ప్రతీకాత్మక చిత్రం
WHO Warns Europe Covid-19 Situation : గత కొన్ని నెలలుగా మన దేశంలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. అయితే కొన్ని రోజుల క్రితమే పలు రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్‌కు చెందిన ఏవై.4.2 అనే కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్ డెల్టా కంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరోప్ ప్రాంతంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
(చదవండి: థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్)
2022, ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్ వల్ల మరో ఐదు లక్షల మంది మృత్యువాత పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ప్రస్తుతం యూరప్ రీజియన్ పరిధిలో 53 దేశాల్లో కరోనా వ్యాపించి ఉందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లుగే గురువారం మీడియాకు తెలిపారు. ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే, యూరప్ దేశాల్లో మరో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
(చదవండి: వెలుగులోకి మరో వైరస్: సోకిందంటే మరణమే)
రష్యా, బ్రిటన్ తదితర దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవడంతో పలు యూరప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో యూరోపియన్ యూనియన్ రీజియన్ పరిధిలో సెంట్రల్ ఆసియా పరిధిలోని పలు దేశాలతోపాటు మరో 53 ఈయూ దేశాలు వస్తాయి. మహమ్మరి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment