గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. జనవరి 10వ తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్‌కు అనుమతి. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపుకు అనుమతి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు. అలానే జనవరి 11 నుంచి 5 షోస్‌కు అనుమతి. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు. సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు. టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోస్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ.
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
Published Wed, Jan 8 2025 11:37 PM | Last Updated on Thu, Jan 9 2025 12:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment