
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. యూకే నుంచి హనుమకొండలోని పోస్ట్‌ల్ కాలనీకి వచ్చిన యువతికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 1న యూకే నుండి వచ్చిన సదరు యువతికి 12వ తేదీన ఆర్‌టీపీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది.
ఆపై 13వ తేదీన ఒమిక్రాన్ టెస్టు నిర్వహించగా మూడు రోజుల తర్వాత పాజిటివ్ వచ్చింది. హన్మకొండలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదును వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. తాజా ఒమిక్రాన్ కేసుతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది. కాగా, జిల్లాలో వారం రోజుల్లో 91కి కరోనా కేసులు రాగా, తాజాగా 12 పాజిటివ్ కేసులు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment