సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth Reddy) జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). ప్రపంచం మొత్తం చూసి వచ్చిన వ్యక్తి కేటీఆర్(KTR). ఇదంతా రేవంత్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ కారు రేసు కేసు అనే లొట్టపీసు కేసు అంటూ విమర్శించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులను రేవంత్ వేధింపులకు చేస్తున్నాడు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఒక్క రూపాయి రైతుభరోసా ఇవ్వలేదని అడిగినందుకు కేసులు పెడుతున్నారా?. రుణమాఫీ గురించి అడిగితే పెడుతున్నారా?. తులం బంగారం ఏమైందన్నందుకా కేసులు?. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు.
కారు రేసు అనేది ఓ లొట్టపీసు కేసు. ఈ రేసు కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీలో తెలంగాణకు తీసుకొస్తే.. దాన్ని కూడా రేవంత్ రద్దు చేశాడు. తెలంగాణకు రూ. 700 కోట్లు లాభం వచ్చినట్టు నెల్సన్ సర్వేనే చెప్పింది. టెస్లా కంపెనీని తీసుకురావాలనేది కేటీఆర్ లక్ష్యం. ఆ కంపెనీని తీసుకురావడానికే కేటీఆర్ కారు రేసు తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ అడ్డుకున్నాడు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ పంపించాలని అనుకుంటున్నాడు.
కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చిన వ్యక్తి. కేటీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అదే డిఫరెన్స్. అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు?. అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు?. ప్రొసీజర్ ల్యాప్స్ కేటీఆర్ తప్పు ఎందుకు అవుతుంది?. పాలసీ డిసీషన్ మాత్రమే కేటీఆర్ తీసుకుంటారు తప్ప ప్రొసీజర్‌తో ఆయనకేం సంబంధం?. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పోతే.. 60 లక్షల మంది కేసీఆర్లు తయారు అవుతారు. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్‌ను అంటే ఊరుకోవాలా?. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేడు.
ఆర్డీవో మీద నేను ఒక్క మాటైనా మాట్లాడానా?. ఒక్కడితో నేను మాట్లాడితే ఆరుగురితో కేసులు పెట్టిస్తారా?. డీకే అరుణపై నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కేసు పెట్టలేదే?. నాడు జూపల్లిపై ఇష్టారాజ్యంగా చేస్తే కేసీఆర్ కేసులు పెట్టలేదు కదా?. నీకో న్యాయం మాకో న్యాయమా?. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో దాడి చేయిస్తారా? ఖమ్మంలో హరీష్ రావుపై దాడి జరిగింది ఇదేం సంస్కృతి? అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment