
ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం

ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది: వైఎస్ జగన్

మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా కూటమి సర్కార్ గాలికొదిలేసింది. ప్రతీ ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది

మనం ఇచ్చిన పథకాలను రద్దుచేశారు

బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెలలో ఏ క్యాలెండర్ అమలు చేస్తామో క్యాలెండర్ విడుదల చేశాం. ప్రజల సంతోషం కోసం నిరంతరం తాపత్రయ పడ్డాం.

మనం చేస్తున్న హామీలకు ఇంత ఖర్చు అవుతోంది, చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సూచించాను.

పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఈరోజు ఆ వీడియోలు చూస్తే.. జగన్ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి ఉంది









