న్యూఢిల్లీ: ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది డెల్టాతో పాటు ఇతర వేరియెంట్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోగలదని వెల్లడించారు. ఒమిక్రాన్ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్ వచ్చే అవకాశమే లేదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
మొత్తం 39 మంది వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్ రెండు డోసులు తీసుకున్నారు. ఆరుగురు అసలు టీకాలు వేసుకోలేదు. టీకా వేసుకున్నవారికంటే, వేసుకోనివారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్య యనం పేర్కొన్నది. ఒమిక్రాన్ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే అధ్య యనం చేయడం ఇందుకు కారణం కావచ్చని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment