
Ganguly Tested Positive For Delta Plus Covid Variant: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి కరోనా బారిన పడ్డారు. అయితే ఈ సారి అతడికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యింది. తొలుత ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగిటివ్‌గా తేలిందని కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్ ఆస్పత్రి వర్గాలు శనివారం రాత్రి వెల్లడించాయి.
శుక్రవారమే(డిసెంబర్ 31, 2021) కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన దాదా.. గంటల వ్యవధిలోనే మరోసారి మహమ్మారి బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం గంగూలీకి కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, గతేడాది ఆరంభంలో గంగూలీ గుండె పోటుకు గురై యాంజియోప్లాస్టీ చేయించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..!