ఏవై.4.2 కలకలం; 6 రాష్ట్రాలు.. 17 కేసులు | 17 cases of Delta variant AY 4. 2 reported in India | Sakshi
Sakshi News home page

ఏవై.4.2 కలకలం; 6 రాష్ట్రాలు.. 17 కేసులు

Published Fri, Oct 29 2021 6:04 AM | Last Updated on Fri, Oct 29 2021 6:27 PM

17 cases of Delta variant AY 4. 2 reported in India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: భారత్‌కు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో దేశంలో కొత్త వేరియెంట్‌ ఏవై.4.2 కేసులు ఆందోళనని పెంచుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌లలో ఈ కేసులు నమోదు కావడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ నుంచి జన్యు మార్పులు చోటు చేసుకొని ఈ కొత్త రకం వైరస్‌ పుట్టుకొచ్చింది. తొలిసారిగా బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ప్రస్తుతం బ్రిటన్, రష్యా, అమెరికాతో సహా 10కి పైగా దేశాలకు విస్తరించింది. ఈ వేరియెంట్‌ త్వరితంగా వ్యాప్తి చెందుతోంది కానీ ఇదెంత ప్రమాదకరమో శాస్త్రవేత్తలు అంచనాకి రాలేకపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement