ED And ACB Investigation Formula Car Race Case Updates..
👉తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula e-Car Race) కేసులో ఏసీబీ విచారణకు ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు.
👉అలాగే, ఇదే కేసులో ఈడీ విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు.
👉రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ స్టేట్‌మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డ్ చేయనుంది.
👉ఫార్ములా ఈ-కార్ రేసు అగ్రిమెంట్‌లో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. నిధుల దుర్వినయోగం కేసులో అరవింద్ కుమార్‌ను ఏసీబీ ఏ2గా చేర్చింది.
👉ఇక, ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్.. రేపు ఏసీబీ విచారణను వెళ్లనున్నారు. అలాగే, ఈనెల 16వ తేదీన కేటీఆర్ ఈడీ విచారణకు హాజరుకానున్నట్టు తెలిపారు.
👉మరోవైపు.. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. కక్ష సాధింపు కారణంగానే తనపై ఈ కేసు పెట్టినట్టు కేటీఆర్. ఇదే సమయంలో తాను రాజ్యాంగబద్దంగా ఉన్న హక్కులను వినియోగించుకుంటానని చెప్పారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని తెలిపారు. చివరకు న్యాయమే గెలుస్తుందని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment