క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్‌గా వచ్చి ఒక్కసారిగా మనిషిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే భయానక వ్యాధి అనే చెప్పాలి. ఇంతవరకు డబ్బున్న వాళ్లకు, చెడువ్యసనాలు ఉన్నవాళ్లకు మాత్రమే వచ్చేది ఈ వ్యాధి. ఇప్పుడు ఇది కూడా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందర్నీ అటాక్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తోంది. చాలావరకు కొన్ని క్యాన్సర్‌లను దశాల రీత్యా మందులతోనే నయం చేయొచ్చు. కానీ కొన్నింటికి కీమో థెరఫీ వంటి చికిత్సలు మరికొన్నింటికి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సల ద్వారా నయం చేస్తారు వైద్యులు. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధికి సంబంధించి వైద్యం మాత్రమే గాక మెడిసిన్ సైతం అత్యంత ఖరీదే. అలాంటి మందులను సైతం భారత్ ఫ్రీగా ఇస్తోంది. ఎన్ని రకాల మందులను ఉచితంగా ఇస్తుంది ఆరోగ్య సంరక్షణలో భారత్ తీసుకుంటున్న చర్యలు గురించే ఈ కథనం.!
భారత్ క్యాన్సర్‌కి సంబంధించి సుమారు 90 మందులలో 42 మందులను ఫ్రీగానే రోగులకు అందిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సంజీవని: యునైటెడ్ ఎగైనెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ఆరోగ్యానికే పెద్ద పీట వేస్తూ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పెంచామననారు. ఆరోగ్యం ఎప్పుడూ రాజీకీయ అంశం కాదని అదొక గొప్ప సేవ అని చెప్పారు. కాలక్రమేణ వ్యాధుల తీరు మారుతోంది. దీనిపై సమగ్ర దృక్పథం కలిగి ఉండటం చాలా ముఖ్యం అని నొక్కి చెప్పారు మాండవీయ. అంతేగాదు భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధిలోకి విలీనం చేసిందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజల ఆరోగ్యమే అత్యంత కీలక పాత్ర అని చెప్పారు.
అందువల్లే ప్రభుత్వం ఆరోగ్య సేవలు పేద, బలహీన వర్గాల ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించిందన్నారు. కోవిడ్ 19 తర్వాత భారత్ ఎన్నో సవాళ్లను ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో అధిగమించింది. అలాగే మాండవియా తాను ప్రారంభించిన సంజీవని ఫౌండేషన్ గురించి కూడా వివరించారు. ఇది నిశబ్దంగా కబళించే క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, వ్యాధికి సంబంధించిన భయాలను పోగొట్టడం తదితర అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అలాగే ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తూ వారిక తగిన సలహాలు సూచనలు ఇస్తున్న 'ఆశా బెహన్' సామాజకి కార్యకర్తల పాత్ర చాలా గొప్పదని అన్నారు.
అంతేగాదు క్యాన్సర్ సంరక్షణలో భారత విధానం గురించి కూడా విపులీకరించారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో పేద రోగులకు ఫీజులు మినహాయింపు ఇవ్వడమేగాక లాభప్రేక్షలేని ధరల్లోనే మందులను అందిస్తున్నామని అన్నారు. అనివార్య కారణాల వల్ల భారత్ కొంతమేర ఆరోగ్య సంరక్షణను తక్కువ ధరలోనే అందిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైన ధరల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించనున్నట్లు తెలిపారు ఆరోగ్య మంత్రి మాండవీయ.
(చదవండి: గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు! చిట్టి గుండె ఘోష..)
Comments
Please login to add a commentAdd a comment