![Stampede At Vishnu Nivasam In Tirupati](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/8/Tirumala1.jpg.webp?itok=mbEIcJiz)
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి
భక్తులను క్యూలైన్లలోకి వదిలే సమయంలో ఘటన
సాక్షి, తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జరిగిన భక్తుల మధ్య తోపులాటలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఒక పురుషుడుగా గుర్తించారు. 40 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.
రుయాలో వైద్యులు పట్టించుకోకపోవడంతో క్షతగాత్రుల బంధువులు సిమ్స్‌కు తరలించారు. భక్తులను క్యూలైన్లలోకి వదిలే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విష్ణు నివాసం, బైరాగి పట్టేడ రామానాయుడు స్కూల్ వద్ద తోపులాట జరిగింది.
వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శన టోకెన్లను కోసం భక్తులు పడిగాపులు పడుతున్నారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి టికెట్ల జారీ ఉంటుందని టీటీడీ ప్రకటించింది. 10 ,11 ,12 తేదీలకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లను గురువారం జారీ చేయనున్నారు. లక్ష 20 వేల సర్వ దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేయనుంది.
9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ జరగనుంది. ఇంకా సమయం ఉన్న కారణంగా భక్తులను క్యూలైన్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్ల మీద కూర్చొని భక్తులు గోవింద నామ స్మరణలతో నిరసన తెలిపారు. రోజుకు 40 వేలు టికెట్ల చొప్పున తొలి 1,20000 మూడు రోజుల టికెట్లను టీటీడీ జారీ చేయనుంది.
ఉచిత దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు కౌంటర్లకు చేరుకోవడంతో ఈ రోజు అర్ధరాత్రి 12 పైన చెప్పిన సమయం కన్నా ముందుగానే టికెట్లను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం షామియన కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రమైన చలికి వృద్ధులు పిల్లలతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రామచంద్ర పుష్కరిణి నుంచి స్విమ్స్ వరకు రోడ్లపైనే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు
Comments
Please login to add a commentAdd a comment