tata institute of social science(TISS)
-
ర్యాగింగ్ భూతానికి టాటా ఇనిస్టిట్యూట్ విద్యార్థి బలి
ముంబై: ర్యాగింగ్ భూతానికి ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్)కి విద్యార్థి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ముంబైలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. లక్నోకి చెందిన అనురాగ్ జైస్వాల్ ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్‌లో చేరారు. ఈ తరుణంలో జైస్వాల్ తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జైస్వాల్ ప్రాథమికంగా ర్యాగింగ్ వల్లే ఆత్మహత్య చేకున్నాడని నిర్ధారించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో విద్యార్థి శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీలో మొత్తం 150మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జరిగిన మరుసటి రోజు ఉదయం అతని స్నేహితులు జైస్వాల్ రూమ్‌కి వెళ్లి చూడగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గది తలుపు బద్దలు కొట్టి చూడగా రూములో విగతజీవిగా కనిపించాడు. అత్యవసర చికిత్స కోసం విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్ధి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.జైస్వాల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని రూమ్మేట్స్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
మారుతి నుంచి కొత్తగా డిగ్రీ కోర్సు.. టాటా సహకారం
కార్ల అమ్మకాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న మారుతి సుజూకి మరో అడుగు ముందుకు వేసింది. భవిష్యత్తులో తమ సంస్థకు అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేసే పనిపై ఫోకస్ పెట్టింది. ఆటోమోటివ్ రిటైల్ మార్కెట్ రీసెర్చ్ అంచనాల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి కేవలం 36 కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి కోవిడ్ సంక్షోభం పూర్తిగా ముగిసి ఆర్థిక పరిస్థితి గాడిన పడితే కార్ల అమ్మకాలు ఊపందుకుంటాయని మార్కెట్ అనాలిసిస్టులు చెబుతున్నారు. దీంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్పై మారుతి దృష్టి సారించింది. అందులో భాగంగా రిటైల్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆటోమోటివ్ రిటైల్ కోర్సును ప్రవేశ పెడుతోంది. మూడేళ్ల కోర్సు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి మూడేళ్ల డిగ్రీ కోర్సును అందివ్వాలని మారుతి నిర్ణయించింది. ఈ కోర్సులో పూర్తిగా ఆటోమైబైల్ పరిశ్రమకు సంబంధించిన అంశాలనే సిలబస్‌లో పొందు పరచనుంది. మొదటి ఏడాది కేవలం తరగతి కోర్సుగా మిగిలిన రెండేళ్లు మారుతి ఆథరైజ్డ్ డీలర్షిప్ యూనిట్లలో ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ కోర్సుని డిజైన్ చేసింది. టాటా సహకారంతో మారుతి సంస్థ అందిస్తోన్న మూడేళ్ల కొత్త కోర్సును మొదటగా టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - స్కూల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ (టీఐఎస్ఎస్-ఎస్వీఈ) ముంబై క్యాంపస్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన తొలి బ్యాచ్‌కి 2021 అక్టోబరు నుంచి క్లాసులు ప్రారంభం అవనుంది. కోర్సు పూర్తైన తర్వాత విద్యార్థుల యోగ్యతను బట్టి మారుతి లేదా ఇతర సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జపాన్ తరహా స్కిల్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రిటైల్ సెక్టార్లో స్కిల్డ్ వర్కర్లు లభించడం లేదని, అందుకే ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని రుతి సుజూకి ఇండియా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఈ కోర్సులో జపాన్ తరహా వర్క్ కల్చర్, సాఫ్ట్ స్కిల్స్‌ని మన యూత్‌లో డెవలప్ చేయడం మా లక్ష్యమని ఆయన వివరించారు. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్రం తీపికబురు! -
హైదరాబాద్ చరిత్రలో తొలిసారి...
సాక్షి, హైదరాబాద్ : టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్ (టిస్) యాజమాన్యానికి.. విద్యార్థులకు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. మెస్సు బిల్లుల పెంపునకు నిరసనగా గత కొద్ది రోజుల నుంచి ఆ ప్రాంగణం విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సమస్యను పరిష్కరించక పోగా హైదరాబాద్ క్యాంపస్‌లో అకడమిక్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులంతా సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోగా క్యాంపస్‌ను ఖాళీ చేయాల్సిందిగా స్పష్టం చేస్తూ ‘సైన్–డై’ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ చరిత్రలో తొలిసారి... హైదరాబాద్ విద్యాలయాల చరిత్రలో ఈ తరహా నోటీసులు జారీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్(టిస్) తొలుత రాజేంద్రనగర్‌లో ఉండేది. ఇటీవల ఈ క్యాంపస్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లికి తరలించారు. అక్కడ బీఏ, ఎంఏ, ఎంఫిల్ కోర్సులను బోధిస్తున్నారు. ఆయా కోర్సుల్లో సుమారు ఐదు వందల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మెస్ చార్జీలతో పాటు డిపాజిట్లను భారీగా యాజమాన్యం పెంచింది. వాటిని తగ్గించాలని, మెస్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన టెండర్లను బహిర్గతం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా.. వారిపై చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థులు తమ ఆందోళనలతో ప్రాంగణ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొంటూ ‘సైన్–డై’ ఆఫ్ క్యాంపస్‌కు యాక్టింగ్ రిజిస్ట్రార్ ఎంపీ బాలమురగన్ నోటీసు జారీ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఫ్యాకల్టీ సహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. దీంతో విద్యార్థులంతా క్యాంపస్‌ను ఖాళీ చేసి రోడ్డుపైకి వచ్చారు. ఇక్కడ చదువుతున్న వారిలో హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నారు. తీరా సాయంత్రం క్యాంపస్ ఖాళీ చేయించడంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డారు. ఇదిలా ఉంటే గత ఏడాది హాస్టల్, మెస్ డిపాజిట్ రూ.15 వేలు ఉండగా, ఈ మొత్తా న్ని మూడు విడతల్లో చెల్లించేవారు. తాజాగా మెస్ ఛార్జీలను ఒకే విడతలో రూ.54,000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ బిల్లు చెల్లింపులో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు మినహాయింపు ఉండగా, ఈ విద్యా సంవత్సరం ఆ వెసులుబాటును తొలగించి ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తోందని విద్యార్థి జేఏసీ నాయకురాలు కరీష్మా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ నోటీసులను రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో భారీ ఆందోళనలకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. -
నోటికి తాళం వేస్తారా?
ముంబై: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత్‌లో భావ ప్రకటన స్వేచ్ఛను హరించే సంఘటనలు నానాటికి పెరుతుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకమైన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్)లో మానవ హక్కుల కార్యకర్త, 'కలర్స్ ఆఫ్ కేజ్' రచయిత అరుణ్ ఫిరీరా బుధవారం నాడు చేపట్టాల్సిన పుస్తక పఠనం కార్యక్రమాన్ని అరగంట ముందు భారత ఇంటెలిజెన్స్ అధికారులు రద్దు చేశారు. ఎందుకు రద్దుచేశారో, ఇంటెలిజెన్స్ అధికారులుగానీ, టాటా ఇనిస్టిట్యూట్‌గానీ అధికారింగా ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. సాహిత్యం గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు తరచుగా టిస్‌లో సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా పుస్తక పఠనం కార్యక్రం ఉంటుంది. మావోయిస్టు సానుభూతిపరుడైన అరుణ్‌పై గతంలో దేశద్రోహం కేసు నడిచింది. ఆ కేసులో అరెస్టయిన అరుణ్ కొద్దికాలం జైలు జీవితం అనుభవించారు. అప్పుడు అక్కడ తనకు కనిపించిన పరిస్థితులపై అరుణ్ 'కలర్స్ ఆఫ్ కేజ్' పేరిట పుస్తకం రాశారు. ఆ పుస్తక పఠనమే బుధవారం నాటి సాహితీ కార్యక్రమం. టిస్ విద్యార్థి నాయకుల కథనం ప్రకారం.. సరిగ్గా కార్యక్రమం ప్రారంభం కావడానికి అరగంట ముందు సివిల్ దుస్తుల్లో ఉన్న కొంతమంది ఇంటలెజెన్సీ అధికారులు కాలేజీ డీన్ కార్యాలయానికి వచ్చి పుస్తక పఠన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో కాలేజీ నిర్వాహకులు మొత్తం ఆ నాటి కార్యక్రమాలన్నింటిని రద్దు చేశారు. రద్దుకు కారణాలేమిటో మాత్రం అధికారికంగా వివరించలేదు. తనకు దీనిపై అధికారిక వివరణ కావాలంటూ టిస్ డెరైక్టర్ ప్రొఫెసర్ పరశురాం పేరిట అరుణ్ లేఖ రాశారు. దానికి సమాధానం రావాల్సి ఉంది. గత నెలలో ఇదే కాలేజీ యాజమాన్యం 'టాక్ ఆన్ ది కాశ్మీర్' కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా రద్దు చేసింది.