![doctors son who came to mumbai from america died - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/2/mumbai.jpg.webp?itok=bhQbd4tE)
మహారాష్ట్రలోని ముంబైలో 14 ఏళ్ల కుర్రాడు ఒక భారీ భవనంలోని 22వ అంతస్థు నుంచి పడిపోయి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఘనా మరెలా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులకు మృతుడిని కృష్ణా అగర్వాల్‌గా గుర్తించారు. మృతుని తండ్రి అనుపమ్ అగర్వాల్ అమెరికాలో ప్రముఖ డాక్టర్. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కృష్ణ కొన్ని రోజులక్రితం తన తల్లితోపాటు అమెరికా నుంచి ముంబై చూసేందుకు వచ్చాడు.
ఆత్మహత్యా? ప్రమాదమా?
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసును నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ గత కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. తరచూ వీడయో గేమ్స్ ఆడుతుంటాడని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడని తెలిసింది. కాగా కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదమేమైనా జరిగిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘సమ్మతి’ వయసు 16కు తగ్గించండి: కేంద్రానికి హైకోర్టు కీలక వినతి
Comments
Please login to add a commentAdd a comment