Covid Updates Omicron Will Overtake Delta In Early Days Of 2022 Warns CDC- Sakshi
Sakshi News home page

Omicron variant updates: డెల్టా వేరియంట్‌ను అధిగమించనున్న ఒమిక్రాన్‌..

Published Thu, Dec 16 2021 11:55 AM | Last Updated on Thu, Dec 16 2021 12:35 PM

Covid Updates Omicron Will Overtake Delta In Early Days Of 2022 Warns CDC - Sakshi

వాహింగ్టన్‌: గత యేడాది మారణహోమం సృష్టించిన కరోనా డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌  శర వేగంతో వ్యాప్తి చెందే అవకాశం ఉందని యూఎస్‌ సెంటర్‌ ఆఫ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గురువారం వెల్లడించింది. అమెరికాలోని మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్‌ కేసులు 3 శాతం ఉన్నాయని ఈ సందర్భంగా సీడీసీ డైరెక్టర్‌ రోచెల్ వాలెన్‌స్కీ పేర్కొన్నారు. యూఎస్‌ దేశ వ్యాప్తంగా 96 శాతం మెజార్టీ కేసులన్నీ డెల్లా ఫ్లస్‌కు చెందినవి కాగా, 3 కంటే ఎక్కువ శాతం కేసులు ఒమిక్రాన్‌కు చెందినవని ఆయన తెలిపారు. 75 దేశాల్లోని 36 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూశాయని, కేవలం రెండు రోజుల వ్యవధిలో కొత్త వేరియంట్‌ కేసులు రెట్టంపయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా యూఎస్‌ నేషనల్‌ జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ అనాలిసిస్‌ డేటాను సీడీజీ విడుదల చేసింది. 

వారాల వ్యవధిలోనే  ఒమిక్రాన్‌ విజృంభణ
కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌ కోవిడ్‌ డెల్టా ప్లస్‌ను డామినెట్‌ చేసే ఆధిపత్య జాతిగా పురోగమిస్తుందని యూఎస్‌ సీడీసీ నివేదించింది. మరోవైపు ఈయూ/ఈఈఏ దేశాల్లో 2022 మొదటి రెండు నెలల్లో ఒమిక్రాన్‌ వీఓసీ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, పండుగ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా యూరోపియన్‌ హెల్త్‌ కమిషనర్‌ స్టెల్లా కిరియాకిడ్స్ సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరించారు.

చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement