
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. అదే విధంగా టీకా తీసుకున్నవారికి ప్రాణాలకు ముప్పు రాలేదని ఆ అధ్యయనం తెలిపింది. అత్యధికులకి కరోనా వైరస్ సోకడానికి డెల్టా వేరియెంటే కారణమని పేర్కొంది. దేశంలో వ్యాక్సిన్ కార్యక్రమం మొదలయ్యాక జరిగిన అతి పెద్ద అధ్యయనం ఇదే.
కరోనా మరో ముప్పు రాకుండా ఉండాలంటే త్వరితగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమయ్యేలా చూడాలని ఆ అధ్యయనం పేర్కొంది. దీనివల్ల దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందని తెలిపింది. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఒక్క డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా సోకిన 677 మంది శాంపిల్స్‌ని పరీక్షించింది. అందులో 86.09 మందికి డెల్టా వేరియెంట్ సోకింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆల్ఫా వేరియెంట్ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని తెలిపింది. కరోనా సోకిన వారిలో 9.8% మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంక 0.4% మృతులు నమోదైనట్టు ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment