Nifty50
-
స్టాక్ మార్కెట్: వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగింపు
Stock Market Closed Update: దేశీ స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 634 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో ట్రేడ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే దలాల్ స్ట్రీట్‌లో గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా పతనం కావడం గమనార్హం. గురువారం 60, 045 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. 59, 068 పాయింట్ల కనిష్టానికి టచ్ అయ్యి.. చివరికి 59, 464 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే.. 1.06 శాతం నష్టంతో సెన్సెక్స్ క్లోజ్ అయ్యింది. మంగళ, బుధ వారాల్లో వరుసగా 656, 554 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. ఇక నిఫ్టీ 17, 921 పాయింట్ల వద్ద గురువారం మొదలై.. ఒకానొక టైంలో 17, 648 పాయింట్లకు చేరి.. చివరికి 17, 757 పాయింట్ల వద్ద ముగిసింది. కిందటి రోజుతో పోలిస్తే.. ఈ పతనం 1.01 శాతం దిగజారింది. భారత ఈక్విటీ మార్కెట్ కీలక సూచీలు పతనం కావడంతో ప్రత్యేకించి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ దారుణంగా నష్టపోయాయి. ఐటీ స్టాక్స్ వరుసగా మూడో రోజూ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, హిందుస్థాన్ యునిలివర్, డాక్టర్ రెడ్డీ ల్యాబోరేటరీస్, సన్ ఫార్మా నష్టాల సెన్సెక్స్‌లో నష్టాలు చవిచూశాయి. -
Stock Market: ఊగిసలాటలో స్టాక్ సూచీలు
శుక్రవారం ఉదయం(డిసెంబర్ 24, 2021) గ్లోబల్ మార్కెట్లో ఫలితాలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అయితే కాసేపటికే స్వల్ఫ నష్టాలు, ఆపై లాభంతో ఊగిసలాట కనిపిస్తోంది. డిసెంబర్ 24 ఉదయం గ్లోబల్ క్యూస్ సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మొదలైంది. లాభాలతో మొదలైన స్వల్ఫ నష్టాలు, ఆ వెంటనే స్వల్ఫ లాభాలతో స్టాక్ సూచీలు కదలాడుతున్నాయి. ఉదయం 9గం.23ని. వద్ద సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో 57, 364 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 27 పాయింట్ల స్వల్ప లాభంతో 17, 100 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల ప్రభావం చూపెట్టినప్పటికీ.. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మార్కెట్ ఊగిసలాటలో ట్రేడ్ అవుతోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, విప్రో, ఐవోసీ లాభాల్లో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్లాండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా క్జూమర్ ప్రొడక్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకులు నష్టాల బాట పట్టాయి. -
స్టాక్ మార్కెట్‌కి ఊరట.. లాభాల్లో ట్రేడ్
ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనల నడుమ గ్లోబల్ మార్కెట్ నిన్నంతా (సోమవారం) భారీ నష్టాల్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సైతం భారీ పతనాల్ని ఎదుర్కొన్నాయి. అయితే మంగళవారం కాస్త ఊరటనిచ్చే ఫలితాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం(21-12-2021) లాభాలతో మొదలైంది. ఉదయం 9.40గం. సమయంలో నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి(1.09%) 16, 751 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 478 పాయింట్లు లాభంతో (1.09%) 56,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో నిఫ్టీ-సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌గా టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రోలు.. నిఫ్టీలో టాప్ లాసర్స్‌గా సిప్లా, హీరో మోటర్కాప్, ఎయిచర్ మోటర్స్, ఉన్నాయి. ఐసీఐసీఐ, రిలయన్స్, బజాజ్‌ఫైనాన్స్, టాటామోటార్స్, విప్రో లాభాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లో సానుకూల ప్రభావం, దేశీయ కంపెనీల భారీ ఒప్పందాల నడుమ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల పట్టినట్లు నిపుణులు చెప్తున్నారు. -
స్టాక్ మార్కెట్ ఊరట.. లాభాలతో మొదలు
ఒమిక్రాన్ తీవ్రత భారత ఎకానమీపై అంతగా ఉండదన్న ఆర్థిక శాఖ ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడం తదితర పరిణామాలు స్టాక్ మార్కెట్‌ను లాభాల ట్రాక్ ఎక్కించాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం(13, డిసెంబర్ 2021) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండడంతో.. దేశీ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో నడుస్తున్నాయి. పైగా గత కొన్ని రోజుల దిద్దుబాటు నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 10:09 గంటల సమయంలో సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో 59,158 వద్ద.. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 17,625 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.59 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా మినహా అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టైటన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి. చదవండి: ఎకామనీపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ అంతంతే!- ఆర్థిక శాఖ -
90 శాతం కంపెనీల్లో తగ్గిన ఎఫ్ఐఐ వాటా!
నాలుగో త్రైమాసికంలో దాదాపు 90 శాతం నిఫ్టీ కంపెనీల్లో విదేశీ మదుపరులు వాటాలు తగ్గించుకున్నాయి. బడ్జెట్ టెన్షన్స్, కరోనా కలకలం, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ఎఫ్ఐఐలు పోర్టుఫోలియోల్లో అమ్మకాలకు దిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ధోరణే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్షోభాల కారణంగా నిఫ్టీ 500లో విదేశీకంపెనీల వాటా ఐదేళ్ల కనిష్ఠాలకు దిగివచ్చిందని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిల్లో ఒకమోస్తరుగా కొనుగోళ్లు చేసిన ఎఫ్ఐఐలు మార్చిలో ఒక్కమారుగా రూ.1.2 లక్షల కోట్ల విలువైన అమ్మకాలకు దిగారు. దీంతో ఆ నెల సూచీలు భారీ పతనం చవిచూశాయి. మార్చి త్రైమాసికంలో ఎఫ్ఐఐల అమ్మకాలకు వ్యతిరేకంగా డీఐఐలు కొనుగోళ్లకు దిగాయి. ఈ త్రైమాసికంలో ఎఫ్ఐఐలు నిఫ్టీ 50లోని 78 శాతం కంపెనీల్లో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ 500 కంపెనీల్లో కూడా డీఐఐలు గణనీయంగా కొనుగోళ్లు జరిపాయి. దీంతో నిఫ్టీ 500లో ఎఫ్ఐఐ- డీఐఐ వాటా నిష్పత్తి మరింత క్షీణించింది. గత ఐదేళ్లలో ఈ నిష్పత్తి 2.2 ఉండగా మార్చిలో 1.4కు దిగివచ్చింది. ఇదే ధోరణి కొనసాగేనా? కరోనా సంక్షోభ భయాలు చల్లారడం ఆధారంగా సూచీల్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు పెరగడం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎకానమీ తిరిగి గాడిన పడడం, అంతర్జాతీయ పరిస్థితులు పాజిటివ్‌గా మారడంపై మార్కెట్ తదుపరి భవితవ్యం ఆధార పడి ఉంటుంది. క్యు2లో ఎకానమీ రికవరీ బాట పడితే ఇండియా వైపు తిరిగి విదేశీ మదుపరులు చూస్తారని నిపుణుల అంచనా. అయితే సమీప భవితవ్యంలో మాత్రం ఎఫ్ఐఐల అమ్మకాలే కొనసాగవచ్చని, మిడ్‌టర్మ్‌కు ఈ అమ్మకాలు నిలిచిపోవచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. పెద్దదేశాలు ప్రకటించిన ఉద్దీపనల కారణంగా పెరిగే లిక్విడిటీ నెమ్మదిగా భారతీయ మార్కెట్లోకి వస్తుందని, అందుకు సమయం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. -
ఫార్మా స్టాక్స్ ర్యాలీ: లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50.12 పాయింట్ల లాభంలో 31,159.40వద్ద, నిఫ్టీ 19.65 పాయింట్ల లాభంలో 9624.55గా క్లోజ్ అయ్యాయి. వరుసగా తొమ్మిది రోజుల పాటు నష్టాల్లో కొనసాగిన ఫార్మా స్టాక్స్ లో కొనుగోలు మద్దతు లభించింది. దీంతో అరబిందో ఫార్మా స్టాక్ భారీగా 13 శాతం మేర దూసుకెళ్లింది. హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా 2 శాతం పైననే లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు కనీసం 2 శాతం మేర లాభపడ్డాయి. నిన్నటి మార్కెట్లో ర్యాలీ సాగించిన ఎఫ్ఎంసీజీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. నేటి ట్రేడింగ్ లో అదానీ పోర్ట్స్, అరబిందో ఫార్మా, ఎన్టీపీసీ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. బీహెచ్ఈఎల్, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్ ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 18 పైసలు బలహీనపడి 64.63 వద్ద నమోదైంది. బంగారం ధరలు ఎంసీఎక్స్ మార్కెట్లో 40 రూపాయల నష్టంలో 28,860గా రికార్డయ్యాయి. -
స్వల్పలాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయంగా, దేశీయంగా స్తబ్ధుగా వస్తున్న సంకేతాలతో నేడు స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 26.65 పాయింట్ల లాభంతో 29545 వద్ద, నిఫ్టీ 11.70 పాయింట్ల లాభంలో 9138 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఐటీసీ, ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంకు , భారతీ ఎయిర్ టెల్, మహింద్రా అండ్ మహింద్రా, గెయిల్, ఐడియా సెల్యులార్, హిందాల్కో ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. విశాఖపట్నం యూనిట్-2కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దిగుమతి అలర్ట్ జారీచేయడంతో దివీస్ ల్యాబ్స్ 17 శాతం పడిపోయింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. 65.39 వద్ద ఎంట్రీ ఇచ్చింది. బంగారం ధర సైతం ఎంసీఎక్స్ మార్కెట్లో స్వల్పంగా 13 రూపాయలు పడిపోయి 28,496 వద్ద ట్రేడవుతోంది. -
2017 ఫస్ట్ ట్రేడింగ్ డే: నష్టాల్లో ముగింపు
ఏడాది ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 31.01 పాయింట్ల నష్టంతో 26,595 వద్ద, నిఫ్టీ 6.30 పాయింట్ల నష్టంతో 8,179 వద్ద ముగిసింది. నష్టాల్లో ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు లాభనష్టాల ఊగిసలాటలో నడిచి, ఆఖరికి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. మధ్యాహ్నం సెషన్లో ఆటో, ఫార్మా స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ తన కీలకమార్కు 8200ను పునరుద్ధరించుకుంది. కానీ ముగింపుకు వచ్చే సరికి మళ్లీ 8,179 పాయింట్లకు పడిపోయింది. 2017 ప్రారంభం రోజున మార్కెట్లు బలహీనంగా ముగిసినప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లు మార్కెట్లో మంచి ప్రదర్శనను కనబరిచాయి. ఈ రెండు సూచీలు 1.2 శాతం పైకి ఎగిశాయి. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు సెషన్ ప్రారంభంలో కొంత రికవరీ అయి, ఆఖరికి 2 శాతం లాభాలను ఆర్జించాయి. ఆటో షేర్లలో మహింద్రా అండ్ మహింద్రా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, మారుతీసుజుకీ 3.8 శాతం మేర లాభాలు పొందాయి. రియాల్టీ స్టాక్స్ కూడా 4 శాతం లాభాల్లో ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలు 0.17 పాయింట్లు పడిపోయి 68.10గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం సైతం 70 రూపాయల లాభంతో 27,515గా ట్రేడ్ అయింది. -
ఆఖరిక్షణాల్లో కోలుకున్న మార్కెట్లు
ముంబై : నెగిటివ్ వాతావరణంలో లాభ, నష్టాలకు మధ్య ఊగిసలాటలో నడిచిన గురువారం నాటి స్టాక్ మార్కెట్లు చివరి క్షణాల్లో కోలుకున్నాయి. అనిశ్చిత పరిస్థితుల నడుమ సెన్సెక్స్ 84.72 పాయింట్ల లాభంలో 27,859 వద్ద ముగిసింది. నిఫ్టీ 16.85 పాయింట్ల లాభంతో 8,592 దగ్గర సెటిల్ అయింది. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మద్దతుతో మార్కెట్లు ఆఖరి క్షణాల్లో లాభాలను నమోదుచేశాయి. ఫ్లాట్‌గా ప్రారంభమై దేశీయ సూచీలు, అనంతరం లాభ, నష్టాలకు మధ్య ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీసీ 1.93 శాతం ఎక్కువగా నమోదై సెన్సెక్స్ ప్యాక్‌లో కొంత లాభాల్లో కంపెనీగా నిలిచింది. లుపిన్ 2 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.32 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.12 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.12 శాతం లాభాలను నమోదుచేశాయి. ఎస్బీఐ 2 శాతం మేర పడిపోయింది. ఎమ్ అండ్ ఎమ్ 1.86 శాతం, గెయిల్ 1.11 శాతం, సన్ ఫార్మా 1.03 శాతం నష్టాలను గడించాయి. అదేవిధంగా నిన్నటి ట్రేడింగ్‌లో సంచనాలు సృష్టించిన అదానీ పోర్ట్స్ 1.95 శాతం మేర పడిపోయి, సెన్సెక్స్ ప్యాక్‌లో రెండో అతిపెద్ద లూజర్‌గా నిలిచింది. నిఫ్టీ50 ఇండెక్స్‌లో, బ్యాంకు ఆఫ్ బరోడా కుదేలైంది. జూన్ క్వార్టర్ ఫలితాలతో షేర్లు 9.23 శాతం మేర క్షీణించాయి. జూన్ త్రైమాసిక ఫలితాలు మిక్స్‌డ్‌గా రికార్డు అవుతుండటంతో, దేశీయ సూచీలు నెమ్మదించాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాఫిట్ బుకింగ్స్ దేశీయ సూచీలకు బాగా దెబ్బ కొడుతుందని వెల్లడిస్తున్నారు. అటు ఆసియన్ మార్కెట్లు సైతం నష్టాలనే నమోదుచేశాయి. -
జీఎస్టీ ఊపు.. లాభాల్లో మార్కెట్లు
ముంబై : జీఎస్టీ బిల్లు ఈ మార్కెట్ సెషన్ లోనే ఆమోదం పొందుతుందనే ఊపుతో దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. నేడు ఈ బిల్లుపై చర్చ జరుగనున్న నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల లాభంతో 28,245 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 59.70 పాయింట్ల లాభంతో 8,698గా కొనసాగుతోంది. హీరో మోటార్ కార్పొరేషన్ దాదాపు 6శాతం ఎగిసింది. బీహెచ్ఈఎల్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎల్&టీ, ఓఎన్జీసీ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, లుపిన్ నష్టాలను చవిచూస్తున్నాయి. బలహీనమైన ఆపరేటింగ్ ఫర్ఫార్మెన్స్ ను జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఐసీఐసీఐ నమోదుచేయడంతో, ఆ బ్యాంకు షేర్లు మార్నింగ్ ట్రేడ్ లో 2శాతం మేర పడిపోయాయి. చైనీస్ ఎకాననీ వృద్ధి , రెండో త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలకంటే పడిపోవడం మరోసారి ఫెడ్ రేట్ పెంపు ఆలస్యం కావొచ్చని సూచనలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. టెక్ మహింద్రా, టాటా కమ్యూనికేషన్, డెల్టా కార్పొరేషన్, ఇంటర్గ్లోబల్ ఏవియేషన్, వీఆర్ఎల్ లాజిస్టిక్స్ వంటి కంపెనీల జూన్ క్వార్టర్ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మార్నింగ్ ట్రేడ్‌లో 31 పైసలు బలపడింది. ప్రస్తుతం 66.73గా కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.485 లాభంతో, 31,516 రూపాయలుగా నడుస్తోంది. -
27వేల మార్కుకు అటూ.. ఇటూ..
ముంబై : నేటి ఫ్రైడే ట్రేడింగ్ ప్రారంభంలో 27వేల మార్కును బీట్ చేసిన సెన్సెక్స్ కొంతమేర తగ్గి 113 పాయింట్ల లాభంలో 26,956గా నమోదవుతోంది. నిఫ్టీ సైతం 29 పాయింట్ల లాభంతో 8,248 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ట్రేడింగ్ ముగిసేనాటికి సెన్సెక్స్ 27,000 మార్కు నుంచి 28,800 కు చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే మార్చి కల్లా సెన్సెక్స్ 30వేల మార్కును బీట్ చేస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. రుతుపవనాల పురోగతి సెన్సెక్స్, నిఫ్టీలు ఏడు నెలల గరిష్ట స్థాయిలో నమోదవడానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్పొరేషన్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్లో లాభాలను పండిస్తుండగా.. భారతి ఎయిర్ టెల్, లుపిన్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, బీహెచ్ ఈఎల్ నష్టాల్లో నడుస్తున్నాయి. రుతుపవనాల పురోగతి స్టాక్ మార్కెట్ లో లాభాలను పండిస్తుందని మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. .అయితే బ్లాక్ డీల్ తర్వాత ఐడియా సెల్యులార్ షేర్లు ఎన్ఎస్ఈ లో 9శాతం మేర పడిపోయాయి. ఈ బ్లాక్ డీల్ ద్వారా 133 మిలియన్ షేర్లు అంటే 3.7శాతం(రూ.1,400 కోట్లు) ఈక్విటీ చేతులు మారబోతుందనే విషయం తెలియగానే, ఐడియా సెల్యులార్ షేర్లు అమ్మకాల బాట పట్టాయి. మరోవైపు పసిడి ధరలు పడిపోతుండగా.. వెండి కొంత మేర లాభాలను నమోదుచేస్తోంది. పసిడి రూ. 23 నష్టంతో రూ.28,840 వద్ద నమోదవుతుండగా.. వెండి రూ.13 లాభంతో రూ.8,541గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 67.23గా ఉంది. -
2015 తర్వాత మొదటిసారి
ముంబై: గురువారం నాటి ట్రేడింగ్ లో దలాల్ స్ట్రీట్ లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఎన్డీఏ సర్కార్ రెండేళ్ల పండుగను స్టాక్ మార్కెట్లు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు గా కనిపిస్తోంది. 2015 నవంబర్ 5 తర్వాత మొదటి సారి నిఫ్టీ 8 వేల మార్క్ ను దాటింది. 78 పాయింట్ల లాభంతో 8,013 దగ్గర ఉంది. అటు అటు సెన్సెక్స్ కూడా 26 వేల స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది. 296 పాయింట్ల లాభంతో 26,177 దగ్గర ఉంది. గత 58 సెషన్లలో 7 వేల స్థాయి నుంచి 8 వేల స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు ఆనందంగా ఉన్నారు. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఆయిల్ రంగంలో నెలకొన్న సానుకూల సంకేతాలను నిష్టీ రీబౌండ్ కు సాయం చేశాయని ఎనలిస్టులు అంటున్నారు.అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాల నేపథ్యంలోనే ఈ ర్యాలీ అని, వడ్డీరేట్లు పెరగనున్నాయనే వార్తలో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో 4.3శాతం లాభాలతో ఇన్వెస్టర్లను లాభాల బాట పట్టించింది. -
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : బ్యాంకింగ్, ఐటీ, రియాల్టీ, ఆటో స్టాక్స్ లో కొనసాగుతున్న నష్టాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఒడిదుడుకులకు లోనవుతోంది. అదేవిధంగా మార్నింగ్ ట్రేడ్ లో 100 పాయింట్ల రేజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ సైతం 63.94 పాయింట్లు నష్టపోతోంది. సెన్సెక్స్ 25,426 వద్ద, నిఫ్టీ 7,796 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా నాలుగో త్రైమాసికంలో రూ.3,230 కోట్ల నష్టాలను నమోదుచేస్తూ శుక్రవారం ఫలితాలను విడుదలచేయడంతో, నేటి ట్రేడింగ్ 7శాతం మేర ఆ బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి. మార్కెట్ విశ్లేషకులు అంచనావేసిన కంటే దారుణంగా దీని లాభాలు పడిపోయాయి. బ్యాంకు ఆప్ బరోడాతో పాటు యూకో బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, దేనా బ్యాంకులు మొండి బకాయిల బెడదతో క్యూ4 ఫలితాల్లో నిరాశను చూపాయి. దీంతో నిఫ్టీ పీఎస్ యూ ఇండెక్స్ 3శాతం కిందకు జారింది. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లాభాల్లో నడుస్తుండగా.. ఎస్ బీఐ, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్ నష్టాలను నమోదుచేస్తున్నాయి. పసిడి, వెండి ధరలు నేటి మార్కెట్లో పుంజుకున్నాయి. పసిడి రూ.63 పెరిగి రూ.30,097గా నమోదవుతుండగా... వెండి రూ.392 పెరిగి రూ. 41,366గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.85గా ఉంది. -
నష్టాలకు బ్రేక్..లాభాల్లో మార్కెట్లు
ముంబై : నిన్నటి ట్రేడింగ్ లో మూడు వారాల కనిష్టానికి పతనమైన స్టాక్ మార్కెట్లు నేటి(మంగళవారం) ట్రేడింగ్ లో కోలుకున్నాయి. సెన్సెక్స్138 పాయింట్ల లాభంలో 25,575.89 వద్ద నమోదవుతుండగా.. నిఫ్టీ 7,800 ట్రేడ్ మార్కును దాటింది. 46.10 పాయింట్ల లాభంతో 7,852 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో నిన్నటి వరకూ నష్టాల్లో నడిచిన బ్యాంకింగ్ షేర్లు రికవరీ అయ్యాయి. మార్కెట్ల ప్రారంభంలో హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బ్యాంకు, ఐసీఐసీఐ, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ లాభాల బాట పటడంతో సెన్సెక్స్ 200 పాయింట్లను దాటి ట్రేడ్ అయింది. ఆటో, బ్యాంకు, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎమ్ సీజీ, రియాల్టి స్టాక్స్, నిఫ్టీని 7,800 ట్రేడ్ మార్కును దాటడానికి దోహదం చేశాయి. మరోవైపు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 11 పైసలు బలపడి రూ.66.33గా ఉంది. ఆసియన్ కరెన్సీ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో రూపాయి బలపడిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. బంగారం, పసిడి కొంతమేర కిందకు జారాయి. పసిడి రూ. 30,267 వద్ద, వెండి రూ. 41,170 వద్ద నమోదవుతున్నాయి.