బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సంక్రాంతికి మిస్ 'ఫైర్' ! | Allu Arjun Pushpa 2 The Rule Re loading Version latest Update | Sakshi

Pushpa 2 The Rule: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. పొంగల్‌కు ఎక్స్‌ట్రా ఫైర్‌ మిస్!

Jan 8 2025 6:23 PM | Updated on Jan 8 2025 7:01 PM

Allu Arjun Pushpa 2 The Rule Re loading Version latest Update

నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్‌ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్‌ ముందుకొచ్చారు. ఈనెల 11 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్‌ తేదీని  మార్చారు. ముందుగా ప్రకటించిన డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్‌ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్‌ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. 

అందుకోసమేనా?..

అయితే పుష్ప-2 రీ లోడింగ్‌ తేదీని మార్చడంపై నెట్టింట చర్చ మొదలైంది. ఈనెల 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోంది. బాలయ్య డాకు మహారాజ్‌, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో గేమ్ ఛేంజర్ కూడా బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో పుష్ప-2 రీ లోడింగ్ వర్షన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించి సంక్రాంతి సినిమాలకు షాకిచ్చారు మైత్రి మూవీ మేకర్స్.

దీంతో పొంగల్‌కు రిలీజ్ అవుతోన్న సినిమాలకు పుష్ప-2 వల్ల పెద్ద డ్యామేజ్‌ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి-2ను వెనక్కి నెట్టిన పుష్పరాజ్‌.. సంక్రాంతి చిత్రాలతో పోటీ పడితే వాటి పరిస్థితి ఏంటన్నది గమనార్హం. అందువల్లే మైత్రి మూవీ మేకర్స్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాలకు పోటీ ఉండకూడదనే రీ లోడింగ్ వర్షన్‌ తేదీని జనవరి 17 వరకు పొడిగించారు. దీంతో ఈ ఏడాది పొంగల్ బరిలో నిలిచిన నిర్మాతలకు ఊరట లభించింది. ఏదేమైనా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్‌ చేయడం రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌ ..

అల్లు అర్జున్‌ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. దీంతో జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్‌ వెర్షన్‌ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనూ రికార్డ్..

పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం  సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతమందించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement