Flamingos
-
ఎమిరేట్స్ విమానం ఢీ.. 40 ఫ్లెమింగో పక్షులు మృతి
ముంబై: విమానం ఢీకొని 40 ఫ్లెమింగో పక్షులు చనిపోయిన ఘటన ముంబైలో జరిగింది. సోమవారం(మే20) దుబాయ్ నుంచి వస్తున్న ఎమిరేట్స్ విమానం తాకి వలస పక్షులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. నవీ ముంబైలోని చెరువుల్లో నిర్మాణాలు చేపట్టడం వల్లే ఫ్లెమింగో పక్షులు తమ దారి మార్చుకుని థానే వైపు వెళ్లాయనేది వారి వాదన. దారి మార్చుకోవాల్సి రావడం వల్లే పక్షులు విమానం ఢీకొని చనిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పక్షులు ఢీకొనడంతో దుబాయ్ తిరిగి వెళ్లాల్సిన విమానం ముంబైలోనే ఉండిపోయింది. విమానం ఫిట్‌నెస్‌పై పూర్తి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానం మే 21 (మంగళవారం) రాత్రి 9 గంటలకు దుబాయ్ వెళ్లనుంది. -
వలస రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్ వైరల్ వీడియో!!
పక్షులకు సంబంధించిన వీడియోలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. పైగా ఇటీవల అవి భలే మనుషులను అనుకరించడం, చక్కగా స్నానం చేయడం వంటి పనులతో తెగ ఆకర్షిస్తున్నాయి. అచ్చం అలానే ఫ్లైమింగ్ పక్కులన్నీ ఒకే చోట సందడి చేసి చూపురులను ఒక్కసారిగా కట్టిపడేశాయి. (చదవండి: 200 ఏళ్ల నాటి పండుగ... పిండి, కోడి గుడ్లతో చేసే తమాషా యుద్ధం!!) అసలు విషయంలోకెళ్లితే...తమిళనాడులోని నిస్సారమైన నీటి ప్రదేశంలో చాలా ఫ్లెమింగోలు తిరుగుతుంటాయి. అయితే ఫ్లెమింగ్ పక్షలు భారతదేశానికి చెందినవి కావు. ఇవి ఎక్కువగా అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా వంటి ప్రాంతాల్లో ఉంటాయి. అంతేకాదు ఈ పక్షులు ఒంటి కాలు మీద నిలబడటం వల్ల శరీర వేడిని సంరక్షించుకుంటాయని నిపుణలు చెబుతున్నారు. పైగా ఫ్లెమింగ్ పక్షుల్లో సైజు పరంగా పెద్దవి బాగా ఎగిరే సామర్థ్యం కలవి. అయితే ఈ పక్షులు పుట్టడం బూడిద ఎరుపు రంగుతో పుడతాయి. కానీ ఎదిగే కొద్ది లేత గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటాయి. అలాంటి అందమైన ఈ ఫ్లెమింగ్ పక్షులు (రాజ హంసలు) తమిళనాడులోని కొడియాకరైలోని పాయింట్ కాలిమెర్ వన్యప్రాణులు పక్షుల అభయారణ్యంలో ఒకేసారి వేల సంఖ్యలో సందడి చేశాయి. ఈ మేరకు తమిళనాడు అడువుల పర్యావరణ వాతావరణ మార్పులు ప్రిన్స్‌పాల్ సెక్రటరీ సుప్రియా సాహు ఈ వీడియోతో పాటు తమిళనాడులోని కాలిమేర్ వన్యప్రాణులు పక్షుల అభయారణ్యం వేల సంఖ్యలో వలస పక్షులతో కళకళలాడుతోంది అనే క్యాప్షన్ జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) Point Calimere ( Kodiakarai ) Wildlife and Bird Sanctuary in Tamil Nadu is abuzz with thousands of migratory birds #TNForest pic.twitter.com/LyOoHn1Elz — Supriya Sahu IAS (@supriyasahuias) December 25, 2021 -
నగరంలో ఫ్లెమింగోల సందడి
అందమైన ఆ పక్షులు సరస్సుల సౌందర్యానికి అలంకారాలుగా అమరిపోతాయి.నగరానికి వాటి రాక... ప్రకృతి ప్రేమికులను.. మరీ ముఖ్యంగా పక్షి ప్రేమికులనుఒక్కసారిగా అటెన్షన్లోకి తెస్తుంది. సిటీలోని లేక్స్వైపు పరుగులు తీయిస్తుంది. కెమెరాలకు పనిచెబుతుంది. నగరంలో వానలతో పాటు ఫ్లెమింగో పక్షుల సందడి కూడామళ్లీ మొదలైంది. సాక్షి, సిటీబ్యూరో: దక్షిణాఫ్రికా నుంచి వస్తాయీ ఫ్లెమింగో పక్షులు. చల్లని వాతావరణంలోనే ఉంటాయి కాబట్టి వానాకాలం వచ్చి మే వరకూ మన నగరంలో ఉంటాయి. చిరు ప్రాయంలో ఉండగా లేత రంగులో కనిపిస్తూ పెద్దవి అవుతుండగా పింక్ కలర్లోకి మారే వీటి అందం పర్యాటకుల్ని పక్షి ప్రేమికుల చూపులను కట్టి పడేస్తుంది. ఆహారం... విహారం... నీళ్లు పుష్కలంగా ఉన్న చోట ఇవి మకాంఏర్పరచుకుంటాయి. చేపల్ని, పురుగుల్ని ఆహారంగా మార్చుకుంటాయి. ఒకవేళ అక్కడ నీరు సరిగా లేకపోతే అప్పుడు ఇవి నీటిలోని మట్టి అడుగున ఉన్న పాకుడు (అల్గే)ని ఆహారంగా తీసుకుంటాయి. అందుకే ఇవి ఎక్కువగా సరస్సుల చుట్టూ తారాడుతుంటాయి. అయితే నీటి బయట ఉన్న పాకుడును ఇవి ముట్టుకోవు. వాటి శరీరపు వర్ణం అలా రావడానికి కూడా ఆ నీటి అడుగున ఉండే పాకుడు తినడమే కారణం అంటారు. సిటీని వదలక.. ఈ ఫ్లెమింగో పక్షులు ఒకప్పుడు కేవలంవలసపక్షులుగా మాత్రమే ఉండేవి. కాని ప్రస్తుతం సెటిలర్స్గా మారినట్టు కనిపిస్తోందని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. నగరంలోని అమీన్పూర్ లేక్, ఉస్మాన్ సాగర్లతో పాటు మంజీరా సాంక్చ్యురి, అన్నాసాగర్ (మెదక్)... వంటి చోట్ల ఇవిరుతువులకు అతీతంగా తరచుగా దర్శనమిస్తున్నాయని చెప్పారు. బహుశా ఇక్కడ వాతావరణ పరిస్థితులు వాటికి అనువుగా ఉండడం వల్లనే అవి అవి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండొచ్చునన్నారు. అయితే కొందరు చెబుతున్న ప్రకారం... ఇక్కడ సరైన ఆహారం దొరకకపోవడం తద్వారా అవి అంత దూరం ఎగిరి వెళ్లడానికి అవసరమైన శక్తిని సంతరించుకోలేకపోవడం కూడా కారణం కావచ్చునని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా... ప్రస్తుతానికి నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్న ఈ ఫ్లెమింగో గెస్టులను కలిసి తనివితీరా పలకరించి పులకరించిపోదాం... పదండి. -
ఒంటి కాలిపై ఎందుకు నిల్చుంటాయంటే...
ఫ్లెమింగోలు... ఆకాశంలో అరుదైన విన్యాసాలతో ఆకట్టుకునే అందమైన పక్షులు. శీతాకాలం ప్రారంభం కాగానే వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ మన దేశానికి వలస వచ్చే ఈ రాజహంసలను చూడటానికి పర్యాటకులు ముచ్చటపడుతూ ఉంటారు. అయితే వేల కిలో మీటర్ల పొడవునా ఒకే మార్గాన్ని అనుసరించడంలో, సుదీర్ఘంగా ఎగరడంలో, వేగంగా నీళ్లలో నడవడంలోనూ వాటికవే సాటి. ఇలాంటి ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్న ఫ్లెమింగోలు గంటల తరబడి ఒంటి కాలిపైనే నిలబడతాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుకునేందుకే ఫ్లెమింగోలు ఇలా నిల్చుని ఉంటాయని గతంలో చాలా మంది చాలా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే తాజాగా... చనిపోయిన ఫ్లెమింగోల శరీరాలపై వరుస ప్రయెగాలు చేసిన యంగ్ హుయ్ చాంగ్ అనే ప్రొఫెసర్ అసలు కారణం ఇదేనంటూ రాయల్ సొసైటీ బయాలజీ లెటర్స్‌లో పలు ఆసక్తికర అంశాలను ప్రచురించారు. అసలు కారణం ఇదే.. ‘నిలబడి ఉన్నపుడు తక్కువ కండర బలాన్ని ఉపయోగించడం ద్వారా ఫ్లెమింగోలు శరీరాన్ని సమతౌల్యంగా ఉంచుకోగలవు. అందుకే ఒంటి కాలిపై నిలబడేందుకే అవి ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే రెండు కాళ్లపై నిల్చునే కంటే ఒంటి కాలిపై నిల్చోడమే వాటికి తేలికైన పని. అందుకోసం తక్కువ టార్క్ బలం అవసరమవుతుంది కాబట్టి.. అలాంటి భంగిమలో ఉన్నపుడు అవి పక్కకు ఒరిగే అవకాశం ఉండదు. తద్వారా ఒంటి కాలిపై నిల్చునే గంటల తరబడి నిద్ర పోగలవు కూడా’ అంటూ తాజా అధ్యయనంలో యంగ్ హుయ్ అనేక విషయాలు పొందుపరిచారు. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. పరిశోధనల్లో భాగంగా చనిపోయిన ఫ్లెమింగోలను రెండు కాళ్లపై నిలబెట్టడం అసలు సాధ్యపడలేదు గానీ, ఒంటి కాలిపై చాలా సులభంగా నిలబెట్టామని యంగ్ హుయ్ తెలిపారు. -
పులికాట్‌కు ఎర్ర కళ
సూళ్లూరుపేట: గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలోనూ ఎర్రకాళ్ల కొంగలతో పాటు ఫ్లెమింగోలు పులికాట్ సరస్సులో వేటసాగిస్తూ పర్యాటకలకు కనులవిందు చేస్తున్నాయి. సముద్రంలోని ఆటుపోట్లతో ఓ మోస్తరుగా చేరిన నీటితో వేల సంఖ్యలో పక్షులు గుంపులు గుంపులుగా చేరి అందరినీ కట్టిపడేస్తున్నాయి. పక్షుల రాకను తెలుసుకున్న చెన్నైకి చెందిన పర్యాటకులు బుధవారం శ్రీహరికోట రోడ్డులో ఎర్రకాళ్ల కొంగల అందాలను కెమెరాల్లో బంధించారు. ఓ పర్యాటకుడు తీసిన ఫొటోలు ఇవి.