photo credit: Getty (Representational)
ముంబై: విమానం ఢీకొని 40 ఫ్లెమింగో పక్షులు చనిపోయిన ఘటన ముంబైలో జరిగింది. సోమవారం(మే20) దుబాయ్ నుంచి వస్తున్న ఎమిరేట్స్ విమానం తాకి వలస పక్షులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. నవీ ముంబైలోని చెరువుల్లో నిర్మాణాలు చేపట్టడం వల్లే ఫ్లెమింగో పక్షులు తమ దారి మార్చుకుని థానే వైపు వెళ్లాయనేది వారి వాదన.
దారి మార్చుకోవాల్సి రావడం వల్లే పక్షులు విమానం ఢీకొని చనిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పక్షులు ఢీకొనడంతో దుబాయ్ తిరిగి వెళ్లాల్సిన విమానం ముంబైలోనే ఉండిపోయింది. విమానం ఫిట్‌నెస్‌పై పూర్తి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానం మే 21 (మంగళవారం) రాత్రి 9 గంటలకు దుబాయ్ వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment