సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో భారత్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు "జాతీయ క్యాన్సర్ నమోదు పట్టిక - 2020" పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 13.9 లక్షల క్యాన్సర్ రోగులుండగా 2025 నాటికి ఇది 15.7 లక్షలకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్‌ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్, భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. ఈశాన్య రాష్ట్రాల్లో పొగాకు వినియోగం ఎక్కువగా ఉండటంతో అక్కడి పురుషులు అధికంగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. దీంతో పొగాకు సంబంధిత క్యాన్సర్లు 27.1 శాతంగా ఉన్నాయి. (కేన్సర్‌ను చంపేసే ఫ్యాటీ ఆసిడ్స్ గుర్తింపు)
అంటే పొగాకు వినియోగం కారణంగా ఒక్క ఈ ఏడాదిలోనే 3.7 లక్షలమంది దీని బారిన పడ్డారు. పురుషుల్లో ఊపిరితిత్తుతలు, కడుపు, అన్నవాహిక క్యాన్సర్ అధికంగా ఉంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్(14.8%), గర్భాశయ క్యాన్సర్(5.4%) ఎక్కువగా వస్తోంది. క్యాన్సర్ బాధితులు ఎక్కువగా మిజోరంలోని ఐజ్వాల్(పురుషుల్లో ఎక్కువగా క్యాన్సర్), అరుణాచల్ ప్రదేశ్‌లోని పపుం పురె(మహిళల్లో అత్యధికంగా క్యాన్సర్) జిల్లాలో, తక్కువగా మహారాష్ట్రలోని ఒస్మానాబాద్, బీడ్ జిల్లాల్లో ఉన్నారు. (రక్త పరీక్షతో కేన్సర్ గుట్టు రట్టు!)
Comments
Please login to add a commentAdd a comment