ముంబై: ర్యాగింగ్ భూతానికి ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్)కి విద్యార్థి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు.
లక్నోకి చెందిన అనురాగ్ జైస్వాల్ ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్‌లో చేరారు. ఈ తరుణంలో జైస్వాల్ తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జైస్వాల్ ప్రాథమికంగా ర్యాగింగ్ వల్లే ఆత్మహత్య చేకున్నాడని నిర్ధారించారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో విద్యార్థి శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీలో మొత్తం 150మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ జరిగిన మరుసటి రోజు ఉదయం అతని స్నేహితులు జైస్వాల్ రూమ్‌కి వెళ్లి చూడగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గది తలుపు బద్దలు కొట్టి చూడగా రూములో విగతజీవిగా కనిపించాడు. అత్యవసర చికిత్స కోసం విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్ధి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
జైస్వాల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని రూమ్‌మేట్స్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment