ముంబై : నేటి ఫ్రైడే ట్రేడింగ్ ప్రారంభంలో 27వేల మార్కును బీట్ చేసిన సెన్సెక్స్ కొంతమేర తగ్గి 113 పాయింట్ల లాభంలో 26,956గా నమోదవుతోంది. నిఫ్టీ సైతం 29 పాయింట్ల లాభంతో 8,248 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ట్రేడింగ్ ముగిసేనాటికి సెన్సెక్స్ 27,000 మార్కు నుంచి 28,800 కు చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే మార్చి కల్లా సెన్సెక్స్ 30వేల మార్కును బీట్ చేస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. రుతుపవనాల పురోగతి సెన్సెక్స్, నిఫ్టీలు ఏడు నెలల గరిష్ట స్థాయిలో నమోదవడానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్పొరేషన్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్లో లాభాలను పండిస్తుండగా.. భారతి ఎయిర్ టెల్, లుపిన్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, బీహెచ్ ఈఎల్ నష్టాల్లో నడుస్తున్నాయి. రుతుపవనాల పురోగతి స్టాక్ మార్కెట్ లో లాభాలను పండిస్తుందని మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. .అయితే బ్లాక్ డీల్ తర్వాత ఐడియా సెల్యులార్ షేర్లు ఎన్ఎస్ఈ లో 9శాతం మేర పడిపోయాయి. ఈ బ్లాక్ డీల్ ద్వారా 133 మిలియన్ షేర్లు అంటే 3.7శాతం(రూ.1,400 కోట్లు) ఈక్విటీ చేతులు మారబోతుందనే విషయం తెలియగానే, ఐడియా సెల్యులార్ షేర్లు అమ్మకాల బాట పట్టాయి.
మరోవైపు పసిడి ధరలు పడిపోతుండగా.. వెండి కొంత మేర లాభాలను నమోదుచేస్తోంది. పసిడి రూ. 23 నష్టంతో రూ.28,840 వద్ద నమోదవుతుండగా.. వెండి రూ.13 లాభంతో రూ.8,541గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 67.23గా ఉంది.
27వేల మార్కుకు అటూ.. ఇటూ..
Published Fri, Jun 3 2016 10:58 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement