COVID Vaccine For Children Under 2-18 Years Available By September: Know Complete Details - Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ నెలాఖరుకు పిల్లలకు కోవాగ్జిన్‌

Published Thu, Aug 19 2021 3:05 AM | Last Updated on Thu, Aug 19 2021 6:35 PM

Vaccines for Children may be Available by September: NIV Director - Sakshi

ప్రియా అబ్రహం 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతో పాటు, వ్యాక్సిన్‌ తీసుకోవాలని పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ డైరెక్టర్‌ ప్రియా అబ్రహం తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు ఇచ్చే కోవాగ్జిన్‌ ట్రయల్‌ త్వరలోనే పూర్తవుతుందని, సెప్టెంబర్‌ నెలాఖరు కల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కోవిడ్‌ –19 విషయంలో జరుగుతున్న శాస్త్రీయ పరిణామాలపై ఇండియా సైన్స్‌ అనే సంస్థతో ప్రియా అబ్రహం వర్చువల్‌గా మాట్లాడారు. 

పిల్లలపై కోవాక్సిన్‌ ట్రయల్‌ ఏ దశలో నడుస్తోంది. పిల్లలకు వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?
ప్రస్తుతం 2–18 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం కోవాగ్జిన్‌ రెండో దశ, మూడో దశ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. త్వరలో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులేటర్స్‌కు ఈ ఫలితాలు అందిస్తారు. కాబట్టి సెప్టెంబర్‌ నెలాఖరుకు లేదా ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే పిల్లలకు కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌లను అందించ గలుగుతాం. ఇది కాకుండా, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ ట్రయల్‌ కూడా జరుగుతోంది. ఇది పిల్లలకు సైతం ఉపయోగిం చవచ్చు. త్వరలో ఇది కూడా అందుబాటులోకి రానుంది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవైనా డెల్టా–ప్లస్‌ వేరియంట్‌పై ప్రభావవంతంగా ఉన్నాయా?
డెల్టా వేరియంట్‌ కంటే డెల్టా–ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అనే విష యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా డెల్టా వేరియంట్‌ 130కి పైగా దేశాలలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో  మేము ఈ వేరియంట్‌ మీద అధ్యయనాలు చేశాం. మేము వ్యాక్సిన్లు వేసిన వ్యక్తుల శరీరాలలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలను అధ్యయనం చేసిప్పుడు ఈ వేరియంట్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీల సమర్థత కొంత తగ్గినట్లు కను గొన్నాం. అయినప్పటికీ వ్యాక్సిన్లు ఇప్పటికీ వేరి యంట్‌లను ఎదుర్కొనే విషయంలో రక్షణగా ఉన్నాయి. అవి కొంచెం తక్కువ సామర్థ్యాన్ని చూపించవచ్చు. కానీ ఇలాంటి మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లు  చాలా ముఖ్యమైనవి. వ్యాక్సిన్‌ తీసుకోని ఎవరైనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో చేరడం, పరిస్థితి విషమంగా మారితే చనిపోయే అవకాశాలుం టాయి. కాబట్టి వేరియంట్‌ ఏౖదైనప్పటికీ ఇప్ప టివరకు డెల్టా వేరియంట్‌తో సహా  అన్నింటి విషయంలో వ్యాక్సిన్‌ రక్షణగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సంకోచం ఉండరాదు. 

రాబోయే కాలంలో మనకు బూస్టర్‌ డోస్‌లు అవసరమా? ఈ విషయంపై ఏదైనా అధ్యయనం జరుగుతోందా?
బూస్టర్‌ డోస్‌లపై అధ్యయనాలు విదేశాలలో జరుగుతున్నాయి. బూస్టర్‌ డోస్‌ల కోసం కనీసం ఏడు వేర్వేరు వ్యాక్సిన్లను ప్రయత్నిం చారు. కానీ ప్రస్తుతం మరిన్ని దేశాలు వ్యాక్సిన్లు వేసే వరకు డబ్ల్యూహెచ్‌ఓ బూస్టర్లపై అధ్యయనాలను నిలిపివేసింది. ధనికదేశాలు బూస్టర్‌ డోసులు ఇవ్వడం ప్రారంభిస్తే పేదదేశాలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భవిష్యత్తులో బూస్టర్‌ల కోసం సిఫార్సులు ఖచ్చితంగా వస్తాయి.

వ్యాక్సిన్ల మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వినియోగంపై అధ్యయనాలు జరుగుతున్నాయా? అది ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుంది?
మన దేశంలో పొరపాటున 2 డోసుల్లో రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్పిన్లను కొందరికి ఇవ్వ డం జరిగింది. వీరిపై అధ్యయనం చేశాం. వేర్వే రు వ్యాక్సిన్లు తీసుకున్న రోగులు సురక్షితంగా ఉన్నారని మేము గుర్తించాం. వారిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు. వారిలో యాంటీబాడీలు కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఇది కచ్చితంగా సురక్షితమే. మేము ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నాం. 

బర్డ్‌–ఫ్లూ లేదా జికా వైరస్‌ సోకిన వ్యక్తులు కోవిడ్‌–19 సంక్రమణకు గురవుతారా?
బర్డ్‌ ఫ్లూ, జికా వైరస్‌లు కరోనా వైరస్‌తో ఏమాత్రం సంబంధం లేనివి. కానీ బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ, కరోనా వైరస్‌లకు ఉండే సారూప్యత కారణంగా వాటి వ్యాప్తిని మాస్క్‌లు, భౌతిక దూరం, చేతుల శుభ్రత, ఇంటి కోవిడ్‌ పోటోకాల్స్‌ పాటించడం ద్వారా నిరోధిం చవచ్చు. ఈ వైరస్‌లు అన్నీ శ్వాస మార్గము ద్వారానే సంక్రమిస్తాయి. అయితే జికా వైరస్‌ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.

మరో వేవ్‌ రాకపోవచ్చా?
అలా ఏమీ ఉండదు. కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరించడం, వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేసుకోమని ప్రోత్సహించాలి. అప్పుడు మరో వేవ్‌ వచ్చినా, అది అంత ప్రభావవంతంగా ఉండదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement