లో 63.2 శాతం ఎక్స్‌బీబీ వేరియంట్‌వే. బీఏ.2.75 కేసులు 46.5 శాతం, ఎక్స్‌బీబీ దాని ఉపరకాలు 35.8 శాతం ఉన్నాయి. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1ల వ్యాప్తిపై ఇన్సకాగ్ నిశితంగా పరిశీలిస్తోంది.’ అని బులిటెన్‌లో పేర్కొంది ఇన్సకాగ్. ఇదీ చదవండి: ఆధునిక భారతదేశ చరిత్రపై విస్తృత పరిశోధనలు చేయాలి -
స్వల్ప శ్రేణిలోనే ట్రేడింగ్
ముంబై: స్టాక్ మార్కెట్ కొత్త ఏడాది తొలి వారంలోనూ ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులపై దృష్టి సారించే వీలుంది. గతవారం ప్రారంభమైన షా పాలీమర్స్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ముగుస్తుంది. అదే రోజున రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ లిస్టింగ్ ఉంది. ఇటీవల దిద్దుబాటులో దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో స్టాక్ సూచీలు రికవరీ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్ల మినహా అన్ని రంగాల షేర్లలో బుల్ ర్యాలీ కొనసాగడంతో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ‘‘ఆర్థిక మాంద్య భయాలు, చైనా కోవిడ్ పరిస్థితులు సూచీల అప్‌సైడ్ ర్యాలీని అడ్డుకుంటున్నాయి. ఇదే సమయంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. కావున సూచీలు కొంతకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవచ్చు. నిఫ్టీ 17800–18400 పాయింట్ల పరిధిలో స్వల్పకాలం పాటు స్థిరీకరణ కొనసాగొచ్చు. కన్సాలిడేషన్ దశను పూర్తి చేసుకున్నట్లయితే నిఫ్టీ జీవితకాల గరిష్టం 18,887 స్థాయిని చేరుకునేందుకు ప్రయత్నం చేయోచ్చు’’ అని ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ తెలిపారు. మార్కెట్‌ను నడిపించే అంశాలు ఇవీ.. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ గతేడాది డిసెంబర్ 14న జరిగిన అమెరికా ఫెడ్ రిజర్వ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్ వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. గత నాలుగుసార్లు 75 బేసిస్ పాయింట్లు పెంచిన ఫెడ్.. గత నెలలో 50 పాయింట్లు పెంచింది. దీంతో 4.25 – 4.50 శాతానికి ఫెడ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు చేరింది. గత 15 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. భవిష్యత్తు(2023)లోనూ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన వైఖరిపై ఫెడ్ మినిట్స్‌లో మరింత స్పష్టత వచ్చే వీలుంది. ఎఫ్‌పీఐలు ఓకే డిసెంబర్లో ఈక్విటీల్లోకి రూ. 11,119 కోట్ల పెట్టుబడులు గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ ఈక్విటీలలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం 2022 డిసెంబర్లో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీంతో వరుసగా రెండో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. కొన్ని ప్రపంచ దేశాలలో తిరిగి కోవిడ్–19 కేసులపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలోనూ దేశీ స్టాక్స్‌పట్ల ఎఫ్‌పీఐలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే ఇటీవల కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటం గమనార్హం! ఫలితంగా 2022 నవంబర్‌లో నమోదైన రూ. 36,239 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు భారీగా తగ్గాయి. యూఎస్‌లో మాంద్య భయాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ నిపుణులు హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలోనూ చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. భారీ అమ్మకాలు దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు 2022లో భారీగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూఎస్ ఫెడ్‌సహా ప్రపంచవ్యాప్తంగా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూపోవడం, చమురు ధరల పెరుగుదల, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. వెరసి గత మూడేళ్లలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు 2022లో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్‌పీఐలు ఇంతక్రితం అంటే 2021లో రూ. 25,752 కోట్లు, 2020లో రూ. 1.7 లక్షల కోట్లు, 2019లో రూ. 1.01 లక్షల కోట్లు విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇక 2022 డిసెంబర్లో రూ. 1,673 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను విక్రయించగా.. ఏడాది మొత్తం రూ. 15,911 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 2021లోనూ డెట్ విభాగంలో రూ. 10,359 కోట్లు, 2020లో రూ. 1.05 లక్షల కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలు విక్రయించారు. స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా నేడు మార్కెట్ ఆదివారం వెలువడిన డిసెంబర్ ఆటో విక్రయాలకు స్పందించాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు ఈ వారంలో డిసెంబర్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలను వెల్లడించనున్నాయి. కోవిడ్ కేసులు తెరపైకి వచ్చిన నేపథ్యంలో కరోనా ప్రభావం ఈ రంగంపై ఎంతమేర పడిందనే అంశాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. భారత్, అమెరికా డిసెంబర్ తయారీ రంగ పీఎంఐ డేటా(నేడు), బ్రిటన్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. సేవారంగ పీఎంఐ డేటా బుధవారం విడుదల అవుతుంది. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తెరపడనుంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొలిక్కి రావచ్చు. దేశీయ పరిస్థితులను గమనిస్తే.., ధరలు కొండెక్కి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం పుంజుకుంటుంది. ప్రభుత్వ వృద్ధి దోహద చర్యలు, ప్రోత్సాహక విధానాలు, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి మన మార్కెట్‌ను ముందుకు నడపొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
చైనా నుంచి వస్తే నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి
న్యూఢిల్లీ: చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమానప్రయాణికులు కచ్చితంగా ముందుగా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలని భారత్ నిబంధన పెట్టింది. జనవరి ఒకటో తేదీ నుంచి దీనిని అమలుచేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. అక్కడి నుంచి బయల్దేరడానికి ముందే ఎయిర్‌సువిధ పోర్టల్‌లో సంబంధిత రిపోర్ట్‌ను అప్లోడ్ చేయాలి. ఆ ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్ బయల్దేరడానికి 72 గంటలముందు చేసినదై ఉండాలి. ఒక్కో అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా ఇక్కడికొచ్చాక టెస్ట్చేస్తామని మంత్రి చెప్పారు. కాగా, భారత్‌లో గత 24 గంటల్లో 268 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,552కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు కేవలం 0.11 శాతంగా ఉంది. చైనా ప్రయాణికులపై అమెరికా సైతం.. 72 గంటల్లోపు సిద్ధమైన కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టాలని చైనా నుంచి రాబోయే అంతర్జాతీయ ప్రయాణికులకు అమెరికా సూచించింది. ఏ దేశ పౌరుడు, వ్యాక్సినేషన్ పూర్తయిందా లేదా అనే వాటితో సంబంధంలేకుండా ప్రతిఒక్కరికీ జనవరి ఐదు నుంచి ఇవే నిబంధనలు వర్తిస్తాయని అమెరికా తెలిపింది. ‘ ఆంక్షలు పెట్టినంతమాత్రాన చైనా నుంచి వైరస్ వ్యాప్తి అమెరికాలోకి ఆగదు. అయితే, చైనాలో కోవిడ్ పరిస్థితిపై మరింత సమాచారం రాబట్టేందుకు, చైనాపై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇలా చేస్తోంది’ అని జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ డౌడీ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి సమాచారం సంగతి పక్కనబెట్టి సొంతంగా కోవిడ్ కట్టడి వ్యూహాలకు అమెరికా మరింత పదును పెట్టాలని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో వ్యాధుల నిపుణుడు డాక్టర్ స్ట్రాట్ క్యాంపబెల్ హితవుపలికారు. -
చైనాలో వైరస్... మీరు ఆఫీస్‌కి రావద్దు ప్లీజ్
-
కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..!
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత్ తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే రాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధనలు తీసుకురానుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 40 రోజులు చాలా కీలకమని, జనవరిలో కరోనా కేసులు పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించారు అధికారులు. దేశంలో నాలుగో వేవ్ వచ్చినా మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. గతంలో తూర్పు ఆసియాలో కోవిడ్ విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్‌లో కొత్త వేవ్ వచ్చిందని గుర్తు చేశాయి. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్, ‘ఎయిర్ సువిధ’ ఫారమ్‌లో వివరాల నమోదు వంటి నిబంధనలు మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సుమారు 6000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. అందులో గత రెండు రోజుల్లోనే 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా బుధవారం సందర్శించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కరోనా అలర్ట్: జనవరి గండం ముందే ఉంది.. కేంద్రం వార్నింగ్ ఇదే.. -
రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది భారత్. రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తోంది. అయితే, గడిచిన రెండు రోజుల్లోనే భారత్‌కు వచ్చిన 39 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 6000 మందికి రాండమ్‌గా పరీక్షలు నిర్వహించినట్లు విమానయాన శాఖ అధికారవర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియీ గురువారం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే 40 రోజులు కీలకం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో వచ్చే 40 రోజులు కీలకంగా మారనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. వచ్చే 40 రోజుల్లో భారత్‌లో కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, గతంలోని డేటా ప్రకారం జనవరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఇదీ చదవండి: తమిళనాడు ఎయిర్‌పోర్టుల్లో నలుగురికి పాజిటివ్.. చైనా వేరియంట్? -
పసలేని చైనా టీకా.. ఏమాత్రమూ లొంగని కరోనా.. తమకొద్దంటున్న దేశాలు
కరోనా మహమ్మారి మరోసారి చైనాను కబళిస్తోంది. ప్రజాగ్రహానికి లొంగి కఠిన ఆంక్షలు సడలించి నెలైనా కాకముందే దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. 20 రోజుల్లోనే ఏకంగా 40 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టు అంచనా! వచ్చే ఏడాది కరోనా వల్ల చైనాలో కనీసం 20 లక్షల మరణాలు ఖాయమన్నది అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. ఆంక్షల సడలింపే ఇంతటి కల్లోలానికి దారి తీసిందని ప్రచారం జరుగుతున్నా చైనా కరోనా వ్యాక్సిన్‌లో పన లేకపోవడమే అసలు కారణంగా కనిస్తోంది. ఎందుకంటే దాదాపు 100 కోట్ల మందికి పైగా చైనీయులు ఇప్పటికే కరోనా టీకాలు వేయించుకున్నారు. అయినా కరోనా ఉధృతి తగ్గడం లేదు. సరికదా, రోజుకు కనీసం 10 లక్షల మందికి పైగా దాని బారిన పడుతూనే ఉన్నారు. టీకాలో రాజకీయం! కరోనా వ్యాప్తి మొదలవగానే దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. చైనాయే తొలి వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీ రూపొందించిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు, ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన కరోనావాక్‌కు తొలుత ఆమోదం లభించింది. ఈ రెంటింటిని తమ పౌరులకు వేయడమే గాక పలు దేశాలకు చైనా సరఫరా చేసింది కూడా! వీటి కొనుగోలు నిమిత్తం ఆఫ్రికా దేశాలకు 200 కోట్ల డాలర్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు 100 కోట్ల డాలర్ల రుణం కూడా ఇచ్చింది. ఆసియాలోనూ 30 దేశాలకు చైనా టీకాలందాయి. సత్తా శూన్యం? చైనా కరోనా టీకాలు తీసుకున్న వాళ్లు పదేపదే కరోనా బారిన పడుతుండటంతో వాటి సామర్థ్యంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. భారత టీకాలు అన్ని డోసులూ వేసుకున్న వారిలో అవి 99.3 శాతం సమర్థంగా పని చేయగా చైనా టీకాల సామర్థ్యం 79 శాతమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అది వాస్తవానికి 60 శాతం లోపేనని హాంకాంగ్ వర్సిటీ అధ్యయనం తేలి్చంది. జర్మనీ వ్యాక్సిన్ పైజర్–బయోఎన్‌టెక్‌తో పోలిస్తే చైనా టీకాలు వాడిన వారిలో మరణించే ఆస్కారం మూడు రెట్లు ఎక్కువని ఆసియాలైట్ పత్రిక పేర్కొంది! కరోనావాక్ వాడిన 40 రోజుల్లోనే వ్యాధి నిరోధక యాంటీ బాడీలు సగానికి సగం పడిపోయాయని థాయ్‌లాండ్ పరిశోధనల్లో తేలింది. చైనాలో ప్రస్తుతం విలయం తొలి దశ వ్యాప్తి మాత్రమేనని అంటువ్యాధుల నిపుణుడు వుజున్‌యాంగ్‌ను ఉటంకిస్తూ బీబీసీ పేర్కొంది. ‘‘జనవరి చివరి నాటికి చైనా న్యూ ఇయర్ వేడుకలు తదితరాల పూర్తయ్యాక రెండో వేవ్ వస్తుంది. సెలవులు ముగిసి కోట్లాది మంది చైనీయులు సొంతూళ్లకు మళ్లే క్రమంలో ఫిబ్రవరి చివరి నుంచి మూడో వేవ్ మొదలవుతుంది’’ అంటూ హెచ్చరించింది! మాకొద్దంటున్న దేశాలు చైనా టీకాలపై ఆధారపడ్డ దేశాల్లో ఇండొనేసియా, బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, ఫిలిప్పీన్స్, మొరాకో, థాయ్‌లాండ్, అర్జెంటీనా, వెనెజువెలా, కాంబోడియా, శ్రీలంక, చిలీ, మెక్సికో, బంగ్లాదేశ్ తదితరాలున్నాయి. వాటిలో పస లేదని తేలడంతో అవన్నీ ఇతర టీకాల కోసం పరుగులు పెడుతున్నాయి. కరోనావాక్ తీసుకున్న తమ పౌరులకు ఆ్రస్టాజెనెకా వేయాలని థాయ్‌లాండ్ గత వారమే నిర్ణయించింది. ఇండొనేసియా కూడా కరోనావాక్ తీసుకున్న తమ వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్‌గా మోడెర్నా వేస్తోంది. ఇంకా వాడని 40 లక్షల కరోనావాక్ డోసులను పక్కన పెట్టేస్తున్నట్టు నేపాల్ ప్రకటించింది. బ్రెజిల్, బహరైన్, యూఏఈ, ఈజిప్ట్ గతేడాదే చైనా టీకాలపై అనుమానాలు వెలిబుచ్చాయి. కరోనా రోగుల్లో మరణాలను ఆపడంలో వాటి సామర్థ్యం 45 శాతం లోపేనని తేలినట్టు వెల్లడించాయి. జర్మనీ అయితే చైనాలోని తమ దేశస్థులకు బయోఎన్‌టెక్ డోసులిస్తోంది! ఇతర దేశాలూ అదే బాటన నడుస్తున్నాయి. చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు ఎవరేమన్నారు... చైనా వ్యాక్సిన్ల సామర్థ్యం పాశ్చాత్య దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటమే చైనాలో ప్రస్తుత విలయానికి కారణం. – అమెరికా అధ్యక్షుని ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫాసి భారత్‌లో సమర్థమైన టీకాల ద్వారా పరిస్థితిని దాదాపుగా అదుపులోకి తెచ్చి కరోనా ఆంక్షలను ఎత్తేశారు. చైనా మాత్రం నాసిరకం టీకాలతో సమస్యను జటిలం చేసుకుంది. – బ్రిటిష్ పత్రిక ఆసియాలైట్ ఇంటర్నేషనల్ ఒమిక్రాన్ వైరస్ రకాలను గుర్తించడంలో చైనా టీకాలు విఫలమయ్యాయి. – ది లాన్సెట్ జర్నల్ -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇకపై అక్కడ మాస్క్ తప్పనిసరి!
బెంగళూరు: చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. పండగలు, కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా నాలుగో వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్ వేడుకల్లో పబ్‌లు, రెస్టారెంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. కరోనాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీ మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని కోరారు. యూపీలో అలర్ట్.. ఉన్నావ్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, ప్రస్తుతం ఆ యువకుడు దుబాయ్ వెళ్లాడు. అంతకు ముందే పరీక్షలు చేసుకోగా ప్రస్తుతం పాజిటివ్‌గా తేలింది. అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. చైనా నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలిన మరుసటి రోజునే ఈ విషయం బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్లు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని కోరారు. ఇదీ చదవండి: చైనాలో శవాల గుట్టలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు! -
మళ్లీ మొదటికి వచ్చింది.. టెక్కీలకు తీపికబురు చెప్పనున్న కంపెనీలు!
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో ఈ మహమ్మారి రూపాంతరం చెంది విలయతాండవం చేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయాలు, లాక్డౌన్ దేశాన్ని పట్టుకున్నందున వర్క్ ఫ్రమ్ హోం (Work From Home) తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, భారత్‌లో వైరస్ భయంతో ఇప్పటికే ఆతిథ్యం, రవాణా, పర్యాటకం, రియల్ ఎస్టేట్‌తో సహా వివిధ రంగాలు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఒమిక్రాన్ (Omicron) కొత్త BF.7 వేరియంట్ చైనాను వణికిస్తున్న తరుణంలో దేశంలో ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా మొదలయ్యాయి. అయితే జాగ్రత్తలు ఎన్ని తీసుకున్న కరోనా ఫోర్త్ వేవ్ దేశాన్ని మరో సారి వణికిస్తుందేమోనని భయం ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థలకు ఇది తలనొప్పిగా మారిందనే చెప్పాలి. నిన్నటి వరకు ఆఫీస్‌కు రావాలని, హైబ్రిడ్ వర్క్ మోడల్లో పనిచేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను సన్నద్ధం చేస్తూ వచ్చాయి. టెక్కీలు కూడా అయిష్టంగానే వీటికి అంగీకరించారు. అయితే తాజా పరిస్థితులతో చూస్తుంటే కంపెనీలకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గు చూపేలా ఉన్నాయంటూ నివేదికలు కూడా ఊపందుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు బాగా పెరగడంతో, దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమను తాము సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా జపాన్, దక్షిణ కొరియా, చైనాతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు ప్యాసింజర్లకు కోవిడ్ (COVID-19) పరీక్షను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో వైపు మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్! -
రికవరీకి అవకాశాలు
ముంబై: గతవారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, ట్రేడింగ్‌కు సంబంధించి ఈ ఏడాదికి ఇదే ఆఖరి వారం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది. కావున భారీ లాభాలైతే కనిపించకపోవచ్చు. ప్రపంచ పరిణామాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. చైనాతో పాటు పలుదేశాల కోవిడ్ కేసుల నమోదు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో గతవారంలో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. ‘సాధారణంగా ప్రతి ఏడాది చివరి రోజుల్లో ఫండ్ మేనేజర్లు ఖాతాల్లో సర్దుబాట్లు చేస్తుంటారు. అందులో భాగంగానే గతవారంలో లాభాల స్వీకరణ జరిగింది. సూచీలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలు మద్దతు లభించవచ్చు. రికవరీ జరిగితే నిఫ్టీకి 18,000 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,700 స్థాయిలో తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోతే 17400 వద్ద మరో మద్దతు స్థాయి లభించొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ► కొత్త వేరియంట్ బీఎఫ్.7 ఆందోళనలు చైనాతో పాటు పలు కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసుల నమోదు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తుంది. భారత్‌పై ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.., కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అధికార గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లపై ఈ రకం వేరియంట్ కేసలు నమోదు ప్రభావం స్వల్పకాలం పాటు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ► ఆర్థిక గణాంకాలు చైనా, జపాన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వరుస మంగళ, బుధవారాల్లో విడుదల కానున్నాయి. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం, భారత నవంబర్ ద్రవ్యలోటు శుక్రవారం వెల్లడి కానున్నాయి. అదేరోజున ఆర్బీఐ డిసెంబర్ 23 తేదీన ముగిసి వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 16వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ► ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(డిసెంబర్ 30న) నిఫ్టీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,500–17,800 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ► రెండు లిస్టింగులు, రెండు పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది ఆఖరి వారంలో రెండు ఐపీఓలు రాను న్నాయి. అలాగే పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న రెండు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నా యి. గతవారంలో (23న) ప్రారంభమైన రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ మంగళవా రం ముగిస్తుంది. షాలీ పాలీమర్స్ ఇష్యూ డిసెంబర్ 30–జనవరి 22 తేదీల మధ్య జరగనుంది. కేఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ గురువారం ఉండగా, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ షేర్ల లిస్టింగ్ శుక్రవారం ఉంది. -
Covid-19 Fourth Wave: చైనాలో కరోనా కల్లోలం.. ‘మనకు ముప్పు లేదు’
చైనాలో కరోనా కల్లోలం భారత్‌లోనూ భయభ్రాంతులకు కారణమవుతోంది. దేశంలో నాలుగో వేవ్ మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బిఎఫ్.7 చైనా, అమెరికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తూండడంతో కేంద్రం అప్రమత్తమై కరోనా నిబంధనల్ని పాటించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే చైనాతో పోల్చుకుంటే మనకు ప్రమాదం దాదాపుగా ఉండదని అంటువ్యాధి నిపుణులు భరోసా ఇస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలతో ఈ వేరియెంట్‌ను కూడా సులువుగా ఎదుర్కోవచ్చంటున్నారు. మనకి ఫోర్త్ వేవ్ ముప్పు పెద్దగా ఉండకపోవడానికి గల కారణాలేంటో చూద్దాం... కరోనా వ్యాక్సినేషన్ భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా జరిగింది. కరోనా సోకిన తొలి రోజుల్లో కేంద్రం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూసింది. అత్యధికులు రెండు డోసుల్ని తీసుకుంది. అక్టోబర్ నాటికి 220 కోట్ల వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. మనం అధికంగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎక్కువ మంది తీసుకుంటే, చైనా అచేతన వైరస్‌తో తయారు చేసిన కరోనా వాక్, సినోఫామ్ వ్యాక్సిన్లు ఇచ్చింది. కరోనా వేరియెంట్లను ఎదుర్కోవడంలో ఇవి విఫలమవుతున్నాయని అంటున్నారు. అత్యధికులకు కరోనా కరోనా మహమ్మారి మొదలైన దగ్గర్నుంచి భారత్‌లో ఇప్పటి వరకు 4.5 కోట్ల కేసులు నమోదయ్యాయి. కరోనాలో ఉన్న అన్ని వేరియెంట్లు దాదాపుగా భారత్‌లో వ్యాపించడంతో ప్రజలందరిలోనూ ఈ వేరియెంట్లను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి బలపడింది. అదే చైనాలో ఇప్పటివరకు ఏ వేరియెంట్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. జీరో కోవిడ్ విధానం కారణంగా ఇప్పటివరకు 20 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో అధిక శాతం ప్రజల్లో కరోనా వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు ఉత్పన్నం కాలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ సెప్టెంబర్ నుంచే బీఎఫ్.7 కేసులు మన దేశంలో ఒమిక్రాన్ ఉపవేరియెంట్ బీఎప్.7 కేసులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చాయి. కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పటికే భారత్‌లో తొలి వేవ్ 2020 ఆగస్టు–సెప్టెంబర్‌లో సార్స్–కోవ్–2తో చాలా ఇబ్బందులు పడ్డాం. 2021 ఏప్రిల్–మే నెలల్లో సెకండ్‌వేవ్‌లో డెల్టా వేరియెంట్ దేశాన్ని వణికించింది. మందులకి, ఆక్సిజన్‌కి కరువు వచ్చి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ కాస్త తక్కువ ప్రభావాన్నే చూపించింది. అందుకే ఈ సబ్ వేరియెంట్ ఏమంత ప్రభావం చూపించదని ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసులు ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభించారు. జనాభాలో 28% మందివరకు బూస్టర్ డోసులు తీసుకున్నట్టు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. చైనాలో 50% మంది బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ 80 ఏళ్లకు పైబడిన 90 లక్షల మంది తీసుకోలేదు. వారికే ఎక్కువగా వైరస్ సోకడం గమనార్హం. మన దేశంలో ప్రజలు కూడా బూస్టర్ డోసులు తీసుకుంటే మంచిదని వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంత్ సూచించారు. బూస్టర్ డోసు వేరే కంపెనీది తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితేమిటి? మన దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజుకి సగటున 150 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అదే మిగిలిన ప్రపంచ దేశాల్లో రోజుకి సగటున 5.9 లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వేరియెంట్లు అన్ని దేశాలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపించడం లేదు. ఎక్స్ఎక్స్బీ వేరియెంట్‌తో మన దేశంలో కేసులు 8% నుంచి ఒకానొక దశలో 69శాతానికి చేరినప్పటికీ ఆ తర్వాత వ్యాప్తి తగ్గిపోయింది. నవంబర్ 10న అత్యధికంగా 4,500 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వేరియెంట్ కూడా ప్రమాదకరం కాదని తేలిపోయింది.