సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ కేసు(Formula-e race)లో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) వేసిన లంచ్‌మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(జనవరి 8) మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి విచారించింది. కేటీఆర్‌తో పాటు న్యాయవాది ఏసీబీ విచారణకు రావొచ్చు అని హైకోర్టు తెలిపింది. అయితే ఈ విషయంలో కోర్టు కొన్ని షరతులు విధించింది.
కేటీఆర్‌తో పాటు రాంచందర్ అనే న్యాయవాది ఏసీబీ విచారణకు వచ్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లకూడదని ఆదేశించింది. విచారణ గదిలో మాత్రం కేటీఆర్‌తో పాటు ఏసీబీ అధికారులు మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ గది పక్కనే లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చోవచ్చని ఏసీబీ హైకోర్టు తెలిపింది. గురువారం(జనవరి 9) ఏసీబీ విచారణకు వెళ్లాలని కోర్టు కేటీఆర్‌కు సూచించింది. స్టేట్‌మెంట్ రికార్డులో ఏమైనా అనుమానాలుంటే తమను సంప్రదించవచ్చని కోర్టు తెలిపింది. విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయడానికి హైకోర్టు నో చెప్పింది.
ఇప్పటికే ఒకసారి కేటీఆర్ తన లాయర్‌తో పాటు ఏసీబీ విచారణకు వెళితే ఏసీబీ అనుమతించని విషయం తెలిసిందే. దీంతో గురువారం(జనవరి 9) ఏసీబీ ఆఫీసులో జరగనున్న విచారణ కీలకంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment