సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చేయాల్సింది లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు సీఎల్పీ మధుసూదన్ రెడ్డి. తప్పు చేసింది మీరైతే.. విచారణకు ముఖ్యమంత్రిని ఎందుకు రమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టే బయటకు రావడం లేదని వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ మధుసూదన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ మాటల్లోనే డొల్లతనం బయటపడింది. ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ కాకముందు ఒకలా.. నమోదు చేశాక అపరిచితుడులా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే కేసు కొట్టేయాలంటూ కోర్టులకు వెళ్లి మరీ మొట్టికాయలు తిన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో క్యాష్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. నిన్న ఈడీ విచారణ సందర్బంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.
ఈడీ వాళ్లు.. ఏసీబీ అడిగిందే అడుగుతున్నారు అని చెప్పారు. నేరం ఒక్కటే అయినప్పుడు ఇంకేం అడుగుతారు. కేటీఆర్‌కు చేయాల్సింది.. లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలి. డ్రగ్స్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. తప్పు మీరు చేసి.. విచారణకు సీఎంను రమ్మని అడుగుతారా?. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టి.. బయటకు రావడం లేదు. మీ హయాంలో ప్రతిపక్షనేతల కేసులకు మీరు విచారణకు వెళ్ళారా?.
కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్.. ఇలా ఫ్యామిలీ మొత్తం దోపిడీ చేసింది. మీ హయాంలో జరిగిన తప్పులు బయటకు వస్తున్నా నేపథ్యంలో విచక్షణ కోల్పోయి.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులకు.. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment