
బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా కేసులు అధికమైపోతున్నాయి. డెల్టా వేరియెంట్‌తో కేసుల వ్యాప్తి పెరుగుతోంది. గత వారం రోజుల్లో 11 ప్రావిన్స్‌లలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. 40 లక్షల జనాభా కలిగిన లాన్‌జువో నగరంలో అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని చైనా స్పష్టం చేసింది. చైనాలో ఇప్పటికే 75 శాతానికి పైగా ప్రజలకు రెండు డోసులు కరోనా టీకా ఇవ్వడం పూర్తయింది.
అయినా కొత్త కేసులు రావడం ఆందోళన పుట్టిస్తోంది. జీరో కోవిడ్ లక్ష్యంతో ముందుకు వెళుతున్న చైనా... ఇలా కేసులు పెరిగిపోవడంతో ఉలిక్కిపడుతోంది.అందుకే ఒకట్రెండు కేసులు కనిపించినా కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. లాన్‌జువాలో 6 కేసులు బయటపడగానే అప్రమత్తమై లాక్‌డౌన్ విధించింది. 24 గంటల్లో 29 కేసులు వెలుగులోకి వస్తే అందులో లాన్‌జువాలో 6 కేసులు నమోదయ్యా యి.
(చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు)
పకడ్బందీగా కరోనా పరీక్షలు
మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే చైనాలో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ జీరో కోవిడ్ లక్ష్యం వైపు వెళుతున్న చైనా ఎక్కడా రాజీపడడం లేదు. షాంఘైకి చెందిన ఒక జంట ఇటీవల పలు ప్రావిన్స్‌ల్లో పర్యటించింది. వారితో కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా సోకడంతో ప్రభు త్వం పరీక్షలు భారీగా నిర్వహిస్తోంది.
(చదవండి: Afghan Baby Girl Sell: తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం )
Comments
Please login to add a commentAdd a comment