సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డిది రివేంజ్ అని ప్రజలు అనుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం(జనవరి 8) తెలంగాణభవన్‌లో జరిగిన కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యాక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.‘ఇప్పుడుఉన్న పరిస్ధితుల్లో ఇబ్బంది ఏం లేదు.పార్టీ పెట్టినప్పుడున్న ఉన్న పరిస్ధితి, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమర వీరులు చేసిన త్యాగాలతో పొల్చితే ఇప్పుడున్న పరిస్ధితి ఇబ్బందేం కాదు.ఇప్పుడున్న కేసు లొట్టపీసు కేసు. రేవంత్ రెడ్డి ఒక్క లొట్టపీసు ముఖ్యమంత్రి.
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని, కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని ఈ అక్రమ కేసుకు భయపడుతామా.జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ పైన కేంద్రం కక్ష కడితే ప్రజలకోసం,రాష్ట్రం కోసం పోరాటం చేసి శిబు సోరెన్ కొడుకు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. లగచర్ల రైతులు తమ భూమి గుంజుకోవద్దనందుకు…40 రోజులు జైల్లో అక్రమంగా పెట్టిన దానితో పొల్చితే మనకున్న పరిస్ధితి పెద్ద ఇబ్బందేం కాదు. మనం ఇబ్బందిలో ఉన్నామని అనుకోవద్దు.మనం చేయాల్సింది రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలి.
ప్రతి రైతుకి కాంగ్రెస్ ఎకరానికి రూ.17 వేలు బాకీ ఉందని చెప్పాలి. రైతు రుణమాఫీ,కౌలు రైతులకిచ్చిన కాంగ్రెస్ హమీలను ప్రశ్నించాలి.రానున్న సంవత్సరం మెత్తం రైతన్నలకు,తెలంగాణ ప్రజలకిచ్చిన హమీల అమలు,ప్రభుత్వ మోసంపైనే మాట్లాడుదాం.అంతేకానీ నాపై పెట్టిన అక్రమ కేసు గురించి అలోచించాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ కేసుపైన నేను చట్టప్రకారం కొట్లాడుతా.తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయ పడేది లేదు.
హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలే అన్నీ.కాంగ్రెస్ పార్టీ నేతలు డీల్లీలోనూ అబద్దాలు అడుతున్నారు.తెలంగాణలో మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారు.తెలంగాణ కోసం మనం కలిసి నడుద్దాం.ఈ సంవత్సరాన్ని మెత్తంగా పోరాట నామ సంవత్సరంగా చేసి ప్రభుత్వంపైన పోరాటం చేద్దాం.ఒక్కొక్క పార్టీ కార్యకర్త ఒక్కో కేసీఆర్‌గా మారి పోరాటం చేయాలి.
కాంగ్రెస్ చేస్తున్న అప్పుల తప్పులు,సాగునీటి ప్రాజెక్టులపైన చేస్తున్న దుప్ఫ్రచారంపైన మాట్లాడుదాం.రానున్న సంవత్సర కాలంలో నూతన కమీటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అద్యక్షుని ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం’అని కేటీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి: కేటీఆర్‌తో పాటు విచారణకు న్యాయవాది..హైకోర్టు షరతులు
Comments
Please login to add a commentAdd a comment