Emirates aircraft
-
ఎమిరేట్స్ విమానం ఢీ.. 40 ఫ్లెమింగో పక్షులు మృతి
ముంబై: విమానం ఢీకొని 40 ఫ్లెమింగో పక్షులు చనిపోయిన ఘటన ముంబైలో జరిగింది. సోమవారం(మే20) దుబాయ్ నుంచి వస్తున్న ఎమిరేట్స్ విమానం తాకి వలస పక్షులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. నవీ ముంబైలోని చెరువుల్లో నిర్మాణాలు చేపట్టడం వల్లే ఫ్లెమింగో పక్షులు తమ దారి మార్చుకుని థానే వైపు వెళ్లాయనేది వారి వాదన. దారి మార్చుకోవాల్సి రావడం వల్లే పక్షులు విమానం ఢీకొని చనిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పక్షులు ఢీకొనడంతో దుబాయ్ తిరిగి వెళ్లాల్సిన విమానం ముంబైలోనే ఉండిపోయింది. విమానం ఫిట్‌నెస్‌పై పూర్తి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానం మే 21 (మంగళవారం) రాత్రి 9 గంటలకు దుబాయ్ వెళ్లనుంది. -
ముంబైలో ఎమిరేట్స్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్
దుబాయ్ నుంచి మాల్దీవ్స్‌కు 309 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎమిరేట్స్ విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలోంచి పొగలు రావడం గమనించిన సిబ్బంది వెంటనే ముంబై ఏటీసీకి సమాచారమిచ్చారు. దీంతో విమానం సురక్షితంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. విమానం రాకముందే ఎయిర్పోర్ట్ అధికారులు అంబులెన్స్‌లను, ఎమర్జెన్సీ సర్వీసులను రన్ వే వద్దకు చేర్చారు. విమానంలోని ప్రయాణికులను హుటాహుటిని తరలించారు. ఒక వేళ విమానం ఎయిర్ పోర్టు వరకు కూడా రాలేక పోతే.. నౌక మీద ల్యాండ్ చేసేందుకు ఏర్పాటు కూడా పూర్తి చేశామని.. అయితే.. విమానం సురక్షితంగా ఎయిర్ పోర్టులోనే ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు.