Delta Plus Variant
-
ఒమిక్రాన్ రోగనిరోధక శక్తి డెల్టానూ ఎదుర్కొంటోంది
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది డెల్టాతో పాటు ఇతర వేరియెంట్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోగలదని వెల్లడించారు. ఒమిక్రాన్ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్ వచ్చే అవకాశమే లేదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. మొత్తం 39 మంది వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్ రెండు డోసులు తీసుకున్నారు. ఆరుగురు అసలు టీకాలు వేసుకోలేదు. టీకా వేసుకున్నవారికంటే, వేసుకోనివారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్య యనం పేర్కొన్నది. ఒమిక్రాన్ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే అధ్య యనం చేయడం ఇందుకు కారణం కావచ్చని అభిప్రాయపడింది. -
Sourav Ganguly: గంగూలీ కుమార్తెకు కరోనా.. మరో ముగ్గురికి కూడా
Sourav Ganguly Daughter Sana: భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కుటుంబాన్ని కరోనా వదలడం లేదు. ఇప్పటికే కోవిడ్(డెల్టాప్లస్ వేరియంట్)తో ఆస్పత్రిలో చేరిన గంగూలీ ఇటీవలే డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన కుమార్తె సనా గంగూలీ కరోనా బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సనాతో పాటు గంగూలీ కుటుంబంలోని మరో ముగ్గురు సభ్యులకు కూడా కోవిడ్ సోకినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో గంగూలీకి మరోసారి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. కాగా లండన్‌లో చదువుకుంటున్న సనా గంగూలీ శీతాకాల సెలవుల్లో భాగంగా ఇటీవలే కోల్‌కతాకు వచ్చింది. ఇక దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కోవిడ్ పాజిటివ్ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. చదవండి: KL Rahul Vs Dean Elgar: డసెన్ తరహాలోనే కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై వివాదం.. కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్! -
గంగూలీ నిన్నొదల.. బీసీసీఐ బాస్‌కు మళ్లీ కరోనా.. ఈసారి డెల్టా ప్లస్
Ganguly Tested Positive For Delta Plus Covid Variant: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి కరోనా బారిన పడ్డారు. అయితే ఈ సారి అతడికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యింది. తొలుత ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగిటివ్‌గా తేలిందని కోల్‌కతాలోని వుడ్లాండ్స్ ఆస్పత్రి వర్గాలు శనివారం రాత్రి వెల్లడించాయి. శుక్రవారమే(డిసెంబర్ 31, 2021) కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన దాదా.. గంటల వ్యవధిలోనే మరోసారి మహమ్మారి బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం గంగూలీకి కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, గతేడాది ఆరంభంలో గంగూలీ గుండె పోటుకు గురై యాంజియోప్లాస్టీ చేయించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..! -
కరోనా విలయతాండవం: ఒక్కరోజులో ఐదు లక్షల కేసులు.. సగం ఒమిక్రాన్!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో లెక్క నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఒక్క అమెరికాలోనే అదీ ఒక్కరోజులో ఐదు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం, అందులో సగం కంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ అందించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 5, 12, 000 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సగం కంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కావడం విశేషం. అమెరికాలో ప్యాండెమిక్ విజృంభణ మొదలయ్యాక నమోదు అయిన కేసుల సంఖ్య ఇదే హయ్యెస్ట్. మొత్తంగా ఇప్పటివరకు 54 మిలియన్ల కేసులు ఇప్పటిదాకా నమోదు అయ్యాయి. ఇంతకు ముందు కరోనా హయ్యెస్ట్ కేసుల సంఖ్య 2, 94, 015గా(ఈ ఏడాది జనవరి 8న) నమోదు అయ్యింది. డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సమాచారం ప్రకారం.. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 58 శాతం(దాదాపు సగం కంటే ఎక్కువ) ఒమిక్రాన్ కేసులే ఉన్నట్లు చెబుతోంది. ఒమిక్రాన్ కంటే ముందు డెల్టా వేరియెంట్ మూలంగానే అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం డెల్టా వేరియెంట్ కేసులేనని సీడీసీ చెబుతోంది. కొవిడ్-19 కారణంగా గడిచిన ఒక్కరోజులో 1,762 మంది పేషెంట్లు చనిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 8,42,000 చేరింది. ప్రస్తుతం అమెరికాలో కోటి పంతొమ్మిది లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నాలుగు కోట్ల 32 లక్షల మందికిపైగా కోలుకున్నారు. భారత్‌లోనూ ఇదే పరిస్థితి? ఓవైపు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడం, మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ బాధితుల సంఖ్యా పెరిగిపోతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం భారత్‌కు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ఎక్కువ జనాభా ఉన్న భారత్‌లో ఒమిక్రాన్ విజృంభణ ఒక్కసారిగా పెరిగిపోవచ్చని చెప్తున్నారు ప్రొఫెసర్ పాల్ కట్టూమన్. ‘‘రాబోయే కొద్దిరోజుల్లో భారత్ కీలక దశలోకి ప్రవేశించనుంది. కొన్ని వారాల్లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు తారాస్థాయికి చేరుకుంటాయి. కారణం.. ఒమిక్రాన్ వేరియెంట్ వేగం ఎక్కువగా ఉండడం. బహుశా అది ఈ వారం పదిరోజుల నుంచే జరగొచ్చు కూడా. అయితే అమెరికా స్థాయిలో ఉంటుందా? లేదా? అనేది రెండు వారాల్లో తెలిసిపోతుంది. బూస్టర్ డోసులతో కట్టడికి ప్రయత్నించినా.. ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడం కష్టమే. జాగ్రత్తలు పాటించడం ద్వారా పరిస్థితి చేజారకుండా కాపాడుకోవచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు ఆయన. భారత్‌లో కొవిడ్ ట్రాకర్‌ను రూపొందించిన పరిశోధకుల్లో కట్టూమన్ కూడా ఉన్నారు. డిసెంబర్ 24 దాకా ఆరు రాష్ట్రాల్లో తీవ్రతను గుర్తించిన కొవిడ్ ట్రాకర్.. 26వ తేదీ నాటికి ఆ సంఖ్యను 11 రాష్ట్రాలకు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ రెండు నగరాల్లో దీనస్థితి కాలిఫోర్నియా, న్యూయార్క్ నగరాల్లో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఒక్క కాలిఫోర్నియాలోనే 50 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గోల్డెన్ స్టేట్‌లో 86 వేలమందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో సీడీసీ కాలిఫోర్నియాను ‘హై ట్రాన్స్మిషన్’ జోన్‌గా ప్రకటించింది. మరోవైపు న్యూయార్క్ నగరంలో చిన్నపిల్లలు వైరస్ బారినపడుతుండడంతో దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ తీవ్రత మరింత ఉదృతంగా ఉండొచ్చని సీడీసీ డైరెక్టర్ రోచెల్లె వాలెన్‌స్కై అంచనా వేస్తున్నారు. డెల్టా వేరియెంట్ బారినపడ్డ పేషెంట్లకు చికిత్స భయంభయంగానే నడుస్తోంది. అయితే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండడంతో సాధారణ చికిత్సకే పరిమితం అవుతున్నారు వైద్యులు. మరోవైపు ఐసోలేషన్ సమయాన్ని పది నుంచి ఐదు రోజులకు కుదించింది అమెరికా ప్రభుత్వం. చదవండి: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు -
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అక్కడ 5 లక్షల మరణాలు
WHO Warns Europe Covid-19 Situation : గత కొన్ని నెలలుగా మన దేశంలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. అయితే కొన్ని రోజుల క్రితమే పలు రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్‌కు చెందిన ఏవై.4.2 అనే కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్ డెల్టా కంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరోప్ ప్రాంతంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. (చదవండి: థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్) 2022, ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్ వల్ల మరో ఐదు లక్షల మంది మృత్యువాత పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ప్రస్తుతం యూరప్ రీజియన్ పరిధిలో 53 దేశాల్లో కరోనా వ్యాపించి ఉందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లుగే గురువారం మీడియాకు తెలిపారు. ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే, యూరప్ దేశాల్లో మరో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. (చదవండి: వెలుగులోకి మరో వైరస్: సోకిందంటే మరణమే) రష్యా, బ్రిటన్ తదితర దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవడంతో పలు యూరప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో యూరోపియన్ యూనియన్ రీజియన్ పరిధిలో సెంట్రల్ ఆసియా పరిధిలోని పలు దేశాలతోపాటు మరో 53 ఈయూ దేశాలు వస్తాయి. మహమ్మరి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. చదవండి: కరోనా లీక్ కాలేదనడం తొందరపాటే: టెడ్రోస్ -
ఏవై.4.2 కలకలం; 6 రాష్ట్రాలు.. 17 కేసులు
న్యూఢిల్లీ: భారత్‌కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో దేశంలో కొత్త వేరియెంట్ ఏవై.4.2 కేసులు ఆందోళనని పెంచుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌లలో ఈ కేసులు నమోదు కావడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. డెల్టా ప్లస్ వేరియెంట్ నుంచి జన్యు మార్పులు చోటు చేసుకొని ఈ కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. తొలిసారిగా బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ప్రస్తుతం బ్రిటన్, రష్యా, అమెరికాతో సహా 10కి పైగా దేశాలకు విస్తరించింది. ఈ వేరియెంట్ త్వరితంగా వ్యాప్తి చెందుతోంది కానీ ఇదెంత ప్రమాదకరమో శాస్త్రవేత్తలు అంచనాకి రాలేకపోతున్నారు. -
థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదు. ఇప్పటికే రెండు వేవ్‌లు ప్రపంచవ్యాప్తంగా జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా కేసులు సంఖ్య భారీగా తగ్గింది. అయినప్పటికి కోవిడ్ ముగిసిపోలేదని.. థర్డ్ వేవ్ ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశంలో పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఏవై.4.2(AY.4.2) తీవ్ర భయాందోళనలు కలగజేస్తుంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్.. సెకండ్ వేవ్ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్ వేరియంట్ కుటుంబానికి చెందినది అని.. దీని వల్ల కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: కర్ణాటకలో ఏడు ఏవై.4.2 కరోనా కేసులు) ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్ గురించి పరిశోధించే పనిలో ఉన్నారు. (చదవండి: మహమ్మారికి వాయువేగం.. ఎయిర్‌బార్న్ డిసీజ్‌గా మారే ప్రమాదం ) ఇక ప్రస్తుతం మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో 16,156 కొత్త కేసులు నమోదు కాగా.. 733 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,60,989 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. చదవండి: ముందుంది ముప్పు.. చేయద్దు తప్పు.. గమనించగలరు -
కర్ణాటకలో ఏడు ఏవై.4.2 కరోనా కేసులు
బెంగుళూరు: కరోనాలో కొత్త రకం ఏవై.4.2 కేసుల సంఖ్య కర్ణాటకలో ఏడుకి చేరుకుంది. డెల్టా ప్లస్ నుంచి రూపాంతరం చెంది కొత్తగా పుట్టుకొచ్చిన ఈ కొత్త రకం కేసులు మొట్టమొదటి సారిగా యూకేలో వెలుగులోకి వచ్చాయి. భారత్‌లోనూ ఈ కొత్త వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఇప్పటిదాకా ఏడు కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ రణ్‌దీప్ వెల్లడించారు. ఈ కొత్త వేరియెంట్‌తో ఎలాంటి మరణాలు సంభవించలేదని, కొంతమంది ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. -
వర్క్‌ఫ్రమ్ హోం: జనవరి నుంచి కూడా రానక్కర్లేదు!
Work From Home.. Amazon new return-to-office policy: వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్న ఉద్యోగుల్ని జనవరి నుంచి ఆఫీసులకు రప్పించాలనే ప్రయత్నాలపై మళ్లీ కంపెనీల సమీక్షలు మొదలుపెట్టాయి. ఈ తరుణంలో అమెజాన్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా టైం నుంచి వర్క్‌ఫ్రమ్ హోం లో మునిగిపోయింది ఐటీ ప్రపంచం. వేవ్‌లవారీగా వైరస్ విరుచుకుపడుతున్నప్పటికీ.. వ్యాక్సినేషన్ రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ఎంప్లాయిస్ను తిరిగి ఆఫీసు గడప తొక్కించే ప్రయత్నాలు చేస్తున్నాయి. క్వాలిటీ ప్రొడక్టవిటీ కోసమే ఈ పని చేయకతప్పడం లేదని చెప్తున్నాయి. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్‌తో, మరికొన్ని కంపెనీలు రోస్టర్ విధానంలో, రొటేషన్ షిఫ్ట్‌లలో కొంతమంది ఉద్యోగులను రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇదివరకే మెయిల్స్ ద్వారా సమాచారం కూడా అందించాయి. ఇక అమెజాన్ కూడా 2022 జనవరి నుంచి వర్క్‌ఫ్రమ్ ఆఫీసులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఈ నిర్ణయం మీదా ఇప్పుడు మరోసారి సమీక్ష నిర్వహించింది అమెజాన్. తద్వారా ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేయబోమని వెల్లడించింది. ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించుకునే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయా టీంలకే వదిలేసింది అమెజాన్. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ నుంచి అధికారికంగా మెయిల్స్ వెళ్లినట్లు గీక్‌వైర్ వెబ్సైట్ ఓ కథనం ప్రచురించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, కుటుంబ భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ తరహా వర్క్‌పాలసీ వల్ల కొన్ని సమస్యలూ తలెత్తే అవకాశం ఉండడంతో ప్రొడక్టివిటీ మీద ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని ఉద్యోగులను కోరుతోంది మేనేజ్మెంట్. ఇందుకు సంబంధించి పరిష్కారాల కోసం అమెజాన్ లీడర్షిప్ టీం పరిష్కారాల సమాలోచనలు చేస్తోంది. జనవరి 3లోపు ఈ వర్క్పాలసీకి సంబంధించిన స్పష్టమైన ప్రణాళిక, విధివిధానాలకు సంబంధించిన బ్లూప్రింట్ అందజేయాలని ఎంప్లాయిస్ను, టీఎల్‌లను కోరింది అమెజాన్. ఇక తప్పనిసరి ఉద్యోగులు, ఎమర్జెన్సీ విభాగాల్లోని ఎంప్లాయిస్ మాత్రం వారంలో మూడు రోజులు ఆఫీసుల నుంచే పని చేయాలని, రెండు రోజులు వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపింది. పూర్తిస్థాయి కార్యాకలాపాల మీద రాబోయే రోజుల్లో, అది పరిస్థితులనే సమీక్షించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది అమెజాన్. చదవండి: జీవితాంతం వర్క్‌ఫ్రమ్ హోం.. ఎక్కడో తెలుసా? -
భారత్‌లో కొత్త వేరియంట్‌పై ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్(సార్స్–కోవ్2) కొత్త వేరియంట్ ఉనికిపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని జినోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం ‘ఇన్సాకాగ్’ ప్రకటించింది. డెల్టా ఉప వేరియంట్లకు సంబంధించి అదనంగా సూచించాల్సిన జాగ్రత్తలు కూడా లేవని తెలిపింది. ఈ మేరకు తాజాగా బులెటిట్ విడుదల చేసింది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ భారత్‌లో ఆందోళనకరమైన వేరియంట్‌గా(వీఓసీ) కొనసాగుతోందని వెల్లడించింది. డెల్టా కారణంగానే దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి కనిపించిందని, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ప్రబలంగానే వ్యాప్తి చెందుతోందని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో బయటపడిన ఏవై.1 వేరియంట్ నెమ్మదిగా, స్థిరంగా వ్యాప్తి చెందుతోందని ఇన్సాకాగ్ వివరించింది. ఇక డెల్టాలో ఉపరకమైన ఏవై.4 వేరియంట్ లక్షణాలు బి.1.617.2 వేరియంట్ తరహాలోనే ఉన్నట్లు మహారాష్ట్రలో చేపట్టిన ప్రాథమిక అధ్యయనంలో తేలిందని పేర్కొంది. కరోనాలో కొత్త రకాలైన మూ(ఎంయూ), సి.1.2 వేరియంట్ల జాడ భారత్‌లో ఇప్పటిదాకా కనిపించలేదని ఇన్సాకాగ్ గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మహమ్మారికి వాయువేగం.. ఎయిర్‌బార్న్ డిసీజ్‌గా మారే ప్రమాదం
వేషము మార్చెను, భాషను మార్చెను, చివరకు తానే మారెను... అని మనిషి పోకడను ఒక సినీ కవి వర్ణించాడు. ప్రస్తుతం కరోనా ఇదే బాటలో పయనిస్తోంది. ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ మరణ మృదంగం మోత పెంచుతూ వస్తోంది. ఇలాంటి ప్రమాదకారి గాలి ద్వారా ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని పొందితే? ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కానీ ఈ భయాలు నిజమయ్యే చాన్సుల ఎక్కువయ్యాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు వాయు మార్గంలో ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని సంతరించుకుంటున్నాయి. ఈ శక్తి మరింత ఎక్కువైతే కరోనా ఎయిర్‌బార్న్ డిసీజ్(గాలిద్వారా వ్యాపించే వ్యాధి)గా మారే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ ఏరోసాల్స్(గాలి తుంపర), డ్రాప్లెట్స్(సూక్ష్మ బిందువులు) ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. సదరు రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ దగ్గరలో ఉన్నవారికి, పక్కనే ఉండేవారికి సోకుతుంది. పక్కన ఎవరూ ఆ సమయంలో లేకుంటే క్రమంగా బయటి వాతావరణంలో కరోనా వైరస్ నిర్వీర్యం అవుతుంది. కానీ జలుబు లాంటి వైరస్లు గాలి ద్వారా కూడా వ్యాపిస్తాయి. వీటి ఏరోసాల్స్ ఎక్కువ దూరం పయనిస్తాయి, ఎక్కువకాలం గాల్లో ఉంటాయి. అందుకే ఒక సమూహంలో ఒకరికి జలుబు చేసినా ఇతరులందరికీ తొందరగా అంటుకునే అవకాశాలు ఎక్కువ. కరోనా వైరస్ ప్రస్తుతం ఈ శక్తిని సాధించే యత్నాల్లో ఉంది. కరోనా వేరియంట్లు గాల్లో ప్రయాణించడంలో మెలకువలు సాధిస్తున్నాయని, దీనివల్ల కరోనా గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు పెరుగుతాయని మేరీల్యాండ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మరింత టైట్ ఫిట్ మాస్కులు ధరించడం, నివాస గృహాల్లో విస్తృత వెంటిలేషన్ ఏర్పరుచుకోవడం చేయాలని సూచించింది. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలిపింది. ఇప్పటికే కరోనా సోకిన వారు వదిలే గాలిలో వైరస్ ఉంటుంది. అల్ఫా వేరియంట్ సోకిన వారు వదిలే గాలిలో 43–100 రెట్లు అధిక వైరస్‌లోడు ఉంటుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇప్పటివరకు ఇవి బయట గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించి ఇతరులకు సోకడం జరగలేదు. అయితే క్రమంగా వాయు ప్రయాణం చేసే శక్తిని వేరియంట్లు పెంచుకుంటున్నాయని, దీనివల్ల వైరల్ ఏరోసాల్స్ పెరిగిపోతున్నాయని సీఐడీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. టీకా ప్లస్ మాస్క్ అల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి కలిగిఉన్నట్లు అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ డాన్ మిల్టన్ చెప్పారు. ఈ వేరియంట్లు క్రమంగా గాల్లో ప్రయాణించడాన్ని అలవరుచుకుంటున్నాయన్నారు. ఇవి పూర్తిగా వాయుమార్గంలో సోకే వేరియంట్లుగా మారకుండా నిరోధించేందుకు టీకా తీసుకోవడం, టైట్ మాస్కులు ధరించడం, శుభ్రమైన వాతావరణంలో నివసించడం చేయాలన్నారు. అల్ఫా కన్నా డెల్టాలో ఈ శక్తి ఎక్కువగా కనిపిస్తోందని, దీన్నిబట్టి వైరస్‌లో వాయుప్రయాణ అనుకూల మార్పులు పెరుగుతున్నాయని డాక్టర్ లాయ్ చెప్పారు. ఇప్పటికీ మాస్కులు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిçస్తూనే ఉన్నాయన్నారు. మాస్కుల వల్ల వైరస్సోకే అవకాశాలు దాదాపు 50 శాతం తగ్గుతాయని వివరించారు. కానీ లూజుగా ఉండే దుస్తులు, సర్జికల్ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు. -
Trending: దుర్మార్గం.. వ్యాక్సిన్ వేసుకోకుంటే వివక్ష?
Unvaccinated Americans: అమెరికాలో వ్యాక్సిన్ తీసుకోని వాళ్ల పరిస్థితిపై విస్తృత చర్చ నడుస్తోంది. ప్రపంచంలో జెట్ స్పీడ్‌గా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన అమెరికా.. ఆ తర్వాత ఆర్థిక క్షీణత కారణంగా! వెనుకబడిపోయింది. ఇక ఇప్పుడు వ్యాక్సిన్ తప్పనిసరి చేసేలా నిబంధనలు తీసుకురావాలన్న ప్రయత్నాలు, తీసుకోని వాళ్లపై వివక్ష చూపిస్తుండడంతో సోషల్ మీడియాలో చర్చ రచ్చ నడుస్తోంది. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ల ప్రయాణాల దగ్గరి నుంచి ప్రతీదాంట్లోనూ వివక్ష కనిపిస్తోంది. ఇప్పటికే విమాన ప్రయాణాలపై కీలక సూచనలు వెలువడగా.. క్యాబ్ డ్రైవర్లు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే రైడ్‌కు సిద్ధపడుతున్నారు. ఇక కొన్ని మాల్స్, రెస్టారెంట్లు సైతం వ్యాక్సిన్ పూర్తైన వాళ్లను మాత్రమే అనుమతించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పేషెంట్లకు(కరోనా బారిన పడిన వాళ్లూ ఉన్నారు) చికిత్స ఇవ్వడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. దీంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో ఓవైపు సింపథీ వ్యక్తం అవుతుండగా.. మరోవైపు డెల్టా వేరియెంట్ విజృంభణ తరుణంలో ఇలా చేయడమే సరైన పద్ధతంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఈ రకంగా సోషల్ మీడియాలో Unvaccinated Americans చర్చ జోరందుకుంది. పని చేసే చోట వర్క్ ప్లేస్‌లో వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధన విధిస్తే.. అమెరికాలో లక్షల ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే వ్యాక్సినేషన్‌కు ఉద్యోగులెవరూ సిద్ధంగా లేరు. అసలు ఉద్యోగుల అంతరంగం ఎలా ఉందో తెలుసుకునేందుకు అక్కడి ప్రముఖ మీడియా సంస్థలు ఈ మధ్య పోల్స్ నిర్వహించాయి. మొత్తం ఉద్యోగుల్లో 16 శాతం మంది వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు సిద్ధంగా ఉండగా, 35 శాతం మంది మినహాయింపులు(మతపరమైన) కోరుతున్నారు. మరో 42 శాతం మంది ఉద్యోగాలు పూర్తిగా వదిలేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మినహాయింపులు లేవని చెబితే ఏం చేస్తారని అడిగితే.. 18 శాతం మంది వ్యాక్సినేషన్‌కు వెళ్తామని చెప్పగా.. 72 శాతం మంది ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగాలు చేయబోమని కుండబద్ధలు కొట్టేశారు. బైడెన్ మొండిపట్టు అమెరికాలో కొన్ని రాష్రా్టల్లో డెల్టా వేరియెంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నవాళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శలు గుప్పించాడు. వీళ్లు ప్రమాదకరమైన వేరియెంట్ వ్యాప్తికి కారణం అవుతున్నారంటూ మండిపడ్డారు. గురువారం వ్యాక్సినేషన్ తప్పనిసరి విషయంలో కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికాలో ఇప్పటికి పదిహేడున్నర కోట్ల మంది మాత్రమే వ్యాక్సినేషన్ ఫుల్ డోసులు పూర్తి చేసుకున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా.. మిలియన్ల మందికి సింగిల్ డోస్ కూడా పడలేదు. అమెరికాలో కేవలం ఫైజర్-బయోఎన్‌టెక్ రెండు డోసుల వ్యాక్సిన్‌కు మాత్రమే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) నుంచి పూర్తి అనుమతి ఉంది. The pandemic of the unvaccinated is a tragedy that is preventable. People are dying and will die from COVID-19 who don't have to. If you haven't gotten vaccinated, do it now. It could save your life and the lives of those you love. — Joe Biden (@JoeBiden) September 8, 2021 ఈ తరుణంలో మరిన్ని వ్యాక్సిన్లకు అనుమతలు ఇవ్వడం, వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికి అవసరమైన అనుమతుల్ని త్వరగతిన జారీ చేయడం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అవుతోంది. మరోవైపు ‘వ్యాక్సినేషన్ తప్పనిసరి’ నిర్ణయంతో కరోనా నియంత్రణ-అమెరికన్ల భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపెడుతుందన్న ప్రశ్నకు.. అదంతా ‘వ్యాక్సిన్ వేసుకోవడం మీదే ఆధారపడి ఉంటుంద’న్న సమాధానం వైట్‌హౌజ్ నుంచి వినిపిస్తోంది. చదవండి: ఆఫీసులకు రండి.. మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్! -
డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!
-
వర్క్ ఫ్రమ్ హోం: ఆఫీస్‌లకు శాశ్వతంగా గుడ్‌బై!
పరిమితి లేని పని గంటలు.. పని ఒత్తిడిని భరిస్తూనే వర్క్ ఫ్రమ్ హోంలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు ఎంప్లాయిస్. దీంతో జీతభత్యాల కోతల నడుమ కొన్నాళ్లపాటు అనుమతులు ఇస్తున్నాయి కంపెనీలు. వీటికి తోడు డెల్టా ఫ్లస్ వేరియెంట్ కేసులు పెరుగుతున్న టైంలో.. జనవరి వరకు వర్క్ ఫ్రమ్ హోంను పొడిగించాయి కొన్ని ఐటీ కంపెనీలు. అయితే ఈ అంశం ఇప్పుడు కంపెనీల పరిధి దాటిపోయినట్లు అనిపిస్తోంది. ఆఫీసులు తెరిచినా.. తాము ఎట్టిపరిస్థితుల్లో తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న చాలామంది ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బలవంతపు ఆదేశాలు జారీ చేస్తే.. కంపెనీలను వీడతామంటూ కుండబద్ధలు కొట్టేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం విషయంలో చాలా కంపెనీలు వరుసగా ఎంప్లాయిస్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంకి ఆసక్తి చూపిస్తున్నట్లు ఉద్యోగులు చెప్తున్నారు. ఈ మేరకు కొన్ని సర్వేలు ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. అయితే కంపెనీల స్పందన ఎలా ఉండబోతుందనేది రానున్న రోజుల్లోనే తెలిసేది. ►లండన్‌కు చెందిన ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న 41 శాతం మంది తాము అసలు ఆఫీస్‌లకు రమ్మన్నా.. రామని తేల్చి చెప్పారు. జనవరిలో ఇదే కంపెనీ నిర్వహిచిన సర్వేలో కేవలం 29 మాత్రమే ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. చదవండి: హైదరాబాద్ ఐటీ కంపెనీల నయా ట్రెండ్ ఇది! ► భారత్‌కు చెందిన ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కంపెనీ ఆగష్టు రెండో వారంలో.. లక్షన్నర మంది ఎంప్లాయిస్ అభిప్రాయంతో ఓ సర్వే చేపట్టింది. అందులో 48 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంకి ఓటేశారు. ఒత్తిడిలో ఉన్నా.. తాము రిమోట్ వర్క్‌తో అన్ని విధాలుగా కంఫర్ట్‌గా ఉన్నట్లు చెప్పారు. ► భారత్‌కు చెందిన మరో ఐటీ కంపెనీ జులై చివరి వారంలో చేపట్టిన సర్వేలో.. కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా 19 శాతం ఉద్యోగులు రిమోట్ వర్క్(వర్క్ ఫ్రమ్ హోం)కే సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.17 శాతం మంది వారానికి మూడు రోజులైనా వర్క్ ఫ్రమ్ హోం కావాలని కోరుకుంటున్నారు. 22 శాతం మంది తాము కనీసం ఒక్కరోజైనా కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ► తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ 1500 మందితో ఇలాంటి సర్వేనే నిర్వహించగా.. 38 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంను.. 21 శాతం వారంలో కనీసం మూడు రోజులైనా వర్క్ ఫ్రమ్ హోం కోరుకున్నారు. వ్యాక్సినేషన్ సర్వే చాలా కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో కచ్చితంగా ఉండాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోంతో పాటు ఆఫీసులకు రావాలనుకుంటున్న ఉద్యోగులను తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఆదేశిస్తున్నాయి. అయితే ఈ కంపల్సరీ రూల్‌ను చాలామంది ఉద్యోగులు ఆమోదిస్తున్నారు. గాలప్ సర్వే ప్రకారం.. 36 శాతం ఉద్యోగులు ఈ నిబంధనకు మద్దతు తెలపగా. 29 శాతం ఉద్యోగులు మాత్రం ఈ రూల్‌తో విభేదిస్తున్నారు. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. బాబోయ్ మాకొద్దు! -
వ్యాక్సిన్ వేసుకున్నా వదలని డెల్టా వేరియెంట్ !
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా వేరియెంట్ కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సోర్టియం అయిన ఐఎన్ఎస్ఏసీఏజీ తెలిపింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయడం లేదని అంచనా వేసింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి తీవ్రత అంతగా కనిపించడం లేదని, మరణాలు దాదాపుగా లేవని వెల్లడించింది. దేశంలో మొత్తంగా 30,230 శాంపిల్స్‌ని పరీక్షించి చూస్తే వాటిలో 20.324 డెల్టా కేసులేనని ఐఎన్ఎస్ఏసీఏజీ తాజా బులెటిన్‌లో తెలిపింది. భారత్‌లో మొదటి సారిగా వెలుగు చూసిన డెల్టా వేరియెంట్ బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది. మన దేశంలోనూ సెకండ్ వేవ్ ప్రబలంగా ఉండడానికి డెల్టా వేరియెంటే కారణం. దేశంలో ఆర్ వాల్యూ 0.89కి తగ్గినప్పటికీ ప్రతీ రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదు కావడానికి డెల్టా వేరియెంటే కారణమని ఆ సంస్థ వేస్తున్న అంచనాలు ఆందోళనని పెంచుతున్నాయి. 97.54% కి పెరిగిన కోవిడ్ రికవరీ రేటు దేశంలో కోవిడ్–19 కేసులు మరో 36,571 నిర్థారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,58,829కి చేరుకున్నట్లు శుక్రవారం కేంద్రం తెలిపింది. కోవిడ్ బారిన పడిన మరో 540 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 4,33,589కి పెరిగాయని వెల్లడించింది. 540 మరణాల్లో కేరళ నుంచి 197, మహారాష్ట్ర నుంచి 154 నమోదైనట్లు తెలిపింది. అదేవిధంగా, మార్చి 2020 తర్వాత కోవిడ్ రికవరీ రేటు 97.54%కి పెరిగిందని పేర్కొంది. యాక్టివ్ కేసులు 150 రోజుల తర్వాత 3,63,605కి పడిపోయాయని, మొత్తం కేసుల్లో ఇవి 1.12%గా ఉన్నాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50,26,99,702 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరపగా, 57.22 కోట్ల డోసుల కోవిడ్ టీకా వేసినట్లు పేర్కొంది. -
ఉలిక్కిపడుతున్న అగ్రరాజ్యం.. ఒక్క రోజులో వెయ్యికి పైగా మరణాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. వాయు వేగంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ వల్ల దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా కేసులు 286శాతం పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో మరణాల్లో కూడా రికార్డు స్థాయి పెరుగుదల కనిపిస్తుంది. గడిచిన నెల రోజుల్లో కరోనా మరణాల్లో 146శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా, ఒక్క రోజులోనే వెయ్యికి పైగా(1017) మరణాలు నమోదైనట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో అమెరికాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6,23,000లకు చేరింది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని కరోనా మరణాలు సంభవించలేదు. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో గణణీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన రెండు వారాల్లో కరోనా హాస్పిటలైజేషన్లలో 70శాతం పెరుగుదల కనిపించిందని స్థానిక వార్తా సంస్థ తమ వివేదికలో పేర్కొంది. చదవండి: Afghanistan: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రషీద్ ఖాన్ భావోద్వేగం -
Corona Virus: మరో వేవ్ రాకపోవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, వ్యాక్సిన్ తీసుకోవాలని పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు ఇచ్చే కోవాగ్జిన్ ట్రయల్ త్వరలోనే పూర్తవుతుందని, సెప్టెంబర్ నెలాఖరు కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కోవిడ్ –19 విషయంలో జరుగుతున్న శాస్త్రీయ పరిణామాలపై ఇండియా సైన్స్ అనే సంస్థతో ప్రియా అబ్రహం వర్చువల్‌గా మాట్లాడారు. పిల్లలపై కోవాక్సిన్ ట్రయల్ ఏ దశలో నడుస్తోంది. పిల్లలకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం 2–18 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం కోవాగ్జిన్ రెండో దశ, మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. త్వరలో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులేటర్స్‌కు ఈ ఫలితాలు అందిస్తారు. కాబట్టి సెప్టెంబర్ నెలాఖరుకు లేదా ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ –19 వ్యాక్సిన్లను అందించ గలుగుతాం. ఇది కాకుండా, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ట్రయల్ కూడా జరుగుతోంది. ఇది పిల్లలకు సైతం ఉపయోగిం చవచ్చు. త్వరలో ఇది కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవైనా డెల్టా–ప్లస్ వేరియంట్‌పై ప్రభావవంతంగా ఉన్నాయా? డెల్టా వేరియంట్ కంటే డెల్టా–ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అనే విష యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా డెల్టా వేరియంట్ 130కి పైగా దేశాలలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మేము ఈ వేరియంట్ మీద అధ్యయనాలు చేశాం. మేము వ్యాక్సిన్లు వేసిన వ్యక్తుల శరీరాలలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలను అధ్యయనం చేసిప్పుడు ఈ వేరియంట్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీల సమర్థత కొంత తగ్గినట్లు కను గొన్నాం. అయినప్పటికీ వ్యాక్సిన్లు ఇప్పటికీ వేరి యంట్లను ఎదుర్కొనే విషయంలో రక్షణగా ఉన్నాయి. అవి కొంచెం తక్కువ సామర్థ్యాన్ని చూపించవచ్చు. కానీ ఇలాంటి మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లు చాలా ముఖ్యమైనవి. వ్యాక్సిన్ తీసుకోని ఎవరైనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరడం, పరిస్థితి విషమంగా మారితే చనిపోయే అవకాశాలుం టాయి. కాబట్టి వేరియంట్ ఏౖదైనప్పటికీ ఇప్ప టివరకు డెల్టా వేరియంట్‌తో సహా అన్నింటి విషయంలో వ్యాక్సిన్ రక్షణగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సంకోచం ఉండరాదు. రాబోయే కాలంలో మనకు బూస్టర్ డోస్‌లు అవసరమా? ఈ విషయంపై ఏదైనా అధ్యయనం జరుగుతోందా? బూస్టర్ డోస్‌లపై అధ్యయనాలు విదేశాలలో జరుగుతున్నాయి. బూస్టర్ డోస్‌ల కోసం కనీసం ఏడు వేర్వేరు వ్యాక్సిన్లను ప్రయత్నిం చారు. కానీ ప్రస్తుతం మరిన్ని దేశాలు వ్యాక్సిన్లు వేసే వరకు డబ్ల్యూహెచ్ఓ బూస్టర్లపై అధ్యయనాలను నిలిపివేసింది. ధనికదేశాలు బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభిస్తే పేదదేశాలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భవిష్యత్తులో బూస్టర్ల కోసం సిఫార్సులు ఖచ్చితంగా వస్తాయి. వ్యాక్సిన్ల మిక్స్ అండ్ మ్యాచ్ వినియోగంపై అధ్యయనాలు జరుగుతున్నాయా? అది ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుంది? మన దేశంలో పొరపాటున 2 డోసుల్లో రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్పిన్లను కొందరికి ఇవ్వ డం జరిగింది. వీరిపై అధ్యయనం చేశాం. వేర్వే రు వ్యాక్సిన్లు తీసుకున్న రోగులు సురక్షితంగా ఉన్నారని మేము గుర్తించాం. వారిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు. వారిలో యాంటీబాడీలు కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఇది కచ్చితంగా సురక్షితమే. మేము ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నాం. బర్డ్–ఫ్లూ లేదా జికా వైరస్ సోకిన వ్యక్తులు కోవిడ్–19 సంక్రమణకు గురవుతారా? బర్డ్ ఫ్లూ, జికా వైరస్లు కరోనా వైరస్‌తో ఏమాత్రం సంబంధం లేనివి. కానీ బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్‌లకు ఉండే సారూప్యత కారణంగా వాటి వ్యాప్తిని మాస్క్‌లు, భౌతిక దూరం, చేతుల శుభ్రత, ఇంటి కోవిడ్ పోటోకాల్స్ పాటించడం ద్వారా నిరోధిం చవచ్చు. ఈ వైరస్లు అన్నీ శ్వాస మార్గము ద్వారానే సంక్రమిస్తాయి. అయితే జికా వైరస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. మరో వేవ్ రాకపోవచ్చా? అలా ఏమీ ఉండదు. కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరించడం, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోమని ప్రోత్సహించాలి. అప్పుడు మరో వేవ్ వచ్చినా, అది అంత ప్రభావవంతంగా ఉండదు. -
డేంజరస్ డెల్టా ప్లస్.. 66 మందిలో నిర్ధారణ, ఐదుగురి మృతి
సాక్షి, ముంబై: రాష్ట్రంపై దాడి చేసేందుకు కరోనా మహమ్మారి మరో రూపంలో సిద్ధమైంది. డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో పంజా విసరడం మొదలు పెట్టింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 66 మందికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ కాగా.. అందులో అయిదుగురు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. నమోదైన 66 డెల్టా ప్లస్ కేసుల్లో అత్యధికంగా జల్గావ్ జిల్లాలో 13 కేసులున్నాయి. డెల్టా ప్లస్ కేసులలో జల్గావ్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, రత్నగిరి జిల్లాలో 12 కేసులున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 11 మందికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని తేలింది. అయితే ఈ 66 మందిలో 32 మందిపై వైరస్ ప్రభావం అంతగా లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, మిగతావారిలో 18 ఏళ్ల లోపు వయసు వారు కూడా ఉన్నారు. దీంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్‌లాక్ 3.0లో భాగంగా పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆంక్షలు సడలిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ విస్తరణపై ఎలా ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా, డెల్టా ప్లస్ ముప్పు పొంచి ఉందని, ఈ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ కచ్చితంగా నియమాలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అతివేగంగా వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు డోసులు తప్పనిసరి డెల్టా ప్లస్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు కరోనా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలని నియమం పెట్టింది. టీకా రెండు డోసులు తీసుకోనివారు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని నెగెటివ్ రిపోర్టు చూపించడం తప్పనిసరి చేసింది. ఈ రెండు నియమాలను పాటించకపోతే 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి వర్తించే సడలింపులు ►మాల్స్, రెస్టారెంట్స్ 50 శాతం సామర్థ్యంతో రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలని షరతును పెట్టింది. ►షాపులు కూడా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. ►స్పా, జిమ్‌లు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు నడిపేందుకు పలు షరతులతో అనుమతించింది. ►బహిరంగ ప్రాంతాల్లో జరిగే వివాహ వేడుకలకు ఇకపై 200 మందిని అనుమతించనున్నారు. హాళ్లలో జరిగే కార్యక్రమాలకు స్థలాన్ని బట్టి 50 మందిని లేదా 100 మందిని అనుమతించనున్నారు. ►ఇండోర్ క్రీడలకు అనుమతి లభించింది. ►సినిమా హాళ్లు, ప్రార్థనా స్థలాలు మాత్రం తదుపరి ఆదేశాల వరకు మూసి ఉండనున్నాయి. ►ఇన్నాళ్లు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు సామాన్యులకు అనుమతి ఉండేది కాదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర విభాగాల్లో పనిచేసే వారిని మాత్రమే అనుమతించారు. కానీ, కరోనా టీకా రెండు డోసులు తీసుకుని 14 రోజులు పూర్తయినవారిని ఇకపై లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ప్రకటన చేయడంతో రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన ప్రయాణికులకు పాసులు కూడా జారీ చేస్తున్నారు. -
ముంబైలో తొలి డెల్టా ప్లస్ మరణం
ముంబై: కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ముంబైలో తొలి మరణం సంభవించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు సైతం తీసుకున్న 63 ఏళ్ల మహిళ జూలై 27న మరణించారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టు ఆమె మరణించాక వచ్చిందని పేర్కొన్నారు. జూలై 21న పొడి దగ్గు, వాసనలేమి, ఒళ్లునొప్పులు, తలనొప్పితో ఆమె ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు తెలిపారు. ఆమెకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, ఆమెతో స్ననిహితంగా మెలిగిన ఆరుగురికి కరోనా నిర్ధారణ పరీక్ష చేసినట్లు వెల్లడించారు. అందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, ఇద్దరిలోనూ డెల్టా ప్లస్ వేరియంట్ ఉందన్నారు. జూన్ 13న కూడా 80 ఏళ్ల మహిళ రత్నగిరి జిల్లాలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మరణించారు. బుధవారం నాటికి మహారాష్ట్రలో 20 డెల్టా ప్లస్ కేసులు ఉండగా, అందులో ముంబైలోనే 7 కేసులు నమోదయ్యాయి. -
డెల్టా ప్లస్ వేరియెంట్‌తో ముంబైలో తొలి మరణం
సాక్షి, ముంబై: ఒక వైపు థర్డ్ వేవ్ ప్రమాదం భయపెడుతున్న తరుణంలో ముంబైలో కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా తొలి మరణం నమోదైంది. నగరంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా నగరంలో 63 ఏళ్ల మహిళ మృతి చెందినట్టు అధికారులకు ప్రకటించారు. ఆక్సిజన్ సపోర్ట్, స్టెరాయిడ్స్, రెమ్‌డెసివిర్ చికిత్స అందించినప్పటికీ, కరోనా పాజిటివ్ వచ్చిన మూడు రోజుల తర్వాత ఆమె జులై 27న కన్నుమూసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే బాధితురాలికి డయాబెటిస్తో సహా అనేక వ్యాధులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు బాధిత మహిళ కరోనా టీకా రెండు మోతాదులను తీసుకున్నట్టు సమాచారం. ఈ మహిళనుంచి సేకరించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ పరీక్షల్లో మరో ఇద్దరికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 20 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించామని, వాటిలో ఏడు ముంబైలో ఉన్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.దీనితో, రాష్ట్రంలో ఈ వేరియంట్ సోకిన రోగుల సంఖ్య 65కి పెరిగిందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా గుర్తించిన కేసులలో ఏడు ముంబై, మూడు పుణే, నాందేడ్, గోండియా, రాయగఢ్, పాల్ఘర్, మరియు చంద్రపూర్ మరియు అకోలా జిల్లాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్‌కు మహారాష్ట్రకు ఇది రెండో మరణం. జూన్ 13న, సంగమేశ్వర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మరణించిన సంగతి తెలిసిందే. చదవండి : corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం! -
జనవరి నుంచే ఆఫీసులకు రండి
Facebook Employees Return To Office: కరోనా-లాక్డౌన్ మొదలైన వర్క్ ఫ్రమ్ హోం ట్రెండ్.. ఇంకొన్నాళ్లు కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే టెక్ కంపెనీలు కొన్ని అక్టోబర్ మధ్య నుంచి ఆఫీసులకు రావాలని తేల్చిచెప్పడంతో పాటు షరతుల మీద కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంకి అనుమతి ఇస్తున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్బుక్ తన ఉద్యోగులకు భారీ ఊరట ఇచ్చింది. ఇక వచ్చే ఏడాది నుంచే ఆఫీసులకు రావాలని తెలియజేసింది. డెల్టా ఫ్లస్ వేరియెంట్ ఉధృతి.. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా విజృంభిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి.. వాళ్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయడం ఇష్టం లేదని ఫేస్బుక్ భావిస్తోంది. ఈ మేరకు కాలిఫోర్నియా మెన్లో పార్క్ హెడ్ కార్యాలయం నుంచి ఉద్యోగులకు మెయిల్ వెళ్లింది. అందులో ‘ఇప్పట్లో ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని. బహుశా జనవరి నుంచి ఆఫీసులకు రావాల్సి ఉండొచ్చ’ని సంకేతాలు ఇచ్చింది. చదవండి: జీతాల కట్టింగ్‌కు రెడీ, కానీ..-ఉద్యోగులు ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, యాపిల్లు వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందేనని ఇదివరకు చెప్పాయి. అంతేకాదు మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి ఏర్పాట్లతో ఆరోగ్య భద్రతకు తమది హామీ అని ప్రకటించాయి. కానీ, వేవ్‌ల వారీగా పెరుగుతున్న కరోనా కేసులు, ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన, విమర్శలు, పైగా ఇంటి నుంచే ఎక్కువ అవుట్‌పుట్ వస్తుండడంతో రిమోట్ వర్క్ విషయంలో ఉద్యోగుల పట్ల సానుకూల స్పందన ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ కూడా జనవరి నుంచే రావాలని ఊరట ఇవ్వగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఫేస్బుక్ కూడా చేరింది. మరోవైపు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌లు మాత్రం అక్టోబర్ మధ్య నుంచే ఉద్యోగులను రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. -
143 కేసులు: జనాలను ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్న అధికారులు
బీజింగ్: కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన చైనాను ఇప్పుడు డెల్టా వేరియంట్ బెంబెలెత్తిస్తోంది. తాజాగా డ్రాగన్ దేశంలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో పోలిస్తే డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా, ప్రమాదకరంగా ఉండటంతో.. వైరస్ కట్టడి కోసం అధికారులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ జనాలను బయటకు రానివ్వకుండా.. ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలో చైనా సోషల్ మీడియా యాప్ వీబోలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. డెల్టా కేసులు ఎక్కువగా కనిపిస్తున్న వుహాన్‌లో ఈ తరహా చర్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయిని ఓ ట్విట్టర్ యూజర్ తెలిపారు. ఇక వీబో, ట్విట్టర్, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోల్లో.. పీపీఈ కిట్లు ధరించిన కొందరు వ్యక్తులు.. జనాల ఇళ్ల దగ్గరకు వెళ్లి.. వారిని లోపలకి పంపి.. బయట నుంచి తాళం వేయడమే కాక ఇనుపరాడ్లు పెట్టి.. సీల్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘‘జనాలు రోజులో మూడుసార్లు మాత్రమే డోర్ తెరిచి బయటకు రావాలి. కాదని ఎక్కువసార్లు లాక్ ఓపెన్ చేయడం.. బయటకు రావడం చేస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తాం. ఇక ఏ అపార్ట్‌మెంట్‌లోనైనా కేసులు బయటపడితే.. దాన్ని మూడు వారాల పాటు సీల్ చేస్తాం’’ అని తెలిపారు. ఇక ఆగస్టు 9 చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రస్తుతం తమ దేశంలోని 17 ప్రాంతాలలో 143 కొత్త కేసులు రికార్డయ్యాయని తెలిపారు. వీటిలో 35 కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలో వెలుగు చూడగా.. 108 స్థానికంగా నమోదయిన కేసులని తెలిపారు. ఇవేకాక నాన్జింగ్ సిటీలో మరో 48 కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. -
వర్క్ ఫ్రమ్ హోం: జీతపు కోతలు.. అనూహ్య స్పందన
వర్క్‌ఫ్రమ్ హోం-ఆఫీస్ వ్యవహారంలో టెక్ కంపెనీలు-ఉద్యోగుల మధ్య హైడ్రామా నడుస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుండడంతో ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీలు అడుగుతుంటే.. ఉద్యోగాలైనా వదిలేసుకుంటాం తప్ప రాబోమంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు ఉద్యోగులు. ఈ తరుణంలో కంపెనీలు మాత్రం మొండిపట్టు వీడడం లేదు. ఒకవేళ రిమోట్ వర్క్‌కే పట్టుబడితే కట్టింగ్లు తప్పవని ఉద్యోగులకు కరాఖండిగా చెప్పేశాయి కూడా. ఈ తరుణంలో ఉద్యోగుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించిన నేపథ్యంలో.. జీతాల కట్టింగ్‌కు తాము సిద్ధమేనని గూగుల్ ఉద్యోగులు బదులిచ్చారు. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోంకి అనుమతి ఇస్తే.. కట్టింగ్‌లపై తమకూ ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని, కాకపోతే పర్ఫార్మెన్స్ ఆధారంగా ఏడాదికి ఒకసారి ఇచ్చే హైకులను మాత్రం కొనసాగించాలంటూ వేల మంది ఉద్యోగుల నుంచి రిప్లై మెయిల్స్ వెళ్తున్నాయి గూగుల్‌కి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కండిషన్స్‌కు కంపెనీ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాబ్ లొకేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా లొకేషన్ టూల్ జీతభత్యాల చెల్లింపునకు గూగుల్ సిద్ధపడుతుండగా.. అందుకు కూడా తాము సిద్ధమేనని సమ్మతి తెలిపారు ఉద్యోగులు. ఇది చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: అమెజాన్ నిర్ణయం ఇది ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌కి సుమారు లక్షా 35 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో గతంలో చాలామంది వర్క్‌ఫ్రమ్ హోం రిక్వెస్ట్‌లు పెట్టుకోగా.. కేవలం గత రెండు నెలల్లోనే సుమారు పది వేల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అర్జీలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో 85 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వాలని గూగుల్ నిర్ణయించుకుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోం, రీ లొకేషన్ విజ్ఞప్తులు తిరస్కరణకు గురైన ఉద్యోగులు.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా గూగుల్ నిర్ణయించింది. ఇక గూగుల్ నుంచి ఈ స్పందన వచ్చిన వెంటనే.. మరికొన్ని టెక్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టగా.. ఉద్యోగుల నుంచి ఇలాంటి స్పందనే వస్తోంది. ఇదీ చదవండి: ఆఫీసులకు వెళ్తేనే కదా అసలు మజా! వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పని భారం, మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ కరోనా వైరస్ భయం, ఉద్యోగాల్లో అభద్రతా భావం, ఎక్కువ సేపు ఇంట్లోనే గడిపే వీలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, డబ్బు సేవింగ్స్, ఇతర పనులు చక్కబెట్టుకునే వీలు!.. తదితర కారణాలతో కట్టింగ్లు అయినా సరే ‘వర్క్ ఫ్రమ్ హోం’కే ఉద్యోగులు మొగ్గుచూపిస్తున్నారు. ఇక డెల్టా వేరియెంట్ విజృంభణతో ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ను అక్టోబర్ 18 వరకు వాయిదా వేశాయి గూగుల్, యాపిల్ సహా ఇతరత్రా టెక్ కంపెనీలు. -
తప్పక ఫేస్‌మాస్క్ ధరించండి.. ఫొటోలు!
ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, కప్పా, ల్యామ్డా, డెల్టా ప్లస్... ఇలా మహమ్మారి కరోనా అనేక రూపాలు మార్చుకుంటూ మానవాళిని వణికిస్తోంది. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేకపోవడం, మరోవైపు థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కు ధరించడం తప్పనిసరి. ►కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు మనపై పడకుండా మాస్కు అడ్డుకుంటుంది. అంతేకాదు గాలిలోని అనేకానేక సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించకుండా ఆపేస్తుంది. ►ప్రపంచవ్యాప్తంగా సర్జికల్, రిస్సిరేటర్, క్లాత్ ఫేస్ కవరింగ్ అనే మూడు రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ►ఆపరేషన్ థియేటర్లో సర్జరీ సమయంలో పేషెంట్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా సర్జికల్ మాస్కులు వాడతారు. ►గాలిని శుద్ధి చేసే రిస్పిరేటర్లను కూడా రోగుల కోసం ఉపయోగిస్తారు. ►అయితే, కరోనా కాలంలో సామాన్య ప్రజలు కూడా సర్జికల్ మాస్కులను ఉపయోగిస్తున్నారు. ►ఇక ఇంట్లో అందుబాటులో ఉన్న వస్త్రాలతో చాలా మంది క్లాత్ మాస్కులు తయారు చేసుకుంటున్నారు. ►చాలా మంది ఫేస్‌మాస్కుతో పాటు కళ్ల నుంచి వైరస్ లోపలికి ప్రవేశించే వీల్లేకుండా గాగుల్స్ ధరిస్తున్నారు కూడా. ►ఏదైమైనా కరోనా కాలంలో చికిత్స కంటే నివారణే మేలు అన్న చందంగా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. తప్పక వ్యాక్సిన్ వేయించుకోండి. -
డెల్టా కన్నా డేంజర్ వేరియంట్ వస్తోందా?
కరోనా వైరస్ ఎప్పటికప్పుడు రూపుమార్చుకుంటూ కొత్త సవాళ్లను విసురుతోంది. డెల్టా వేరియంట్ ఉధృతి తగ్గే సమయానికి ఇతర వేరియంట్లైన ల్యామ్డా, ఈటా వంటివి డేంజరస్‌గా మారే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ వేరియంట్ల వ్యాప్తిపై డబ్లు్యహెచ్‌ఓ కన్నేసి ఉంచింది. ఎలాంటి టీకాకు లొంగకుండా, కార్చిచ్చులాగా వ్యాపిస్తూ, ప్రజలను తీవ్ర అనారోగ్యం పాలు చేసే వేరియంట్ రెడీ అవుతోందనేందుకు ఛాన్సులు తక్కువేగానీ, అస్సలు లేవని చెప్పలేమని న్యూస్‌వీక్ రిపోర్ట్ తాజా నివేదిక అభిప్రాయపడింది. అలాంటి వేరియంట్ ఎదురైతే ప్రస్తుత ముప్పునకు మూడురెట్లు అధిక ముప్పుండొచ్చని అంచనా వేసింది. అలాంటి వేరియంట్‌ను స్టిరాయిడ్స్(అధికశక్తిని ప్రేరేపించే రసాయనాలు) తీసుకున్న అథ్లెట్లతో పోలుస్తూ ‘స్టిరాయిడ్ తీసుకున్న డెల్టా’గా నివేదిక అభివర్ణిస్తోంది. టీకాలే శరణమా? పైన లెక్క ప్రకారం చూస్తే ఎంత తక్కువగా మ్యుటేషన్ చెందినా ఈ పాటికి కరోనా డేంజర్ వేరియంట్ల సంఖ్య ఎక్కువగానే ఉండాలనే డౌట్ వస్తుంది. అయితే ప్రతి మ్యుటేషన్‌తో వచ్చే వేరియంట్ డేంజర్ కాకపోవచ్చని, ఉద్భవించిన కొత్త వేరియంట్ ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందిందనే అంశంపై ఆధారపడి దాని ప్రభావం ఉంటుందని పరిశోధన వెల్లడించింది. అంటే సంవత్సరం పాటు ఒక వేరియంట్ కొద్దిమంది జనాభాలో వ్యాప్తి చెందుతుంటే వచ్చే ప్రమాదం కన్నా కోట్లాదిమందిలో సోకిన వేరియంట్ వ్యాప్తి తీవ్రత కారణంగా అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. అంటే మనిషి శరీరమే కరోనా కొత్త వేరియంట్ పుట్టుకకు ల్యాబ్‌లాగా పనిచేస్తుందన్నమాట. ముఖ్యంగా టీకా తీసుకోని జనాభా ఎక్కువగా ఉన్న చోట వ్యాపించే వేరియంట్ అంత్యంత డేంజరస్‌గా మారుతుందని నివేదిక తెలిపింది. కేవలం మాస్కులు, సామాజిక దూరంతో కొత్త వేరియంట్ల సృష్టిని ఆపలేమని, టీకాలు తీసుకోవడం ద్వారానే దీనికి అడ్డుకట్టవేయగలమని మరో సైంటిస్టు ప్రీతి మాలిని అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే డెల్టా కన్నా డేంజర్ వేరియంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న దేశాల్లో డెల్టా విజృంభణకు ఇదే కారణమని నిపుణులతో పాటు డబ్లు్యహెచ్‌ఓ భావిస్తోంది. అందుకే దేశాలన్నీ టీకా కార్యక్రమ వేగాన్ని పెంచాలని కోరుతోంది. ఎందుకింత ప్రమాదకరం? నిజానికి ఇతర జీవులతో పోలిస్తే కరోనా వైరస్‌లో జన్యుపదార్ధం చాలా స్వల్పం. మొత్తం కలిపితే 15 జీన్స్ ఉంటాయి. మనిషి కణంలో 20వేల జీన్స్ ఉంటాయి. దీన్ని బట్టి కరోనా జన్యుపదార్ధ సైజు అర్దం చేసుకోవచ్చు. అలాగే దీని ఉత్పరివర్తనాల రేటు(రేట్ ఆఫ్ మ్యుటేషన్) చాలా తక్కువ. పది రిప్లికేషన్ల(ప్రతికృతి)కు ఒకసారి ఈ వైరస్ జీన్స్ మ్యుటేషన్ చెందుతాయి. మరలాంటప్పుడు కరోనా కొత్త వేరియంట్లు ఒకదాని కన్నా ఒకటి డేంజర్‌గా ఎందుకు మారుతున్నాయన్న ప్రశ్న వస్తుంది. ఇతర వైరస్‌లతో పోలిస్తే జన్యుపదార్ద రిప్లికేషన్లో తప్పిదాలు జరగకుండా ఉత్పరివర్తనం(మ్యుటేషన్) చెందే సామర్థ్యం కరోనా సొంతమని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇతర వైరస్‌లతో పోలిస్తే ఇది సోకిన వ్యక్తిలో ఉత్పత్తయ్యే వైరస్ల సంఖ్య చాలా ఎక్కువ. దీంతో ఒకసారి మ్యుటేషన్ పొందిన అనంతరం కొత్త వేరియంట్ సోకిన మనిషిలో దీని లోడు చాలా ఎక్కువ. దీంతో సదరు రోగి కోట్లాది మ్యుటేడెడ్ వైరస్‌లను ఒక్కరోజులో ఉత్పత్తి చేస్తుంటాడు. ఉత్పరివర్తన రేటు తక్కువైనా కొత్తగా పుట్టు కొచ్చే వైరస్ సంఖ్య చాలా ఎక్కువ కావడంతో డేంజర్ వేరియంట్ ఆవిర్భావం జరుగుతోందని తెలిపింది. – నేషనల్‌డెస్క్, సాక్షి -
చైనాలో ‘డెల్టా’ కలవరం.. మరోసారి లాక్డౌన్
బీజింగ్: కరోనా డెల్టా వేరియంట్ డ్రాగన్ దేశం చైనాను వణికిస్తోంది. సోమవారం 55 కొత్త కేసులు నమోదయ్యాయి. 20కిపైగా నగరాలు, పదికిపైగా ప్రావిన్స్‌ల్లో డెల్లా వేరియంట్ ఉనికి బయటపడింది. దీంతో డెల్టా వేరియంట్‌న వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. నాన్జింగ్లో రష్యా నుంచి వచ్చిన విమానాన్ని శుభ్రం చేసిన 9 మంది ఎయిర్‌పోర్టు కార్మికులకు డెల్టా వేరియంట్ సోకినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. బీజింగ్‌సహా పెద్ద నగరాల్లో కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు. హునాన్ ప్రావిన్స్‌లోని జుజౌ సిటీలో సోమవారం లాక్డౌన్ విధించారు. దీంతో 10.2 లక్షల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. బీజింగ్‌లో డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి బీజింగ్‌లోకి పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించారు. ఇక పర్యాటక ప్రాంతమైన జాంగ్‌జీజియాజీలో శుక్రవారం లాక్డౌన్ అమలు చేశారు. చాంగ్‌పింగ్‌లోనూ గత వారం లాక్డౌన్ విధించారు. తాజాగా హైనన్, హెనాన్ ప్రావిన్స్‌ల్లో కొత్త కేసులు అధికంగా బయటపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్–19 ఒరిజినల్ వెర్షన్ కంటే డెల్టా వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. కరోనా వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ వేరియంట్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలోనూ డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా నియంత్రణకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది. పెద్ద నగరమైన సిడ్నీలో చాలారోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. -
డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవాగ్జిన్ సామర్థ్యం 62.5 శాతం
హైదరాబాద్: భారత్ బయోటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్(ఐసీఎంఆర్) బయో ఆర్క్సివ్లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తులకు కోవాగ్జిన్ రెండు డోసుల టీకాలను అందిచడం ద్వారా శరీరంలో ఐజీఎం యాంటీబాడీస్ పెరిగి బాధితులు కోలుకున్నట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. మూడో దశ 3 క్లినికల్ ట్రయల్‌లో డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపించినట్లు తెలిపారు. కాగా కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతంగా తేలింది. ఇక బి.1.617.2 డెల్టా వేరియంట్‌పై సామర్థ్యం 65.2 శాతంగా తేలింది. ఇక దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 46 కోట్ల మైలురాయి దాటింది. 54,94,423 శిబిరాల ద్వారా మొత్తం 46,15,18,479 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,07,81,263 మంది కోలుకున్నారు. -
Telangana: రెండు డెల్టా ప్లస్ కేసులు.. అత్యంత గోప్యంగా!
కరోనా భయాలు ఇప్పట్లో వీడేలా లేవు. మళ్లీ వైరస్ విస్తరిస్తోంది. గత వారం రోజులుగా గ్రేటర్ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల డిశ్చార్జి కంటే..కొత్తగా అడ్మిట్ అవుతున్న రోగుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కూడా వెలుగుచూస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కోవిడ్ వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంది. ఇప్పటికే అనేక మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్...తాజాగా డెల్టా ప్లస్‌గా రూపాంతరం చెందిందనే ప్రచారం సిటీజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 70 కేసులను గుర్తించగా, వీటిలో రెండు కేసులు తెలంగాణలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఒకరు ఓ వైద్యుడి బంధువు కాగా, మరొకరు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులపై వైద్య ఆరోగ్యశాఖ అత్యంత గోప్యతను పాటిస్తుండటం గమనార్హం. సర్వైలెన్స్ విభాగం ఇప్పటికే ఆయా బాధితులతో పాటు వారికి సన్నిహితంగా మెలిగిన వారి నుంచి కూడా నమూనాలు సేకరించి ఐసీఎంఆర్‌కు పంపినట్లు సమాచారం. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యులు మాత్రం ఇప్పటి వరకు తమ వద్ద డెల్టా ప్లస్ కేసులు రిపోర్ట్ కాలేదని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కేసులన్నీ డెల్టా వేరియంట్ కేసు లేనని చెప్పుతుండటం విశేషం. చాపకింద నీరులా... ► ఏప్రిల్, మేలో విశ్వనగరంలో విశ్వరూపాన్ని ప్రదర్శించిన కరోనా వైరస్ జూన్ నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ► ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రోజుకు సగటున 150పైగా కేసులు నమోదవుతున్నాయి. గాంధీలో ప్రస్తుతం 370 మంది చికిత్స పొందుతుండగా, వీరి లో సగానికిపైగా మంది గ్రేటర్ జిల్లాల వారే. ► పక్షం రోజుల క్రితం గాంధీలో కొత్త అడ్మిషన్ల కంటే..డిశ్చార్జీలే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం ఇందుకు భిన్నంగా ఉంది. కొత్తగా రోజుకు 30 మందికిపైగా అడ్మిటవుతుంటే...20 మంది మాత్రమే డిశ్చార్జ్ అవుతున్నారు. ► కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు భావించి సాధారణ సేవలను పునరుద్ధరించేందుకు గాంధీ వైద్యులు సిద్ధం అవుతుండగా..ప్రస్తుతం మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 9141 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్ జిల్లాల్లోనే మూడు వేలకుపైగా క్రియాశీల కేసులు ఉండటం గమనార్హం. వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు కోవిడ్ వైరస్ పూర్తిగా పోవడం వల్లే ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేసినట్లు చాలా మంది భావిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం మానేశారు. భౌతిక దూరం పాటించడం లేదు. మార్కెట్లు, హోటళ్లు, మాల్స్ జనంతో రద్దీగా మారుతున్నాయి. నిజానికి వైరస్ పూర్తిగా పోలేదు. కేవలం కేసుల సంఖ్య మాత్రమే తగ్గింది. పర్వదినాల్లో సిటిజన్లు పెద్ద సంఖ్యలో జమవుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమవుతున్నారు. జాగ్రత్తలు పాటించకుండా..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థర్డ్‌వేవ్ ముప్పు తప్పదు. డెల్టా వేరియంట్ కాస్తా..డెల్టా ప్లస్‌గా రూపాంతరం చెందితే పరిస్థితి విషమిస్తుంది. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
డెల్టాప్లస్.. ఆటలమ్మ కంటే వేగం
న్యూయార్క్: చికెన్‌పాక్స్(ఆటలమ్మ) ఎంత వేగంగా వ్యాపించగలదో, కరోనా డెల్టా వేరియంట్ అంతే వేగంగా వ్యాపించగలదని, మిగిలిన వేరియంట్ల కన్నా ఎక్కువ అనారోగ్యం కలిగించగలదని యూఎస్ సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) హెచ్చరించినట్లు అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ తీసుకోనివారిలో వ్యాపించినంత వేగంగానే, టీకా తీసుకున్నవారికి కూడా అంతేవేగంగా డెల్టా సోకవచ్చని సీడీసీ తెలిపింది. టీకా తీసుకోని వారి ముక్కు, గొంతులో ఎంత వైరల్ లోడు ఉంటుందో, టీకా తీసుకున్న వారిలో నూ అంతే లోడుంటుందని సీడీసీ డైరెక్టర్ రొచెల్ వాలెన్‌స్కై చెప్పారు. అలాగే ఆల్ఫా వేరియంట్ బాధితుల్లో ఉండే వైరల్ లోడు కన్నా 10 రెట్లు అధిక లోడు డెల్టా వేరియంట్ సోకినవారిలో గమనించినట్లు సీడీసీ తెలిపింది. మెర్స్, సార్స్, ఎబోలా, జలుబు, స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా సోకుతుందని తెలిపింది. అమెరికాలో టీకా తీసుకున్న వారిలో సైతం డెల్టా సోకినట్లు్ల సీడీసీ పేర్కొంది. వివిధ రాష్ట్రాల గణాంకాలను విశ్లేషించి సీడీసీ ఈ పత్రాన్ని రూపొందించింది. ప్రతి చోటా ప్రతి ఒక్కరూ మరలా మాస్కులు ధరించడం మంచిదని రొచెల్ సూచించారు. ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. టీకా తీసుకున్నవారు సైతం డెల్టా వ్యాప్తికి కారకులు కావడం ఆందోళనకరమైన విషయమని మరో సైంటిస్టు వాల్టర్ ఓరెన్స్టైన్ చెప్పారు. అయితే డెల్టా సోకినా సరే టీకా తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లేనన్నారు. టీకా వల్ల వ్యాధి తీవ్రత 90 శాతం వరకు తగ్గుతుందని, అందువల్ల వీరు తీవ్ర అనారోగ్యం పాలయ్యేందుకు, లేదా తీవ్ర వ్యాప్తికి కారణమయ్యేందుకు ఛాన్సులు తక్కువన్నారు. -
బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్కు భయపడాలా..?
టీకా తీసుకుంటే కరోనాకు ‘మత్ డరోనా’ అనుకుంటూ వచ్చింది ప్రపంచం. కానీ ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. టీకా రెండు డోసులు పుచ్చుకున్నా సరే కరోనా రావచ్చంటున్నాయి తాజా పరిశోధనలు. ఇలా వచ్చే ఇన్ఫెక్షన్ను బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ అంటారు. డెల్టా వేరియంట్ దెబ్బకు టీకాల ప్రభావం క్షీణిస్తోందని, అందుకే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్లు ఎక్కువైతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అసలీ వార్తలు నిజమేనా? నిజమైతే ఎంతవరకు డేంజర్? టీకా తీసుకున్నా కరోనా సోకేట్లయితే ఎందుకు టీకా తీసుకోవడం? తదితర అంశాలపై జరిగిన పరిశోధనల వివరాలపై ఒక లుక్కేద్దాం! ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం ప్రభావవంతం కాదు. పోలియోను నిరోధించే సాక్ వ్యాక్సిన్ సైతం 80–90 శాతం మాత్రమే ఎఫెక్టివ్. మీజిల్స్‌కు ఇచ్చే టీకా 94 శాతం మాత్రమే ప్రభావశీలి. ఈ గణాంకాల ప్రకారం చూస్తే దాదాపు 95 శాతం ప్రభావం చూపుతున్న మోదెర్నా, ఫైజర్ రూపొందించిన ఎంఆర్ఎన్ఏ కరోనా టీకాలు బాగానే పని చేస్తున్నట్లు లెక్క. ఒక టీకా 95 శాతం ప్రభావశాలి అంటే 100మంది జనాభాలో 95 మందిని టీకా రక్షిస్తుంది, ఐదుగురికి మాత్రమే వైరస్ సోకుతుందని కాదని నిపుణులు వివరిస్తున్నారు. 95 శాతం ప్రభావశాలి అంటే ఒక నిర్ణీత సమూహంలో టీకా తీసుకున్నవారిని, టీకా తీసుకోనివారిని పోల్చిచూసి టీకా ప్రభావాన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక టీకా ప్రభావశాలిత్వం 95 శాతమంటే, నిర్ణీత కాలంలో 10 వేల మంది జనాభాలో 100మంది టీకా తీసుకోనివారికి వైరస్ సోకిందంటే వారిలో ఐదుగురు టీకా తీసుకున్నవారు కూడా ఉన్నారని అర్దం. ఇలా టీకా తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే టీకా ఇచ్చిన రక్షణ కవచాలను ఛేదించుకొని మరీ వైరస్ సోకిందన్నమాట! అందరికీ వస్తుందా? ఇతర వ్యాధులతో పోలిస్తే కరోనా విషయంలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇలాంటి బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్కు గురైన వారిలో వ్యాధి తీవ్రత, లక్షణాలు స్వల్పంగా లేదా అసలు కనిపించకుండానే ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు జనవరి– ఏప్రిల్ కాలంలో యూఎస్‌లో సుమారు 1.2 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా వీటిలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ సంఖ్య 10, 262ని సీడీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే నుంచి కేవలం ఆస్పత్రి పాలైనవారు లేదా మరణించినవారివి తప్ప సాధారణ బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ గణాంకాల సేకరణను సీడీసీ నిలిపివేసింది. జూలై 19నాటికి ఇలాంటి కేసులు సంఖ్య సుమారు 6వేలుంది. ఇదే సమయానికి దేశంలో టీకా తీసుకున్నవారు సుమారు 16 కోట్లు. ఫైజర్, మోదెర్నా టీకాల విషయంలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ సంఖ్య 0.16 శాతముంది. దీన్ని బట్టి బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ చాలా అసాధారణమని తెలుస్తోంది. ఎంత సీరియస్? ఒక వ్యక్తి నిర్ధేశిత టీకా డోసులు పూర్తి చేసిన 14 రోజుల అనంతరం అతనికి కరోనా పాజిటివ్ వస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్గా భావించాలని సీడీసీ పేర్కొంది. సీడీసీ లెక్కల ప్రకారం మొత్తం బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్లో 27 శాతం కేసుల్లో లక్షణాలే కనిపించలేదు. 10 శాతం మంది కరోనాతో పాటు ఇతర సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు. కేవలం 2 శాతం మందిమాత్రమే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ తర్వాత మరణించారు. ఇతర అధ్యయనాల్లో సైతం బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ వల్ల మరణాలు సంభవించలేదనే తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ చాలావరకు డేంజర్ కాదనే నిపుణులు చెబుతున్నారు. ఎవరికి రావచ్చు? అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మాములు కరోనా కేసులు ఎక్కువగా ఉండే చోట్లనే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ కేసులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సామూహికంగా గుమిగూడే ప్రదేశాలను సందర్శించేవారు, కిక్కిరిసిన సమూహంలో పనిచేయాల్సివచ్చినవారు, కరోనా పేషెంట్లతో ఎక్కువ కాలం గడిపే హెల్త్‌లైన్ వర్కర్లు, 65ఏళ్ల పైబడినవారు, బీపీ, షుగర్, హృద్రోగాలు, కిడ్నీవ్యాధుల్లాంటి వాటితో బాధపడేవారు, అవయవమార్పిడి జరిగినవారిలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ అధికమని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం పురుషుల కన్నా మహిళల్లో ఈ బ్రేక్‌థ్రూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై మరింత పరిశోధన జరగాల్సిఉంది. డెల్టా వేరియంట్ ప్రభావమేంటి? ప్రస్తుతమున్న కరోనా టీకాలు చాలావరకు తొలిదశ వేరియంట్ల భరతం పట్టేందుకు ఉద్దేశించినవి. అయితే కాలక్రమంలో కొత్త వేరియంట్లు కనిపించినా టీకాల వల్ల పెరిగిన యాంటీబాడీలు ఈ వేరియంట్లను కూడా బాగానే అడ్డుకున్నాయి. అయితే డెల్టా వేరియంట్ రంగప్రవేశంతో సీను మారింది. ఈ వేరియంట్ కారణంగా తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా ప్రస్తుత టీకాలు కాపాడుతున్నా, పాత వేరియంట్లతో పోలిస్తే దీనిపై ప్రభావం తక్కువగానే ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఉదాహరణకు ఎంఆర్ఎన్ఏ రెండు డోసులు తీసుకుంటే ఆల్ఫావేరియంట్పై 89% ప్రభావం చూపగా, డెల్టాపై 79% ప్రభావమే కనిపించిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలిపింది. కానీ, డెలా ్టకారణంగా ఆస్పత్రి పాలు కాకుండా మాత్రం టీకాలన్నీ బాగానే ప్రభావం చూపుతున్నాయి. టీకా తీసుకోవాలా? అమెరికా సహా పలు దేశాల్లో దాదాపు 35–50 శాతం జనాభా టీకాలు తీసుకున్నారు. అలాగే వయోవృద్ధుల్లో చాలామందికి టీకాలందాయి. వీరందరిలో అత్యధికులను చావు నుంచి తీవ్ర అనారోగ్యం నుంచి టీకా కాపాడినట్లు పరిశోధనలు తెలిపాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్‌లో టీకాల వల్ల ఆస్పత్రిపాలవడం 68 శాతం మేర తగ్గింది. గత మేలో అమెరికాలో కరోనా కారణంగా సంభవించిన మరణాలు 18,000కాగా వీటిలో టీకా తీసుకున్నవారి సంఖ్య 150. అంటే చాలావరకు కరోనా మరణాలు టీకా తీసుకోనివారిలోనే సంభవించినట్లు తెలుస్తోంది. టీకా తీసుకోనివారు కరోనాకు చెందిన ఏ వేరియంట్ బారినైనా పడొచ్చని, తద్వారా తీవ్ర అనారోగ్యమో, మరణమో సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తప్పక టీకాలు తీసుకోవడం మంచిదన్నది నిపుణులందరి మాట! – నేషనల్ డెస్క్, సాక్షి -
తెలంగాణలో రెండు డెల్టా ప్లస్ కేసులు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కొత్త రూపమైన డెల్టా ప్లస్ కేసులు తెలంగాణలో రెండు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఈ నెల 23 నాటికి దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహా రాష్ట్రలో 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. డెల్టా ప్లస్ కరోనా వైరస్ ఏ స్థాయిలో ప్రమాదమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రమాదం అంటుండగా, కొందరు వైద్య నిపుణులైతే అంత ప్రమాదం ఏమీ కాదని పేర్కొంటున్నారు. -
వర్క్‌ఫ్రమ్ ‘ఆఫీస్’ నుంచి స్వల్ప ఊరట!
Google Employees Returning To Office: కరోనా నేపథ్యంలో సుమారు ఏడాదిన్నరగా వర్క్‌ఫ్రమ్ హోంలోనే ఉండిపోయారు కోట్ల మంది ఉద్యోగులు. అయితే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఆఫీసులకు రావాల్సిందేనని చాలా కంపెనీలు మెయిల్స్ ద్వారా కరాకండిగా చెప్పేశాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం వర్క్‌ఫ్రమ్ నడిపించాలని భావిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం ఉద్యోగులకు స్వల్ప ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేశాయి. సిలికాన్ వ్యాలీ: సెప్టెంబర్ మొదటి వారం నుంచి మూడు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేస్ మీద ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి కంపెనీలు. తాజాగా వర్క్‌ఫ్రమ్ హోంను మరో నెలకు పైనే కొనసాగించాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు గూగుల్, ఫేస్బుక్, యాపిల్‌తో పాటు కొన్ని ఎమ్ఎన్సీలు ఉద్యోగులకు మెయిల్స్ పంపించాయి. అక్టోబర్ 18 వరకు ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోంలోనే కొనసాగొచ్చని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇక గూగుల్ నుంచి ప్రకటన వెలువడిన కాసేపటికే యాపిల్, ఆ వెంటనే ఫేస్బుక్ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే విడుదల చేశాయి. వ్యాక్సిన్లు వేయించుకున్నాకే ఆఫీసులకు రావాలని, కనీసం ఒక్క డోస్ వేయించుకున్నా సరిపోతుందని ఉద్యోగులకు తప్పనిసరి ఆదేశాల్లో పేర్కొన్నాయి కంపెనీలు. సడలింపు గడువును వ్యాక్సిన్ డోసుల కోసం ఉపయోగించుకోవాలని పిలుపు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత-ప్రశాంతతమే తమకు ముఖ్యమని, ఈ పాలసీని యూఎస్ నుంచి మిగతా దేశాలకు విస్తరిస్తామని, కరోనా డెల్టా వేరియెంట్ విజృంభణ-ఎంప్లాయిస్‌లో భయాందోళనలు.. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంటుండడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వీలైనంత త్వరగా ఆఫీసులకు ఉద్యోగులకు రప్పించే ప్రయత్నం చేస్తామని ఫేస్బుక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక తాజా ఆదేశాలతో మరికొన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోంని మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. -
‘డెల్టా’ డేంజర్ బెల్స్!
కరోనా డెల్టా వేరియంట్ ప్రమాదకారుల్లోకెల్లా ప్రమాదకారి అని నిరూపించే గణాంకాలు, అధ్యయనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలోని కోవిడ్ వైరస్ వేరియంట్లన్నింటిలోకి డెల్టా వేరియంట్ వేగవంతమైన, ప్రభావవంతమైనదని, టీకా తీసుకోని వారిలో ఈ వేరియంట్ ప్రభావం అధికమని తెలుసు! అయితే తాజాగా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి సైతం ఇన్ఫెక్షన్ కలిగించే సత్తా డెల్టాకు ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా టీకా తీసుకున్నా సరే డెల్టా సోకినవారు ఇతరులకు దీన్ని వ్యాప్తి చేయగలరని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు డెల్టానే అని సైంటిస్టు షారన్ పీకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్‌ను ‘‘ఫిట్ అండ్ ఫాస్ట్’’గా అభివర్ణించారు. దీని దెబ్బకు టీకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున పూర్తి చేసి ఆంక్షలు ఎత్తేసిన దేశాల్లో తిరిగి ఆంక్షలు విధించాల్సిన అవసరం వచ్చేలాఉందన్నారు. ఫైజర్ ప్రభావం అంతంత మాత్రమేనా? ఇప్పటివరకు కోవిడ్‌పై వచ్చిన టీకాల్లో అత్యంత ప్రభావవంతమైనదని భావిస్తున్న ఫైజర్ టీకా డెల్టాపై 41 శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని ఇజ్రాయిల్‌లో బయటపడ్డ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో డెల్టా వేరియంట్‌పై టీకాలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయన్న నిపుణుల భయాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రిపాలైనవారిలో దాదాపు 22 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నవారున్నారు. సింగపూర్‌లో సైతం ఇదే ధోరణి కనిపించింది. ఇజ్రాయిల్‌లో కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 60 శాతంమంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఎస్‌లో నూతన ఇన్ఫెక్షన్లలో 83 శాతం డెల్టా వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈయూలోని మొత్తం 28 దేశాలుండగా, ప్రస్తుతం 19 దేశాల్లో డెల్టా జోరు పెరిగిందని డబ్లు్యహెచ్‌ఓ హెచ్చరించింది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఈసీడీసీ)సైతం ఇదే హెచ్చరికలు చేసింది. ఈతరహా కొనసాగితే ప్రపంచమంతా డెల్టా ఆధిపత్యం వ్యాపించేందుకు వారాలు చాలని పేర్కొంది. ఇది ఇలాగే వ్యాపిస్తూ మరో కొత్త వేరియంట్‌గా మారితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేసింది. ముక్కులో వైరస్ లోడు సాధారణ కోవిడ్ వేరియంట్లు సోకిన రోగి ముక్కులో ఉండే వైరల్ లోడు కన్నా వెయ్యిరెట్లు అధికంగా డెల్టా వేరియంట్ సోకిన రోగి ముక్కులో వైరస్‌లోడు ఉంటుందని చైనాలో జరిపిన మరో అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల వైరస్ వ్యాప్తి మరింత వేగవంతమవుతోందని పీకాక్ విశ్లేషించారు. డెల్టా ఇన్ఫెక్షన్ల కారణంగా వ్యాక్సినేషన్లపై ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కానీ అసలు టీకా తీసుకోకుండా ఉండడం కన్నా ఏదో ఒక టీకా తీసుకోవడం చాలా బెటరని సూచిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మొత్తం కేసుల్లో 75% పైగా డెల్టా వేరియంట్‌వే
జెనీవా: భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, యూకే సహా ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు వారాలుగా పరీక్షించిన కోవిడ్–19 శాంపిళ్లలో పాజిటివ్‌గా తేలిన వాటిల్లో 75%పైగా డెల్టా వేరియంట్‌వేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చాలా దేశాలు కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీని విస్తృతం చేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కేసుల్లో పెరుగుదల నమోదయిందని ఈనెల 20వ తేదీన విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత వారంలో ఇండోనేసియాలో అత్యధికంగా 44% పెరుగుదలతో 3,50,273 కేసులు నమోదయ్యాయి. యూకేలో 41% పెరుగుదలతో 2,96,447 కేసులు, బ్రెజిల్ 14% పెరుగుదలతో 2,87,610 కొత్త కేసులు, భారత్‌లో 268,843 కొత్త కేసులతో 8 శాతం పెరుగుదల, అమెరికాలో 2,16,433 కొత్త కరోనా వైరస్ కేసులతో 68% పెరుగుదల నమోదైనట్లు వివరించింది. జీఐఎస్ఎయిడ్ సంస్థ జూలై 20వ తేదీన వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 2,40,000 శాంపిళ్లలో 2,20,000 శాంపిళ్లు డెల్టా వేరియంట్‌వేనని నిర్థారణ అయిందని తెలిపింది. రాబోయే నెలల్లో డెల్టా వేరియంట్ కేసులే అత్యధికంగా ఉండే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కాగా, భారత్‌లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్‌వే ఉంటున్నాయని కరోనా జన్యుక్రమాన్ని శోధించే వేదిక ఇన్సాకాగ్ వెల్లడించింది. -
ప్రజలు ఖచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్
-
టీకా తీసుకుంటే ప్రాణాలకు ముప్పుండదు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. అదే విధంగా టీకా తీసుకున్నవారికి ప్రాణాలకు ముప్పు రాలేదని ఆ అధ్యయనం తెలిపింది. అత్యధికులకి కరోనా వైరస్ సోకడానికి డెల్టా వేరియెంటే కారణమని పేర్కొంది. దేశంలో వ్యాక్సిన్ కార్యక్రమం మొదలయ్యాక జరిగిన అతి పెద్ద అధ్యయనం ఇదే. కరోనా మరో ముప్పు రాకుండా ఉండాలంటే త్వరితగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమయ్యేలా చూడాలని ఆ అధ్యయనం పేర్కొంది. దీనివల్ల దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందని తెలిపింది. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఒక్క డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా సోకిన 677 మంది శాంపిల్స్‌ని పరీక్షించింది. అందులో 86.09 మందికి డెల్టా వేరియెంట్ సోకింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆల్ఫా వేరియెంట్ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని తెలిపింది. కరోనా సోకిన వారిలో 9.8% మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంక 0.4% మృతులు నమోదైనట్టు ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. -
వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఏం ప్రయోజనం.. వైరస్ మళ్లీ సోకింది
లండన్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఇటీవలే కరోనా బారిన పడి, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే అతనికి కరోనా ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనా సోకకముందు పంత్ ఎక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అని బీసీసీఐ వర్గాలు ఆరా తీస్తుండగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. జూన్ 29న పంత్.. వెంబ్లీ స్టేడియంలో యూరో ఛాంపియన్షిప్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. అక్కడ మాస్క్ లేకుండానే అభిమానులతో సెల్ఫీలు దిగాడు. కాగా, పంత్ ఇక్కడే కరోనా బారినపడ్డాడని అందరూ భావించారు. కానీ, అతనికి చాలా గ్యాప్ తరువాత అంటే జులై 8న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంటే పంత్‌కు ఫుట్‌బాల్ స్టేడియంలో కరోనా సోకలేదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మధ్యలో అతను జులై 5, 6 తేదీల్లో ఓ దంత వైద్యుడి సంప్రదించాడు. జులై 7న రెండో డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాడు. ఆ మరుసటి రోజే అంటే జులై 8న అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంటే అతనికి దంత వైద్యశాలలోనే వైరస్ సోకి ఉండవచ్చని బీసీసీఐ ప్రాధమిక నిర్ధారణకు వచ్చింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాక కూడా పంత్.. వైరస్ బారిన పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, పంత్‌కు కరోనా డెల్టా వేరియంట్ వైరస్ సోకిందని వైద్య పరీక్షల్లో రుజువైనట్లు సమాచారం. -
టీమిండియా ప్లేయర్‌కు కరోనా.. బీసీసీఐ అలర్ట్!
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 23 మంది ఆటగాళ్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. ఆటగాడి పేరు బయటకు వెల్లడించకపోగా.. ప్రస్తుతం అతను తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే స్వల్ఫ గొంతు నొప్పిగా ఉండడంతో ఆ ఆటగాడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ ఆటగాడితో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులను, సిబ్బందిని మూడురోజుల పాటు ఐసోలేషన్ వెళ్లమని వైద్య సిబ్బంది సూచించగా.. ఆ గడువు ముగిసింది. దీంతో గురువారం ఆ ఆటగాడు మినహా.. మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు. ఇక బుధవారం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కోల్‌కతాలో సమావేశంకాగా, ఏం చర్చించారనే విషయంపై గోప్యతను ప్రదర్శించారు. మరోవైపు 20 రోజుల బ్రేక్ దొరికినప్పటికీ టీమిండియా ఆటగాళ్లను బయటకు వెళ్లొద్దని బీసీసీఐ సూచించినప్పటికీ.. కొందరు ఏకంగా వింబుల్డన్ టోర్నీకి హాజరయ్యారు కూడా. ఇక ఆటగాడు వైరస్ బారినపడ్డ(అసింప్టోమెటిక్ లక్షణాలు) విషయం తెలిశాక.. బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి ఓ మెయిల్ లేఖను పంపారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతుండడంతోనే ఇలా సూచించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఆ ఆటగాడికి వైరస్ ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆగష్టు 5వ తేదీ నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈమధ్య పాకిస్థాన్‌లో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్యాంప్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. -
థర్డ్ వేవ్ ముంగిట్లో..!
-
రెండో వేవ్ ముగియలేదు.. కాస్త తగ్గండి, ముందుంది అసలు కథ!
కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ తగ్గి లాక్డౌన్ ఎత్తివేయగానే.. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఒకవైపు ఉద్యోగాలు, చిరువ్యాపారులు నిత్యజీవితంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సరదాల కోసం పాకులాడేవాళ్లు సైతం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మాస్క్‌లను మరిచి గుంపులుగా తిరుగుతున్న జనసందోహాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యూఢిల్లీ: తాజాగా హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ స్పాట్ మనాలిలో గుంపులుగా జనాలు తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కార్లు, మంచు రోడ్లపై వెహికిల్స్ క్యూ, ముస్సోరీ కెంప్టీ జలపాతం దగ్గర ఆదమరిచి ఆస్వాదిస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్ మాట పక్కనపెట్టినా.. అందులో మాస్క్‌లు లేన్నోళ్లే ఎక్కువ. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పర్వం కొనసాగుతోంది. ‘మెంటల్ పీస్ కోసం పోతే.. రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు’ అని సెటైర్లు పేలుస్తున్నారు. ఈ తరుణంలో ‘యూరో 2020’ ప్రస్తావన తెస్తూ.. ఇకనైనా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Tourists ‘watering down’ all #COVID19 norms at kempty Falls Mussorie … A steep fall straight into the ‘deep waters’ of #ThirdWave !#Covididiots #coronavirus #Covid #Mussorie Video- Scoopwhoop pic.twitter.com/LBruU0k3Xp — RAHUL SRIVASTAV (@upcoprahul) July 7, 2021 సగం జనాభాకి వ్యాక్సిన్, అయినా.. కిందటి ఏడాది జరగాల్సిన యూరో 2020 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఏడాది జరుగుతోంది. అయితే ఆశగా ఎదురుచూసిన లక్షల మంది సాకర్ కోసం.. గేట్లు తెరిచింది లండన్ వాంబ్లే స్టేడియం. నాకౌట్ టోర్నీల కోసం 2 లక్షల మంది ఫ్యాన్స్ స్టేడియంలో అడుగుపెట్టగా.. చివరి రెండు సెమీఫైనల్స్ కోసమే లక్షా 22 వేలమంది హాజరుకాగా, ఇక ఆదివారం జరగబోయే ఫైనల్ కోసమని 60 వేలమందికి అనుమతి దొరికింది. అయితే ఫ్యాన్స్‌ను పరిమిత సంఖ్యలో అనుమతించాలనే ఆలోచన చేస్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ వేవ్‌తో, ప్రమాదకరమైన వేరియెంట్లతో ఇంగ్లండ్‌పై విరుచుకుపడుతోంది కరోనా. జనవరి నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో.. ఆంక్షలు ఎత్తేశాక కేసులు నిదానిస్తూ వచ్చాయి. కానీ, యూరో 2020 మొదలయ్యాక కేసుల సంఖ్యలో స్వల్ఫంగా పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. జులై 8న 30 వేల కేసులు(జనవరి నుంచి ఇదే హయ్యెస్ట్?!) నమోదు అయ్యాయి. ఇంగ్లండ్‌లో ఇప్పటికే 51.1 శాతం జనాభాకు పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచంలో ఇదే మెరుగైన వ్యాక్సినేషన్ రేటు కూడా. పైగా వ్యాక్సినేషన్ తీసుకున్న ఫ్యాన్స్‌నే స్టేడియంలోకి అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. స్టేడియంలోకే కాదు.. స్టేడియం బయట ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. మాస్క్‌లు లేకుండా గుంపులుగా పార్టీలు చేస్తున్న దృశ్యాలు ప్రతీరోజూ కనిపిస్తున్నాయి. అయితే ఈ అత్యుత్సాహం-అభిమానం మధ్య చివరి మ్యాచ్ ఇంకెన్ని కేసులకు దారితీస్తోందో అనే ఆందోళనలో ఉండింది అక్కడి అధికార యంత్రాంగం. మరోవైపు డెల్టా వేరియెంట్.. కొనసాగింపుగా వస్తున్న వేరియెంట్ల ముప్పు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం అయ్యింది. యూరో సాకర్ అభిమానులు ‘సూపర్స్పెడ్రర్లు’గా మారే అవకాశం లేకపోలేదని, వాళ్లను నిశీతంగా పరిశీలించాలని ఇంగ్లండ్ ప్రభుత్వానికి సూచించింది. మరి మన పరిస్థితి.. మన దేశంలో జనాభా పరంగా ఇప్పటికే ఐదు శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. సింగిల్ డోసుల లెక్కలపై ప్రభుత్వ గణాంకాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పైగా మార్చి-మే మధ్యలో ఎన్నికలు, మహా కుంభమేళా నేపథ్యాలతో కేసులు పెరిగాయనే విమర్శలు ప్రభుత్వాలపై ఉండనే ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి విమర్శలను తట్టుకునే స్థాయిలో ప్రభుత్వం లేన్నట్లుంది. అందుకే గుంపులుగా జనాల కదలికలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉండడంతో అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేసింది కేంద్రం. ‘యూరో 2020 పరిస్థితులు చూస్తున్నాంగా. వాళ్లే భయపడుతున్నారు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.మీరే కాదు.. మీ వల్ల అవతలి వాళ్లూ ఇబ్బందిపడతారని గుర్తించండి. మాస్క్‌లు ధరించండి.. జాగ్రత్తలు పాటించండి’ అనే సందేశంతో ప్రచారం నిర్వహిస్తోంది. అసలు కరోనా రెండో వేవ్ కథే ముగియలేదన్న ప్రభుత్వ ప్రకటన.. నెలకొన్న ఆందోళన స్థాయిని ప్రతిబింబిస్తోంది. ‘కరోనా యుద్ధం ఇంకా ముగియలేదు. అసలు రెండో వేవ్ ఉధృతే అయిపోలేదు. కొవిడ్ ప్రొటోకాల్‌ను జాగ్రత్తగా పాటిస్తేనే.. దానిని పూర్తిగా ఎదుర్కొగలిగిన వాళ్లం అవుతాం. సరదాలు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది. మాస్క్‌లు ధరించండి. ’’ అని అని కొవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. -
ఢిల్లీలో కరోనా కట్టడికి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సంక్రమణ నేపథ్యంలో ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబర్ – నవంబరులో థర్డ్ వేవ్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఏరకంగా వ్యవహరించాలన్న దానిపై శుక్రవారం జరిగిన కీలక సమావేశంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ను ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఆమోదించింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సంక్రమణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ వేరియంట్‌ను ఢిల్లీలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులోభాగంగా కరోనా సంక్రమణ సంభవించినప్పుడు, ఎప్పుడు లాక్డౌన్ విధించాలి...? ఎప్పుడ్ అన్‌లాక్ చేయాలి..? అనే అంశాలకు సంబంధించిన ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ను అనుసరించాలని నిర్ణయించారు. దీని కోసం బ్లూప్రింట్ సైతం సిద్ధం చేశారు. డీడీఎంఏ సమావేశం.. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్–19 మహమ్మారి పరిస్థితి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలో శుక్రవారం 22వ డీడీఎంఏ సమావేశం జరిగింది. ఇందులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, రెవెన్యూ మంత్రి, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డెల్టా ప్లస్, లాంబ్డా వంటి కొత్త వేరియంట్ల కారణంగా ఎదురయ్యే పరిణామాలపై కూలంకషంగా చర్చించారు. వ్యాక్సినేషన్, జీనోమ్ సీక్వెన్సింగ్, టెస్టింగ్, ట్రాకింగ్, నిఘా వంటి చర్యలను నూతన వేరియెంట్స్ వ్యాప్తిని తగ్గించేందుకు అత్యంత ప్రభావవంతమైన దశలుగా సూచించారు. కరోనా సంక్రమణ రేటు, యాక్టివ్ కరోనా రోగుల సంఖ్య, ఆసుపత్రులలోని రోగుల సంఖ్య ఆధారంగా ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ పనిచేస్తుంది. ఢిల్లీలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్న ప్రదేశాలలో ఆంక్షలు విధించనున్నారు. ఎలా పనిచేస్తుంది..? 1) ఎల్లో అలర్ట్: ఢిల్లీలో సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులపాటు 0.5 శాతానికి మించి ఉంటే లేదా వారంలో 1,500 కొత్త కరోనా కేసులు నమోదైతే లేదా ఆసుపత్రులలో 500 ఆక్సిజన్ పడకలు సగటున వారానికి నిండి ఉంటే ఈ హెచ్చరిక ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో కేసులు తక్కువ సంఖ్యలో ఉంటే, సరి–బేసి ఫార్ములా ప్రకారం మార్కెట్లు, మాల్స్‌లో అత్యవసరంకాని వస్తువులు,సేవల దుకాణాలను ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు తెరవడానికి అనుమతిస్తారు. మూడు కార్పోరేషన్ ప్రాంతాల్లో సగం సామర్థ్యంతో వారాంతపు మార్కెట్లు తెరిచేందుకు, నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక యూనిట్లు పనిచేయడానికి అనుమతిస్తారు. 2) అంబర్ అలర్ట్ ః సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులు ఒక శాతానికి మించి ఉంటే లేదా వారంలో 3,500 కొత్త కేసులు ఉంటే లేదా వారంలో సగటు ఆక్సిజన్ పడకలు 700 కన్నా ఎక్కువ ఉంటే ఈ హెచ్చరిక వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో, నిర్మాణ కార్యకలాపాలు అనుమతిస్తారు. మార్కెట్లు, మాల్స్‌లోని దుకాణాలను సరి–బేసి ప్రాతిపదికన ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు తెరవవచ్చు. 3) ఆరెంజ్ అలర్ట్ ః కరోనా సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులపాటు 2 శాతానికి మించి ఉంటే లేదా వారంలో 9,000 కొత్త కేసులు నమోదైతే లేదా వరుసగా ఏడు రోజులు ఆసుపత్రిలో సగటున 1000 ఆక్సిజన్ పడకలు నిండి ఉంటే ఈ హెచ్చరిక వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో కిరాణా, పాలు, కెమిస్ట్ వంటి ముఖ్యమైన వస్తువుల దుకాణాలు తప్ప, అన్ని దుకాణాలు, మార్కెట్లు మూసివేస్తారు. మెట్రో సర్వీసులు మూసివేస్తారు. బస్సులు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపేందుకు అనుమతిస్తారు. ఆటోలు, క్యాబ్‌లు, ఈ–రిక్షాలు గరిష్టంగా ఇద్దరు ప్రయాణీకులను తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. 4) రెడ్ అలర్ట్ ః కరోనా సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులు 5 శాతం మించి ఉంటే లేదా వారంలో 16,000 కొత్త కేసులు నమోదైతే లేదా ఆసుపత్రులు సగటున 3000 ఆక్సిజన్ పడకలతో ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం నిండి ఉంటే ఈ సిగ్నల్ ప్రభావవంతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, నిర్మాణ కార్యకలాపాలపై కూడా నిషేధం ఉంటుంది. కార్మికులు నిర్మాణ ప్రాంతంలోనే ఉండగలిగితే అవసరమైన వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేయడానికి కర్మాగారాలకు అనుమతి ఉంటుంది. -
అమెరికాలో డెల్టా దందా
హూస్టన్: అమెరికాలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఆధిపత్యం చూపుతోంది. నమోదవుతున్న కేసుల్లో 51.7 శాతం కేసులు ఈ వేరియంట్‌వేనని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది. కరోనా వేరియంట్లలో వేగవంతమైన ఈ వేరియంట్, ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనైతే దాదాపు 80 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమవుతోంది. ఒకప్పుడు దేశంలో ఎక్కువగా కనిపించిన ఆల్ఫా వేరియంట్ ప్రస్తుతం 28.7 శాతం కేసులకు కారణమవుతోందని సీడీసీ గణాంకాలు వెల్లడించాయి. టీకా ఎందుకు అని ఎవరైనా అడిగితే డెల్టా వేరియంట్ వ్యాప్తి పెరగడమే కారణమని చెప్పవచ్చని అమెరికా ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఫౌచీ వ్యాఖ్యానించారు. ఇది కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, ఎక్కువ ప్రభావాన్ని చూపగలదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈవేరియంట్ ఆధిపత్యం మరింతగా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతున్న కేసులు కనిపిస్తున్నాయని, కానీ వీటి సంఖ్య తక్కువేనని ఆరోగ్య నిపుణులు తెలిపారు. వ్యాక్సినేషనే శరణ్యం దేశంలోని 12– 15 సంవత్సరాల పిల్లల్లో ఐదుగురిలో ఒకరు టీకా తీసుకున్నట్లు సీడీసీ తెలిపింది. అదే 16–17 సంవత్సరాల యువతలో ముగ్గురిలో ఒకరు టీకా తీసుకున్నారు. డెల్టా వేరియంట్ కారణంగా కేసులు పెరగడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని తట్టుకోవాలంటే ఎక్కువమందికి టీకా ఇవ్వడమే మార్గమని డాక్టర్లు చెబుతున్నారు. వేరియంట్ రూపుమార్చుకొని మరింత వేగంగా వ్యాపించే సామర్ధ్యం పెంచుకుంటున్నప్పుడు, దాన్ని అడ్డుకునేందుకు సమాజంలో టీకా తీసుకున్న వారి సంఖ్యను పెంచుకుంటూ పోవడమే మార్గమని డాక్టర్ డేవిడ్ పెర్సీ చెప్పారు. కొందరు డాక్టర్లు పిల్లలు సైతం మాస్కు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటివరకు టీకా తీసుకోని వారు డెల్టా బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్ పీటర్ హెచ్చరించారు. డెల్టా వేరియంట్ నుంచి సైతం రక్షణ ఇచ్చేలా ప్రస్తుత వ్యాక్సిన్లున్నాయని, కానీ అధిక శాతం జనాభా ఇంకా టీకా తీసుకోకపోవడం వల్ల రిస్కు పెరుగుతోందని వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పైక్ ప్రోటీన్‌లో ఉత్పరివర్తనంతో డెల్టా వేరియంట్ ఆవిర్భవించింది. ఇది గత వేరియంట్ల కన్నా ఎక్కువ ప్రభావవంతంగా ఆరోగ్యంగా ఉన్న మానవ కణాల్లోకి చొచ్చుకుపోయే శక్తిని పొందింది. -
డెల్టా కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరం..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ధాటి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి. కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి… డెల్టా, లాంబ్డా వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ ప్రస్తుతం 100కిపైగా దేశాల్లో విజృంభిస్తోంది. మరోవైపు దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా మరో రూపం లాంబ్డా వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో లాంబ్డా వేరియంట్‌పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లాంబ్డా వేరియంట్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించవచ్చని షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ ఉద్భవించిందని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. మరోవైపు యూకేలో గుర్తించిన లాంబ్డా కరోనా వేరియంట్ డెల్టా కంటే మూడు రెట్లు ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు తేల్చారు. పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనా వైరస్ నమూనాలలో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు. లాంబ్డా వైరస్ త్వరగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. -
Coronavirus: మూడో వేవ్? ఎదుర్కొందాం ఇలా..!
అల తర్వాత అల... ఆటు తర్వాత పోటు... సముద్రంలో మామూలే. కానీ ఇప్పుడు కరోనా సంక్షోభమూ ఓ కడలిలాగే అంతూపొంతూ లేకుండా కనిపిస్తోంది. కొత్త కొత్త వేరియెంట్లూ, స్ట్రెయిన్లూ అంటూ అలల్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న రెండో వేవ్ తర్వాత మూడో వేవ్ కూడా వస్తుందా? అది మరింత శక్తిమంతంగా పెద్దలతో పాటు పిల్లలనూ ప్రమాదంలో ముంచెత్తుతుందా అన్నది చాలామంది ముందు ఉన్న ప్రశ్న. ఒకవేళ అది అంత పెద్ద అలే అయితే... దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది మన ముందు ఉన్న ప్రశ్న. అలల్లో కొట్టుకుపోవడం అందరికీ మామూలే. కానీ కొందరు సర్ఫర్లు మాత్రం పెద్ద పెద్ద అలలకు బెంబేలెత్తరు.... బెదిరిపోరు. వచ్చే అల ఉంటే ఎలాగూ వస్తుంది... వద్దని మనం అనుకున్నా ఆగదు. అయితే... ఒకవేళ అలాంటి రాకాసి అల వచ్చినప్పటికీ... మన ముందస్తు తయారీతో సర్ఫర్ల స్వారీలా దాన్ని నేర్పుగా అధిగమించే మార్గాలను తెలుసుకుందాం. కరోనా మూడో దశను కలిసికట్టుగా ఎదుర్కొందాం. అసలు కరోనా దశల వారీగా ఎందుకు వస్తుంటుందో చూద్దాం? కరోనా ఒక్కటే కాదు.. ఆ మాటకొస్తే చాలారకాల వైరల్ ఇన్ఫెక్షన్లు దశలవారీగా సంభవిస్తుంటాయి. ఇలా జరగడానికి కారణం ఉంది. ప్రపంచంలోని ప్రతి జీవీ తన పరిణామ దశలో అంతకంతకూ తనను తాను మెరుగుపరచుకుంటూ ఉంటుంది. మనుగడ కోసం కృషి చేస్తుంటుంది. కరోనా వైరస్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఒకసారి ఒక స్ట్రెయిన్‌తో ఇది వచ్చాక.. ఆ స్ట్రెయిన్‌కు చాలామందిలో ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. దాంతో ఆ ఇమ్యునిటీ ఉన్నవారిలో తాను మనుగడ సాగించలేదు. కాబట్టి మరింతగా మెరుగుపరచుకుని మరో కొత్త స్ట్రెయిన్ రూపంలో మరిన్ని (తన మనుగడ కోసం కావాల్సిన అనుకూల) మార్పులతో అది తనను తాను మళ్లీ మళ్లీ ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. ఇలా తనను తాను కొత్త స్ట్రెయిన్లు సృష్టించుకుంటుంది కాబట్టి దశలు దశలుగా (ఫస్ట్, సెంకడ్, థర్డ్ ఇలా వేవ్స్) వస్తుంటుంది. అలా ప్రతి దశ అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి కారణమవుతుంది. వైరస్ ఇలా అనేక స్ట్రెయిన్లుగా, వేరియెంట్లుగా ఎందుకు మారుతుందో తెలుసుకుని, దాన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసుకునే ముందుగా అసలు వైరస్ గురించి కాస్తంత అవగాహన పెంచుకుందాం. దాంతో మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశం చాలా తేలికవుతుంది. ప్రతిజీవిలోనూ ఎన్నో రకాల కణాలుంటాయి. ఉదాహరణకు గుండె కండర కణం, మెదడు కణం, ఊపిరితిత్తుల కణం.. ఇలా ఎన్నెన్నో. ప్రతి కణంలోనూ ఓ కేంద్రకం, అందులో క్రోమోజోములు ఉంటాయి. అవన్నీ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలాంటి మూల పదార్థాలతో నిర్మితమై ఉంటాయి. వైరస్ అనేది కూడా కణంలోని మూల పదార్థమైన ఒక ఆర్ఎన్ఏ లేదా కొన్నిసార్లు డీఎన్ఏ మాత్రమే నిర్మితమై ఉండే చాలా చిన్న జీవాంశం. మనకు ఏదైనా పరాన్నజీవి సోకిందనుకోండి. అప్పుడు అది బ్యాక్టీరియానో, ఫంగసో లేదా ఏకకణజీవో అయితే.. మందులు వాడి దాన్ని ఒకింత తేలిగ్గానే చంపవచ్చు. కానీ వైరస్ అలా కాదు. అది ఆర్ఎన్ఏ కావడం వల్ల మన కణంలోకి చొరబడి మన ఆర్ఎన్ఏలతో కలిసిపోయి తన ప్రత్యుత్పత్తి నిర్వహించుకుంటూ ఉంటుంది. ఇలా ఒక కణంలోకి చొరబడిన ఓ వైరస్.. మూడొందలు మొదలుకొని 1000కి పైగా వైరస్‌లుగా పెరిగి ఆ కణాన్ని నాశనం చేసి, బయటకు వచ్చేస్తుంది. కొత్తగా పుట్టిన అవి మళ్లీ తమ ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తాయి. అలా వైరస్లలో హానికరమైనవి వ్యాపించినప్పుడు మనం వాటి దుష్ఫలితాలను చూస్తాం. ఈ వైరస్లు ఎంత చిన్నవంటే.. ఒక సూది మొన మీద కోట్లాది వైరస్లు ఉంటాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా (ఈ కథనం రాస్తున్ననాటికి అంటే.. 26వ తేదీ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారు 18,12,57,890 మంది రోగులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది). ఉజ్జాయింపుగా ఇప్పటికి 20 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డట్లు అంచనా వేసి... ఈ అందరిలోనూ ఉన్న ఈ బిలియన్లూ, ట్రిలియన్లలో ఉన్న వైరస్‌లను సేకరించి... ఓ టీ–కప్పు లో వేశామనుకుందాం.. ఇంకా ఆ టీకప్పు నిండకుండా.. కాస్తంత వెలితిగానే ఉంటుంది. అంత చిన్నవన్నమాట ఈ వైరస్లు. కరోనా ఏమిటీ... వాటి కొత్త స్ట్రెయిన్ కథ ఏమిటి? ఈ లోకంలో కోటాను కోట్ల రకాల వైరస్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో కేవలం మనకు జలుబు తెచ్చిపెట్టేవే దాదాపు 200 రకాల పైనే ఉంటాయి. వాటినీ వాటి సమలక్షణాల ఆధారంగా గ్రూపులుగా చేస్తే జలుబు తెచ్చే వైరస్లు ఆరు ప్రధాన రకాలు అవి.. 1) ఇన్ఫ్లుయెంజా, 2) పారా ఇన్ఫ్లుయెంజా, 3) రైనో వైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్ రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) 6) కరోనా. ఇలా చూసినప్పుడు కరోనా అన్నది ఈ ప్రపంచానికి కొత్తదేమీ కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. ఈ కరోనాలోనూ మళ్లీ ప్రధానమైనవి ఏడు రకాల వైరస్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక మనిషి నుంచి ఇంకొకరికి వ్యాపించేవే. ఇందులో నాలుగు రకాలు మాత్రం చాలా తేలికపాటి జలుబును తెచ్చి, ఓ వారం రోజుల్లో తగ్గిపోయేలా మాయమవుతాయి. కానీ మరో మూడు మాత్రమే ఒకింత ప్రమాదకరమైనవి. ఆ మూడింటినీ నిర్దిష్టంగా చెప్పాలంటే 1) సార్స్ (సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)ను తెచ్చే వైరస్, 2) మధ్యప్రాచ్య దేశాల్లో వచ్చిన వేరియెంట్ అయిన మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)తో పాటు తాజాగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ‘కోవిడ్–19’ వైరస్. అంతెందుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కొత్తల్లోనూ పరిశోధకులు దాదాపు 103 రకాల శాంపుళ్లను పరిశీలించినప్పుడు అందులో కొన్ని ‘ఎల్’ అనే రకానికీ, మరికొన్ని ‘ఎస్’ అనే రకానికి చెందనవి ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లోనూ తొలుత ‘ఎస్’ వచ్చిందనీ.. అయితే అది కొందరికి మాత్రమే పరిమితం కాగా.. ఆ తర్వాత కనిపించిన ‘ఎల్’ రకం చాలామందిలో కనిపించినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రముఖమైన కొన్ని కొత్త వేరియెంట్లు ఇవే... ► ఆల్ఫా (బి.1.1.7.): గత ఏడాది చివర్లో ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో కనిపించిన వేరియెంట్ ఇది. ఇది కరోనా వైరస్ల మీద ఉన్న కొమ్ములాంటి దానిపై (స్పైక్ ప్రోటీన్‌లో) వచ్చిన మార్పు కారణంగా ఉనికిలోకి వచ్చిన వేరియెంట్. ఇది అంతకుముందున్న వేరియెంట్ల కంటే 70% వేగంగా వ్యాపిస్తోందని ప్రతీతి పొందింది. ► బీటా (బి.1.351): మిగతా అన్ని దేశాలతో పాటు ప్రత్యేకంగా ఇది సౌత్ ఆఫ్రికా, నైజీరియాలలో ఎక్కువగా వ్యాపించింది. సౌత్ ఆఫ్రికన్ వేరియెంట్ మిగతావాటికంటే ఒకింత ప్రమాదకారిగా పేరు పొందింది. ►గామా (పీ.1): ఈ ఏడాది మొదట్లో అంటే.. జనవరి 2021లో ఇది బ్రెజిల్ నుంచి జపాన్‌కు ప్రయాణం చేసిన వ్యక్తుల వల్ల జపాన్‌లో ఎక్కువగా కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు. జనవరి చివరినాటికి అమెరికా అంతటా వ్యాపించింది. అయితే మిగతా అన్ని వేరియెంట్ల కంటే ఇది చాలా వేగంగా అంటుకుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక అప్పటికే ఒకసారి కోవిడ్–19 వచ్చిన వారికీ రెండోసారి రావడానికి ఇదే కారణమని వారు తెలిపారు. ఈ సంగతి బ్రెజిల్‌లోని 29 ఏళ్ల మహిళకు చేసిన పరీక్షల్లో పరిశోధనల్లో నిర్ధారణ కూడా అయ్యింది. గతంలో ఆమెలో పుట్టిన యాంటీబాడీలను తట్టుకుని కూడా పెరిగేలా ఈ వేరియెంట్ మార్పులు చెందిందని తెలిసింది. ► డెల్టా (బి.1.617.2): ఈ వేరియెంట్నే మన దేశపు వేరియెంట్‌గా పిలుస్తున్నారు. నిజానికి ఇది గత ఏడాది చివర్లో అంటే డిసెంబరులోనే మన దేశంలో కనుగొన్నా.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశమంతటా విజృంభించి, విలయతాండవంతో వేలాది మరణాలకు కారణమైందని చెబుతున్నారు. మన దేశంతో పాటు దీన్ని యూఎస్, యూకే, సింగపూర్ వంటి మరో 43 దేశాల్లోనూ చూశారు. ►డెల్టా ప్లస్ (ఏవై.1): కరోనా డెల్టా వేరియెంట్ (బి.1.617.2) అనేది మార్పులకు గురై డెల్టా ప్లస్ (ఏవై.1)గా మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు కారణంగా కరోనా వైరస్‌లో ఉండే స్పైక్‌లలో మార్పు వచ్చి... అవి మరింతగా కణంలోకి చొచ్చుకుపోయేలా మార్పులు జరిగిందని నిపుణుల మాట. ఈ మార్పులను ‘కే417ఎన్’గా చెబుతున్నారు. ఇప్పటివరకు రూపొందిన వ్యాక్సిన్లన్నీ గతంలోని వేరియెంట్లనూ, మామూలుగా ఉన్న స్పైక్లనూ సమర్థంగా ఎదుర్కొంటున్నవని తేలినప్పటికీ... ఇవి ఈ కొత్త మార్పులతో రూపొందిన వైరస్ వేరియెంట్లను ఎదుర్కోగలవా అన్నది నిపుణుల ముందు ఉన్న సందేహం. అందువల్లనే దీనిపై అన్ని వర్గాల ప్రజల్లోనూ భయాందోళలను పెరుగుతున్నాయి. ఇది ఇప్పటికే మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలలో మూడో వేవ్‌ని తెచ్చినట్లుగా మరికొందరి అనుమానం. కాగా... ఇదే మూడో వేవ్‌కు కారణమవుతుందేమోనన్నది చాలామందిలో ఉన్న సంశయం. మూడో వేవ్ తప్పదా? ఇప్పుడు ముఖ్యంగా మూడో వేవ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకూ దాదాపు 7 నుంచి 8 వేల వరకు మ్యూటేషన్స్ జరిగాయంటూ మనం ఈ కథనంలోనే చెప్పుకున్నాం. కానీ ఈ ఏడెనిమిది వేలలో కేవలం అల్ఫా, బీటా, గామా, డెల్టాల గురించి ఎందుకు ప్రస్తావించాం? ఎందుకంటే... కేవలం ఆర్ఎన్ఏ మాత్రమే ఉండే కరోనా వైరస్‌లో దాదాపు పదివేల మార్పులు వచ్చి... పదివేల వేరియెంట్లుగా మారినప్పటికీ ఓ నాలుగైదు మాత్రమే ప్రమాదకారులుగా ఉండటం మనం చూశాం. అంటే... ఇప్పుడూ మళ్లీ మరో మూడు నాలుగు వేల మార్పులు జరిగినప్పటికీ వాటిల్లో ఏదైనా ఘోర ప్రమాదకారి అవుతుందేమో! అలా అయితే ఏం చేయాలి అనేదే సమస్యగాని... తప్పక మూడో వేవ్ వచ్చి తీరుతుందనీ... అది ప్రమాదకారిగా మారి విలయం సృష్టిస్తుందనీ కాదు. మనకు తెలుసు మనుగడ కోసం ప్రతి జీవీ మరింత ఎక్కువ మెరుగ్గా మారుతుందని. జీవుల్లో ఓ వైరస్‌కు యాంటీబాడీస్ వల్ల నిరోధకత పెరుగుతున్న కొద్దీ... వాటిని అధిమించడానికి అది ఆ యాంటీబాడీస్‌ను తప్పించుకుని మరింత శక్తిమంతం అయ్యేలా రూపొందడానికి ప్రయత్నిస్తుంటుంది. దీన్నే ‘యాంటీబాడీ ఎస్కేప్ వేరియెంట్’ అని కూడా అంటుంటారు. (పెద్దగా ఫలితం లేకపోవడంతో పాటు ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లకు కారణమవుతుందనే అంశాల వల్లనే ప్లాస్మాథెరపీని చికిత్స ప్రోటోకాల్ నుంచి తొలగించిన సంగతి మనకు తెలిసిందే). పై అంశాలన్నింటినీ పరిశీలించినప్పుడు ఈ ఏడాది చివరినాటికి 10,000 సార్లు మ్యూటేషన్ జరిగి కొత్త కొత్త వేరియెంట్లు వస్తే... అందులో ఏదైనా ఇప్పటి చికిత్సలకు లొంగనంత బలంగా కొత్త స్ట్రెయిన్ వస్తే... దాని వల్ల మూడో వేవ్ రావచ్చన్నది నిపుణుల అంచనా. అంతేతప్ప అది తప్పక వస్తుందనీ కాదు... రాదనే గ్యారంటీలేదు. కాకపోతే వస్తే ఏమిటి, ఎదుర్కోవడం ఎలా అన్న సన్నద్ధత మాత్రం తప్పక ఉండాల్సిందే. పిల్లలపైన తప్పక ప్రభావం చూపుతుందా? ఈసారి వచ్చే వేరియెంట్ ఈసారి పిల్లలపై ప్రభావం చూపుతుందనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఉంది... మొదటి వేవ్ వచ్చినప్పుడు ఎక్కువగా వయోవృద్ధులు, బాగా వయసు పైబడినవారు ప్రభావితం అయ్యారనీ, రెండో వేవ్‌లో యువకులు మొదలు మధ్యవయస్కులు ఈ వైరస్ బారిన పడ్డారనీ... అందువల్ల మూడోవేవ్ వస్తేగిస్తే అది తప్పక పిల్లల మీద ప్రభావ చూపుతుందనేది చాలామంది చెబుతున్న మాట. కానీ గణాంకాల మాట వేరేగా ఉంది. ఉదాహరణకు ఏడాది నుంచి పదేళ్ల పిల్లల విషయంలో చూస్తే మొదటి వేవ్‌లో 3.28% చిన్నారులు దీనిబారిన పడగా రెండో వేవ్‌లో వారి శాతం 3.05% మాత్రమే. అంటే ఇంకా చెప్పాలంటే పిల్లల శాతం తగ్గింది. ఇక 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యవారిని చూస్తే.. మొదటి ఏడాదిలో వారి శాతం 8.03% కాగా రెండో వేవ్‌లో అది 8.57 శాతానికి పెరిగింది. అంటే పెరుగుదల కేవలం 0.54% మాత్రమే. అంటే.. కరోనాతో ప్రభావితమయ్యే పిల్లల శాతం మొదటి నుంచీ దాదాపుగా (అటు ఇటుగా) మూడు శాతానికి దగ్గరగానే ఉంది. వాళ్లలోనూ ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్లిన వారు చాలా చాలా తక్కువ. కాబట్టి గణాంకాల పరంగా చూసినా పిల్లలు ప్రభావితమవుతారనేందుకు ఎలాంటి దాఖలాలూ లేవు. ఇక మొదట్లో వయోవృద్ధులూ రెండో వేవ్‌లో మధ్య వయస్కులూ ప్రభావితమయ్యారని చెప్పడానికీ పెద్దగా ఆస్కారం లేదు. ఉదాహరణకు మొదటి వేవ్‌లో 21 – 30 ఏళ్ల వారు 21.21% అయితే రెండోవేవ్ నాటికి ఈ సంఖ్య 22.49% మాత్రమే. అంటే పెరుగుదల 1.28% మాత్రమే. అలాగే 31–40 ఏళ్ల వారూ మొదటివేవ్లో 21.23% ఉండగా రెండోవేవ్‌లో వారి శాతం 22.70%. అంటే పెరుగుదల కేవలం శాతం 1.47% మాత్రమే. ఇలా చూసినప్పుడు మధ్యవయస్కులోనూ జబ్బుపడ్డవారి సంఖ్య పెరుగుదల గణనీయంగా ఏమీ లేదు. అయితే మొదటివేవ్లో వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యారనీ, రెండోవేవ్‌లో వారి శాతం అంతగా లేదని చెప్పడం ఒక రకంగా వాస్తవమే అయినా.. మొదటివేవ్‌తో పోల్చినప్పుడు ఆ ఏజ్ గ్రూపులపై కుటుంబ సభ్యుల శ్రద్ధ పెరగడం.. కరోనా వైరస్ అందుబాటులోకి రాగానే మొదట మనం టీకాలు వేసింది. 65 ఏళ్లకు పైబడినవారికి మాత్రమేనని గుర్తుపెట్టుకుంటే అందుకు కారణాలు మనకే తేలిగ్గా అర్థమవుతాయి. ఇదే టీకా కార్యక్రమం విస్తరించి అన్ని వయసుల వారికీ విస్తృతంగా వ్యాక్సిన్ అందేలా చేసినప్పుడు మూడో వేవ్ ప్రభావం అసలు పెద్దగా ఉండకపోవచ్చు. ఉన్నా నామమాత్రం కావచ్చు కూడా. అందుకే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడితే మూడో వేవ్ అంత ప్రమాదకారి కాబోదనే మన ముందున్న గణాంకాలూ, అంచనాలు చెబుతున్నాయి. అంటే.. మూడోవేవ్ ప్రభావాన్ని తగ్గించేది టీకా అన్న విషయాన్ని అందరూ గుర్తెరిగితే చాలు. ఇక మరో విషయం ఏమిటంటే.. వైరస్ పిల్లల శరీరంలోకి చేరడానికి, పెద్దల్లోలాగా వాళ్లలో రిసెప్టార్లు అంతగా అభివృద్ధి చెంది ఉండవు. దాంతో పిల్లలు ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాధి బారినపడ్డారు. ఇదే సానుకూలమైన అంశం మూడోవేవ్‌లోనూ కనిపించవచ్చు. అందుకే మూవోవేవ్లో పిల్లలు తప్పకుండా పడతారన్నది ఒక ఆధారం లేని అంచనాయే తప్ప అదే వాస్తవం కాదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ పిల్లలో తీవ్రంగా ఉంటుందా? పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కోవిడ్ న్యుమోనియా ఒకింత తక్కువే అయినా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎమ్ఐఎస్–సి) వంటి కోవిడ్–19 అనంతర దుష్ప్రభావాలు పిల్లల్లో ఎక్కువగా కనిపించేందుకు అవకాశం ఉంది. అలాగే ఈ ఎమ్ఐఎస్–సిలోనూ కొన్ని సందర్భాలో లక్షణాలు ఏమీ లేకుండా లేదా కొన్ని చాలా స్వల్ప లక్షణాలతో కరోనా సోకిన 2 – 6 వారాల తర్వాత కూడా కొందరిలో ‘ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్’ ఉండవచ్చునని కొందరి ఆందోళన. ‘ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్’ అంటే పిల్లల్లో ఉండే వ్యాధినిరోధకత తీవ్రంగా ప్రభావితమై వారు ఇతరత్రా ఇన్ఫెక్షన్లకు గురికావడం. అయితే ఇలా జరగడానికి ఉన్న ఆస్కారం తక్కువ. ఒక పరిశీలన మేరకు ప్రస్తుతం లక్షమంది పిల్లల్లో కేవలం పన్నెండు కంటే తక్కువ కేసుల్లోనే ఇలాంటి పరిస్థితిని నిపుణులు చూశారు. త్వరగా గమనిస్తే ఇలాంటి కేసులకూ సమర్థమైన చికిత్స అందించవచ్చు. పైగా ఒకవేళ పిల్లల్లో ‘ఎమ్ఐఎస్–సి’ వచ్చినా.. ఆ చిన్నారుల నుంచి ఈ సమస్య ఇతరులకు వ్యాపించడం లేదు. కాబట్టి ఎలా చూసినా పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందనే వాదనలకు సరైన ఆధారాలు లేవు. అంతమాత్రాన నిర్లక్ష్యం కూడదు... అయితే తార్కాణాలేవీ కనిపించనప్పటికీ పిల్లల విషయంలో అప్రమత్తత మాత్రం అవసరం. ఎందుకంటే ఇప్పటికి మనం టీకా వేస్తున్నది కేవలం 18 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే. వాళ్లందరికీ ఇమ్యూనిటీ వచ్చాక... అలాంటి రక్షణ వలయం లేనివారు పిల్లలే అవుతారు. కాబట్టి వారి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. ఎలాంటి పిల్లలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు? ►పెద్దల్లోలాగే దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలపై కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలు, థలసీమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, కీమోథెరపీ / రేడియేషన్ థెరపీ వంటివి తీసుకుంటున్న పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి పిల్లలకు ప్రాధాన్యక్రమంలో వ్యాక్సిన్ ముందుగా ఇచ్చే ఏర్పాట్లూ చేయాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల విషయంలో సాధారణ పిల్లల కంటే ఒకింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ∙పోషకాహారలోపం ఉన్న పిల్లలూ, రోగనిరోధక వ్యవస్థలో లోపం ఉన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో హోమ్ ఐసోలేషన్ ఎలా? ► వైరస్ సోకిన పిల్లలు తల్లిదండ్రులతో ఉండవచ్చు. ఆ సమయంలో పెద్దల సపోర్ట్ పిల్లలకు చాలా అవసరం కాబట్టి వారి వెంట ఉండాల్సిందే. అయితే పేరెంట్స్ కోవిడ్ నిబంధలైన మాస్క్ ధరించడం, చేతులను మాటిమాటికీ కడుక్కోవడం వంటి జాగ్రత్తలను తప్పక పాటిస్తూ ఉండాలి. ► కరోనా వైరస్‌కు గురైన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాతలూ, నానమ్మ, అమ్మమ్మలూ, మామ్మలతో పాటు ఇంట్లో పెద్దవయసు వారి దగ్గర వదలకూడదు. మైల్డ్ నుంచి ఓ మోస్తరుగా లక్షణాలు కనిపించిన పిల్లలను 10రోజులు, తీవ్రమైన లక్షణాలు కనిపించినవారిని 20 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. అందరికీ వ్యాక్సిన్ వేశాక కరోనా కథ ముగిసిపోతుందా? ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. అందరికీ వ్యాక్సిన్ అందాక మనందరిలోనూ కరోనా వైరస్‌కు ఇమ్యూనిటీ వస్తే మున్ముందు అది మరిన్ని వేరియెంట్లుగా మారే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. దాంతో జలుబు తెచ్చిపెట్టే అనేకానేక వైరస్లలో ఇదీ ఒకటిగానో లేదా ఫ్లూలా ప్రతి ఏడాదీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఓ ప్రమాదరహితమైన (అంటే ఏ కొద్దిమందికో తప్ప మిగతా ప్రజలందరికీ ప్రమాదం చేకూర్చని) ఇన్ఫెక్షన్లా మిగిలిపోవచ్చు. గతంలోనూ ఎన్నో పాండమిక్‌లను ప్రపంచం చూసినట్లుగానే దీన్నీ సమర్థంగా ఎదుర్కొని మానవాళి ఎప్పటిలాగే తన మనుగడ కొనసాగించవచ్చు. వేరియెంట్లు లేదా కొత్త స్ట్రెయిన్లు ఎలా పుడతాయంటే... వైరస్లు తొలుత హైజాక్ చేసినట్లుగా తాము ప్రవేశించిన కణంలోకి దూరిపోతాయి కదా. అక్కడ తమను వృద్ధి చేసుకోవడం మొదలుపెడతాయి. తమను తాము వృద్ధి చేసుకునే ప్రక్రియలో తమ ‘కాపీ’ వైరస్‌ను సృష్టిస్తాయి. ఈ ప్రక్రియనే ‘కాపీయింగ్’ అంటారు. ఒక వైరస్ వేలాది వైరస్‌లను కాపీ చేసుకుంటుంది. ఇవన్నీ మళ్లీ అన్నన్ని కణాలను హైజాక్ చేసి.. మళ్లీ వేలాదిగా, లక్షలాదిగా పెరుగుతూ పోతాయి. ఇలా వేల కొద్దీ పుట్టే సమయంలో వాటి ఆర్ఎన్ఏలో ఏదైనా చిన్న పొరబాటు జరిగి.. ఆ ఆర్‌ఎన్‌ఏలోని పదార్థాల్లో కొత్త మార్పులు జరిగితే.. అది కొత్త స్ట్రెయిన్‌గా, కొత్త వేరియెంట్‌గా మారే అవకాశం ఉంది. కోటాను కోట్లుగా కాపియింగ్ జరిగే ప్రక్రియలో ఇలా కొత్త స్ట్రెయిన్లు, కొత్త వేరియెంట్లుగా మారే అవకాశాలు ఎక్కువ. పిల్లల విషయంలో మన సన్నద్ధత ఎలా ఉండాలంటే... ► పిల్లలైనా పెద్దలైనా మొదట కనిపించే లక్షణం కేవలం జ్వరం మాత్రమే. కాబట్టి ఈ లక్షణాన్ని తేలిగ్గా ఎదుర్కొనేలా పారాసిటమాల్‌తో పాటు వారికి అవసరమైన మాత్రలను సంసిద్ధంగా ఉంచుకోవాలి. ► పిల్లలకు అవసరమైన ఇన్‌పేషెంట్ వసతులతో హాస్పిటల్స్‌ను సైతం సిద్ధం చేయాలి. ఆసుపత్రి సిబ్బంది అందరినీ అప్రమత్తం చేయాలి. ► పిల్లలకు వచ్చేందుకు అవకాశం ఉన్న మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎమ్ఎస్ఐఎస్)కి అవసరమైన ఔషధాలు, చికిత్స సదుపాయాలను ముందునుంచే తయారుగా పెట్టుకునేలా హాస్పిటళ్లను సంసిద్ధం చేయాలి. ► పిల్లల కోసమే ప్రత్యేకంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)తో కూడిన కోవిడ్ వార్డుల ఏర్పాటు జరగాలి. ► పిల్లలు కూడా పెద్దలు తీసుకుంటున్న జాగ్రత్తలను తప్పక పాటించాలి. అంటే... మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం. భౌతిక దూరం వంటివి పాటించాలి. పిల్లలు ఈ మార్గదర్శకాలను పాటించేలా పెద్దలు వారికి అవగాహన కల్పించాలి. అలా చేయడానికి వారికి తోడ్పడాలి. ► చివరగా... అమెరికాలాంటి దేశాల్లో ఇప్పటికే ఫైజర్ వంటి వ్యాక్సిన్లు పిల్లలకు సురక్షితమని తేలింది. ఇక మన దేశంలోనూ పిల్లలపై కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయి. వీటి ఫలితాలు వస్తే... మొదట్లో వయోవృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాధాన్యక్రమంలో తొలుత 65 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చినట్లే... మన ట్రయల్స్‌లోనూ పిల్లలకు వ్యాక్సిన్ సురక్షితమని తేలాక... ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలి. పిల్లలతో మన అనుబంధం బలమైన భావోద్వేగపూరితమైన బంధం. వాళ్లు మన కంటి వెలుగులు. అందుకే గతంలో వ్యాక్సిన్ కొరత వంటి సంభవించిన అంశాలతో పాఠాలు నేర్చుకుని పిల్లల విషయంలో అలాంటి తప్పిదాలు జరగకకుండా... పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తే మూడో వేవ్ ప్రభావం వారి మీద లేకుండా జాగ్రత్తపడవచ్చు. పెద్దలూ... ఈ జాగ్రత్తలు తీసుకోండి... పిల్లల విషయంలో పెద్దలూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అతి తీవ్రమైన జ్వరం వచ్చినా, గొంతునొప్పి, దగ్గు, నీరసం, నిస్సత్తువ, బలహీనత, ఒళ్లునొప్పులూ, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వాసన తెలియకపోవడం, తిండి సయించకపోవడం, చనుబాలు తాగే పిల్లలు పాలు తాగకపోవడం, ఒళ్ళంతా ఎర్రబడడం, కళ్లు, నాలుక ఎర్రబారడం, మగతగా ఉండటం, ఫిట్స్ రావడం, ఆయాసం రావడం, ఒళ్లు నీలంగా మారడం, అపస్మారక స్థితి, ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వంటి తీవ్ర లక్షణాలను పిల్లల్లో గమనిస్తే తక్షణమే వారిని హాస్పిటల్‌కు తరలించాలి. -యాసీన్ -
జాన్సన్ అండ్ జాన్సన్ టీకాతో డెల్టా వేరియంట్‌కు చెక్..!
న్యూజెర్సీ: కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైన డెల్టా వేరియంట్‌పై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. అతి వేగంగా కరోనా మహమ్మారిని వ్యాప్తి చేసే డేల్టా వేరియంట్‌పై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సింగల్ డోసు.. డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుందని, వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 8 నెలల పాటు ఉంటుందని, ఆతర్వాత మరోసారి సింగిల్ బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోతుందని స్పష్టమైంది. SARS-CoV-2 వేరియంట్లపై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, యాంటీ బాడీలు త్వరగా ఉత్పత్తి చేసి డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేస్తుందని రిపోర్టులో వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా (B.1.351) వేరియంట్ కంటే డెల్టా వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతుందని అధ్యయనంలో స్పష్టమైంది. ఈ టీకా తీసుకున్న 85 శాతం మందిలో వైరస్ ప్రాణాంతకంగా మారకుండా ప్రభావం చూపుతుంది. తమ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో మెరుగైన ఫలితాలు రాబట్టిందని జాన్సన్ అండ్ జాన్సన్ ఎండీ పాల్ స్టాఫెల్స్ తెలిపారు. క్లినికల్ డేటా సమాచారం మేరకే సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రభావంపై ఓ అంచనాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ 8 నెలలపాటు కచ్చితంగా రక్షణ కల్పిస్తుందని శాస్త్రీయమైన ఆధారాలున్నాయని తెలిపారు. తమ వ్యాక్సిన్ డెల్టాతో పాటు మరికొన్ని కరోనా వేరియంట్లపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికాలో ఫిబ్రవరి 27న ఆమోదం లభించిందని, మార్చి 11న యూరోపియన్ కమిషన్ కండీషనల్ మార్కెటింగ్‌కు అనుమతి పొందిందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ వినియోగానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందని తెలిపారు. -
ఈ వేరియంట్లేంటి? మ్యుటేషన్ల ముప్పేంటి?
ఏడాదిన్నర కింద కరోనా వైరస్ దాడి మొదలైంది. ఏడాది కింద మొదటి వేవ్‌తో కలకలం సృష్టించింది. ఇటీవల రెండో వేవ్‌తో అతలాకుతలం చేసింది. త్వరలో మూడో వేవ్ వస్తోందన్న ఆందోళననూ రేకెత్తిస్తోంది. అంతా కరోనానే అయినా.. మొదట్లో వచ్చిన వైరస్ వేరియంట్ ఆల్ఫా, ఇప్పుడున్నది డెల్టా, మూడోవేవ్‌కు కారణమవుతాయన్నది డెల్టా ప్లస్. మరి అసలు వైరస్ ఇలా మ్యూటేట్ అవడం ఏమిటి? కారణాలు ఏమిటి? దీనివల్ల ప్రమాదం ఎంత? దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వైరస్ మ్యుటేషన్లు, వేరియంట్లు ఏమిటి? సాధారణంగా వైరస్లు పరిస్థితులకు అనుగుణంగా తరచూ వాటిల్లోని జన్యు, ప్రొటీన్ పదార్థాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పులనే మ్యుటేషన్లు అంటారు. జన్యు, ప్రొటీన్లలో జరిగిన మార్పులను బట్టి ఆ వైరస్ లక్షణాలు తీవ్రంగా మారడంగానీ, ఉన్న సామర్థ్యాన్ని కోల్పోవడం గానీ జరుగుతుంది. ఇలా మ్యుటేషన్లు జరిగిన వైరస్ రకాలనే వేరియంట్లు అంటారు. వైరస్ ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందుతూ పోతుంటే.. అంత ఎక్కువగా మ్యుటేషన్లు చెంది కొత్త కొత్త వేరియంట్లు వస్తాయి. వీటిలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వేరి యంట్లను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (వీఓఐ)’గా.. ప్రమాదకరంగా మారే అవకాశమున్న వాటిని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ)’గా సూచిస్తున్నారు. కరోనా ఎందుకు మార్పు చెందుతోంది? ►ప్రజలు కోవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం ►వ్యాపించిన కొద్దీ వైరస్ తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ►భారీగా పునరుత్పత్తి చేసుకునే క్రమంలో వైరస్ విభజనలో తేడాలు ►ప్లాస్మా థెరపీ, వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి చికిత్సలతో శరీరంలో ఏర్పడిన రోగనిరోధక శక్తిని ఎదుర్కొనేందుకు వైరస్ ప్రయత్నించడం. మ్యుటేషన్ల వల్ల ప్రమాదం ఎంత వరకు? ►వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉండటం ►వ్యాప్తి చెందే సామర్థ్యం పెరగడం ►రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం ►ఊపిరితిత్తుల కణాలకు మరింత సులువుగా అతుక్కునే సామర్థ్యం రావడం ►ఒకచోట ఉన్నవారందరికీ గుంపులుగా ఇన్ఫెక్ట్ కావడం ►మోనోక్లోనల్ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే శక్తి సంతరించుకోవడం దేశంలో ‘కన్సర్న్’ వేరియంట్ల పరిస్థితి ఏమిటి? ►దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 174 జిల్లాల్లో ప్రమాదకర కరోనా వేరియంట్లను గుర్తించారు. ►ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లలో ఇవి ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి. ►40వేల శాంపిళ్లలో ప్రమాదకర వేరియంట్లపై చేసిన కమ్యూనిటీ స్టడీలో.. ఆల్ఫా వేరియంట్ కేసులు 3,969.. గామా రకం ఒకటి.. బీటా రకం 149.. డెల్టా, దాని అనుబంధ రకాల కేసులు 16,238 నమోదయ్యాయి. ►కరోనా కొత్త కేసుల్లో ‘వీఓసీ’ల శాతం మే రెండో వారంలో 10.31 శాతమే ఉండగా.. జూన్ 20 నాటికి ఏకంగా 51 శాతానికి పెరిగింది. అంటే ప్రమాదకర వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోంది. డెల్టా వేరియంట్లు.. ప్రమాదం లెక్కలివీ.. దేశంలో కరోనా రెండో వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా (బీ.1.617) వేరియంట్ మరికొన్ని మార్పులు చెంది.. మూడు సబ్ వేరియంట్లు గా మారింది. ఇందులో కప్పా (బీ.1.617.1), లంబ్డా (బీ.1.617.3)లను జాగ్రత్త పడాల్సిన ‘వీఓఐ’ రకాలుగా గుర్తించారు. మరొకటైన డెల్టా ప్లస్ (బీ.1.617.2 లేదా ఏవై.1) రకాన్ని ప్రమాదకరమైన ‘వీఓసీ’ రకంగా ప్రకటించారు. ►డెల్టా ప్లస్ వేరియంట్‌కు వ్యాప్తి చెందే లక్షణం, ఊపిరితిత్తుల్లోని కణాలకు అతుక్కునే సామర్థ్యం మరింత ఎక్కువ. వ్యాక్సిన్‌తో శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి నుంచి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే సామర్థ్యం పెరిగింది. దేశంలో ‘డెల్టా ప్లస్’ కేసుల తీరు ►దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 51 డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు. ►ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ల్యాబ్‌లలో ఈ వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ►వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ వేరియంట్ కరోనా సోకినవారి పరిస్థితి ఏమిటి, వ్యాక్సిన్ ప్రభా వం ఎంత వరకు ఉందన్నది కచ్చితంగా తేల్చేందుకు పలు ఆస్పత్రుల్లో అధ్యయనం జరుగుతోంది. ప్రమాదకర వేరియంట్ల నియంత్రణ ఎలా? దేశంలో ప్రమాదకర వేరియంట్లు విస్తరిం చకుండా కేంద్ర వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ఈ తరహా కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం, బాధితులను ప్రత్యేకంగా ఐసోలేట్ చేసి, తగిన చికిత్స అందించడం, వారి కాంటా క్టులను క్వారంటైన్ చేయడం, ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ భారీగా చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ►ప్రమాదకర వేరియంట్లు వచ్చిన జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైద్యారోగ్య సేవలను పెంచాలని సూచించింది. ►విస్తృతంగా కరోనా టెస్టులు చేయడం, పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టుల ట్రేసింగ్, శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడం, జనం గుంపులుగా ఉండకుండా చూడటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. -
Delta Varient: రష్యాలో రికార్డు స్థాయిలో మరణాలు
మాస్కో: వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రష్యాలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. అక్కడ వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,042 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 669 మరణాలు నమోదైనట్లు బుధవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో డెల్టా వేరియంట్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాలు ఇవేనని తెలిపింది. స్థానిక అధికారుల లెక్కల ప్రకారం రష్యాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 55,14,599 కాగా, మరణాల సంఖ్య 1,35,214కి చేరింది. ఇదిలా ఉంటే, గత శుక్రవారం యూరో 2020 ఫుట్ బాల్ టోర్నీకి(క్వార్టర్ ఫైనల్) ఆతిథ్యమిచ్చిన సెయింట్ పీటర్స్ బర్గ్ కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఆ నగరంలో కోవిడ్ మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాజధాని మాస్కోలో కూడా పరిస్థితి ఆందోళనకరమైన నేపథ్యంలో అక్కడ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నగర వ్యాప్తంగా నమోదవుతున్న 90శాతం కోవిడ్ కేసులకు డెల్టా వేరియంటే కారణమని మాస్కో మేయర్ సెర్గియి సోబ్యానిన్ తెలిపారు. కాగా, మంగళవారం కూడా రష్యాలో 20,616 కోవిడ్ కేసులు, 652 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యన్లందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ మరోసారి సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు రష్యాలో చాలా మంది వెనకాడుతున్న నేపథ్యంలో…ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, తాను కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని పుతిన్ వెల్లడించారు.