domination
-
Miss World 2024 Photos: అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సెలబ్రిటీల డామినేషన్ (ఫోటోలు)
-
ప్రపంచ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న భారత సంతతి నేతలు
భారత సంతతికి చెందిన పలువురు నేతలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో దేశం చేరింది. సింగపూర్ నూతన అధ్యక్షునిగా భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం బాధ్యతలు చేపట్టారు. ఫలితంగా ప్రపంచంలోని పలు దేశాల రాజకీయాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారతీయ మూలాలు కలిగిన నేతల జాబితాలో షణ్ముగరత్నం చేశారు. షణ్ముగరత్నం 70 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఆయన సింగపూర్ తొమ్మిదవ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. షణ్ముగరత్నం పదవీకాలం ఆరు సంవత్సరాలు. పెరుగుతున్న భారత సంతతినేతల ప్రభావం సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ నూతన అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం అభినందించారు. ప్రపంచ స్థాయిలో ఉన్నత పదవికి ఎన్నికైన భారతీయ వారసత్వానికి చెందిన అనేక మంది నాయకులలో థర్మన్ షణ్ముగరత్నం కూడా చేరారని ఆయన అన్నారు. షణ్ముగరత్నం విజయం ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల ప్రభావానికి ప్రతీక అని లూంగ్ అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో భారత సంతతి నేతలు.. 1. అమెరికాలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీకి పెరుగుతున్న ప్రభావం కమలా హారిస్ విజయంతో స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాకు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ సంతతికి చెందిన హారిస్ నియమితులయ్యారు. దీనికి ముందు ఆమె 2017 నుండి 2021 వరకు కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. డెమొక్రాట్ అయిన హారిస్ 2011 నుండి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా కూడా పనిచేశారు. ఆమె కాలిఫోర్నియాలో ఇండియన్, జమైకన్ తల్లిదండ్రులకు జన్మించారు. 2. అమెరికా మధ్యంతర ఎన్నికలలో అధికార డెమొక్రాట్ పార్టీ నుండి ఐదుగురు భారతీయ మూలాలు కలిగిన నేతలు తమ హవా చాటారు. వారిలోరాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, శ్రీ తానేదార్ ఉన్నారు. వీరు యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: 10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం! 3. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన చెందిన ప్రముఖ రాజకీయ నేత హర్మీత్ ధిల్లాన్ ఇటీవలే రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) చైర్మన్ ఎన్నికలలో పోటీ చేశారు. 4. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి నేతలు వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. 5. రిషి సునాక్ గత ఏడాది బ్రిటన్‌కు మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి అయ్యారు. గోవాకు చెందిన సుయెల్లా బ్రేవర్మన్ అతని హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. బ్రేవర్మాన్ తర్వాత సునాక్ క్యాబినెట్లో గోవా మూలాలు కలిగిన రెండవ మంత్రి క్లైర్ కౌటిన్హో. కౌటిన్హో ఇటీవలే నూతన ఎనర్జీ సెక్యూరిటీ, నెట్ జీరో సెక్రటరీగా ప్రమోషన్ అందుకున్నారు. 6. సునాక్ కంటే ముందు ప్రీతి పటేల్.. బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో హోం సెక్రటరీగా ఉన్నారు. జాన్సన్ క్యాబినెట్లో అలోక్ శర్మ అంతర్జాతీయ అభివృద్ధి కార్యదర్శిగా వ్యవహరించారు. 7. ఐర్లాండ్ ప్రధాన మంత్రి లియో ఎరిక్ వరద్కర్ కూడా భారతీయ సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. వరద్కర్.. అశోక్, మిరియం వరద్కర్ దంపతుల మూడవ సంతానం. ఎరిక్ వరద్కర్ తండ్రి ముంబైలో జన్మించారు. 1960లలో యునైటెడ్ కింగ్డమ్కు తరలి వెళ్లారు. 8. ఆంటోనియో కోస్టా 2015 నుండి పోర్చుగల్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను సగం భారతీయుడు.. సగం పోర్చుగీస్. 9. కెనడాలో ఫెడరల్ మంత్రి అయిన మొదటి హిందువు అనితా ఆనంద్. ఆనంద్ ఈ ఏడాది జూలైలో ట్రెజరీ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు. తండ్రి తమిళనాడు, తల్లి పంజాబ్‌కు చెందినవారు. 10. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన సభ్యులు కూడా ఉన్నారు. వారు హర్జిత్ సజ్జన్, కమల్ ఖేరా. 11. ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్‌లో మంత్రి అయిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. మలయాళీ తల్లిదండ్రులకు చెన్నైలో జన్మించిన ఆమె ప్రస్తుతం కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్‌కు మంత్రిగా ఉన్నారు. 12. ట్రినిడాడ్, టొబాగో అధ్యక్షునిగా ఎన్నికైన క్రిస్టీన్ కార్లా కంగాలూ.. ఇండో-ట్రినిడాడియన్ కుటుంబంలో జన్మించారు. 13. భారత సంతతికి చెందిన న్యాయవాది, రచయిత ప్రీతమ్ సింగ్ 2020 నుండి సింగపూర్‌లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. 14. దేవానంద్ శర్మ 2019లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా నిలిచారు. 15. గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ లియోనోరాలో ముస్లిం ఇండో-గయానీస్ కుటుంబంలో జన్మించారు. 16. ప్రవింద్ జుగ్నాథ్ జనవరి 2017 నుండి మారిషస్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను 1961లో హిందూ యదువంశీ కుటుంబంలో జన్మించారు. అతని ముత్తాత 1870లలో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి మారిషస్‌కు వలస వెళ్లారు. 17. 2019 నుండి మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్ భారతీయ ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. 18. చంద్రికాప్రసాద్ సంతోఖి 2020 నుండి సురినామ్ అధ్యక్షుడిగా ఉన్నారు. సంతోఖి 1959లో లెలీడోర్ప్‌లో ఇండో-సురినామ్ హిందూ కుటుంబంలో జన్మించారు. 19. వేవెల్ రాంకలవాన్ అక్టోబర్ 2020 నుండి సీషెల్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతని తాత బీహార్‌కు చెందినవారు. భారతీయ వారసత్వానికి చెందిన 200 మందికి పైగా నాయకులు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో ప్రజా సేవలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఇండియాస్పోరా గవర్నమెంట్ లీడర్స్ లిస్ట్ తెలియజేస్తోంది. వీరిలో 60 మందికిపైగా నేతలు కేబినెట్ పదవుల్లో ఉన్నారు. ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు అందించే 12 ప్రయోజనాలివే! -
Bihar Politics: నితీశ్‌లో ఎందుకీ అసంతృప్తి?
బిహార్‌లో బీజేపీ, జేడీ(యూ) బంధం బీటలుబారుతోంది. రెండు పార్టీల మధ్య తెగతెంపులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై తనని కూర్చోబెట్టినప్పటికీ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఎక్కువ ఉండడంతో కమలదళం తమపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని సీఎం నితీశ్ కుమార్ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు.ప్రభుత్వం నడపడానికి ఆయనకి ఎప్పుడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోగా, తనకున్న జనాదరణను బీజేపీ బలపడడానికి వినియోగించుకుంటోందని ఆయన అసహనంతో రగిలిపోతున్నారు. 2025 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సొంత పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చెయ్యాలని భావిస్తూ దానికి అనుగుణంగా కమలదళం వ్యూహాలు రచిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన పదవికి ఎసరు తప్పదన్న అంచనాలు నితీశ్‌లో అసంతృప్తి రాజేస్తున్నాయి. స్పీకర్‌తో కయ్యం బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ సిన్హాను ఆ పదవి నుంచి తొలగించాలని చూసి నితీశ్ కుమార్ భంగపడ్డారు. అప్పట్నుంచి ఇరు పార్టీల నడుమ పోరు మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత జేడీ(యూ) నుంచి ఆర్సీపీ సింగ్ ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడం నితీశ్‌కి రుచించలేదు. ఆ పదవి కూడా ఆర్సీపీ సింగ్‌కు బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే వచ్చింది.దీంతో గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆర్సీపీ సింగ్‌ను మరోసారి పెద్దల సభకు పంపడానికి నితీశ్ నిరాకరించడంతో ఆయన కేంద్ర మంత్రి పదవిని వీడాల్సి వచ్చింది. సింగ్‌కున్న ఆస్తులపైన కూడా జేడీ(యూ) వివరణ కోరింది. దీంతో ఆర్సీపీ సింగ్ పార్టీని వీడుతూ జేడీ(యూ) మునిగిపోతున్న నౌక అని, నితీశ్ అసూయతో రగిలిపోతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్)కి చెందిన చిరాగ్ పాశ్వాన్ బహిరంగంగానే నితీశ్‌ను దుయ్యబట్టడం వంటివన్నీ రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. గైర్హాజరు పర్వం..బీజేపీ నాయకత్వం తీరుపై తన అసంతృప్తిని నితీశ్ కుమార్ ఎక్కడా దాచుకోవడం లేదు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో నితీశ్ పాలుపంచుకోలేదు. ఆదివారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారు. జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా ఉండిపోయారు.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు పలుకుతూ జూలై 22న ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు సైతం హాజరుకాలేదు. మూడు రోజుల తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పాల్గొనలేదు. చాలారోజులుగా బీజేపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కులాల వారీగా జనగణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్ పథకం వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
తగ్గుతున్న డాలరు ఆధిపత్యం
రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలనే వాంఛ అమెరికా మిత్ర దేశాలకు ఎప్పటి నుండో ఉండగా ఉక్రెయిన్ యుద్ధం కలిసొచ్చింది. విదేశీ బ్యాంకుల్లో 80,000 కోట్ల డాలర్లకు పైగా ఉన్న రష్యా నగదు నిల్వలపై ఆంక్షలు విధించి జప్తు చేయనారంభించి, ‘స్విఫ్ట్’ వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించటంతో కంపెనీల జమాఖర్చుల లావాదేవీలు నిలిచిపోతున్నాయి. రూబుల్ విలువ పడిపోతున్న సమ యంలో, పుతిన్ ఎత్తుగడతో, మార్చి 24న రష్యా రూబుల్ తోనే తమ చమురు, గ్యాస్‌కు చెల్లించాలని ప్రపంచ దేశాలకు అల్టిమేటం జారీ చేశాడు. దీంతో ముఖ్యంగా యూరప్ దేశా లైన జర్మనీ, ఫ్రాన్స్ ఇరకాటంలో పడ్డాయి. అమెరికా ఏకంగా తాను తీసుకొన్న గోతిలో తానే పడిపోయినంత వ్యథ చెందు తున్నది. ప్రపంచంలో 12 శాతం ముడి చమురును ఉత్పత్తి చేస్తూ యూరపు దేశాలకు అవసరమగు 40 శాతం పైగా ఇంధనాన్ని రష్యా ఎగుమతి చేస్తుంది. ఫ్రాన్స్ మాక్రోన్, జర్మన్ షోల్జ్లు రూబుల్ కరెన్సీ మారకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందాల ప్రకారం యూరోలో లేదా డాలరులో చెల్లిస్తామంటున్నారు. చెల్లిం పుల మొత్తం ఎలానూ స్విఫ్ట్ ద్వారా రష్యా ఖాతాల్లోకి జమ కాదు, అలా జరిగినా బ్యాంకుల్లోని నిల్వలను స్తంభింప జేస్తారు. పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ ప్రెస్కోవ్ మాత్రం రూబుల్ చెల్లింపులతోనే గ్యాసు, ఆయిల్ పంపిస్తామనీ, చారిటబుల్ సంస్థను నడపటం లేదనీ నిర్మొహమాటంగా స్పందించాడు. యుద్ధం ముందు ఒక డాలరుకు 75 రూబుళ్లు ఉన్న మారకపు విలువ, ఆంక్షలతో 145కు చేరి, ప్రస్తుతానికి 95 రూబుళ్లతో స్థిరత్వం దిశగా పయనిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా, చైనాల మధ్య ముడి చమురు వాణిజ్యం యువాన్లతో జరపటానికి సౌదీ అంగీ కరించింది. చైనా ఇంధన అవసరాలను 25 శాతం వరకూ సౌదీ అరేబియా తీరుస్తుంది. యువాన్‌లో సౌదీ లావాదేవీలు జరిపితే చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటం, డాలరు ప్రాధాన్యత తగ్గటం ఒకేసారి జరుగుతుంది. ఇప్పటికే రష్యా, చైనా యువాన్ వాణిజ్యానికి ముందుకొచ్చాయి. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షేక్ మొహమ్మద్ నహ్వాన్ ఇద్దరూ వైట్‌హౌస్ నుండి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు స్పందించలేదంటే మధ్య ప్రాచ్యంలో డాల రుతో పాటుగా అమెరికా ఎంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కో నుందో అర్థమవుతుంది. డాలరు ఆధిపత్య వ్యతిరేక పోరులో నేను సైతం అంటూ భారత్ ముందుకు వస్తోంది. రష్యాతో లోగడ కుది రిన ఒప్పందం ప్రకారం తక్కువ ధరకు ముడి చమురును భారత్ దిగుమతి చేసుకొంటున్నది. రష్యా భారత్ మధ్య ఇకపై రూబుల్–రూపాయి వాణిజ్యం జరగనుందని వార్తలొస్తున్నాయి. వీరికి తోడు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక దేశాలు ఈ బాటనే అనుకరించటానికి సిద్ధంగా ఉన్నాయి. 1944లో న్యూహాంషైర్ బ్రెట్టన్ ఉడ్స్‌లో 44 సభ్యదేశాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను, ప్రపంచ బ్యాంకులను స్థాపించి బంగారు నిల్వల ఆధారంగా అమెరికా డాలరును అంతర్జాతీయ కరెన్సీగా ప్రకటించాయి. 1971లో బంగారు నిల్వలు అమెరికా దగ్గర లేకపోవటంతో అమెరికాకు ముడి చమురును ఎగుమతి చేయబోమని అరబ్ దేశాలు ప్రక టించాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. మరలా నిక్సన్ షాక్ పేరిట ఫ్లోటింగ్ డాలరు రూపాంతరం చెంది, ఇప్పటివరకూ వాల్‌స్ట్రీట్‌లోని తన అనుకూల ఫారిన్ ఎక్స్ఛేంజ్ విభాగంతో ప్రపంచ కరెన్సీలతో తనకు అను కూలంగా కరెన్సీ మార్పిడులను చేస్తోంది. కృత్రిమ డాలరు మార్పిడీకి వ్యతిరేకంగా ఫ్రాన్స్, జర్మనీ 1970 ప్రాంతంలోనే బ్రెట్టెన్ ఉడ్ సిస్టమ్ నుండి తప్పుకొని బలపడ్డాయి. డాలరు మార్పిడీలతో అనేక దేశాలు బలవు తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నిటితో (మెక్సికోతో తప్ప) అమెరికా వాణిజ్య లోటుతో, సుమారు 25 లక్షల కోట్ల డాలర్ల రుణంతో ఉన్నా, తన చేతిలోని వాల్‌స్ట్రీట్ ఊహాజనిత ద్రవ్య పెట్టుబడులతో, ఫోరెక్స్ మారకాన్ని కృత్రిమంగా నడుపుతూ, ఆయుధ అమ్మకాలతో, కృత్రిమ మేధో సంపత్తితో జూదమాడుతోంది. డాలరుకు ప్రత్యమ్నాయంగా వాణిజ్యం చేయగలిగిననాడు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్న డాలరు ఆధిపత్యం పతనంగాక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
అంతరిక్షంలో ఆధిపత్య పోరు
భూమిపై దేశాల మధ్య రాజకీయాలు నింగికి పాకుతున్నాయి. పలు అంశాల్లో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా తాజాగా అంతరిక్షంలో ఆధిపత్య పోరుకు తెర తీసింది. దీంతో ఒకప్పుడు సోవియట్ యూనియన్– అమెరికా మధ్య ఉన్న పోటీ మరోమారు చైనా– యూఎస్ రూపంలో అంతరిక్షంలో కనిపించనుంది. అగ్రరాజ్య హోదా కోసం తహతహలాడుతున్న చైనా తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు అన్ని రంగాల్లో విపరీతంగా శ్రమిస్తోంది. ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రాబల్యమున్న వివిధ అంశాల్లో కాలు మోపి ఉనికి చాటుకోవాలని యత్నిస్తోంది. తాజాగా అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. యూఎస్ఎస్ఆర్ (సోవియట్ రిపబ్లిక్) కుప్పకూలక ముందువరకు అమెరికాతో ఇదే తరహా పోటీ చూపేది. అయితే సోవియట్ పతనానంతరం ప్రపంచం ఏక ధ్రువ ప్రపంచంగా మారిపోయింది. సోవియట్ వదిలి వెళ్లిన ఖాళీని పూడ్చేందుకు చైనా రంగంపైకి వచ్చింది. ఈ క్రమంలో 2021లో అంతరిక్ష ప్రయోగాల పరంగా చైనా అదరగొట్టింది. గత ఏడాది చైనా మొత్తం 55 అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టగా అమెరికా 51తో సరిపుచ్చుకుంది. 2030 నాటికి కుజుడు (మార్స్)పైకి ఉపగ్రహాన్ని పంపి శాంపిళ్లను తీసుకువస్తామని తాజాగా చైనా లూనార్ ప్రోగ్రామ్ డిజైనర్ వూ వైరెన్ ప్రకటించారు. అంతటితో తమ యత్నాలు ఆగవని, సౌర వ్యవస్థలో ఇప్పటివరకు వెళ్లని దూరాలను అన్వేషిస్తామని చెప్పారు. ఇప్పటికే చైనా చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపి అక్కడి నుంచి శాంపిళ్లను విజయవంతంగా తీసుకువచ్చింది. ఇదే తరహాలో మార్స్ మిషన్ పూర్తి చేస్తామని వూ చెప్పారు. చంద్ర మిషన్‌తో పోలిస్తే మార్స్ మిషన్ క్లిష్టమైనదని, ముందుగా శక్తివంతమైన లాంచ్ వాహనాన్ని రూపొందించాల్సి ఉందని చెప్పారు. మేమే ముందు.. మార్స్‌పైకి మనిషిని పంపే ప్రణాళికకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను గత ఏడాది చైనా విడుదల చేసింది. 2033– 2043 కాలంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పించినట్లు ప్రకటించింది. 2020లోనే చైనా గ్రహాంతరయానానికి తొలిమెట్టు అయిన టియాన్వెన్ –1 ప్రోబ్‌ను ప్రయోగించింది. ఈ ప్రోబ్ 2021లో మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. మే నెలలో ఈ ప్రోబ్ నుంచి జురాంగ్ అనే రోవర్‌ను కుజుడి ఉపరితలంపైకి దించారు. ఈ రోవర్ నిర్ధేశిత పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో రష్యా, అమెరికా తర్వాత మార్స్‌పైకి రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఈ ధైర్యంతో రాబోయే ఎనిమిది సంవత్సరాల్లో కుజుడి ఉపరితలం నుంచి శాంపిళ్లను తెచ్చేందుకు చైనా యత్నిస్తోంది. 2020లో అమెరికా తన సొంత మార్స్ మిషన్‌ను చేపట్టింది. 2021లోనే మార్స్ పైకి అమెరికా రోవర్ దిగింది. ఇప్పటివరకు ఈ రోవర్ ఏడు శాంపిళ్లను సేకరించింది. యూరోపియన్ యూనియన్ స్పేస్ కమిషన్‌తో కలిసి ఈ శాంపిళ్లను 2031 నాటికి భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చైనా 2030లో శాంపిళ్లను తెస్తామని ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా కన్నా ముందుగా కుజుడి శాంపిళ్లను తీసుకురావడం ద్వారా అంతరిక్ష ఆధిపత్య పోరులో ముందంజలో ఉండాలన్నది చైనా భావన. అంతరిక్ష దౌత్యం ప్రస్తుతం భూమిపైన ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తోంది. దీన్ని అంతరిక్షంలోకి తీసుకుపోవాలని చైనా భావిస్తోంది. రాబోయే రోజుల్లో అంతరిక్షంపై ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాకు భిన్నంగా అంతరిక్ష దౌత్య మార్గం ద్వారా ఆధిపత్యం సాధించాలని చైనా యోచిస్తోంది. ఇందులో భాగంగా తన స్పేస్ ప్రోగ్రామ్స్‌లో ఇతర దేశాలకు అవకాశాలు ఇస్తోంది. చైనా నిర్మించే స్పేస్ స్టేషన్ పూర్తయితే ఇతర దేశాల వ్యోమగాములకు అవకాశాలు కల్పించడం ద్వారా పటిష్టమైన అంతరిక్ష దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలన్నది చైనా భావనగా ఆ దేశానికి చెందిన చైనా డైలీన్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. ఇది చైనాకు మంచి ప్రజాసంబంధాల వారధి (పబ్లిక్ రిలేషన్స్–పీఆర్)గా పనిచేస్తుందని తెలిపింది. అంతరిక్ష దౌత్యంలో భాగంగా చిన్న దేశాలకు కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించి ఇవ్వడం, తన దగ్గర ఉన్న ఉపగ్రహ డేటాను ఆయా దేశాలతో పంచుకోవడం వంటి చర్యలను చైనా చేపట్టింది. అయితే ఇలాంటి ఆధిపత్య పోరు కన్నా గతంలో సోవియట్, అమెరికా కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించినట్లు చైనా, అమెరికా సంయుక్తంగా పనిచేయడం ప్రపంచం అంతటికీ మేలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాదే పైచేయి 2021లో చైనా అంతరిక్ష ప్రదర్శనల్లో అదరగొట్టింది. కానీ ఇప్పటికీ అంతరిక్షంపై అమెరికా ఆధిపత్యమే నడుస్తోంది. ప్రస్తుతం భూమి చుట్టూ దాదాపు 4,500 కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతుంటే వాటిలో 2,700 ఉపగ్రహాలు అమెరికాకి చెందినవే ఉన్నాయి. అటు చైనా ఉపగ్రహాల సంఖ్య దాదాపు 400 మాత్రమే. అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన రాకెట్లున్నాయి. ఇటీవల కాలంలో చైనా అంతరిక్షంపై పెట్టుబడులను పెంచుతూ వచ్చింది. 2020 నాటికి ఈ రంగానికి చైనా సుమారు 890 కోట్ల డాలర్ల నిధులు కేటాయించింది. కానీ అదే సమయంలో అమెరికా అంతరిక్ష ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు ఏకంగా 4,800 కోట్ల డాలర్లు కావడం విశేషం. అమెరికాలో స్పేస్ ఎక్స్‌లాంటి పలు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షరంగ సంస్థలు ప్రభుత్వానికి దీటుగా అంతరిక్ష ప్రాజెక్టులు చేపడుతున్నాయి. చైనాలో అంతటిస్థాయి ప్రైవేటు అంతరిక్ష కంపెనీలు ఏర్పడలేదు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు!
జైపూర్: దళితులు,వెనుక బడిన వర్గాలపై అఘాయిత్యాలు.. వివక్షతలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఇప్పటికి కొన్నిచోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాజస్తాన్‌లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్తాన్‌లోని చురులోని రుఖాసర్ గ్రామానికి చెందిన.. 25 ఏళ్ల రాకేష్ మేఘ్వాల్ని కొంత మంది వ్యక్తులు అతని ఇంటి నుంచి అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారంతా కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత.. అదే బాటిల్లో మూత్రవిసర్జన చేసి బాధితుడితో బలవంతంగా తాగించారు. అయితే, వీరిమధ్య పాతకక్ష్యల నేపథ్యంలో ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జనవరి 26 న జరిగింది. బాధితుడిని రాత్రి 11ల ప్రాంతంలో.. బలవంతంగా కిడ్నాప్ చేసి పొలాల్లోనికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ మద్యం తాగారు. బాధితుడిని విచక్షణ రహితంగా కొట్టి, అతనిచేత మూత్రం తాగించారు. వారి ఆధీపత్యం చూపించుకోవడానికి ఇలా క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మేఘ్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం.. ఉమేష్, బీర్బల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వీరిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు రతన్‌గఢ్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ తెలిపారు. Rajasthan | A Dalit man was allegedly abducted, beaten, & forced to drink urine by some men in Churu. Two people have been arrested& other accused will be arrested soon: Jagdish Prasad Bohra, Addl Superintendent of police, Churu The incident took place on Jan 26, police said pic.twitter.com/nWanMTDkoy — ANI (@ANI) January 30, 2022 చదవండి: రాహుల్‌కు.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి -
కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక
వాహింగ్టన్: గత యేడాది మారణహోమం సృష్టించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ శర వేగంతో వ్యాప్తి చెందే అవకాశం ఉందని యూఎస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గురువారం వెల్లడించింది. అమెరికాలోని మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయని ఈ సందర్భంగా సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. యూఎస్ దేశ వ్యాప్తంగా 96 శాతం మెజార్టీ కేసులన్నీ డెల్లా ఫ్లస్కు చెందినవి కాగా, 3 కంటే ఎక్కువ శాతం కేసులు ఒమిక్రాన్‌కు చెందినవని ఆయన తెలిపారు. 75 దేశాల్లోని 36 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయని, కేవలం రెండు రోజుల వ్యవధిలో కొత్త వేరియంట్ కేసులు రెట్టంపయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా యూఎస్ నేషనల్ జినోమిక్ సీక్వెన్సింగ్ అనాలిసిస్ డేటాను సీడీజీ విడుదల చేసింది. వారాల వ్యవధిలోనే ఒమిక్రాన్ విజృంభణ కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కోవిడ్ డెల్టా ప్లస్‌ను డామినెట్ చేసే ఆధిపత్య జాతిగా పురోగమిస్తుందని యూఎస్ సీడీసీ నివేదించింది. మరోవైపు ఈయూ/ఈఈఏ దేశాల్లో 2022 మొదటి రెండు నెలల్లో ఒమిక్రాన్ వీఓసీ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, పండుగ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్! #WATCH | US Centers for Disease Control and Prevention (CDC) Director Rochelle Walensky said, "...Early data suggest that Omicron is more transmissible than Delta, with a doubling time of about two days." pic.twitter.com/RbbLoaQ3Nk — ANI (@ANI) December 15, 2021 -
‘పరిధి’ మార్చి మా అధికారాల్లోకి తలదూర్చొద్దు
కోల్‌కతా: దేశ సరిహద్దు వెంట రాష్ట్ర భూభాగాలపై సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అజమాయిషీ పరిధిని కేంద్రం పెంచిన అంశాన్ని ఢిల్లీలో తేల్చుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టంచేశారు. హస్తిన పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. సరిహద్దు వెంట 15 కి.మీ.లకు బదులుగా 50 కి.మీ.ల పరిధి వరకూ సోదాలు, అరెస్ట్‌లకు బీఎస్ఎఫ్కు అధికారాలు కట్టబెడుతూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మోదీతో భేటీలో లేవనెత్తుతానని మమత చెప్పారు. ‘ బీఎస్ఎఫ్ పరిధిని పెంచి మోదీ సర్కార్ సరిహద్దు రాష్ట్రాలపై తమ అధికారం, ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది’ అని మమత ఆరోపించారు. త్రిపురలో హింసాకాండ, బెంగాల్లో తృణమూల్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ వర్గాల దాడుల అంశాలనూ ప్రధానితో చర్చిస్తానని ఆమె పేర్కొన్నారు. ‘ త్రిపురలో హింసపై మానవహక్కుల సంస్థలు, వామపక్ష సంఘాలు ఇంతవరకూ నోరు మెదపకపోవడం నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది’ అని మమత వ్యాఖ్యానించారు. -
ఆధిపత్యం.. మా విధానం కాదు: చైనా అధ్యక్షుడు
బీజింగ్: ఆగ్నేయ ఆసియాపై ఆధిపత్యాన్ని తాము కోరుకోవడం లేదని చైనా అధినేత షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. పొరుగున్న ఉన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయిస్తూ అదుపులో పెట్టుకోవాలని ఆశించడం లేదని వెల్లడించారు. సోమవారం ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్(అసియాన్) సభ్యుల వర్చువల్ సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ఆసియాన్, చైనా మధ్య సంబంధాలకు 30 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ఆధిపత్యవాదానికి, పవర్ పాలిటిక్స్‌కు చైనా ముమ్మాటికీ వ్యతిరేకమేనని ఉద్ఘాటించారు. పొరుగు దేశాలకు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆగ్నేయ ఆసియాలోని దేశాలన్నీ కలిసి ఈ ప్రాంతంలో శాంతిని కాపాడుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. మరో దేశంపై ఆధిపత్యం చెలాయించడం చైనా విధానం కాదని వివరించారు. దక్షిణ చైనా సముద్రంలో ఇటీవలి కాలంలో డ్రాగన్ దేశం నియంతృత్వ పోకడలపై అసియాన్ సభ్యదేశాలైన మలేషియా, వియత్నాం, బ్రూనై, ఫిలిప్పైన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చట్టాలను చైనా గౌరవించాలి: ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో విధుల్లో ఉన్న జవాన్లకు సరుకులు తీసుకెళ్తున్న ఫిలిప్పైన్స్ పడవలను ఇటీవలే చైనా నౌకలు అడ్డగించాయి. శక్తివంతమైన యంత్రాలతో నీటిని విరజిమ్మడంతో ఫిలిప్పైన్స్ పడవలు వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనను ఆసియాన్ సదస్సులో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ లేవనెత్తారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవించాలని చైనాకు హితవు పలికారు. దక్షిణ చైనా సముద్ర వివాదాలను పరిష్కరించుకోవాలని మలేషియా ప్రధాని యాకోబ్ చెప్పారు. -
టెక్ దిగ్గజాలపై చైనా ఆగ్రహం
China Fines Tech Giants Over Anti-Monopoly Violations: దేశీయ బడా వ్యాపార సంస్థలు తమ కనుసన్నల్లోనే పనిచేయాలనే ఆధిపత్య వైఖరిని చైనా మరోసారి బయటపెట్టుకుంది. ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాల విషయాలను ముందస్తుగా తెలియజేయలేదనే సాకుతో చైనా అక్కడి దిగ్గజ టెక్ సంస్థలపై జరిమానాలను విధించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని, గత ఏనిమిదేళ్లలో జరిగిన 43 సంస్థల కొనుగోళ్ల లావాదేవీల వివరాలను ప్రభుత్వానికి నివేదించని కారణంగా ఈ జరిమానాలు విధిస్తున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది. సంస్థల ఒక్కో ఉల్లంఘనకు రూ.60లక్షల చొప్పున జరిమానా విధించింది. -
సాధికారతలో మరింత వెనక్కి...
మన దేశంలో స్త్రీ, పురుష సమానత్వం గంభీరోపన్యాసాలకే పరిమితమవుతున్నది తప్ప ఆ దిశగా నిర్మాణాత్మకమైన ఆలోచన, ఆచరణ వుండటం లేదని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) నివేదిక కుండబద్దలు కొట్టింది. మరో నాలుగు నెలల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపు కోబోతున్నాం. మన రాజ్యాంగం స్త్రీ, పురుషుల సమానత్వాన్ని ప్రబోధిస్తోంది. సకల రంగాల్లో వారికి అర్ధవంతమైన భాగస్వామ్యం ఇచ్చినప్పుడే దేశ పురోగతి సాధ్యమవుతుందని నేతలు చెబు తుంటారు. తీరా మన ప్రోగ్రెస్ రిపోర్టులు తీసికట్టుగా వుంటాయి. ఏం చెబుతోంది తాజా నివేదిక? భారత్‌లో సమానత్వం ఎండమావేనని దండోరా వేస్తోంది. మహిళలకు ఏ దేశం ఏమేరకు అవకాశాలిస్తున్నదో, ఎక్కడెక్కడ సమానత్వం ఏ స్థాయిలోవుందో తెలుసుకునేందుకు 156 దేశాలను అధ్యయనం చేసిన డబ్ల్యూఈఎఫ్ నివేదిక నిరుటితో పోలిస్తే మన దేశం 28 స్థానాలు కిందకుపోయి 140వ స్థానంలో వున్నదని ప్రకటించింది. ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ(జీజీజీఐ)లో దక్షిణా సియాలో మనకంటే తీసికట్టుగా వున్నవి పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ మాత్రమే! పాకిస్తాన్ 153వ స్థానంలోనూ, అఫ్ఘానిస్తాన్ 156వ స్థానంలోనూ వున్నాయి. అవి రెండూ ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు వుండవు కనుక మనకు ఈ స్థానం పదిలమని, ఇంతకంటే దిగజారే అవకాశం లేదని భావించాలి. విషాదం ఏమంటే సరిగ్గా 50 ఏళ్లక్రితం మన చేయూతతో స్వతంత్ర దేశంగా అవ తరించిన బంగ్లాదేశ్ 65వ స్థానంలో వుంది. ఆఖరికి నేపాల్ సైతం 106వ స్థానంలోవుంది. శ్రీలంక 116, భూటాన్ 130 స్థానాల్లో నిలిచాయి. మహిళల స్థితిగతులు ఎక్కడెలా వున్నాయో నిర్ధారిం చటానికి ప్రధానంగా నాలుగు అంశాలను జీజీజీఐ పరిగణనలోకి తీసుకుంది. ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యం, వారికుంటున్న అవకాశాలు... విద్యలో పురోగతి... ఆరోగ్యం... రాజకీయ సాధి కారతలను ప్రాతిపదికగా తీసుకుని ఈ అంచనాలకొచ్చింది. ఐస్లాండ్ స్త్రీ, పురుష సమానత్వంలో వరసగా 12వసారి అగ్రస్థానంలోవుంది. కరోనా మహమ్మారి భూగోళాన్ని చుట్టుముట్టాక దాదాపు అన్ని దేశాల్లో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. అంతో ఇంతో సాధించిన పురోగతి కాస్తా వెనక్కి వెళ్లింది. అయితే ఈ తిరోగమనం అన్నిచోట్లా ఒకేలా లేదు. కొన్ని దేశాలు ఈ మహమ్మారి సృష్టించిన అవరోధాలను చాలావరకూ తట్టుకోగలిగాయి. ప్రపంచ దేశాల్లో ఇప్పుడున్న పురోగతి ఆధారంగా లెక్కేస్తే స్త్రీ, పురుష సమానత్వం 99.5 ఏళ్లకుగానీ సాధ్యపడదని గతంలో చెప్పిన డబ్ల్యూఈఎఫ్ వర్తమాన పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని దాదాపు 136 ఏళ్ల తర్వాతే సమానత్వం సాధ్యమని తాజాగా అంచనా వేస్తోంది. కరోనా పంజా అనంతరం విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని రకాల పరిశ్రమలు మూతబడి అందరి ఉపాధి దెబ్బతింది. కానీ ఈ ధోరణి స్త్రీ, పురుషులకు సమానంగా లేదు. మగవారితో పోలిస్తే మహిళల ఉపాధి అవకాశాలే తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఆక్స్‌ఫాం నివేదిక లాక్డౌన్ కాలంలో ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలతోపాటు లింగ వ్యత్యాసం కూడా చాలా ఎక్కువుందని తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లోని పరిశ్రమల్లోనూ మారిన పరిస్థితుల్లో వ్యయాన్ని అదుపు చేయటానికి సిబ్బందిని తగ్గించాల్సివస్తే పురుషులకన్నా మహిళలనే అధికంగా తొలగిస్తున్నాయి. కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం తక్కువగా వున్న దేశాల్లో మన దేశం ఒకటి. గతంలో అది 24.8 శాతంగా వుండగా ఇప్పుడది 22.3 శాతానికి తగ్గింది. వృత్తి నైపుణ్యం, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం 29.2 శాతానికి పడిపోయింది. సీనియర్, మేనేజ్మెంట్ పదవుల్లో మహిళలు 14.6 శాతంమంది మాత్రమే. అత్యున్నత స్థాయి సారథ్య పదవుల్లో వారి వాటా కేవలం 8.9 శాతం. ఇక స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం సంగతి చెప్పనవసరమే లేదు. లాక్డౌన్ అనంతరం ఆ వ్యత్యాసం మరింతగా పెరిగింది. పురుషులు పొందే ఆదాయంతో పోలిస్తే మహిళల ఆదాయం అయిదోవంతు మాత్రమే వున్నదని నివేదిక తెలిపింది. ఈ అంశంలో పది అట్టడుగు దేశాల్లో భారత్ కూడా ఒకటి. రాజకీయ రంగంలో మహిళా సాధికారత సాధిస్తే అది సమాజంలో అన్ని రంగాలనూ ప్రభా వితం చేస్తుంది. కానీ మన దేశంలో అది రాను రాను మరింత తగ్గుతున్నదే తప్ప పెరగటం లేదు. పార్లమెంటులో మహిళా భాగస్వామ్యం ఎప్పటిలాగే 14.4 శాతం దగ్గర స్థిరంగా వుండిపోగా, మహిళా మంత్రుల సంఖ్య 2019తో పోలిస్తే బాగా తగ్గిందని డబ్ల్యూఈఎఫ్ నివేదిక తెలిపింది. 2019లో అది 23.1 శాతంకాగా, ఇప్పుడు 9.1 శాతం మాత్రమే. అంటే సమాజానికి ఆదర్శంగా వుండాల్సిన రాజకీయ రంగం మహిళలకు సాధికారత కల్పించటంలో బాగా వెనక్కిపోయిందన్న మాట! చట్టసభల్లో మహిళలకు మూడోవంతు స్థానాలు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు దీర్ఘ కాలంగా మూలనపడింది. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవుల దగ్గరనుంచి స్థానిక సంస్థల సారథ్యం వరకూ మహిళలకు సముచితమైన స్థానం కల్పించారు. విద్యారంగం వరకూ మన దేశం సాధిస్తున్న ప్రగతి మెచ్చదగ్గదిగానే వున్నదని డబ్ల్యూఈఎఫ్ నివేదిక చెబుతోంది. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య రంగాల్లో బాలురు, బాలికల మధ్య అంతరం తగ్గుముఖం పడుతోందని నివేదిక వెల్లడించింది. మహిళా సాధికారత గురించి తరచుగా మాట్లాడే పాలకులు డబ్ల్యూఈఎఫ్ తాజా నివేదిక చూశాకైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అన్ని స్థాయిల్లోనూ లోటుపాట్లు సరిద్దాలి. -
ఫీమేల్ డామినేషన్
వియన్నాః ప్రపంచం వ్యాప్తంగా స్త్రీ వివక్ష గురించి విస్త్రుతంగా చర్చజరుగుతోన్న తరుణంలో ఆస్ట్రియాలో పురుష వివక్ష వార్తల్లోకెక్కింది. లింగ వివక్ష రుజువై ఆస్ట్రియా రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేస్తోన్న పీటర్ ఫ్రాంజ్‌మేయర్ 300,000 పైగా యూరోలను నష్టపరిహారంగా పొందిన విషయాన్ని డై ప్రెస్ వార్తా పత్రిక ప్రకటించింది. ఆస్ట్రియా రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేసే ఫ్రాంజ్‌మేయర్ అనే ఉద్యోగికి రావాల్సిన ప్రమోషన్ ని ఉర్సులా జెంచ్నర్ అనే మహిళకు కట్టబెట్టడంతో తాను పదోన్నతిని కోల్పోయానంటూ 2011లో కోర్టుకెక్కారు. తను పదోన్నతి పొందలేకపోవడానికి వివక్షే కారణమనీ, జెంచ్నర్ అనే మహిళకి పదోన్నతినివ్వడంలో పక్షపాత వైఖరి అనుసరించారన్న ఫ్రాంజ్‌మేయర్ వాదనతో ఏకీభవించిన ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు అతనికి నష్టపరిహారంగా 300,000 యూరోలను చెల్లించాలని ఫిబ్రవరిలో తీర్పునిచ్చినట్టు డై ప్రెస్ పత్రిక పేర్కొంది. అయితే జెంచ్నర్కి పదోన్నతినిచ్చే సమయంలో నియామకానికి సంబంధించిన అన్ని నిబంధనలనూ పాటించామని ఆ సమయంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న సోషల్ డెమొక్రాట్ పార్టీకి చెందిన డోరిస్ బర్స్ వివరణ ఇచ్చారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేని కారణంగా, మహిళలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ పదోన్నతిని కల్పించినట్టు డోరిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎస్సీ నేతలే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం. ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ సామాజిక వర్గం నేతలే పెత్తనం చెలాయిస్తారు. కాదని అడ్డం తిరిగితే ఆ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తారు. ఇక ఎస్సీ నియోజకవర్గాలైతే చెప్పనవసరం లేదు. తమ మాట వినకపోతే అసలు వారు రాజకీయాలకే పనికిరాకుండా చేస్తారు. ఎస్సీ ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఓ సామాజిక వర్గం నేతలు చేస్తున్న అసమ్మతి రాజకీయాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరులోనూ, ఎస్టీ నియోజకవర్గం అయిన పోలవరంలోనూ ప్రజాప్రతినిధులది ఇదే పరిస్థితి. శుక్రవారం చింతలపూడిలో జరిగే తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీలో కూడా ఇదే అసంతృప్తులు, అసమ్మతులపై చర్చ జరిగే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను టార్గెట్ చేస్తూ వచ్చిన ఎంపీ మాగంటి బాబు వర్గం ఇప్పుడు మంత్రి పదవి పోవడంతో నేరుగా రంగంలోకి దిగిపోయింది. తమ మాట నెగ్గకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ ఓ వర్గం నాయకులు పదే పదే అల్టిమేటం ఇస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగారు. జిల్లా ఇంఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు లేకుండా పోయింది. మూడున్నర ఏళ్లుగా ఏఎంసీ పాలకవర్గం నియామకం చేపట్టక పోవడం కూడా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఎమ్మెల్యే సుజాత తన వర్గానికి ఈ పదవి దక్కాలని పట్టుబడుతుండగా, ఆమె వ్యతిరేక వర్గం మాత్రం ఎంపీ మాగంటి బాబుతో ఒత్తిడి తీసుకు వచ్చి తమ వర్గానికే ఈ పదవి దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు వర్గాలు తమ వారికే ఏఎంసీ పాలకవర్గ ఛైర్మ¯ŒS గిరీ ఇప్పించుకోవాలని పట్టు పడుతుండటంతో వీరి మధ్య విభేదాలు మరింత రచ్చకెక్కాయి. పీతల సుజాత దళిత మహిళ కావడంతో మొదటి నుంచి అమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంలోకి చేరిపోయి అసమ్మతి రాగం వినిపిస్తుండటం విశేషం. చింతలపూడిలో జరిగే సమన్వయ కమిటీ సమావేశం ఎదుట బలప్రదర్శన చేయాలని నిర్ణయించడంతో పార్టీలోని అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గోపాలపురంలో కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఈ నియోజవర్గంలో తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దేవరపల్లిలో ఏఎంసీ చైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు వర్గం ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తోంది. ఈ నెల 16న ముళ్లపూడి వెంకట్రావు వర్గం, స్థానిక సర్పంచ్ వర్గం ఎమ్మెల్యే ముందే కొట్టుకోవడంతో పాటు రాస్తారోకోకు దిగారు. ఆఖరికి ఎమ్మెల్యే పోలీసు రక్షణ మధ్య అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్టీఆర్ గృహాల మంజూరు విషయంలో జరిగిన అధిపత్య పోరు ఈ వివాదానికి దారితీసింది. రెండు నెలల క్రితం భీమడోలులో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కూడా గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తీరును నిరసిస్తూ ద్వారకాతిరుమల నేతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తమను కాదని మండల అధ్యక్ష పదవిని సుంకవల్లి బ్రహ్మయ్యకు కట్టబెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీతో పాటు 12 మంది ఎంపీటీసీలు, 10 మంది సర్పంచ్‌లు, 15 మంది పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, 13 మంది నీటిసంఘం అధ్యక్షులు, 14 మంది పాలకేంద్రం అధ్యక్షులు, ఇద్దరు సొసైటీ అధ్యక్షులు, ఒక ఏఎంసీ వైస్ చైర్మన్, నలుగురు డైరెక్టర్లు ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరేకించి అసమ్మతి వ్యక్తం చేశారు. ఈ వివాదం సద్దుమణగక ముందే దేవరపల్లిలో గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. పోలవరం నియోజకవర్గంలో కూడా ఎంపీ మాగంటి బాబు వర్గం స్థానిక ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌ను వ్యతిరేకిస్తూ, అక్కడి అసమ్మతికి మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. కొవ్వూరులో ప్రస్తుతం జవహర్ మంత్రి కావడంతో కొద్దిగా ఆ సామాజికవర్గం హడావిడి తగ్గించినా తెరవెనుక చక్రం తిప్పుతోంది. -
ఇదేమి పెత్తనం
ఎంపీ నిధులతో చేపట్టే పనులకు కోడలు ప్రారంభోత్సవాలు అధికారిక కార్యక్రమాల్లో ఆమెదే హవా విస్తుబోతున్న అనుచరగణం ప్రేక్షకపాత్రలో అధికారులు. రాజకీయాల్లో అతివల అధికారాన్ని చేజిక్కించుకొని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి మూలన కూర్చోబెట్టిన మగ మహారాజులున్నారు... పెత్తనం చెలాయిస్తూ వారికి కేటాయించిన అధికార సీట్లపై కూర్చొని అధికారాన్ని వెలగబెట్టినవారున్నారు. మండల సమావేశాల్లో జెడ్పీటీసీలకు, సర్పంచులకు బదులుగా భర్తలు, లేదా వీరి బంధువుల గళాలే వినిపిస్తాయి. సంబంధితాధికారులు కూడా కిమ్మనకుండా చర్చల్లో పాల్గొంటున్నారు. చివరకు జిల్లా కేంద్రంలోని ఓ మహిళా శాసన సభ్యురాలు కూడా స్వతంత్రంగా వ్యవహరించలేని దుస్థితిలో ఉండడం విచారకరం. ఇందుకు భిన్నంగా ఉంది సినీ నటుడు, ఎంపీ మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని పరిణామాలు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ మురళీమోహన్‌కు బదులు కోడలు రాజ్యమేలుతున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఎంపీ మురళీమోహన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన ఉన్నా లేకున్నా అన్నింటా తానే అన్నట్టు కోడలు చక్రం తిప్పుతూ పెత్తనం చెలాయిస్తూ రావడం ఆయన అనుచరులతోపాటు అధికారులకు ఇబ్బందుల్లో నెడుతున్నా అడ్డు చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. మురళీమోహన్ ఎంపీ అయ్యాక కోడలు రూపాదేవి కూడా నీడలా ఆయన వెంటే నడుస్తున్నారు. ప్రధానంగా అనపర్తి నియోజకవర్గం వచ్చే ప్రతిసారీ ఈమె లేకుండా ఆయన రావడం లేదు. మురళీమోహన్ వయస్సు రీత్యా చేదోడువాదోడుగా ఉండేందుకు వస్తున్నారని ఇంతకాలం పార్టీ శ్రేణులు సరిపెట్టుకుంటూ వస్తున్నాయి. మురళీమోహన్ ఏమనుకుంటారేమోననే మొహమాటంతో ఆయనతోపాటు కార్యక్రమాల్లో వేదికపైకి కోడల్ని కూడా అనివార్యంగా ఆహ్వానిస్తున్నారు. అది పార్టీ కార్యక్రమమైనా, అధికారిక కార్యక్రమమైనా సరే. మామ వెంట కోడలు రావడంలో తప్పేంటని సమర్థిస్తూ వచ్చిన వారు కూడా రంగాపురం గ్రామంలో సోమవారం (12వ తేదీన) ఆమె చేసిన ప్రారంభోత్సవాలతో ఒక్కసారిగా విస్తుపోయారు.. మురళీమోహన్ ఎంపీగా ఎన్నికయ్యాక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఓటమి తరువాత అందుకు ప్రధాన కారణమైన అనపర్తి నియోజకవర్గంపై మురళీమోహన్ వల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నారు. 2014లో ఎన్నికలు వచ్చే వరకు కాళ్లకు బల్పాలు కట్టుకుని ఈ నియోజకవర్గంలో మురళీమోహన్ తిరిగినన్నిసార్లు మరే నాయకుడూ తిరిగి ఉండరు. తన గెలుపులో అనపర్తి నియోజకవర్గ పాత్రను మరిచిపోలేనని, అందుకే నియోజకవర్గంలో బిక్కవోలు మండలం రంగాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. అలా దత్తత తీసుకుని రెండున్నరేళ్లవుతున్నా ఎంపీ పర్యటించిది వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో కోడలు ఆకస్మికంగా ఈ నెల 12వ తేదీన (సోమవారం) రూ.12 లక్షల వ్యయంతో ఎంపీ నిధులతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాలును ప్రారంభించి, రూ.7 లక్షలు ఎన్ఆర్జీఎస్, పంచాయతీ నిధుల భాగస్వామ్యంతో బీసీ కాలనీ రోడ్డు పనులకు రూపాదేవి కొబ్బరికాయ కొట్టి భూమి పూజచేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరో అడుగు ముందుకేసి పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశ వేదికపైకి రూపాదేవిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పరిచయం చేసి మాట్లాడాల్సిందిగా కోరడం విశేషం. నియోజకవర్గ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి రూ.19 లక్షలతో పంచాయతీ భవనం, రూ.9.50 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.4 లక్షలతో ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అదే సమయంలో రూపాదేవి రంగాపురంలో ప్రారంభోత్సవాలు ఏ హోదాతో చేశారని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీగా గ్రామాన్ని దత్తత తీసుకున్నంత మాత్రాన కోడలు ప్రారంభోత్సవాలు చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంపీ నిధులు తమ సొంత జేబులోంచి తీసి ఖర్చు చేస్తున్నట్టుగా భావిస్తున్నట్టున్నారని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మేధావి వర్గం ఆక్షేపిస్తోంది. . -
ఆధిపత్యం కోసమే జంట హత్యలు
– గోవిందపల్లె కేసులో నిందితుల అరెస్టు - వివరాలు వెల్లడించిన ఆళ్లగడ్డ డీఎస్పీ ఆళ్లగడ్డ : ఆధిపత్యం కోసమే గోవిందపల్లె గ్రామంలో ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, అతని బావమర్ది మేరువ శ్రీనివాసరెడ్డిలను హత్య చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల అరెస్ట్ చూపించారు. అరెస్టయిన నిందితుల్లో గోవిందపల్లి గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్‌రెడ్డి, ఇందూరి శ్రీధర్‌రెడ్డి, గంగదాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణకాంత రెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డి, సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకలి శ్రీనులు ఉన్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు హత్య ఎందుకు చేశారంటే.. ఎదుగుదల చూసి ఓర్వలేక.. ఇందూరు ప్రభాకర్‌రెడ్డి గతంలో శిరివెళ్ల మండలాధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏచిన్న పనిపడినా ఇతని దగ్గరకు వచ్చేవారు. స్వతహాగా అందరినీ కలుపుకుని పోయే మనస్థత్వం గల ప్రభాకర్‌రెడ్డి.. తనదగ్గరకు వచ్చేవారందరికీ పార్టీ, వర్గం తేడాలేకుండా పనులు చేసిపెట్టేవారు. దీంతో గ్రామంలోని ప్రత్యర్థివర్గాలకు కళ్లుకుట్టేవి. గ్రామం నుంచి మండలం, మండలం నుంచి నియోజవర్గస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటుండటంతో ప్రత్యర్థుల జీర్ణించుకోలేక పోయారు. ఇతన్ని మట్టుబెట్టిబెడితే గ్రామంలో తమదే ఆధిపత్యం అవుతుందని భావించారు. ఇందుకు రెండు వర్గాలకు చెందిన ప్రత్యర్థులు ఏకమై అదును కోసం ఎదరుచూస్తూ రెక్కీ నిర్వహిస్తూ ఉండేవారు. కుటుంబ కలహాలు తోడు.. ఇటీవల టీడీపీ నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇందూరు ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్పీలో చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఆయన సమీప బంధువు శ్రీధర్‌రెడ్డికి, ప్రభాకర్‌రెడ్డికి కుటుంబ కలహాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీధర్‌రెడ్డిని మంచి చేసుకుని ప్రత్యర్థులు రెచ్చగొట్టారు. గోవిందపల్లె గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్‌రెడ్డి, ఇందూరి శ్రీధర్‌రెడ్డి, గంగ దాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణకాంతరెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డిలతోపాటు మరి కొందరు గ్రామస్తులు..సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకలి శ్రీను దగ్గరకు వెళ్లి ప్రభాకర్‌రెడ్డిని చంపాలని రూ. 40 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. హత్యచేశారు ఇలా... ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి, బావమరిది శ్రీనివాసరెడ్డి, తమ్ముడు ప్రతాపరెడ్డితో కలిసి సాయంత్రం వాకింగ్‌కు వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు గ్రామ శివారులోని పంట పొలాల్లో దాక్కుని ఉన్నారన్నారు. ప్రభాకర్‌రెడ్డి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా వేటకొడవళ్లు, పిడిబాకులతో దాడి చేశారు. ప్రతాపరెడ్డి భయంతో పరుగులు తీయగా ప్రభాకర్‌రెడ్డిపై దాడిని శ్రీనివాసరెడ్డి అడ్డుకోబోయారు. ప్రత్యర్థులు.. ప్రభాకర్‌రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షి ప్రతాపరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐలు ప్రభాకర్‌రెడ్డి, దస్తగిరిబాబు పాల్గొన్నారు. -
ఆధిపత్యం కోసమే హత్య
– పి.రుద్రవరం రాముడు మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు – బోగస్ నంబర్ సుమో, సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితుల గుర్తింపు – బోయ కృష్ణ, బోయ విక్రమ్‌తో సహా ఏడుగురు నిందితుల అరెస్టు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగుదేశం నాయకుడు కర్నూలు మండలం పి.రుద్రవరం గ్రామానికి చెందిన కురువ రాముడు హత్యకేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన బోయ కృష్ణ, విక్రమ్, దాసి బాలరాజు, బోయ లక్ష్మన్న, బోయ నల్లబోతుల ఎర్రమల, బోయ నల్లబోతుల రాజు, బోయ నల్లబోతుల మద్దిలేటి, అరుణ్గౌడ్ కలిసి హత్య చేసినట్లు తేలింది. అనుమానితుల కాల్‌డేటా, హత్యకు వినియోగించిన బోగస్ నంబర్ సుమో ఆధారంగా వారిని గుర్తించారు. నిందితుల్లో అరుణ్గౌడు పరారీలో ఉండగా మిగిలిన ఏడుగురిని పోలీసులు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట ఆదివారం హాజరు పరిచారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు... 2016 డిసెంబర్ ఆరో తేదీన రాత్రి పి.రుద్రవరం గ్రామానికి చెందిన మిట్టగిరి కురువ రాముడు బి.తాండ్రపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాల్వ గట్టుపై దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూలు నుంచి పనులు ముగించుకుని బజాజ్ పల్సర్ బైక్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాముడిని సమోతో గుద్దించి, ఆ తరువాత రాడ్లు, కత్తులతో పొడిచి హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు అదే గ్రామానికి చెందిన బోయ కృష్ణ, బోయ విక్రమ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. జిల్లాలో చాలా రోజుల తరువాత ఫ్యాక్షన్ హత్య జరగడంతో జిల్లా ఎస్పీ అకే రవికృష్ణ సీరియన్ స్పందించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బృందానికి విచారణ బాధ్యతలను అప్పగించారు. హత్య కోసం వినియోగించిన ఏపీ04ఏక్యూ2326 అనే నంబర్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న టాటా సుమో ఎవరిదనే దానిపై వారు దృష్టి సారించారు. ఈ వాహనం ఓనర్ అయిన సదాశివపేటకు చెందిన రవితేజను విచారించారు. సెప్టెంబర్ ఒకటో తేదీన పవన్, రాజు అనే వ్యక్తులు తన సుమోను 83 వేలకు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిపాడు. ఇదిలా ఉండగా మృతుడు కురువరాముడు డిసెంబర్ 06వ తేదీన తిరిగిన, చనిపోయిన ప్రదేశాల్లో టవర్ డంప్ ఆధారంగా కొన్ని అనుమానిత ఫోన్ కాల్స్ జాబితాను తీసుకుని విచారణ చేయగా నిందితుల వివరాలు బయటపడినట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ వివరించారు. గతంలో రుద్రవరం గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్ అనే వ్యక్తిని బోయ కృష్ణ, అరుణ్గౌడ్ కలిసి చంపగా కురువ రాముడు బేతంచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారని, అంతేకాక గ్రామంలో ఆయనే ఆధిపత్యాన్ని చెలాయిస్తుండడంతో హత్య చేసినట్లు నిందితులు తెలిపినట్లు ఎస్పీ వివరించారు. నెలన్నరరోజుల్లో కేసును ఛేదించడంతో డీఎస్పీ రమణమూర్తి, సీఐ సి.మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు గిరిబాబు, వి.సుబ్రమణ్యంరెడ్డి, ఇతర పోలీసులను ఎస్పీ అభినందించారు. రిమాండ్ నిమిత్త జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. సమావేశంలో ఓఎస్డీ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
ఆధిపత్యపోరులో ఆత్మహత్యాయత్నం
- డోన్ రూరల్ ఎస్ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు - కొత్తకోట గ్రామంలో ఉద్రిక్తత డోన్ టౌన్: ఆధిపత్యపోరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడాడు. ఈ ఘటన డోన్ మండలం కొత్తకోట గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన దళిత వాడ అధికారపార్టీకి చెందిన ఇద్దరి నాయకుల అధిపత్య పోరాటానికి వేదికైంది. దీంతో దళితులు రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో పరస్పరం దాడులకు పాల్పడడంతో కేసులు నమోదై కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఒక వర్గానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి పురుగుల మందు తాగడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రత్యర్థి వర్గానికి చెందిన దస్తగిరి, పుల్లన్నల సమక్షంలో రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య చేయి చేసుకున్నాడనే మనస్థాపంతో రామాంజనేయులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నార. డోన్‌కు వచ్చిన జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు.. ఎస్పీ దృష్టికి తెచ్చారు. రక్షణ కల్పించండి కొత్తకోట గ్రామంలో అధికారపార్టీ నాయకుని దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ఎస్ఐ అకారణంగా మా కుమారుడిపై ప్రత్యర్థుల ఎదుట చేయిచేసుకున్నాడు. ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు యత్నించాడు. నాగలక్ష్మమ్మ, కొత్తకోట గ్రామం, డోన్ మందలించాను రామాంజనేయులు, దస్తగిరిలు తరచుగా గొడవ పడుతున్నారు.గతంలో ఇరువురిపై కేసులు నమోదు చేశాం.అయినా తిరిగి గొడవకు దిగుతుంటే ఇరువురుని స్టేషన్‌కు పిలిపించి మందలించాం. అంతే తప్ప ఎవరిపై కూడా చేయి చేసుకోలేదు. ఆరోపణలు అవాస్తవం - రామసుబ్బయ్య, ఎస్ఐ -
ఇసుక రీచ్‌లో ఆధిపత్య పోరు
* 500 మీటర్లకు 500 నిబంధనలు * ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం * భారీగా నిలిచిపోయిన ఇసుక లారీలు వెంకటపాలెం (తాడేపల్లి రూరల్): ఇసుక రీచ్‌లో అధికార పార్టీ నేతలు ఆధిపత్యం సంపాదించుకునేందుకు ఇసుక లారీ ఓనర్లను, డ్రైవర్లను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెనుమాక, వెంకటపాలెంలో ఇసుక రీచ్ నుంచి తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. మంగళవారం నుంచి వెంకటపాలెం ఇసుక రీచ్ ప్రారంభం కావడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు తమ లారీలే రోడ్డు మీద నడవాలంటూ పోలీసు బాస్‌లతో చర్చించి, వెంకటపాలెం నుంచి లోడు అయి వచ్చే లారీలను నిలిపివేశారు. పెనుమాక ఇసుక రీచ్‌కు, వెంకటపాలెం ఇసుక రీచ్‌కు ఒకటే రూటు. ఎక్కడ లోడైనా అదే రోడ్డులోకి రావాల్సిందే. కాకపోతే వెంకటపాలెం ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలు 500 మీటర్ల రహదారి ఎక్కువగా ఉంటుంది. ఈ 500 మీటర్లకు 500 ఆంక్షలు విధించి, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లారీలను నిలిపివేశారు. లారీ యజమానులు జరుగుతున్న ఈ సంఘటనపై పోలీసులను ప్రశ్నించడంతో ఈ 500 మీటర్లు సీఎం రహదారి, మీరెలా వెళతారంటూ ప్రశ్నిస్తున్నారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సీఎం ఇంటి మీదుగానే పెనుమాక ఇసుక రీచ్ నుంచి ట్రాక్టర్లు, లారీలు తిరుగుతున్నాయని ప్రశ్నించగా, అది అర్బన్æ పరిధి, ఇది రూరల్∙పరిధి, ఎక్కువగా మాట్లాడుతున్నారేంటి? అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కనీసం ట్రాక్టర్‌పై భోజనానికి కూడా వెళ్లనీయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వెంకటపాలెం మెయిన్ రోడ్డు నుంచి ప్రతి లారీ రాజధాని రూటులో ప్రయాణించాల్సిందే. మరి అక్కడ లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకు విధిస్తున్నారని లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని లారీ డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తుళ్లూరు ఎస్ఐ మహ్మద్ షఫీ వివరణ .. వెంకటపాలెం నుంచి వచ్చే ఇసుక లారీలను ఆపిన మాట వాస్తవమేనని, సచివాలయానికి ఉద్యోగస్తుల తాకిడి పెరగడంతో ట్రాఫిక్ నిలిచిపోతుందని లారీలు ఆపినట్టు తెలిపారు. పెనుమాక ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలను ఎందుకు ఆపలేదని ప్రశ్నించగా, అది అర్బన్ పరిధి అని, తమది కాదని అన్నారు. వెంకటపాలెంలో 500 మీటర్లే మీ పరిధిలో ఉంది, మిగతాది అంతా అర్భన్ పరిధిలో ఉంది కదా అని ప్రశ్నిస్తే, మా ఎస్పీ గారు ఆపమన్నారు, మేము ఆపాము, మీ పరిధికాదు కదా అని అన్నారు. -
పోలీసుల సహకారంతో తొక్కేద్దాం
కర్నూలు: ‘‘ఇది ఫ్యాక్షన్ జిల్లా. జిల్లాలో మంత్రాలయం, ఆదోని, బనగానపల్లె వంటి ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ బలంగా ఉంది. ఈ ప్రాంతాల్లో పర్యటించి వాళ్లను ఎట్లా అణగదొక్కాలి? ఏ విధంగా పోలీసు సాయం తీసుకోవాలి? అనే విషయాల్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలి’’.. ఇవీ బాధ్యత వహించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరో మంత్రి వర్యుడు, ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పిన మాటలు. ఇలా కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు పోలీసుల సహాయం తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. కర్నూలు శివారులోని ఎంఆర్సీ కన్వెన్షన్‌లో శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అధ్యక్షతన టీడీపీ మినీ మహానాడు చారు. నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కేఈ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు.. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని అణగదొగ్గేందుకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకరించేలా ప్రయత్నించాలని కోరారు. ‘‘అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పదవులు దక్కలేదని కార్యకర్తలు ఆవేదనతో ఉన్న మాట వాస్తవమే. ఏయే నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో కార్యకర్తల కష్టాల గురించి నియోజకవర్గ ఇన్చార్జీలు జాబితాలు సిద్ధం చేసి ఇస్తే నా లెటర్‌ప్యాడ్‌పై అధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తా. మండలాల్లో ఏయే అధికారుల వల్ల ఇబ్బంది ఉంది, ఎవరు ఉండకూడదు, ఎవరు కావాలనే జాబితా ఇస్తే దానిపైనే నేను సంతకం పెట్టి అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని అధినేతను కోరతా’’నని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. -
పసుపుపచ్చగా మారుతున్న తెలంగాణ గులాబీ
-
టీడీపీ నేతల బరితెగింపు
తీవ్రంగా గాయపడిన కార్యకర్తను పరామర్శిస్తున్న వీఆర్ రామిరెడ్డి తాడిపత్రి రూరల్ : తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. ఆధిపత్యం కోసం ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటం లేదు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలో చేరారనే కారణంతో తాడిపత్రి మండలం వీరాపురంలో శనివారం వేటకొడవళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరాముడు (44), పుల్లారెడ్డి (60), నారాయణ (62), సుబ్బమ్మ (45)ల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కర్రెప్ప (65), వినోద్‌కుమార్ (22) తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ అండతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యే ప్రోద్బలంతో దాడులు జరిగాయని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో మైనార్టీ నేత మున్నా, నాయకులు మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పేరం రామచంద్రారెడ్డి ఉన్నారు. -
వంట నేర్వనివాడు వింత మనిషా ?
సంతోషంగా ఉండాలంటే మాత్రం మగ మహారాజు వంటచేయాలంటున్నారు. దీనివల్ల పని భారం ఆమెకు తగ్గడమే కాదు, భర్త బాధ్యత తీసుకుని తన కష్టాన్ని తగ్గించిన భావన ప్రత్యక్షంగా ఆమెకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మగాడు... తొలుత వంట గురించి మాట్లాడలేదు. రెండో దశలో... ‘నేను, వంట చేయడమా?’ అన్నాడు. మూడో దశలో ‘వంట నాకు రాద’న్నాడు... ఇపుడు కారణాలు అతను చెప్పడం లేదు, ఎందుకంటే ఎవరూ అడగటం లేదు. నీ మంచికే చెబుతున్నాం... వంటొచ్చా? అంటున్నారు.! అవునట... వంట రాని మొగుడితో సంతోషకరమైన దాంపత్యం ఉండదట. పురుషులకు మాత్రమే...అనే బోర్డు ఉన్న ఉద్యోగాలు కనుమరుగైనాయి. ప్రతి ఉద్యోగానికి స్త్రీ వస్తోంది. గమనించాలి.... ప్రతి ఉద్యోగంలో ఆమెకు ప్రాధాన్యం, వెసులుబాట్లు కూడా ఉంటున్నాయి. అంటే ఉద్యోగం పురుషలక్షణం, వంటిల్లు గృహిణి స్థానం అన్నదానికి కాలం చెల్లింది. ఈ మధ్య కాలంలో పెళ్లయ్యి హౌస్ వైఫ్‌గా ఉన్న వారి శాతం పదికి మించడం లేదంటే స్త్రీలు పురుషుడితో ఉన్న తేడాలు ఎంతగా చెరిపేసుకున్నారో తెలియడం లేదూ! ఉదయాన్నే ఇద్దరూ రెండు బాక్సులు కట్టుకుని బయలుదేరుతున్నారు. మరి ఇంటికి వచ్చి వంటెవరు చేయాలి? అతనికి ఉన్న ఒత్తిడి, పని ఆమెకు ఉంటున్నాయి. అలాంటపుడు ఆమెను వంట చేయమని ఆదేశించడానికి నోరు రావడం లేదు. నోట్లో ఏదో ఒకటి అర్జెంటుగా పడకపోతే ఆకలి తీరడం లేదు. కానీ ఒంట్లో ఓపిక లేదు. ఆమె పరిస్థితి ఇంకాస్త ఇబ్బంది... ఎలాగోలా వంట చేయాలి. ఎందుకంటే పురాణాలు... ‘భోజ్యేషు మాతా’ అని ఒక బిరుదిచ్చి పడేశాయి. కాబట్టి మనిషిలో ఏ మూలన కాస్త మంచితనం ఉన్నా మొహమాటానికి గరిట పట్టాల్సిందే. కుక్కర్లు వచ్చినా, కట్‌చేసిన కూరగాయలు దొరకుతున్నా, రెడీ మిక్స్ కరీలు వచ్చినా... మనిషి పని ఇంకా మిగిలే ఉంది, ఉంటుంది. ఏతావాతా... ఆమె పాత్ర తప్పనిసరి. అలసిన శరీరానికి అసంతృప్తీ తప్పనిసరి. అందుకే చిన్న కుటుంబం చింత లేని కుటుంబంగా ఉండాలంటే మొగుడికీ వంట రావాల్సిందే అన్న కొత్త సిద్ధాంతాన్నా ఫ్యామిలీ కౌన్సిలర్లు, పర్సనాలిటీ ట్రైనర్లు... వీరందరికీ కంటే ముందు ఉద్యోగాలు చేస్తున్న భార్యలు కోరుతున్నారు. దాంపత్యం అంటే సుఖంతో పాటు కష్టాలు పంచుకోవాలి. ఓ చేయి వంటలోనూ వేయాలి. భర్త కాస్త దురుసుగా ఉన్నా, కిచెన్‌లోకి వెళ్లకపోయినా కుటుంబం నడుస్తుంది, కాకపోతే సంతోషంగా ఉండాలంటే మాత్రం మగ మహారాజు వంటచేయాలంటున్నారు. దీనివల్ల పని భారం ఆమెకు తగ్గడమే కాదు, భర్త బాధ్యత తీసుకుని తన కష్టాన్ని తగ్గించిన భావన ప్రత్యక్షంగా ఆమెకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది, పరోక్షంగా ఆ ఇంటికి ఆనందాన్ని పంచుతుందట. ఇల్లాలి ఆనందమే ఇంటికి ఆస్తి, ఆరోగ్యం. రోజూ భర్త వండిపెట్టక్కర్లేదు... కాకపోతే భార్యకు కష్టంగా ఉన్నపుడు, బడలిక ఉన్నపుడు, అనారోగ్యంతో ఉన్నపుడు పని ఎక్కువగా ఉన్నపుడు వండిపెడితే ఆమె అనేక ఇతర విషయాల్లో భర్తకు ఊహించనంత ఆనందాన్ని ఇస్తుంది. భర్త ఆమె కష్టాన్ని పంచుకుంటే భార్య అతనికి ప్రేమను పంచుతుందట. ఈ చిన్నసాయం ద్వారా భవిష్యత్తులో అనేక విషయాల్లో కాస్త డామినేషన్ చూపినా ఆమె సహకారం లభిస్తుంది. ఇదంతా చెప్పాక... అంటే భార్య ఉద్యోగం చేయకపోతే మగాడు వంట చేయక్కర్లేదు అనుకునేరు. అసలు సిద్దాంతం ఏంటంటే ఆమె పనితో సంబంధం లేకుండా మగాడికి వంట వచ్చి ఉండాలంటున్నారు. అపుడే కాపురంలో కాస్త హాయి దక్కుతుందట. భార్యకు బాగోలేకపోవచ్చు, ఆమె ఒక్కతే చేసిపెట్టలేనంత మంది బంధువులు ఇంటికి వచ్చి ఉండొచ్చు, ఆమె గర్భవతి అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇల్లాలి ఉద్యోగంతో సంబంధం లేకుండా వంట నేర్చకుంటే అది మగాడికి సుఖాన్నిస్తుందే గాని కష్టం పెంచదట. గత కాలంలో అయితే ఇప్పట్లాగా ఇంట్లో భార్యభర్తలు మాత్రమే కాకుండా అత్తమామలో, అమ్మనాన్నలో ఉండేవారు కాబట్టి ఈ సమస్య, ఈ కష్టం వచ్చేది కాదు... ఇపుడు ఇద్దరే ఉంటున్నారు. ప్రైవసీ వచ్చింది, దాంతో పాటు ఇలాంటి సైడ్ ఎఫెక్టులూ మొదలయ్యాయి! చెట్టున్న నేల, పెద్ద వాళ్లున్న ఇల్లు చల్లగా ఉంటాయండీ! -
అమ్మవారి సన్నిధిలో ఆధిపత్య పోరు
అందరూ కలసికట్టుగా ఉంటేనే ఇంటి నిర్వహణ అయినా, ఆలయ బాధ్యతలయినా సక్రమంగా ఉంటాయి. ఎవరికి వారు ఆధిపత్యానికి ప్రయత్నిస్తే నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. నలుగురిలో నవ్వులపాలవుతారు. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఇదే జరుగుతోంది. అర్చకులు, సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సింది పోయి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. దీంతో ఆలయ పాలన గాడి తప్పింది. ఫలితంగా అమ్మవారి లక్ష్మీకాసుల హారం మూడు రోజులపాటు మాయమై టీటీడీ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసింది. ఇప్పటికైనా వీరంతా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు వదిలి, అమ్మవారి సేవకు తమ సమయాన్ని వెచ్చిస్తే ఏ హారాలూ పోవు.. భక్తుల మనోభావాలూ దెబ్బతినవు! తిరుచానూరు, న్యూస్‌లైన్ : పద్మావతి అమ్మవారి ఆలయంలో అధికారులు, అర్చకులు, విజిలెన్స్ సిబ్బంది మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. టీటీడీలో తిరుమల శ్రీవారి ఆలయం తరువాత అంత ప్రాశస్త్యం ఉన్నది తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికే. ఈ ఆలయంలో తమదే పైచేయిగా ఉండాలన్నదే వీరి ఆధిపత్య పోరుకు కారణం. కొంతకాలంగా ఈ మూడు వర్గాల మధ్య సఖ్యత కొరవడింది. సమన్వయం లేకపోవడంతో అమ్మవారి కైంకర్యాల్లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ పొరపాట్లు దొర్లుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అమ్మవారి లక్ష్మీహారం మాయమవడం.. మూడురోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమవడం అంతా అమోమయంగా ఉంది. సాధారణంగా రెండు మూడు గ్రాముల బంగారు నగ కనిపిం చకుండా పోతేనే ఇల్లంతా వెతుకుతాం. ఊర్లోని వారందరికీ చెబుతాం. అదే 217 గ్రాముల బరువున్న లక్ష్మీకాసుల హారం పోతే! ఎంత కంగారు.. ఎంత భయం! ఎంతగా వెతుకుతాం.. ఎంతమందికి చెబుతాం! తిరుచానూరు ఆలయంలో మాత్రం అర్చకులు, అధికారులు ఈ వ్యవహారాన్ని మూడు రోజులు రహస్యంగా ఉంచారు. మంగళవారం హారం మాయమైతే గురువారం ఈ విషయం బయటకు పొక్కింది. పలు టీవీ చానళ్లలో ప్రసారం అయింది. దీంతో హారం శుక్రవారం ఆల యంలో ప్రత్యక్షమయింది. నీటి తూములో ఉందని, ఎక్కడికీ పోలేదని అర్చకులు తెలి పారు. పవిత్రమైన లక్ష్మీకాసుల హారం గర్భగుడిలోని నీటి తూములో పడి ఉండడం సందేహానికి తావిస్తోంది. ఇంత పెద్ద హారం కిందపడి ఉండడాన్ని అర్చకపరిచారకులు ఎందుకు గుర్తించలేకపోయారు. విలువైన లక్ష్మీకాసుల హారం కనిపించకపోవడానికి కారణాలు ఏమిటి, దీని వెనుక ఎవరి పాత్ర అయినా ఉందా, ఈ ఘటనకు బాధ్యులెవరు అనే కోణంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఎంత నిర్లక్ష్యమో.. కొన్నేళ్ల క్రితం తిరుచానూరు ఆలయంలో కీలక హోదాలో విధులు నిర్వహించిన ఓ అధికారి ఏకంగా అమ్మవారి నగలను ఎటువంటి భద్రత లేకుండా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఇది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పనితీరు సరిగా లేకపోవడంతోనే ఆ అధికారి విలువైన బంగారు ఆభరణాలను ఎటువంటి భద్రత లేకుండా టీటీడీ జ్యుయెలరీ విభాగానికి తీసుకెళ్లారని విచారణలో తేలింది. ఈ వ్యవహారంతో విజిలెన్స్ అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ చర్యతో అధికారులు, అర్చకులు, విజిలెన్స్ అధికారుల మధ్య విభేదాలు చోటుచేసున్నాయి. గతంలో తాళం చెవి మాయం.. సుమారు ఏడాది క్రితం అమ్మవారి ఆలయంలోని పరకామణికి సంబంధించిన తాళం చెవులు కనిపించకుండా పోయాయి. సిబ్బంది పొరపాటు, నిర్లక్ష్యం కారణంగా తాళంచెవి అమ్మవారి హుండీలో పడిపోయింది. హుండీలోని డ బ్బులు లెక్కించే సమయంలో తాళాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగిపై వేటుపడింది. ఇప్పటికైనా ఆలయ అధికారులు, అర్చకులు, విజిలెన్స్ సిబ్బంది ఆధిపత్య పోరుకు స్వస్తి పలికి అమ్మవారి ఆలయం, టీటీడీ ప్రతిష్టకు భంగం కలగకుండా వ్యవహరించాలని అటు స్థానికులు, ఇటు భక్తులు కోరుతున్నారు. -
పశ్చిమకృష్ణాపై బాబు సవతి ప్రేమ
బాబు హయంలో ముగ్గురు మంత్రులున్నా ఉపయోగం సున్నా తాగునీరు, సాగునీటికి కటకటే! తారాస్థాయిలో ఆధిపత్య పోరు అభద్రతలో అభ్యర్థులు సాక్షి, విజయవాడ : పశ్చిమకృష్ణాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తుందనే సంకేతాలందడంతో .... ఈ ప్రాంతంలో ఏదో విధంగా పార్టీని కాపాడుకోవడానికి అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించి పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తూర్పు కృష్ణాలోని పామర్రు, పెడన, బందరులో పర్యటించిన చంద్రబాబు సోమవారం జగ్గయ్యపేట, నందిగామ,మైలవరం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రానున్నారు. జిల్లాలో పాదయాత్రలు, బస్సుయాత్రలు, మహిళా గర్జనలు చేసినా... పలుమార్లు తిరిగినా ఓటర్లనుంచి ఏ మాత్రం స్పందన రాకపోవడంతో, మరోసారి చంద్రబాబు వచ్చినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీకి శాపంగా మారాయి. తాము గెలవకపోయినా పరవాలేదు..తనపార్టీ వాడు గెలవకూడదనే సిద్ధాంతానికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కట్టుబడి ఉన్నారనే వార్తలొస్తున్నాయి. ప్రజలాదరించినా టీడీపీ నేతలు ఒరగబెట్టింది శూన్యమే..... తెలుగుదేశం పార్టీని ఇక్కడ ప్రజలు ఆదరించినా, నేతలు మాత్రం ఈ ప్రాంతానికి ఒరగపెట్టిందేమీ లేదని ప్రజలంటున్నారు. పశ్చిమకృష్ణా నుంచి గెలుపొందిన వడ్డేశోభనాద్రీశ్వరరావు(మైలవరం), నెట్టెంరఘురామ్(జగ్గయ్యపేట), దేవినేని వెంకట రమణ(నందిగామ) అప్పట్లో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి కావాల్సిన తాగునీరు,సాగునీరు సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. ఇదే ప్రాంతానికి చెందిన ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మీడియా ముందు హడావిడి చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు ఒక్కటి సాధించలేదనేది నిష్టూర సత్యం. ఇక చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అశ్రద్ధచేశారని, రైతుల కష్టాలను, కన్నీళ్లను తీర్చేందుకు ఏ మాత్రం ప్రయత్నించలేదనే భావన ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. తీరని సమస్యలెన్నో... కృష్ణాజలాలు కావాలనే జగ్గయ్యపేట ప్రజల డిమాండ్‌ను మాజీమంత్రి నెట్టెం రఘురామ్కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కానీ పరిష్కరించలేకపోయారు. వత్సవాయి మండలం పోలపల్లి డామ్ నిర్మాణం పూర్తయితే సుమారు 3వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని రైతులు మొత్తుకుంటున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన సమయంలోనూ నందిగామ నియోజకవర్గంలో సమస్యలు కోకల్లలు. నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా పండించే సుబాబుల్ పంటకు గిట్టుబాటు ధర కావాలనే డిమాండ్‌ను ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఏ మాత్రం పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మైలవరం నియోజకవర్గ రైతుల్ని ఎమ్మెల్యే దేవినేని ఉమా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. జి కొండూరు మండలంలో తారకరామ ఎత్తిపోతల పథకంపై పూర్తి నిర్లక్ష్యం వహించడం, కోటికల పూడి గ్రామంలోని ఏనుగగడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడం కొన్ని ఉదాహణలు మాత్రమే. తారాస్థాయికి చేరిన కోల్డ్‌వార్ ... టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్(నాని), జిల్లాఅధ్యక్షుడు దేవినేని ఉమా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గంలోని నేతలంతా రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. నిన్నటి దాకా ఉమా వర్గంలో ఉన్న వారు నేడు కేశినేని వర్గంలోకి వెళ్లితే,కేశినేని వర్గీయులు ఉమా వైపు చూస్తున్నారు. ఈ ఇరువురు నాయకుల మధ్య కార్యకర్తలు పార్టీ ఓటర్లు నలిగిపోతున్నారు. ఇక నందిగామ ఎమ్మెల్యే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల సమస్య ఎదుర్కొంటుంటే, తిరువూరు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఎదురీదుతున్నారు. పశ్చిమ కృష్ణాకు చంద్రబాబు వచ్చినా నేతల మధ్య విభేదాల కారణంగా పార్టీకి విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘అరబ్బు’ ఆధిపత్య పోరులో సమిధ ఈజిప్ట్
ఈజిప్ట్‌లో ఇటీవల వందలాది మంది ‘ముస్లిం బ్రదర్హుడ్’ మద్దతుదార్లకు విధించిన సామూహిక మరణశిక్షల వెనుక సౌదీ హస్తం ఉంది. అరబ్బు ప్రపంచంపై బీటలు వారుతున్న ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో అది బ్రదర్‌హుడ్‌పై కత్తిగట్టింది. ఈజిప్ట్ రాజధాని కైరో నగరం బుధవారం బాంబు దాడులతో మారుమోగింది. గత ఏడాది జూలైలో మొహ్మద్ ముర్సీ పదవీచ్యుతుడైనప్పటి నుంచి అలాంటి పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అలా ఇంత వరకు 500 మంది హతమైపోయారు. వారిలో పోలీసు, సైనికాధికారులే ఎక్కువ. కాకపోతే బుధవారం మరణించినది పోలీసు బ్రిగేడియర్ జనరల్ కావడమే విశేషం. ‘ఉగ్రవాదం భయమే లేకుండా ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హామీని కల్పించడానికి పోరాడుతూనే ఉంటాను’ అని ఈజిప్ట్ సైనిక పాలకునిగా అబ్దెల్ అల్ ఫతా సిసీ సరిగ్గా వారం క్రితం (మార్చి 26) తెహ్రీర్ స్క్వేర్‌లో అభయమిచ్చారు! అదే రోజునే ఆయన సైనిక దుస్తులను విడిచేసి ‘ప్రజాభీష్టం’ మేరకు మే 26-27లలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు సెలవిచ్చారు. అంతకు సరిగ్గా రెండు రోజుల ముందు మార్చి 24న కైరోలోని ఓ న్యాయస్థానం ముందే తయారుచేసిన తీర్పును చదివి వినిపించింది. 528 మంది ముస్లిం బ్రదర్హుడ్ మద్దతుదార్లకు మరణశిక్షలు విధించింది. ఒక రోజు వాయిదా, ఒక రోజు తీర్పుతో సామూహిక విచారణను క్షణాల్లో ముగించిన ఘనత సిసీకే దక్కింది. జైళ్లలో మగ్గుతున్న రెండు వేల మందికి పైగా బ్రదర్హుడ్ ఖైదీలలో మిగతా వారిపై ఇంకా ‘విచారణ’ జరగాల్సి ఉంది. ఈజిప్ట్ విప్లవంలో కీలక పాత్ర వహించిన ట్రేడ్ యూనియన్లు, లౌకికవాద, ఆధునిక యువత నుంచి దేశాన్ని ‘కాపాడటం కోసం’... విప్లవంలో మరో కీలక భాగస్వామి బ్రదర్‌హుడ్‌పై అమెరికా మిత్ర భేదాన్ని ప్రయోగించింది. ప్రజల్లో 30 నుంచి 35 శాతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే ముస్లిం బ్రదర్హుడ్ నేత మొహ్మద్ ముర్సీ అధ్యక్ష పీఠం దక్కించుకునేలా చేసింది. అలాంటి అమెరికా ఈ సామూహిక మరణశిక్షల తదుపరి అల్ సిసీ ప్రభుత్వంపై ఏ ఆంక్షలు విధించింది? అసలు సిసీ సైనిక కుట్రను అణచివేసి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’కు ఎందుకు నడుం బిగించలేదు? ‘తలలను మార్చే’ నైపుణ్యంలో తనకు సాటేలేరనుకున్న అమెరికా తన కీర్తి కిరీటానికి ఆప్త మిత్రులే ఎసరు పెడతారని ఊహించలేకపోవడాన్ని ‘అర్థం చేసుకోవచ్చు.’ ముర్సీ తలను మార్చి అల్ సిసీ తలపై ఈజిప్ట్ మకుటం పెట్టినది సౌదీ అరేబియా. 528 మందికి సామూహిక మరణశిక్షలకు కర్త, కర్మ, క్రియ అదే. అందుకే ‘ఇలాంటి విచారణలను, మర ణశిక్షలను ఆమోదించలేం’అంటూ తనకే వినిపించనంత మెల్లగా గొణగడానికి మించి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఏమీ చేయలేకపోయారు. ఈజిప్ట్ ప్రజాస్వామ్యానికి పరిరక్షకునిగా అది ఎంచుకున్న ముర్సీ సహా మొత్తంగా బ్రదర్‌హుడ్‌ను సౌదీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అదే అడుగుజాడలో సిసీ దేశంలోని అత్యంత సంఘటిత రాజకీయ పార్టీ బ్రదర్‌హుడ్‌ను నిషేధించారు. బ్రదర్‌హుడ్‌పై సౌదీ అక్కసు ఈనాటిది కాదు. ఈజిప్ట్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా సున్నీ ఇస్లామిక్ ప్రపంచంలో బ్రదర్‌హుడ్‌కు శాఖలున్నాయి. సున్నీ ప్రపంచంపై తిరుగులేని ఆధిపత్యం తనదేనని భావిస్తున్న సౌదీ... బ్రదర్‌హుడ్‌ను తనకు ప్రత్యర్థిగా భావిస్తోంది. ఉదారవాద ఇస్లామిస్ట్ సంస్థగా ఉండే బ్రదర్హుడ్ ఆధునిక ప్రజాస్వామ్యాన్ని స్వీకరించింది. సరిగ్గా అదే సౌదీ, దాని మిత్ర దేశాలకు ప్రాణాంతకంగా మారింది. తమ దేశాలలోని రాచరిక వ్యవస్థలకు అది ఎసరు తెస్తుందనే భయం పట్టుకుంది. పైగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా సౌదీ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే సున్నీ ఇస్లామిక్ మత భావజాలానికి పట్టుగొమ్మగా భావించే అల్ అజర్ విశ్వవిద్యాలయం ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉంది. ముర్సీ ఆ విశ్వవిద్యాలయంపై ఆధిపత్యం కోసం కూడా ప్రయత్నించారు. వీటన్నిటికీ మించి ఆయన అటు టర్కీ, ఖతార్‌లతో కలిసి సున్నీలకు, షియాలకు మధ్య ఉన్న దీర్ఘకాలిక వైరాన్ని అధిగమించి ఇస్లామిక్ ప్రపంచ ఐక్యతను సాధించే ప్రయత్నాలు చేశారు. మొత్తం ఇస్లామిక్ ప్రపంచంపై ఆధిపత్యం కోసం సౌదీ ఎప్పటి నుంచో షియా ఇరాన్ పై కత్తికట్టింది. ఇరాన్ షియా ఇస్లామిస్టులతో చేయి కలిపి బ్రదర్హుడ్ చివరికి తమ రాచరికం కాళ్ల కింద అరబ్బు విప్లవం మంటలు రేపుతుందనే భయం దానికి పట్టుకుంది. ఈజిప్ట్‌లోని బ్రదర్హుడ్ కుంభ స్థలాన్ని బద్దలు కొట్టనిదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాని శాఖలను అదుపులో పెట్టలేమని భావించింది. బ్రదర్హుడ్ ఈజిప్షియన్లను షియాలుగా మార్చేస్తుందని, సున్నీ మనుగడకు ముప్పు రానున్నదని ప్రచారం సాగిస్తూ సిసీ సౌదీ బంటుగా బ్రదర్‌హుడ్‌ను ఏరిపారేస్తున్నారు. మే ఎన్నికల్లో గెలిచి సైనిక పాలనకు ప్రజాస్వామ్యం ముసుగు తొడుగుతారు. సౌదీ పెట్రో డాలర్లతో పెరిగిన సినాయ్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా బాంబులు పేలుస్తూనే ఉంటారు. పి.గౌతమ్ -
దోపిడీని ప్రోత్సహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం