Indian Council for Medical Research (ICMR)
-
డెంగీ, చికున్‌గున్యా వ్యాధులకు చెక్.. ఐసీఎంఆర్ శుభవార్త
పుదుచ్చేరి: డెంగీ, చికున్‌గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్ ఈజిప్టీ జాతి దోమలను ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాధికారక వైరస్లు ఉన్న మగ దోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్‌రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో వైరస్లు ఉండవుకనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగీ, చికున్‌గున్యాలను వ్యాపింపచేయడం అసాధ్యం. డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్ ఈజిప్టీ దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇందుకోసం వీరు గత నాలుగు సంవత్సరాలుగా పరిశోధనలో మునిగిపోయారు. అయితే, ఈ ప్రయోగానికి జనబాహుళ్యంలోకి తేవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డెంగీ, చికున్‌గున్యా వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న జనావాసాల్లో ప్రతీ వారం ఈ రకం ఆడదోమలను వదలాల్సి ఉంటుందని ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి) డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ చెప్పారు. చదవండి: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో.. -
టీకా తీసుకుంటే ప్రాణాలకు ముప్పుండదు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. అదే విధంగా టీకా తీసుకున్నవారికి ప్రాణాలకు ముప్పు రాలేదని ఆ అధ్యయనం తెలిపింది. అత్యధికులకి కరోనా వైరస్ సోకడానికి డెల్టా వేరియెంటే కారణమని పేర్కొంది. దేశంలో వ్యాక్సిన్ కార్యక్రమం మొదలయ్యాక జరిగిన అతి పెద్ద అధ్యయనం ఇదే. కరోనా మరో ముప్పు రాకుండా ఉండాలంటే త్వరితగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమయ్యేలా చూడాలని ఆ అధ్యయనం పేర్కొంది. దీనివల్ల దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందని తెలిపింది. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఒక్క డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా సోకిన 677 మంది శాంపిల్స్‌ని పరీక్షించింది. అందులో 86.09 మందికి డెల్టా వేరియెంట్ సోకింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆల్ఫా వేరియెంట్ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని తెలిపింది. కరోనా సోకిన వారిలో 9.8% మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంక 0.4% మృతులు నమోదైనట్టు ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. -
కరోనా: ఐసీఎంఆర్ సర్వేలో సంచలన విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనాపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో ఆగస్టుకల్లా దాదాపు 20 కోట్ల మందికి కరోనా వైరస్ వచ్చిపోయిందని వెల్లడించింది. దేశంలో 15.9 కోట్ల నుంచి 19.6 కోట్ల మందికి కరోనా సోకిందని, 10ఏళ్ల కంటే పై వయసున్న వారిలో ప్రతి 15మందిలో ఒకరికి కరోనా సోకినట్లు వెల్లడైంది. (అగ్రరాజ్యాన్ని భయపెడుతున్న ‘అమీబా’) పట్టణ స్లమ్ ఏరియాల్లో 15.6శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయిందని, నగరంలోని కాలనీల్లో కనీసం 8.2 శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడినట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 4.4శాతం మందికి కరోనా వచ్చిపోయిందని పేర్కొంది. వయసు, ఆడ, మగ తేడా లేకుండా కరోనా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. శీతాకాలంలో వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం పెరుగుతుందని పేర్కొంది. (భారత్‌లో మరో వ్యాధి, మహారాష్టలో హై అలర్ట్) -
15.7 లక్షల క్యాన్సర్ రోగులు @2025
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో భారత్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు "జాతీయ క్యాన్సర్ నమోదు పట్టిక - 2020" పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 13.9 లక్షల క్యాన్సర్ రోగులుండగా 2025 నాటికి ఇది 15.7 లక్షలకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్, భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. ఈశాన్య రాష్ట్రాల్లో పొగాకు వినియోగం ఎక్కువగా ఉండటంతో అక్కడి పురుషులు అధికంగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. దీంతో పొగాకు సంబంధిత క్యాన్సర్లు 27.1 శాతంగా ఉన్నాయి. (కేన్సర్‌ను చంపేసే ఫ్యాటీ ఆసిడ్స్ గుర్తింపు) అంటే పొగాకు వినియోగం కారణంగా ఒక్క ఈ ఏడాదిలోనే 3.7 లక్షలమంది దీని బారిన పడ్డారు. పురుషుల్లో ఊపిరితిత్తుతలు, కడుపు, అన్నవాహిక క్యాన్సర్ అధికంగా ఉంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్(14.8%), గర్భాశయ క్యాన్సర్(5.4%) ఎక్కువగా వస్తోంది. క్యాన్సర్ బాధితులు ఎక్కువగా మిజోరంలోని ఐజ్వాల్(పురుషుల్లో ఎక్కువగా క్యాన్సర్), అరుణాచల్ ప్రదేశ్‌లోని పపుం పురె(మహిళల్లో అత్యధికంగా క్యాన్సర్) జిల్లాలో, తక్కువగా మహారాష్ట్రలోని ఒస్మానాబాద్, బీడ్ జిల్లాల్లో ఉన్నారు. (రక్త పరీక్షతో కేన్సర్ గుట్టు రట్టు!) -
3 కోట్లు దాటిన పరీక్షలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 పరీక్షల్లో భారత్ మరో మైలు రాయిని దాటింది. కరోనా కట్టడికి పరీక్షలు నిర్వహించడమే మార్గమని భావిస్తున్న కేంద్రం కరోనా టెస్టులను భారీగా పెంచింది. ఇప్పటివరకు 3 కోట్ల మందికిపైగా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆగస్టు 16 నాటికి మొత్తంగా 3 కోట్ల 41 లక్షల 400 పరీక్షలు నిర్వహించి నట్టుగా తెలిపింది. జూలై 6 నాటికి కోటి పరీక్షలను పూర్తి చేస్తే, ఆగస్టు 2 నాటికి 2 కోట్లు పూర్తయ్యాయి. మరో రెండు వారాల్లో రికార్డు స్థాయిలో మరో కోటి పరీక్షలు పూర్తి చేశారు. ఇక ఆదివారం నుంచి సోమవారం మధ్య దేశంలో తాజాగా 57,981 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 26,47,663కి చేరుకుంది. 24 గంటల్లో మరో 941 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.92శాతానికి తగ్గింది. (సరితకు ఆమె భర్తకు కూడా కరోనా) ఒకే రోజు 57,584 మంది రికవరీ కరోనా వైరస్ నుంచి ఒకే రోజు 57,584 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీంతో రికవరీ రేటు 72.51 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,19,842కి చేరుకుంది. ట్రాక్, ట్రేస్, టెస్ట్ విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు చేయడం వల్లే ఈ స్థాయిలో రికవరీ సాధ్యపడిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. వైరస్ తీవ్రత తక్కువ ఉన్నవారిని హోంక్వారంటైన్ చేయడం, అవసరమైన వారినే ఆస్పత్రికి తరలిస్తూ ఉండడం వల్ల కరోనా వైరస్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం సాధ్యపడుతోందని పేర్కొంది. -
రేపట్నుంచి ప్రైవేటులో పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతించిన ప్రైవేటు లేబొరేటరీ లు, వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో ప్రభుత్వ ఆదేశాలతో నిలిచిన కరోనా నిర్ధారణ పరీక్షలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని లేబొరేటరీలు నిబంధనలకు విరుద్ధంగా కరోనా పరీక్షలు చేయడం, మరి కొన్ని చోట్ల లక్షణాలు లేకున్నా పరీక్షలు నిర్వహించడం, ఐసీఎంఆర్ పోర్టల్‌లో పరీక్షల వివరాలను అప్లోడ్ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం లోపాలున్న వాటికి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు కొన్ని లేబొరేటరీలు వివరణ ఇచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు నిబంధనలను పాటిస్తూ తిరిగి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు కొన్ని లాబ్‌ల యాజమాన్యాలు తెలిపాయి. ఐసీఎంఆర్ పోర్టల్‌లో ఇప్పటివరకు చేసి న పరీక్షల వివరాల్ని నమోదు చేసే ప్ర క్రియ పూర్తి కావొచ్చిందని వివరించాయి. విన్నపాల వెల్లువ కరోనా కేసులు రోజు రోజుకూ విజృంభిస్తున్నాయి. రోజూ దాదా పు 2 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేయించుకోవాలంటే అక్కడ టెస్టుల సామర్థ్యం పూర్తిస్థాయిలో లేదన్న భావన ప్రజల్లో నెలకొంది. మరోవైపు ప్రైవేటులో చేయించకుందామంటే వారం రోజులుగా వాటిల్లో పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది కరోనా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరైతే పక్క రాష్ట్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని వస్తున్నారు. కరోనా లక్షణాలు, అనుమానాలున్న వా రంతా తక్షణమే పరీక్షలు చేయాలని విన్నవిస్తున్నారని లాబ్‌ల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పక్కాగా ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు లేబొరేటరీల వర్గాలు వెల్లడించాయి. జర్మనీ కిట్లు వాడుతున్నాం మేం నాణ్యమైన కిట్లతోనే పరీక్షలు చేస్తున్నాం. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ కిట్స్ వాడుతున్నాం. నిర్ధారణ పరీక్షల్లో ఎక్కడా రాజీ పడట్లేదు. వైరస్ విజృంభణ సమయంలో వ్యాపార కోణంలో ఆలోచించట్లేదు. పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చా క 12 వేల మందికి పరీక్షలు చేశాం. వాటిల్లో పాజి టివ్ వచ్చిన వారి రిపోర్టులను తక్షణ వైద్యం కో సం వేగంగా అందజేశాం. వాటన్నింటినీ ఐసీఎంఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేయడంలో కొం త ఆలస్యం జరిగింది. అందుకే కొంత విరామం తీసుకొని వాటన్నింటినీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నాం. రోజూ ఉదయం 9 నుంచి రా త్రి 11 వరకు ఫలితాల అప్‌లోడ్‌కు సమయం కేటా యిస్తూ పనిచేస్తున్నాం. ఈ పని మంగళవారం ము గించి బుధవారం నుంచి కరోనా పరీక్షలు చేస్తాం. ఎంత మందికైనా పరీక్షలు చేయగలం.– సుప్రితారెడ్డి, ఎండీ, విజయ డయాగ్నస్టిక్స్ -
భారత్: కోటి దాటిన కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సోమవారం వెల్లడించింది. ఆ రోజు ఉదయం 11 గంటల వరకు భారత్‌లో మొత్తం 1,00,04,101 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ లోకేష్ శర్మ పేర్కొన్నారు. అలాగే ఆదివారం ఒక్కరోజు 1,80,596 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 24,248 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. రోజుకు 2 లక్షల 15 వేల 655 శాంపిల్స్ చొప్పున పరీక్షించినట్లు, గడిచిన అయిదు రోజుల్లో పది లక్షల టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు. (రష్యాను వెనక్కు నెట్టేసిన భారత్) దేశంలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 1100 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. వీటిలో 788 ప్రభుత్వ ల్యాబులు ఉండగా, 317 ప్రైవేటు ల్యాబులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 61, తెలంగాణలో 36 కేంద్రాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా టెస్టులు నిర్వహించిన రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఇక కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే మూడు స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా, బ్రెజిల్ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. (ఏపీలో కొత్తగా 1,322 కరోనా కేసులు) -
ఈఎస్ఐసీలో ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులపై ప్లాస్మా ట్రయల్స్ చేసేందుకు గాంధీ ఆసుపత్రితోపాటు హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ హాస్పిటల్‌కు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 113 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 28 ఆసుపత్రులకు అనుమతి ఇచ్చారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో రెండింటికి అనుమతి వచ్చింది. ప్రస్తుతం ఈఎస్ఐసీలో కరోనా చికిత్సలు చేయడం లేదు. ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా కరోనా చికిత్స ప్రారంభించే అవకాశముంది. అలాగే గుజరాత్లో 5, రాజస్తాన్‌లో 4, పంజాబ్‌లో ఒకటి, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 4, మధ్యప్రదేశ్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, కర్ణాటక, చండీగఢ్‌లో ఒక్కో ఆసుపత్రికి అనుమతి ఇచ్చారు. మరో 83 ఆసుపత్రుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని ఐసీఎంఆర్ వెల్లడించింది. దరఖాస్తుల పరిశీలనలో హైదరాబాద్‌లోని అపోలో, ఏఐజీ ఆసుపత్రులు కూడా ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. (చదవండి: తెలంగాణలో మరో 10 పాజిటివ్ ) -
ఆ రాష్ట్రాల గబ్బిలాల్లో కరోనా పాజిటివ్!
న్యూఢిల్లీ: మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా(కోవిడ్-19) మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చి క్లినికల్ ట్రయల్స్ సైతం నిర్వహిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో టీకాను కనుగొనేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. అయితే ఇంతవరకు కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యుక్రమాన్ని ఎవరూ పూర్తిస్థాయిలో విశ్లేషించలేకపోయారు. ఇక చైనీస్ శాస్త్రవేత్తలు మాత్రం గబ్బిలాల్లోని ఆర్‌ఎమ్‌వైఎన్‌ఓ2 జన్యుక్రమం, హెచ్‌సీఓవీ-19(కోవిడ్-19) జన్యుక్రమంతో దాదాపు 93 శాతం సరిపోలిందని గతంలో వెల్లడించారు. జన్యు పునఃసంయోగాల(జీన్ రీకాంబినేషన్) వల్లే కరోనా పుట్టిందని అంచనా వేశారు. తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్ఆర్)చేసిన అధ్యయనంలోనూ ఇదే తరహా కీలక విషయాలు వెల్లడయ్యాయి.(కరోనా వ్యాక్సిన్‌పై పరీక్షలు షురూ..) రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీపీసీఆర్) ద్వారా రెండు భిన్న రకాల గబ్బిలాలపై పరిశోధనలు జరిపినట్లు ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. దీని ఆధారంగా రౌసెట్టస్, టెరోపస్ రకాకలు చెందిన గబ్బిలాల్లో కరోనా వైరస్ బయటపడినట్లు వెల్లడించింది. ఇక టెరోపస్ రకంలో గతంలో నిపా వైరస్ ఆశ్రయం పొందినట్లుగా రుజువైందని పేర్కొంది. ఈ క్రమంలో కేరళ, హిమాచల్ ప్రదేశ, తమిళనాడు, పుదుచ్చేరిలోని గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిళ్లలో దాదాపు అన్నీ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది. (‘ఆ రెండు జన్యుక్రమాలు సరిపోలాయి’) ఇక తెలంగాణ సహా కర్ణాటక, చండీగడ్, గుజరాత్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లోని గబ్బిలాల్లో నెగటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. మొత్తం 25 రకాల గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించగా కేవలం ఈ రెండింటిలోనే కరోనా ఉన్నట్లు గుర్తించామంది. ఈ మేరకు తన అధ్యయనంలో పలు కీలక విషయాలు పొందుపరిచింది. కాగా బీటీకోవ్(బ్యాట్ కరోనా వైరస్)గా వ్యవహరిస్తున్న ఈ వైరస్ వల్లే మనుషుల నుంచి మనుషులకు సోకుతున్న కరోనా ఉద్భవించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని జాతీయ వైరాలజీ సంస్థ ప్రగ్యా యాదవ్ పేర్కొన్నారు. (కరోనా: 5 నిమిషాల్లో పాజిటివ్.. 13 నిమిషాల్లో నెగటివ్) ‘‘పలు వైరస్‌లకు గబ్బిలాలు ఆశ్రయజీవులుగా ఉంటాయి. వాటిలో కొన్ని మానవులకు తీవ్రమైన హాని చేస్తాయి. భారత్‌లో టెరోపస్ గబ్బిలాలు గతంలో నిపా వైరస్ వ్యాప్తికారకాలుగా వ్యవహరించినట్లు వెల్లడైంది. కాబట్టి కోవిడ్-19 వ్యాప్తిలో ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటి కారణంగానే కరోనా విస్తరిస్తోందని కచ్చితంగా చెప్పలేం’’అని పేర్కొన్నారు. -
అప్డేట్: 168కి చేరిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తోంది. బుధవారం నాటికి 158గా ఉన్న కరోనా కేసులు గురువారం ఉదయం 10 గంటల వరకు ఆ సంఖ్య 168కి చేరింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 13,316 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల లండన్ నుంచి హర్యానా చేరుకున్న ఓ యువతికి గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే కర్ణాటక, మహారాష్ట్రలో రెండేసి చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ మొత్తం 13 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. (భారత్ @ 158) మరోవైపు దేశంలో రోజురోజూకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఇక కరోనా వ్యాప్తిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం అత్యున్నత సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మంత్రులు ఎస్పీలు, కలెక్టర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. -
ఫెలోషిప్
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్ఆర్డీ ఫెలోషిప్‌లు అందజేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. హెచ్ఆర్డీ ఫెలోషిప్ (లాంగ్‌టెర్మ్) విభాగాలు: టాక్సికాలజీ, జీనోమిక్స్, జరియాట్రిక్స్,స్టెమ్‌సెల్ రీసెర్చ్, క్లినికల్ ట్రైల్స్, డిసీజ్ మోడలింగ్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, మెంటల్ హెల్త్, క్లినికల్ సైకాలజీ, క్వాలిటీ కంట్రోల్, మోడరన్ బయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, డ్రగ్ కెమిస్ట్రీ, ఆపరేషనల్ రీసెర్చ్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ ఎథిక్స్, హెల్త్ ఎకనమిక్స్. వ్యవధి: విభాగాన్ని బట్టి ఆరు మాసాల నుంచి ఏడాది వరకు. ఫెలోషిప్: పనిచేస్తున్న సంస్థలోనే పరిశోధన కొనసాగించేవారికి నెలకు రూ.20,000; ఇతర సంస్థల్లో పరిశోధన చేసేవారికి నెలకు రూ.40,000 అందజేస్తారు. కంటిన్జెన్సీ ఫండ్, ట్రావెల్ అలవెన్స్ అదనం. అర్హత: ఎండీ/ ఎమ్మెస్/ ఎండీఎస్/ ఎంబీబీఎస్/ఎంవీఎస్సీ/ ఎమ్మెస్సీ/ ఎంఫార్మసీ/ ఎంటెక్‌తోపాటు సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉండాలి. జాతీయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు/ పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్త/ హెల్త్ రీసెర్చర్‌గా పనిచేస్తూ ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 20 వెబ్సైట్: www.icmr.nic.in