156 ఔషధాలపై కేంద్రం నిషేధం | India bans 156 combination drugs used to treat fever, cold, allergies | Sakshi
Sakshi News home page

Medicine: 156 ఔషధాలపై కేంద్రం నిషేధం

Published Sat, Aug 24 2024 9:38 AM | Last Updated on Sat, Aug 24 2024 12:45 PM

India bans 156 combination drugs used to treat fever, cold, allergies

న్యూఢిల్లీ: రోగుల ఆరోగ్యానికి హాని కలిగంచే 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషనల్‌ను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మందుల ఉత్పత్తి, నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మందులు మనుషులకు ప్రమాదకరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది.

ఈ  156 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ మెడిసిన్స్ తయారీని, అమ్మకాన్ని, డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది.  డ్రగ్ టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ), నిపుణుల కమిటీ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. 

ఆగస్ట్ 12న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధిత ఔషధాలలో 'అసెక్లోఫెనాక్ 50ఎంజీ+ పారాసెటమాల్ 125ఎంజీ టాబ్లెట్, మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజైన్ హెచ్‌సిఎల్ + పారాసెటమాల్+ ఫినైల్‌ఫ్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్‌ వంటివి  ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement