ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనల నడుమ గ్లోబల్ మార్కెట్ నిన్నంతా (సోమవారం) భారీ నష్టాల్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సైతం భారీ పతనాల్ని ఎదుర్కొన్నాయి. అయితే మంగళవారం కాస్త ఊరటనిచ్చే ఫలితాలు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం(21-12-2021) లాభాలతో మొదలైంది. ఉదయం 9.40గం. సమయంలో నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి(1.09%) 16, 751 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్ 478 పాయింట్లు లాభంతో (1.09%) 56,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్‌లో నిఫ్టీ-సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌గా టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రోలు.. నిఫ్టీలో టాప్ లాసర్స్‌గా సిప్లా, హీరో మోటర్‌కాప్, ఎయిచర్ మోటర్స్, ఉన్నాయి.
ఐసీఐసీఐ, రిలయన్స్, బజాజ్‌ఫైనాన్స్, టాటామోటార్స్, విప్రో లాభాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్‌లో సానుకూల ప్రభావం, దేశీయ కంపెనీల భారీ ఒప్పందాల నడుమ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల పట్టినట్లు నిపుణులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment