
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కొత్త రూపమైన డెల్టా ప్లస్ కేసులు తెలంగాణలో రెండు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఈ నెల 23 నాటికి దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహా రాష్ట్రలో 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. డెల్టా ప్లస్ కరోనా వైరస్ ఏ స్థాయిలో ప్రమాదమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రమాదం అంటుండగా, కొందరు వైద్య నిపుణులైతే అంత ప్రమాదం ఏమీ కాదని పేర్కొంటున్నారు.