Delta Variant
-
Corona Latest Updates: కరోనాపై గుడ్ న్యూస్
-
ఆస్పత్రిలో చేరే వారు 5–10 శాతమే
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ యాక్టివ్ కేసుల్లో 5–10%కి మాత్రమే ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉంటోందని కేంద్రం తెలిపింది. అయితే, పరిస్థితులు వేగంగా మారే అవకాశాలున్నందున, ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉన్న కేసుల సంఖ్య కూడా పెరగవచ్చని సోమవారం హెచ్చరించింది. అందుకే, హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని రాష్ట్రాలను కోరింది. దేశంలో రెండో వేవ్ సమయంలో యాక్టివ్ కేసుల్లో ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉన్నవి 20–23% వరకు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సోమవారం ఒక లేఖ రాశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ వల్లనే భారీగా కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు. కోవిడ్ సమర్థ యాజమాన్యానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవాలని, ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొత్తం యాక్టివ్ కేసులు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవి, ఆస్పత్రుల్లో ఉన్న కేసులు.. ఇందులో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నవాటిపై సెకండ్ వేవ్ సమయంలో మాదిరిగానే రోజువారీ సమీక్ష జరపాలని రాష్ట్రాలను ఆయన కోరారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారీగా కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలను భూషణ్ ప్రశంసించారు. అయితే, మానవ వనరులు, మౌలిక వసతులకు పరిమితులున్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే కోవిడ్ బాధితుల నుంచి వేర్వేరు వసతులున్న బెడ్లకు వసూలు చేసే ఫీజులు న్యాయబద్ధంగా ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ సెంటర్లు రాత్రి 10 వరకు పనిచేయవచ్చు.. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)ల పనివేళలను నిర్దిష్టంగా నిర్ణయించలేదని కేంద్రం తెలిపింది. -
భారత్‌లో థర్డ్‌వేవ్.. మొదటి వారంలో ఆర్– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాప్తిపై ఐఐటీ మద్రాస్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్ నాట్ విలువ జనవరి మొదటి వారంలో 4కి చేరుకుందని తాము చేసిన ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని తెలిపింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ నాట్ వాల్యూ లేదంటే ఆర్ఒ అని పిలుస్తారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. డెల్టా వేరియెంట్ ప్రబలి కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో కూడా ఆర్ నాట్ వాల్యూ 1.69 దాటలేదు. అలాంటిది ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తున్న వేళ డిసెంబర్ 25–31 తేదీల్లో ఆర్ నాట్ వాల్యూ 2.9 ఉంటే, జనవరి 1–6 తేదీల మధ్య అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్ మోడల్లో ఐఐటీ మద్రాస్ కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి గల అవకాశం, కాంటాక్ట్ రేటు, వైరస్ సోకడానికి పట్టే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్ నాట్ వాల్యూని అంచనా వేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రావడంతో కాంటాక్ట్ రేటు తగ్గి ఆర్ఒ విలువ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని జయంత్ ఝా చెప్పారు. గత రెండు వారాల్లో కేసులు ప్రబలే తీరుపైనే తాము ప్రాథమికంగా విశ్లేషించామని, కోవిడ్‌ని అరికట్టడానికి తీసుకునే చర్యలను బట్టి ఆర్ వాల్యూ మారవచ్చునని జయంత్ తెలిపారు. ఫిబ్రవరి 1–15 మధ్య దేశంలో కేసులు ఉధృతరూపం దాలుస్తాయని, గతంలో కుదిపేసిన వేవ్‌ల కంటే ఈ సారి కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినట్టు వివరించారు. 2 కోట్ల మంది బాలలకు మొదటి డోసు టీకా ఈ నెల 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల గ్రూపు బాలబాలికలకు కోసం ప్రారంభించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో వేసిన 90,59,360 డోసులతో కలుపుకుని శనివారం రాత్రి 7 గంటల సమయానికి ఇప్పటి వరకు అర్హులందరికీ వేసిన మొత్తం డోసుల సంఖ్య 150.61 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ తెలిపారు. దేశంలోని అర్హులైన వారిలో 91% మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 66% మందికి టీకా రెండు డోసులూ పూర్తయినట్లు పేర్కొన్నారు. -
ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి
Omicron Boost Immunity Against Delta: ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి.. అనేది పాత సామెత! ముందునుంచి ఉన్న చెవులకు కొత్త కొమ్ముల వాడి తగలడం దీనికి కొనసాగింపు! ఈ కథలో ముందునుంచి ఉన్న చెవులు డెల్టా వేరియంట్ కాగా, వెనకొచ్చిన కొమ్ములు ఒమిక్రాన్ వేరియంట్. డెల్టాను మించిన వేగంతో ఆవతరించిన ఒమిక్రాన్ క్రమంగా డెల్టాకే పరోక్ష ప్రమాదకారిగా మారుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వివరాలేంటో చూద్దాం.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీలు భవిష్యత్‌లో డెల్టా వేరియంట్ సోకితే అడ్డుకునేలా సదరు వ్యక్తి శరీరంలో రోగనిరోధకతను పెంచుతాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన పలు మ్యుటేషన్లతో ఒమిక్రాన్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే! డెల్టాతో పోలిస్తే దీనికి వేగం, వ్యాప్తి సామర్ధ్యం ఎక్కువని నిరూపితమైంది. అదేవిధంగా శరీరంలో టీకాల వల్ల, గత ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా ఒమిక్రాన్ అధిగమిస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. అయితే డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల కలిగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం గమనార్హం. దీనివల్లనే ఒమిక్రాన్ ప్రపంచమంతా అత్యధిక వేగంతో వ్యాపించినా, డెల్టా తరహాలో మరణాలు సంభవించడం లేదు. అంటే డెల్టా సోకితే వచ్చిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. కానీ ఒమిక్రాన్ సోకితే వచ్చే యాంటీబాడీలు మాత్రం అటు డెల్టాను, ఇటు ఒమిక్రాన్‌ను అడ్డుకోగలుగుతున్నాయి. అందుకే కొందరు సైంటిస్టులు ఒమిక్రాన్ దేవుడు ఇచ్చిన ‘‘సహజ వ్యాక్సిన్’’గా అభివర్ణిస్తున్నారు. టీకా చేసే పనులను ( వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండడం, శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపించడం) ఈ వేరియంట్ చేస్తోందని భావిస్తున్నారు. ఈ భావనకు తాజా పరిశోధన బలం చేకూరుస్తోంది. ఏమిటీ పరిశోధన ఒమిక్రాన్ వేరియంట్‌ను మరింతగా అవగాహన చేసుకునేందుకు దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక అధ్యయనం జరిపారు. దీని వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా 15మందిని అధ్యయనం చేశారు. వీరిలో టీకాలు తీసుకున్నవారు మరియు ఇంతవరకు టీకాలు తీసుకోకుండా ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారు ఉన్నారు. ఈ రెండు గ్రూపులకు చెందిన వారి రక్తం, ప్లాస్మాల్లో యాంటీబాడీలను విశ్లేషించారు. వీరి శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీల్లో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను అడ్డుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇందుకోసం ‘‘న్యూట్రలైజేషన్’’పరీక్ష నిర్వహించారు. లక్షణాలు కనిపించినప్పుడు, తిరిగి రెండు వారాల తర్వాత మొత్తం రెండు దఫాలు ఈ పరీక్షలు చేశారు. ఒమిక్రాన్ సోకి యాంటీబాడీలు ఉత్పత్తైన వ్యక్తుల్లో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 14 రెట్లు అధికంగా పెరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా డెల్టాకు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 4.4 రెట్లు పెరిగినట్లు గమనించారు. అంటే ఒమిక్రాన్ సోకి వ్యాధి తగ్గిన వారిలో అటు ఒమిక్రాన్, ఇటు డెల్టాకు వ్యతిరేకంగా ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని తేల్చారు. అంటే ఒకసారి ఒమిక్రాన్ సోకి తగ్గితే సదరు వ్యక్తికి భవిష్యత్‌లో డెల్టా, ఒమిక్రాన్ సోకే అవకాశాలు బాగా తగ్గవచ్చని పరిశోధకుడు అలెక్స్ సైగల్ అభిప్రాయపడ్డారు. టీకా సైతం ఇదే పనిచేస్తున్నందున ఒమిక్రాన్‌ను కరోనాకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన టీకాగా భావించవచ్చన్నది నిపుణుల అంచనా. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తే కరోనా ఒక సాధారణ జలుబుగా మారిపోయే అవకాశాలున్నాయనేది ప్రస్తుతానికి వినిపించే గుడ్ న్యూస్! విమర్శలు కూడా ఉన్నాయి... సైగల్ చేపట్టిన పరిశోధన వివరాలు ఆశాజనకంగా ఉన్నా, ఈ పరిశోధనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కేవలం 15మంది వాలంటీర్ల అధ్యయనంతో మొత్తం ప్రపంచ మానవాళి ఆరోగ్యాన్ని అంచనా వేయలేమన్నది విమర్శకుల వాదన. డెల్టా కన్నా ఒమిక్రాన్ మంచిదనేందుకు ఈ యాంటీబాడీల పరీక్ష కాకుండా మరే ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని ఒమిక్రాన్ యాంటీబాడీలు పెంచిఉండొచ్చని కొందరి అంచనా. అలాగే డార్విన్ సిద్ధాంతం ప్రకారం డెల్టాను ఒమిక్రాన్ తరిమేస్తే భవిష్యత్‌లో మరో శక్తివంతమైన వేరియంట్ పుట్టుకురావచ్చు. అందువల్ల కేవలం ఒమిక్రాన్‌తో కరోనా ముగిసిపోకపోవచ్చని పరిశోధకుడు డాక్టర్ పియర్సన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో మూడు పరిణామాలకు అవకాశం ఉందన్నారు. 1. ఫ్లూ వైరస్లాగా ప్రతి ఏటా ఒక సీజనల్ కరోనా వేరియంట్ పుట్టుకురావడం . 2. డెంగ్యూలాగా పలు కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూ కొన్ని సంవత్సరాలకొకమారు ఒక వేరియంట్ విజృంభించడం. 3. తేలికగా నివారించగలిగే ఒకటే వేరియంట్ మిగిలడం.. అనేవి పియర్సన్ అంచనాలు. వీటిలో మూడోది మానవాళికి మంచిదని, కానీ దీనికి ఛాన్సులు తక్కువని ఆయన భావిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఒమిక్రాన్, డెల్టాల సునామీ.. డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
బెర్లిన్: ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అధనామ్ గెబ్రెయెసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్ ప్రబలుతుంటే... అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవి రెండూ కలిపి కేసుల సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పనిభారంతో బాగా అలసిపోయిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిపై ఈ సునామీ మరింత ఒత్తిడిని పెంచుతుంద’ని విలేకరుల సమావేశంలో అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్‌తో ముప్పు తక్కువని ప్రాథమిక గణాంకాలు సూచించినా... అదే నిజమని అప్పుడే స్థిర అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని పేర్కొన్నారు. మరింత విశ్లేషణ జరిగాకే ఒమిక్రాన్ తీవ్రతపై పూర్తి స్పష్టతకు రావొచ్చన్నారు. అమెరికాలో ఒమిక్రాన్ ఇప్పటికే ప్రధాన వేరియెంట్‌గా మారగా... యూరప్‌లోని కొన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ బాగా ప్రబలుతోంది. ఒమిక్రాన్‌తో ముప్పు ఇప్పటికైతే తీవ్రమేనని డబ్ల్యూహెచ్‌వో తమ వారాపు నివేదికలో పేర్కొంది. డిసెంబరు 20–26 వరకు ప్రపంచవ్యాప్తంగా 49.9 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంటే రోజుకు సగటున 7.12 లక్షల కొత్త కేసులొచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 11 శాతం కేసులు పెరిగాయి. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3.56 లక్షల కేసులు రాగా, ఫ్రాన్స్‌లో ఇదివరకూ ఎప్పుడూ లేనంత ఎక్కువగా.. రికార్డు స్థాయిలో 2.08 లక్షల కేసులు నమోదయ్యాయి. యూకేలో 1.29 లక్షల కేసులు వచ్చాయి. చదవండి: (Hyderabad New Year Events: సిటీ పోలీసుల కీలక ఆదేశాలు) -
కరోనా విలయతాండవం: ఒక్కరోజులో ఐదు లక్షల కేసులు.. సగం ఒమిక్రాన్!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో లెక్క నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఒక్క అమెరికాలోనే అదీ ఒక్కరోజులో ఐదు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం, అందులో సగం కంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ అందించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 5, 12, 000 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సగం కంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కావడం విశేషం. అమెరికాలో ప్యాండెమిక్ విజృంభణ మొదలయ్యాక నమోదు అయిన కేసుల సంఖ్య ఇదే హయ్యెస్ట్. మొత్తంగా ఇప్పటివరకు 54 మిలియన్ల కేసులు ఇప్పటిదాకా నమోదు అయ్యాయి. ఇంతకు ముందు కరోనా హయ్యెస్ట్ కేసుల సంఖ్య 2, 94, 015గా(ఈ ఏడాది జనవరి 8న) నమోదు అయ్యింది. డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సమాచారం ప్రకారం.. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 58 శాతం(దాదాపు సగం కంటే ఎక్కువ) ఒమిక్రాన్ కేసులే ఉన్నట్లు చెబుతోంది. ఒమిక్రాన్ కంటే ముందు డెల్టా వేరియెంట్ మూలంగానే అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం డెల్టా వేరియెంట్ కేసులేనని సీడీసీ చెబుతోంది. కొవిడ్-19 కారణంగా గడిచిన ఒక్కరోజులో 1,762 మంది పేషెంట్లు చనిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 8,42,000 చేరింది. ప్రస్తుతం అమెరికాలో కోటి పంతొమ్మిది లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నాలుగు కోట్ల 32 లక్షల మందికిపైగా కోలుకున్నారు. భారత్‌లోనూ ఇదే పరిస్థితి? ఓవైపు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడం, మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ బాధితుల సంఖ్యా పెరిగిపోతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం భారత్‌కు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ఎక్కువ జనాభా ఉన్న భారత్‌లో ఒమిక్రాన్ విజృంభణ ఒక్కసారిగా పెరిగిపోవచ్చని చెప్తున్నారు ప్రొఫెసర్ పాల్ కట్టూమన్. ‘‘రాబోయే కొద్దిరోజుల్లో భారత్ కీలక దశలోకి ప్రవేశించనుంది. కొన్ని వారాల్లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు తారాస్థాయికి చేరుకుంటాయి. కారణం.. ఒమిక్రాన్ వేరియెంట్ వేగం ఎక్కువగా ఉండడం. బహుశా అది ఈ వారం పదిరోజుల నుంచే జరగొచ్చు కూడా. అయితే అమెరికా స్థాయిలో ఉంటుందా? లేదా? అనేది రెండు వారాల్లో తెలిసిపోతుంది. బూస్టర్ డోసులతో కట్టడికి ప్రయత్నించినా.. ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడం కష్టమే. జాగ్రత్తలు పాటించడం ద్వారా పరిస్థితి చేజారకుండా కాపాడుకోవచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు ఆయన. భారత్‌లో కొవిడ్ ట్రాకర్‌ను రూపొందించిన పరిశోధకుల్లో కట్టూమన్ కూడా ఉన్నారు. డిసెంబర్ 24 దాకా ఆరు రాష్ట్రాల్లో తీవ్రతను గుర్తించిన కొవిడ్ ట్రాకర్.. 26వ తేదీ నాటికి ఆ సంఖ్యను 11 రాష్ట్రాలకు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ రెండు నగరాల్లో దీనస్థితి కాలిఫోర్నియా, న్యూయార్క్ నగరాల్లో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఒక్క కాలిఫోర్నియాలోనే 50 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గోల్డెన్ స్టేట్‌లో 86 వేలమందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో సీడీసీ కాలిఫోర్నియాను ‘హై ట్రాన్స్మిషన్’ జోన్‌గా ప్రకటించింది. మరోవైపు న్యూయార్క్ నగరంలో చిన్నపిల్లలు వైరస్ బారినపడుతుండడంతో దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ తీవ్రత మరింత ఉదృతంగా ఉండొచ్చని సీడీసీ డైరెక్టర్ రోచెల్లె వాలెన్‌స్కై అంచనా వేస్తున్నారు. డెల్టా వేరియెంట్ బారినపడ్డ పేషెంట్లకు చికిత్స భయంభయంగానే నడుస్తోంది. అయితే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండడంతో సాధారణ చికిత్సకే పరిమితం అవుతున్నారు వైద్యులు. మరోవైపు ఐసోలేషన్ సమయాన్ని పది నుంచి ఐదు రోజులకు కుదించింది అమెరికా ప్రభుత్వం. చదవండి: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు -
ప్రపంచం పై మళ్లీ పంజా విసురుతోన్న కరోన
-
నాలుగో వేవ్ నడుస్తోంది.. జాగ్రత్త!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా నాలుగో వేవ్ ఉధృతి కనిపిస్తోందని, ఈ సమయంలో భారత్‌లో కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల పేరిట కోవిడ్ నిబంధనల అతిక్రమణ చేయవద్దని కోరింది. తక్షణమే టీకాలు తీసుకోవడం, కోవిడ్ సమయంలో పాటించాల్సిన పద్ధతులు(కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) పాటించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం చేయాలని సూచించింది. ఇప్పటికీ ఇండియాలో డెల్టానే డామినెంట్ వేరియంట్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ తెలిపారు. ఏరకమైన వేరియంట్ సోకినా ఒకటే చికిత్స అందించాలన్నారు. ఇంతవరకు దేశంలో 358 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని, వీటిలో 183 కేసులను విశ్లేషించగా అందులో 121 కేసులు విదేశీ ప్రయాణికులవని తెలిపింది. 183 కేసుల్లో 91 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారని, ముగ్గురైతే బూస్టర్ డోసు తీసుకున్నారని వివరించింది. వీరిలో 70 శాతం మందిలో ఒమిక్రాన్ సోకినా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ పాజిటివిటీ రేటు 6.1 శాతం వద్ద కదలాడుతోంది. దేశీయంగా కేరళ, మిజోరాంలో జాతీయ సగటు కన్నా అధిక పాజిటివిటీ నమోదవుతోందని కేంద్రం వెల్లడించింది. దేశం మొత్తం మీద 20 జిల్లాల్లో(కేరళలో 9, మిజోరాంలో 8)పాజిటివిటీ రేటు 5– 10 శాతం మధ్య ఉందని తెలిపింది. ఒమిక్రాన్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రైవేట్ వైద్య రంగం తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కరోనాపై పోరుకు 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్, 5 లక్షల ఆక్సీజన్ సపోర్టెడ్ బెడ్స్, 1.39 లక్షల ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచారు. ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్2లో భాగంగా 50 శాతం నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించామని, వీటితో ఏర్పాట్లు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. యూపీలో రాత్రి కర్ఫ్యూ ఈనెల 25 నుంచి ఉత్తరప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. పెళ్లిళ్లలాంటి కార్యక్రమాలకు 200కు మించి హాజరు కారాదని తెలిపారు. రోడ్లపై తిరిగేవారికి మాస్కు తప్పనిసరి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు వచ్చేవారికి కరోనా టెస్టులు చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, ముంబైలో రాత్రిపూట ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై నిషేధం విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నియమం అమల్లోకి వస్తుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఇన్డోర్ ఫంక్షన్లలో 100 మంది లేదా హాలు సామర్ధ్యంలో 50 శాతం కన్నా ఎక్కువమంది, అవుట్ డోర్ కార్యక్రమాల్లో 250 మంది లేదా సమావేశ ప్రాంత మొత్తం సామర్ధ్యంలో 25 శాతం కన్నా ఎక్కువ హాజరు కాకూడదని ప్రభుత్వం ఆదేశించింది. జార్ఖండ్‌లోని రాంచీలో జనం రద్దీ -
డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువే!
లండన్: కరోనా డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ తీవ్రతకలదని, అందుకే ఇది సోకిన వారిలో కొద్దిమందే ఆస్పత్రిపాలవుతున్నారని రెండు వేర్వేరు అధ్యయనాలు వెల్లడించాయి. లండన్ ఇంపీరియల్ కాలేజీ, ఎడిన్బర్గ్ యూనివర్సిటీలు రోగులు, ఆస్పత్రులనుంచి గణాంకాలు సేకరించి ఈ అధ్యయనాలను రూపొందించాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారు ఆస్పత్రిలో గడపాల్సిరావడం 40–45 శాతం తక్కువని ఇంపీరియల్ కాలేజీ నివేదిక తెలిపింది. గతంలో ఒకసారి కరోనా సోకి, మరలా ఇప్పుడు ఒమిక్రాన్ సోకినవారిలో ఆస్పత్రిలపాలయ్యే ఛాన్సులు తక్కువని తెలిపింది. టీకాలు తీసుకోనివారిలో హాస్పిటలైజేషన్ రిస్క్ అధికమేనని హెచ్చరించింది. ఒమిక్రాన్‌కు ఉన్న అధిక వేగం కారణంగా ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నివేదిక రూపకర్తల్లో ఒకరైన నీల్ ఫెర్గూసన్ చెప్పారు. ఈ అధ్యయనం కోసం 56వేల ఒమిక్రాన్, 2.69 లక్షల డెల్టా కేసులను పరిశీలించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువేనని ఎడిన్బర్గ్ వర్సిటీ నివేదిక తెలిపింది. ఇది సంతోషకరమైన విషయమని, కానీ అంతమాత్రాన అశ్రద్ధ కూడదని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ పండుగ సంబరాలపై నిబంధనలు విధిస్తున్నారు. దక్షిణాఫ్రికాదీ అదేమాట కరోనా గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువని దక్షిణాఫ్రికాలోని విట్వాటర్ర్సాండ్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ తీవ్రత చాలా తగ్గిందని యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర షెరిల్ కోహెన్ చెప్పారు. మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఒమిక్రాన్ ప్రభావం తగ్గవచ్చని అంచనా వేశారు. అయితే అధిక వ్యాక్సినేషన్ ఉన్న దేశాలతో పోలిస్తే అల్ప వ్యాక్సినేషన్ దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చన్నారు. దేశంలో నడుస్తున్న నాలుగో వేవ్ గత వేవ్స్ కన్నా తక్కువ ప్రమాదకారిగా తేలిందని దక్షిణాఫ్రికా ఆరోగ్య నిపుణులు వాసిలా జసాత్ చెప్పారు. ఈ వేవ్‌లో తొలి నాలుగు వారాల్లో భారీగా కేసులు నమోదయ్యాయని, అయితే వీటిలో 6 శాతం కేసులు మాత్రమే ఆస్పత్రికి చేరాయని వివరించారు. అలాగే సీరియస్ కండీషన్లోకి దిగజారిన పేషెంట్ల సంఖ్యకూడా గతం కన్నా తక్కువేనన్నారు. గత వేవ్స్‌లో కరోనా సోకిన వారిలో 22 శాతం మరణించగా, నాలుగో వేవ్‌లో మరణాలు 6 శాతానికి పరిమితమయ్యాయని తెలిపారు. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగడం, టీకాల విస్తృతి పెరగడం, వేరియంట్లో విరులెన్స్(విష తీవ్రత) తగ్గడం వంటి అనేక కారణాలు ఇందుకు దోహదం చేసిఉండొచ్చని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సిఉందని చెప్పారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌తో హాస్పటలైజేషన్ రిస్కు 80 శాతం తక్కువ కాగా తీవ్ర లక్షణాలు కనిపించే రిస్కు 70 శాతం తక్కువని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల సంస్థ తెలిపింది. -
డెల్టా కంటే 3 రెట్లు వేగం.. ఒమిక్రాన్‌తో బహుపరాక్.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్ ఉంది. తాజాగా, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన ఒమిక్రాన్ అందుకు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రస్తుతం ఆధారాలున్నాయి. అందుకే, అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనాలిసిస్, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, కంటైన్మెంట్ విషయంలో చురుగ్గా ఉండాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘వార్‌రూంలను క్రియాశీలకం చేయాలి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేసుల్లో చిన్నపాటి పెరుగుదల కనిపించిన ప్రాంతాలపైనా దృష్టిపెట్టాలి. జిల్లా, స్థానిక స్థాయిల్లో కంటెయిన్మెంట్ చర్యలను కట్టుదిట్టం చేయాలి. అవసరమైన చోట్ల రాత్రి కర్ఫ్యూ విధించాలి. పెళ్లిళ్లు, ఉత్సవాల్లో ప్రజలు భారీగా గుమికూడకుండా నియంత్రించాలి. వైరస్ బాధితుల హోం ఐసోలేషన్ సమయంలో నిబంధనలను తు.చ.తప్పకుండా పాటించాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్హులైన మొదటి, రెండో డోస్ లబ్ధిదారులందరికీ టీకా వేగంగా అందేలా చూడాలి. వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి’అని ఆయన కోరారు. గత వారం రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 10%, అంతకంటే ఎక్కువగా ఉన్న, ఐసీయూ బెడ్ ఆక్యుపెన్సీ 40%, ఆపైన ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. క్లస్టర్లలో సేకరించిన శాంపిళ్లను తక్షణమే తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపాలన్నారు. ప్రస్తుతం పిల్లలకు టీకా అక్కర్లేదు ప్రస్తుతానికి దేశంలో చిన్నారులకు కోవిడ్–19 టీకా అవసరం లేదని వ్యాధి నిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్టీఏజీఐ వర్కింగ్ గ్రూప్‌లో నిర్ణయించినట్లు పేర్కొంది. ‘పిల్లలకు కోవిడ్ ముప్పు అంతగా లేదు. అందుకే, చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అవసరం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాం’అని మంగళవారం ఎన్టీఏజీఐ తెలిపింది. -
Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయిలో మారణహోమాన్ని రగిలించిన కోవిడ్ రెండో వేరియంట్ డెల్టాప్లస్ కంటే కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ శర వేగంగా విస్తరిస్తోంది. ఐతే తాజా అధ్యయనాల ప్రకారం త్వరలో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశం మొత్తంలో 200 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఐతే డెల్టా ప్లస్ కంటే ఒమిక్రాన్ 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసి పతనంచేస్తుందని, రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లు ఉద్భవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకూ వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసుల్లో గొంతు నొప్పి, అలసట వంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే బయటపడ్డాయి. ఇంట్లోనే తగు జాగ్రత్తలతో కోలుకుంటున్నారు కూడా. దేశంలో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్ మృతి నమోదవ్వనప్పటికీ, అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించడంతో యావత్ ప్రపంచం భయాందోళనల్లో ఊగిసలాడుతోంది. చదవండి: ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్ -
డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే..
న్యూఢిల్లీ: గత యేడాది ప్రారంభంలో కేవలం అతి తక్కువ కాలంలోనే కరోనా డెల్టా స్ట్రెయిన్ ఘోర మారణహోమం సృష్టించింది. ముఖ్యంగా మనదేశంలో ఏప్రిల్ - మే నెలల్లో లక్షల మరణాలకు కారణమైంది. దీని నుంచి పూర్తిగా బయటపడక ముందే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరొకమారు ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. దీనిని ధృవీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు, వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీరి అధ్యయన ఫలితాలు ఏం చెబుతున్నాయంటే.. ఒక వ్యక్తికి సార్స్ కోవిడ్- 2 వైరస్‌కు చెందిన డెల్టా స్ట్రెయిన్, ఒమిక్రాన్ రెండూ ఒకేసారి సోకినట్లయితే అతనిలో సూపర్ స్ట్రెయిన్ అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నట్లు ఒక నిపుణుడు అభిప్రాయపడుతున్నాడు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా కంటే 30 రెట్లు అధికంగా స్పైక్ ప్రొటీన్ కలిగి ఉందని దీనిని ఎదుర్కోవడం కష్టసాధ్యమని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఉధృతి చూస్తుంటే సూపర్ స్ట్రెయిన్ అవకాశాన్ని తోసిపుచ్చలేమని యూకే పార్లమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీకి మోడెర్న్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాల్ బర్టన్ తెలిపారు. రెండు వైరస్‌లను తట్టుకునే శక్తి ఖచ్చితంగా మనుషుల్లో ఉండదనే విషయాన్ని దక్షిణాఫ్రికా కూడా మీడియాలో ప్రచురించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రెండు వేరియంట్లు జన్యువులను మార్చుకుని మరింత ప్రమాదకరంగా రూపాంతరం చెందడం సాధ్యమేనని యూకే పార్లమెంటేరియన్లకు ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఒకసారి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకినవారికి తిరిగి మళ్లీమళ్లీ సోకే అవకాశం 5 రెట్లు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయని, డెల్టా కంటే దీని ఉధృతి తక్కువ అనడానికి ఎటువంటి సంకేతాలు బయటపడలేదని తెలిపారు. కాగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 11 మధ్య కోవిడ్ సోకిన వ్యక్తులపై నేషనల్ హెల్త్ సర్వీస్ డేటా ఆధారంగా యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నిర్వహించిన అధ్యయన ఫలితాలు ఈ విషయాలను వెల్లడించాయి. ఐతే డెల్టాకంటే ఒమిక్రాన్ ఏవిధంగా ప్రాణాలకు హాని చేకూరుస్తుంది, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయంలో ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదని అన్నారు. వాక్సిన్ స్టేటస్, వయస్సు, లింగం, జాతి, లక్షణరహిత స్థితి, ప్రాంతం ఆధారంగా డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ 5.4 రెట్లు ఎక్కువ సార్లు మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!! -
కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక
వాహింగ్టన్: గత యేడాది మారణహోమం సృష్టించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ శర వేగంతో వ్యాప్తి చెందే అవకాశం ఉందని యూఎస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గురువారం వెల్లడించింది. అమెరికాలోని మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయని ఈ సందర్భంగా సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. యూఎస్ దేశ వ్యాప్తంగా 96 శాతం మెజార్టీ కేసులన్నీ డెల్లా ఫ్లస్కు చెందినవి కాగా, 3 కంటే ఎక్కువ శాతం కేసులు ఒమిక్రాన్‌కు చెందినవని ఆయన తెలిపారు. 75 దేశాల్లోని 36 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయని, కేవలం రెండు రోజుల వ్యవధిలో కొత్త వేరియంట్ కేసులు రెట్టంపయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా యూఎస్ నేషనల్ జినోమిక్ సీక్వెన్సింగ్ అనాలిసిస్ డేటాను సీడీజీ విడుదల చేసింది. వారాల వ్యవధిలోనే ఒమిక్రాన్ విజృంభణ కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కోవిడ్ డెల్టా ప్లస్‌ను డామినెట్ చేసే ఆధిపత్య జాతిగా పురోగమిస్తుందని యూఎస్ సీడీసీ నివేదించింది. మరోవైపు ఈయూ/ఈఈఏ దేశాల్లో 2022 మొదటి రెండు నెలల్లో ఒమిక్రాన్ వీఓసీ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, పండుగ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్! #WATCH | US Centers for Disease Control and Prevention (CDC) Director Rochelle Walensky said, "...Early data suggest that Omicron is more transmissible than Delta, with a doubling time of about two days." pic.twitter.com/RbbLoaQ3Nk — ANI (@ANI) December 15, 2021 -
వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: ‘డెల్టా’ వేరియంట్‌తో పది నెలలుగా కంటిమీద కునుకు లేకుండా గడిపిన సిటిజన్లు.. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ‘ఒమిక్రాన్’ వేరియంట్‌తో మళ్లీ వణికిపోతున్నారు. ఎప్పుడూ ఎటు నుంచి ఏ రూపంలో వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సోమవారం సంగారెడ్డి గురుకులంలోని 42 మంది విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో నగరంతో పాటు శివారు జిల్లాల్లోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ 18 ఏళ్లలోపు వారికి టీకాలు అందుబాటులోకి రాకపోవడం, కాలేజీలు, స్కూళ్లు, హాస్టళ్లు పూర్తిస్థాయిలో పని చేస్తుండటం, భౌతిక దూరం పాటించకపోవడం, 40 నుంచి 60 మంది విద్యార్థులను ఒకే చోట కూర్చోబెడుతుండటంతో తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తోంది. చదవండి: ‘ఒమిక్రాన్’ వేరియెంట్ కథాకమామిషూ ఊపిరి పీల్చుకునే లోపే.. సెకండ్‌వేవ్ తీవ్రతకు అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనేక మంది కుటుంబ పెద్దదిక్కును కోల్పోయారు. ఇప్పటి వరకు గ్రేటర్ జిల్లాల్లో 1,33,83,065 మంది కోవిడ్ టీకా తీసుకోగా, వీరిలో 53,47,634 మంది మాత్రమే రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. మరో 80,35,431 మొదటి డోసు టీకా తీసుకుని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై మాసాల్లో నగరంలో రోజుకు సగటున వెయ్యికిపైగా కేసులు నమోదు కాగా, కోవిడ్ టీకాల పంపిణీతో ఆగస్టు నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వందలోపే నమోదవుతోంది. చదవండి: ఒమిక్రాన్ ‘తీవ్రత’పై స్పష్టత లేదు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వైరస్ పీడ ఇక పూర్తిగా తొలగిపోయినట్లేనని సిటిజన్లు భావించి మాస్క్‌లను తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈలోపే ‘బి.1.1.529’ రూపంలో మళ్లీ మరో వేరియంట్ వెలుగు చూడటం ఇది ఇప్పటివరకు ఉన్న డెల్టా కంటే మరింత ప్రమాదమని వైద్యులు హెచ్చరికలు జారీ చేయడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ప్ర భుత్వం అప్రమత్తమైంది. 12 ఆఫ్రికా దేశాల నుంచి నగరానికి వస్తున్న ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. విమానం దిగిన తర్వాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. డెల్టా కంటే వేగంగా.. ప్రస్తుతం దక్షిణాప్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ డెల్టా కంటే ప్రమాదకరమైంది. వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం మన ఒంట్లో ఉన్న యాంటిబాడీస్ ఈ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయా? లేదా అనేది కూడా ఇంకా తేలలేదు. ఇందుకు మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీ కోవిడ్ సెంటర్లో 55 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 35 కోవిడ్ బాధితులు కాగా, మరో 20 బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న వారు ఉన్నారు. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి వైరస్‌ను లైట్‌గా తీసుకోవద్దు ప్రస్తుతం కేసుల సంఖ్య మాత్రమే తగ్గింది. వైరస్ ఇంకా పోలేదు. కానీ చాలా మంది వైరస్‌ను తేలికగా తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నామనే ధీమాతో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారు. శుభకార్యాలు, పూజల పేరుతో పెద్ద సంఖ్యలో ఒక చోటికి చేరుతున్నారు. భౌతికదూరం పాటించడం లేదు. కనీసం చేతులను శానిటైజ్ చేయడం లేదు. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. విధిగా ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలి. – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ, రంగారెడ్డి టీకాలపై ప్రచారం.. నగరంలోని కొన్ని వర్గాల ప్రజల్లో కోవిడ్ టీకాలపై ఇప్పటికీ పలు అపోహలు ఉన్నాయి. మత పెద్దలు, పార్టీ అధినేతలతో ప్రచారం చేయిస్తున్నాం. టీకాలపై వారికి అవగాహన కల్పించి, అపోహలను తొలగిస్తున్నాం. వారంతా టీకాలు వేయించుకునేలా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తున్నాం. – డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్ ఉపాధ్యాయులను అప్రమత్తం చేశాం ఇటీవల గురుకులాల్లో కోవిడ్ కేసులు వెలుగు చూడటంతో వెంటనే అప్రమత్తమయ్యాం. ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులను అప్రమత్తం చేశాం. ఇంటర్వెల్, మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు విధిగా చేతులు శుభ్రం చేసుకునేలా చూస్తున్నాం. అన్ని పాఠశాలలల్లోనూ మాస్క్‌లు తప్పనిసరి చేశాం. విద్యార్థులు భౌతికదూరం పాటించే విధంగా చూసుకోవాల్సిందిగా ఆయా యాజమాన్యాలకు సూచించాం. – సుశీందర్‌రావు, డీఈఓ, రంగారెడ్డి ట్రేటర్ జిల్లాల్లో కోవిడ్ టీకాలు ఇలా.. జిల్లా మొత్తం ఫస్ట్ డోసు సెకండ్ డోసు హైదరాబాద్ 55,38,975 33,01,862 22,37,113 మేడ్చల్ 37,94,677 22,52,390 15,42,287 రంగారెడ్డి 40,49,413 24,81,179 15,68,234 -
సౌతాఫ్రికా నుంచి ఇద్దరు: హమ్మయ్య.. వారికి సోకింది ఒమిక్రాన్ కాదు డెల్టా
బెంగళూరు: దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల బెంగళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా సోకిందన్న వార్త నగరంలో సంచలనం సృష్టించింది. వారికి ఒమిక్రాన్ వేరియంట్ రకం కరోనా వైరస్ సోకిందా ? అనే అనుమానంతో తీవ్ర కలకలం రేగింది. వారి నుంచి సేకరించిన శాంపిళ్లను ల్యాబ్‌లకు పంపించారు. చివరకు వారికి డెల్టా వేరియంట్ సోకినట్లు తేలడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వరకు దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 94 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో ఇద్దరికే కరోనా సోకింది. ‘భయపడాల్సిన పని లేదు. వారిని క్వారంటైన్లో ఉంచారు’ అని బెంగళూరు రూరల్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ స్పష్టంచేశారు. (చదవండి: నీవే నా దేవత.. భార్యకు విగ్రహం) -
కోవిడ్ చికిత్సకు మోనోక్లోనల్ యాంటీబాడీలు భేష్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) డెల్టా రూపాంతరితాన్ని కూడా నియంత్రించగల మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స సమర్థతను ధ్రువీకరించింది. దాదాపు 285 మందిపై జరిపిన అధ్యయనం ద్వారా ఈ చికిత్స తేలికపాటి, మధ్యస్థాయి కోవిడ్ రోగుల సమస్యలు ముదరకుండా, ఆసుపత్రి పాలవకుండా కాపాడుంతుందని, మరణాలను 100 శాతం అడ్డుకుంటుందని తెలిసింది. సీసీఎంబీ, డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనం వివరాలను ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే ఈ చికిత్స అందరికీ ఇవ్వడం సరికాదని చెప్పారు. గుండెజబ్బు, మధుమేహం వంటివి ఉన్న వారికి కోవిడ్ వచ్చే అవకాశమూ, లక్షణాలు వేగంగా ముదిరిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారికే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కల్పించడం మేలని స్పష్టం చేశారు. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్ దాదాపు రూ. 65 వేల వరకూ ఉంటుందని, తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి, ప్రమాదం లేని వారికి అనవసరంగా ఈ ఇంజెక్షన్లు ఇవ్వరాదన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ఈ యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఇంజెక్షన్ తీసుకుంటే కోవిడ్ నుంచి 3 నెలలపాటు రక్షణ లభిస్తుందని... కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కోవిడ్ బారిన పడి మిగిలిన వాళ్లకు సోకే ప్రమాదం ఉంటే అప్పుడు ఈ ఇంజెక్షన్ తీసుకోవాలని సూచించారు. 3 నెలల తరువాత వ్యాక్సిన్ తీసుకోవడం మేలని తెలిపారు. యాంటీబాడీలు పనిచేసేదిలా... మానవ కణాల నుంచి సేకరించి వృద్ధి చేసిన యాం టీబాడీలే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీలు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీ రోష్ రీజెన్ కోవ్ పేరుతో ఈ యాంటీబాడీ మిశ్రమాన్ని తయారు చేసింది. ఈ ఏడాది మేలో కేంద్రం మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు అనుమతులిచ్చింది. ఫలితంగా వైరస్ కణంలోకి ప్రవేశించేందుకు వీల్లేకుండా పోతుంది. ట్రంప్ తీసుకున్న మందే... కోవిడ్ వచ్చిన తొలినాళ్లలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రయోగాత్మక మందే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ. అప్పట్లో దీనిపై తగిన శాస్త్రీయ పరిశోధనలేవీ జరగలేదు. మోనోక్లోనల్ యాంటీబాడీలు కోవిడ్‌ను ఎదుర్కోగలవని కొన్ని అధ్యయనాలు తెలిపినప్పటికీ డెల్టా రూపాంతరితంపై ఎలాంటి పరిశోధనలూ లేవు. ఏఐజీకి చెందిన ఏసియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ నేతృత్వంలో తాము పరిశోధన మొదలుపెట్టామని, ఏఐజీ ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగుల్లో 288 మందిని రెండు గుంపులుగా విడదీసి ప్రయోగాలు చేశామని డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారిలో 208 మందికి రెండు రకాల మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వారికి రెమిడెస్విర్ మందు ఇచ్చామని చెప్పారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 98 శాతం మంది డెల్టా రూపాంతరిత బాధితులు. వారం తరువాత యాంటీబాడీ చికిత్స పొందిన 78 శాతం మందిలో లక్షణాలు తగ్గగా రెమిడెస్విర్ తీసుకున్న వారిలో ఈ సంఖ్య 50 శాతంగా ఉంది. వారం తరువాత యాంటీబాడీ చికిత్స పొందిన వారు ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ కాగా, రెమిడెస్విర్ తీసుకున్నవారిలో 52 శాతం మంది పాజిటివ్‌గానే ఉన్నారు. యాంటీబాడీలు తీసుకున్నవారిలో కోవిడ్ అనంతర ఇబ్బందులేవీ కనిపించలేదని, ఒక్కరిలోనూ లక్షణాలు తీవ్రం కావడం లేదా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు. అందరికీ కాదు... మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కోవిడ్ నుంచి తేరుకునేందుకు ఉపయోగపడుతున్నప్పటికీ ఇది అందరికీ ఇవ్వడం సరికాదని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. అధికుల్లో కోవిడ్ లక్షణాలేవీ కనపడవని, బయటపడ్డ వారిలోనూ అతికొద్ది మందే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని గుర్తుచేశారు. గుండెజబ్బు, మధుమేహం వంటివి ఉన్న వారికి కోవిడ్ వచ్చే అవకాశమూ, లక్షణాలు వేగంగా ముదిరిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారికే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కల్పించడం మేలని స్పష్టం చేశారు. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్ దాదాపు రూ. 65 వేల వరకూ ఉంటుందన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ఈ యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రమాదం ఉంటే అప్పుడు ఈ ఇంజెక్షన్ తీసుకోవాలని సూచించారు. 3 నెలల తరువాత వ్యాక్సిన్ తీసుకోవడం మేలని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స ఎవరికి? 65 ఏళ్ల పైబడ్డ వారికి ఊబకాయం (బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువ ఉన్న వారు) గర్భిణులు కిడ్నీ వ్యాధులు ఉన్న వారు (క్రానిక్ కిడ్నీ డిసీజ్) మధుమేహం ఉన్న వారికి రోగనిరోధక వ్యవస్థను అణచివేసే మందులు వాడేవారు. గుండెజబ్బులు ఉన్న వారు లేదా అధిక రక్తపోటు కలిగిన వారు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి సికిల్ సెల్ అనీమియా బాధితులు సెరెబ్రల్ పాల్సీ వంటి నాడీ అభివృద్ధి సమస్యలు ఉన్న వారికి ఎప్పుడు ఇవ్వాలి? ఆర్టీ–పీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలిన మూడు నుంచి ఏడు రోజుల్లోపు. లేదా లక్షణాలు కనిపించిన ఐదవ రోజు లోపు. రెండింటిలో ఏది ముందైతే దానికి అనుగుణంగా ఈ మందు తీసుకోవాలి. ఆక్సిజన్ అవసరం ఏర్పడ్డ వారు లేదా కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి ఈ చికిత్స ఇవ్వవచ్చా? అన్న అంశంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. వివరాలు త్వరలో ప్రచురితం కానున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేందుకు కనీసం 45 రోజుల సమయం పడితే.. మోనోక్లోనల్ యాంటీబాడీలతో వెంటనే ప్రభావం కనపడుతుంది. -
చైనాలో డెల్టా వేరియెంట్ భయం
బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా కేసులు అధికమైపోతున్నాయి. డెల్టా వేరియెంట్‌తో కేసుల వ్యాప్తి పెరుగుతోంది. గత వారం రోజుల్లో 11 ప్రావిన్స్‌లలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. 40 లక్షల జనాభా కలిగిన లాన్‌జువో నగరంలో అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని చైనా స్పష్టం చేసింది. చైనాలో ఇప్పటికే 75 శాతానికి పైగా ప్రజలకు రెండు డోసులు కరోనా టీకా ఇవ్వడం పూర్తయింది. అయినా కొత్త కేసులు రావడం ఆందోళన పుట్టిస్తోంది. జీరో కోవిడ్ లక్ష్యంతో ముందుకు వెళుతున్న చైనా... ఇలా కేసులు పెరిగిపోవడంతో ఉలిక్కిపడుతోంది.అందుకే ఒకట్రెండు కేసులు కనిపించినా కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. లాన్‌జువాలో 6 కేసులు బయటపడగానే అప్రమత్తమై లాక్డౌన్ విధించింది. 24 గంటల్లో 29 కేసులు వెలుగులోకి వస్తే అందులో లాన్‌జువాలో 6 కేసులు నమోదయ్యా యి. (చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు) పకడ్బందీగా కరోనా పరీక్షలు మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే చైనాలో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ జీరో కోవిడ్ లక్ష్యం వైపు వెళుతున్న చైనా ఎక్కడా రాజీపడడం లేదు. షాంఘైకి చెందిన ఒక జంట ఇటీవల పలు ప్రావిన్స్‌ల్లో పర్యటించింది. వారితో కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా సోకడంతో ప్రభు త్వం పరీక్షలు భారీగా నిర్వహిస్తోంది. (చదవండి: Afghan Baby Girl Sell: తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం )