
బెంగళూరు: దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల బెంగళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా సోకిందన్న వార్త నగరంలో సంచలనం సృష్టించింది. వారికి ఒమిక్రాన్ వేరియంట్ రకం కరోనా వైరస్ సోకిందా ? అనే అనుమానంతో తీవ్ర కలకలం రేగింది. వారి నుంచి సేకరించిన శాంపిళ్లను ల్యాబ్‌లకు పంపించారు.
చివరకు వారికి డెల్టా వేరియంట్ సోకినట్లు తేలడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వరకు దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 94 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో ఇద్దరికే కరోనా సోకింది. ‘భయపడాల్సిన పని లేదు. వారిని క్వారంటైన్‌లో ఉంచారు’ అని బెంగళూరు రూరల్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ స్పష్టంచేశారు.
(చదవండి: నీవే నా దేవత.. భార్యకు విగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment