స్వల్పలాభాల్లో స్టాక్ మార్కెట్లు | Sensex, Nifty50 start on a positive note; Divi's Lab cracks 17 percent | Sakshi
Sakshi News home page

స్వల్పలాభాల్లో స్టాక్ మార్కెట్లు

Published Tue, Mar 21 2017 10:05 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

Sensex, Nifty50 start on a positive note; Divi's Lab cracks 17 percent

ముంబై : అంతర్జాతీయంగా, దేశీయంగా స్తబ్ధుగా వస్తున్న సంకేతాలతో నేడు స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 26.65 పాయింట్ల లాభంతో 29545 వద్ద, నిఫ్టీ 11.70 పాయింట్ల లాభంలో 9138 వద్ద ట్రేడవుతున్నాయి.  ట్రేడింగ్ ప్రారంభంలో ఐటీసీ, ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంకు , భారతీ ఎయిర్ టెల్, మహింద్రా అండ్ మహింద్రా, గెయిల్, ఐడియా సెల్యులార్, హిందాల్కో ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.
 
విశాఖపట్నం యూనిట్-2కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దిగుమతి అలర్ట్ జారీచేయడంతో దివీస్ ల్యాబ్స్ 17 శాతం పడిపోయింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. 65.39 వద్ద ఎంట్రీ ఇచ్చింది. బంగారం ధర సైతం ఎంసీఎక్స్ మార్కెట్లో స్వల్పంగా 13 రూపాయలు పడిపోయి 28,496 వద్ద ట్రేడవుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement