![Sourav Ganguly Discharged From Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/31/Sourav-Ganguly.jpg.webp?itok=K1AMBXC6)
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు తాజాగా నిర్వహించిన టెస్టులో కోవిడ్ నెగటివ్‌గా తేలింది. దీంతో గంగూలీని శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా కోవిడ్ లక్షణాలతో గంగూలీ సోమవారం రాత్రి వుడ్‌లాండ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఐదు రోజుల పాటు చికిత్స అందించారు. ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఈరోజు డిశ్చార్జ్ చేశారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే గంగూలీ రెండుసార్లు అనారోగ్యం బారిన పడిన విషయం విదితమే. ఆంజియోప్లాస్టి నిర్వహించిన తర్వాత అనారోగ్య కారణాల రీత్యా కొన్నిరోజుల పాటు ఆయన ఆస్పత్రిలో ఉన్నారు.
చదవండి: Year End 2021: 2021 నిజంగానే అపురూపం.. ఆటల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో..
Comments
Please login to add a commentAdd a comment