సాక్షి, ముంబై: ఒక వైపు థర్డ్ వేవ్ ప్రమాదం భయపెడుతున్న తరుణంలో ముంబైలో కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా తొలి మరణం నమోదైంది. నగరంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా నగరంలో 63 ఏళ్ల మహిళ మృతి చెందినట్టు అధికారులకు ప్రకటించారు.
ఆక్సిజన్ సపోర్ట్, స్టెరాయిడ్స్, రెమ్‌డెసివిర్ చికిత్స అందించినప్పటికీ, కరోనా పాజిటివ్ వచ్చిన మూడు రోజుల తర్వాత ఆమె జులై 27న కన్నుమూసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే బాధితురాలికి డయాబెటిస్‌తో సహా అనేక వ్యాధులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు బాధిత మహిళ కరోనా టీకా రెండు మోతాదులను తీసుకున్నట్టు సమాచారం. ఈ మహిళనుంచి సేకరించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ పరీక్షల్లో మరో ఇద్దరికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కాగా బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 20 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించామని, వాటిలో ఏడు ముంబైలో ఉన్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.దీనితో, రాష్ట్రంలో ఈ వేరియంట్ సోకిన రోగుల సంఖ్య 65కి పెరిగిందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా గుర్తించిన కేసులలో ఏడు ముంబై, మూడు పుణే, నాందేడ్, గోండియా, రాయగఢ్, పాల్ఘర్, మరియు చంద్రపూర్ మరియు అకోలా జిల్లాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్‌కు మహారాష్ట్రకు ఇది రెండో మరణం. జూన్ 13న, సంగమేశ్వర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment