
ముంబయి: ముంబయిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన.. కందివాలి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
A manual scavenger was mowed to death by a vehiclein Kandivali, Mumbai.
An FIR has been registered in this case at Kandivali police station under sections 304 (A), 336 and 279. Two people - driver and the contractor - have been arrested. pic.twitter.com/86pwBaW5AM
— TIMES NOW (@TimesNow) June 26, 2023
ఈశాన్య రుతుపవనాలతో ముంబయిలో వర్షాలు కుండపోతగా కురిశాయి. దీంతో డ్రైనేజీల్లో వర్షపు నీరు పొంగి పారుతోంది. దీంతో చాలాచోట్ల డ్రైనేజీల్లో సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత తీసి కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో దిగి చెత్తను అందిస్తుండగా.. మరో వ్యక్తి దానిని దూరంగా పారబోస్తున్నాడు. ఇదే సమయంలో మ్యాన్‌హోల్‌లో ఉన్న వ్యక్తి కిందికి వంగాడు. అది గమనించని కారు డ్రైవర్.. కార్మికుని మీదుగానే వాహనాన్ని పోనిచ్చాడు.
ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికున్ని మ్యాన్‌హోల్ నుంచి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ అతను మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కార్మికున్ని గమనించని కారు డ్రైవర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మరమ్మతులు చేసేప్పుడు కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలను కామెంట్ చేశారు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు..