కర్నూలు: ‘‘ఇది ఫ్యాక్షన్ జిల్లా. జిల్లాలో మంత్రాలయం, ఆదోని, బనగానపల్లె వంటి ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. ఈ ప్రాంతాల్లో పర్యటించి వాళ్లను ఎట్లా అణగదొక్కాలి? ఏ విధంగా పోలీసు సాయం తీసుకోవాలి? అనే విషయాల్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలి’’.. ఇవీ బాధ్యత వహించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరో మంత్రి వర్యుడు, ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పిన మాటలు. ఇలా కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీని అణగదొక్కేందుకు పోలీసుల సహాయం తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. కర్నూలు శివారులోని ఎంఆర్‌సీ కన్వెన్షన్‌లో శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అధ్యక్షతన టీడీపీ మినీ మహానాడు చారు. నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కేఈ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంతేకాదు.. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని అణగదొగ్గేందుకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకరించేలా ప్రయత్నించాలని కోరారు. ‘‘అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పదవులు దక్కలేదని కార్యకర్తలు ఆవేదనతో ఉన్న మాట వాస్తవమే. ఏయే నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో కార్యకర్తల కష్టాల గురించి నియోజకవర్గ ఇన్‌చార్జీలు జాబితాలు సిద్ధం చేసి ఇస్తే నా లెటర్‌ప్యాడ్‌పై అధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తా. మండలాల్లో ఏయే అధికారుల వల్ల ఇబ్బంది ఉంది, ఎవరు ఉండకూడదు, ఎవరు కావాలనే జాబితా ఇస్తే దానిపైనే నేను సంతకం పెట్టి అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని అధినేతను కోరతా’’నని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
పోలీసుల సహకారంతో తొక్కేద్దాం
Published Sat, May 23 2015 10:43 PM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM
Advertisement
Advertisement