Divis Lab
-
దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి..
భారత్‌లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొదటిస్థానంలో నిలిచింది. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా ఒక నివేదిక తయారుచేశాయి. గతేడాది అక్టోబరు వరకు ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని రూపొందించాయి. అందులోని కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. టాప్ 3 కంపెనీలు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). దాంతో ఈ కంపెనీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.12.4 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.14.90 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.3 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోని టాప్-500 కంపెనీల (రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్) మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.231 లక్షల కోట్లు)గా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధితో 952 బిలియన్ డాలర్ల (సుమారు రూ.79 లక్షల కోట్ల) విక్రయాలను నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువ. దేశంలోని 70 లక్షల మందికి (మొత్తం ఉద్యోగుల్లో 1.3 శాతం) ఈ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా, ఇందులో 437 మంది మహిళలు ఉన్నారు. 179 మంది సీఈఓ స్థాయిలో ఉన్నారు. కంపెనీ స్థాపించి 10 ఏళ్లు కూడా పూర్తవని సంస్థలు 52 ఉన్నాయి. 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడీ-ప్యారీ కూడా 500 కంపెనీల జాబితాలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాబితాలో 28వ స్థానం సాధించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 2023 ఎడిషన్‌లో మరోసారి టాప్-10 జాబితాలోకి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. హైదరాబాద్ కేంద్రంగా 29 కంపెనీలు ఈ జాబితాలో చోటు సాధించగా, వీటి మార్కెట్ విలువ రూ.5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ మొత్తం విలువ 22% పెరిగింది. దేశంలో సొంతంగా అభివృద్ధి చెందిన సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% పెరిగింది. టాప్ కంపెనీలు(మార్కెట్ విలువ) ఇవే.. దివీస్ ల్యాబ్స్: రూ.90,350 కోట్లు డాక్డర్ రెడ్డీస్: రూ.89,152 కోట్లు మేఘా ఇంజినీరింగ్: రూ.67,500 కోట్లు అరబిందో ఫార్మా: రూ.50,470 కోట్లు హెటెరో డ్రగ్స్: రూ.24,100 కోట్లు లారస్ ల్యాబ్స్: రూ.19,464 కోట్లు సైయెంట్: రూ.17,600 కోట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్: రూ.17,500 కోట్లు డెక్కన్ కెమికల్స్: రూ.15,400 కోట్లు కిమ్స్: రూ.15,190 కోట్లు ఇదీ చదవండి: రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్.. ఈ జాబితాలో సువెన్ఫార్మా, నాట్కోఫార్మా, తాన్లా ప్లాట్‌ఫామ్స్, రెయిన్బో హాస్పిటల్స్, ఆరజెన్ లైఫ్‌సైన్సెస్, అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, యశోదా హాస్పిటల్స్, మెడ్‌ప్లస్, ఒలెక్ట్రాగ్రీన్‌టెక్, ఎన్సీసీ, సీసీఎల్ ప్రొడక్ట్స్, హెచ్‌బీఎల్ పవర్, గ్రాన్యూల్స్, మేధా సర్వో డ్రైవ్స్, కేఫిన్ టెక్, ఎంటార్ కంపెనీలు ఉన్నాయి. -
ఇంటర్ ఫెయిల్, రూ.500తో అమెరికాకి పయనం.. కట్ చేస్తే 47 వేల కోట్లకు అధిపతి!
ఏదో సాధించాలనే తపన..ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాల ఎత్తు ఎదగాల్సిన విద్యార్థులు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని,ఫెయిల్ అయ్యామని మరొకరు ఇలా.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతుంటుంటారు. అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆగి, తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి. తిరిగి పచ్చగా కళకళలాడతాయని అంటున్నారు మురళి దివి. నాడు ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. చేతిలో రూ. 500తో అమెరికాకు వెళ్లారు. కట్ చేస్తే నేడు వేల కోట్ల అధిపతిగా ఎదిగారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు దివిస్ లేబరేటరీస్ అధినేత దివి మురళి కృష్ణ ప్రసాద్. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? మురళి దివి ఎవరు? ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తనకు వచ్చే 10 వేల రూపాయల పెన్షన్‌తో 13 మంది పిల్లల్ని పోషించేవారు. అయినప్పటికీ తన కష్టాన్ని పిల్లలకు తెలియనీయకుండా పెంచారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని శ్రమించారు. కానీ మురళి దివికి ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఆ భయమే ఆయనను ఇంటర్మీడియట్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యేలా చేసింది. వృద్దిలోకి వస్తారనుకున్న కొడుకు ఇలా ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పుడే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందనే సూక్తిని గట్టిగా నమ్మారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కుంగిపోలేదు. ప్రయత్నించారు. చివరికి విజయమే మురళి దివికి బానిసైంది. అందరూ సంపన్నులే.. కానీ తాను మాత్రం ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అప్పటికే మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న తన సోదరుడి వద్దకు పంపారు. అదే ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో చేరారు. అంతర్జాతీయ యూనివర్శిటీ కావడంతో దేశ, విదేశీ విద్యార్ధులు అందులోనూ సంపన్నులు. కానీ తన కుటుంబ నేపథ్యం అందుకు విభిన్నం. ఉన్నత చదువుల కోసం నాన్న, తోబుట్టువులు చేసిన మేలు మరిచిపోలేదని ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎలాగైనా వారి కష్టానికి ప్రతిఫలంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. రేయింబవళ్లు శ్రమించారు. అలా బ్యాచిలర్ డిగ్రీలో యూనివర్సిటీలోనే గోల్డ్ మెడలిస్ట్ సంపాదించారు. అదే యూనివర్సిటీలో బెస్ట్ స్డూడెంట్‌గా గోల్డెన్ అవార్డ్స్‌తో మాస్టర్స్‌ను పూర్తి చేశారు. జీతం రూ.250లే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. వార్నర్స్ హిందుస్థాన్ కంపెనీలో రూ. 250 జీతంతో కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో, అమెరికాలో ఫార్మసిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లు అమెరికా వీసా పొందడం సులభం. అలా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ కావడంతో వీసా దొరికింది. వెంటనే గ్రీన్ కార్డ్ సంపాదించారు. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! చలో అమెరికా కానీ వీసా ఆమోదం తర్వాత మురళికి అమెరికా వెళ్లడానికి 9 నెలలు పట్టింది. 1976-77 సమయంలో తన భార్య, కుమారుడితో కలిసి చేతిలో రూ.500లతో అమెరికాకు పయనమయ్యారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సైంటిస్ట్‌గా పనిచేశారు. తర్వాత కాస్మోటిక్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్ సూపరింటెండెంట్ అయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతు ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జీతం నెలకు రూ.నాలుగున్నర లక్షలకు పెరిగింది. జీవిత భాగస్వామి అంగీకారంతో అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మురళికి ఓ ఆలోచన వచ్చింది. నేను నా కుటుంబ సభ్యులకు, నన్ను కన్న నా దేశానికి దూరంగా ఉంటూ ఇక్కడే ఎందుకు పనిచేయాలి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. వెంటనే భారత్‌కు వచ్చేయాలని అనుకున్నారు. చివరికి జీవిత భాగస్వామి అంగీకారంతో మురళి భారత్‌కు వచ్చారు. చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే? డాక్టర్ అంజిరెడ్డితో పాటు తిరిగి వచ్చిన తర్వాత, ఏం చేయాలో తెలియదు. వ్యాపారం ప్రారంభించాలంటే అంత డబ్బు కూడా లేదు. అమెరికాలో సైంటిస్ట్‌గా సంపాదించిన అనుభవాన్నే ఆస్తిగా మరల్చుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకులు డాక్టర్ అంజి రెడ్డిని సంప్రదించారు. తాను భారత్‌లో ఓ కంపెనీని పెట్టాలని అనుకుంటున్నట్లు తన ఐడియాను వివరించారు. ఆ ఆలోచనకు అంజిరెడ్డి సైతం అకర్షితులయ్యారు. అతని సహకారంతో 'కెమినార్' అనే కంపెనీని కొనుగోలు చేశారు. దేశంలోని ప్రముఖ ఫార్మా తయారీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు భారీగా పెట్టారు. కానీ ప్రయాణం అంత సులభం కాదు. అయితే, ధైర్యం, 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' (బలవంతులదే మనుగడ) నినాదంతో ముందుకు సాగారు. చేసి చూపించారు. ఆ సమయంలో ప్రముఖ వ్యాపార వేత్తలలో ఒకరిగా నిలిచారు. దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ దేశంలోని డిమాండ్లను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్లను ప్రారంభించారు. ఆ అనుభవంతో, సొంతంగా కంపెనీ పెట్టాలనే కోరికతో 1990లో హైదరాబాద్‌లో ‘దివీస్ లేబొరేటరీస్’ ప్రారంభించారు. ఏఐపీఐలు, ఇంటర్మీడియట్ల తయారీకి, వ్యాపారానికి అనుగుణంగా అభివృద్ది చేయడం ప్రారంభించారు. అలా 1995లో మురళి దివి తెలంగాణలోని చౌటుప్పల్‌లోని తన తొలి తయారీ కేంద్రాన్ని, 2002లో విశాఖ సమీపంలో రెండో యూనిట్ ప్రారంభించారు. బిలియనీర్‌గా ఎదిగారు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, 2013లో మురళి బిలియనీర్ అయ్యారు. 2018-19లో అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ భారీగా పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, మురళీ దివి నికర సంపద 5.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని 448వ ధనవంతులుగా నిలిచారు. చదవండి👉 యాపిల్ కంపెనీలో వందల కోట్ల మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
ఇంటర్ 2 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ.72వేల కోట్లకు అధిపతి
జీవితం అంటేనే సంతోషం, బాధ, గెలుపు, ఓటమి వీటన్నింటి కలయిక. ఈ రోజు మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య.. కొన్ని రోజుల తర్వాత చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే ఓడిపోయినప్పుడు.. కుంగిపోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి.. విజయం తప్పక వరిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచారు మురళి దివి. ఇంటర్ రెండు సార్లు ఫెయిలైన మురళి దివి.. నేడు 72వేలకు కోట్లకు అధిపతిగా నిలిచారు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మురళి దివికి 12 మంది తోబుట్టువులున్నారు. మురళి తండ్రికి వచ్చే 10 వేల రూపాయల పెన్షనే వారికి జీవినాధారం. సరిపడా ఆదాయం లేనప్పటికి పిల్లల్ని చదువుకు దూరం చేయలేదు మురళి దివి తండ్రి. ఇంటర్‌కు వచ్చే వరకు కూడా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మురళి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..!) మలుపు తిప్పిన సంఘటన ఇలా ఉండగా.. మురళి ఇంటర్ రెండు సార్లు ఫెయిలయ్యాడు. ఈ సంఘటన మురళి జీవితం మీద చాలా ప్రభావం చూపింది. తనను చదివించడం ఆర్థికంగా భారమైనప్పటికి తండ్రి అవేం పట్టించుకోలేదు. కానీ తాను మాత్రం రెండు సార్లు ఫెయిలయ్యాననే బాధ మురళిని పీడించసాగింది. ఆ తర్వాత నుంచి మురళి మరింత కష్టపడి చదివాడు.. అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. ఇంటర్లో ఫెయిలవ్వడం గురించి మురళి అంతర్జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘చదువు విషయంలో నేను చాలా నిజాయతీగా ఉండేవాడిని. చాలా కష్టపడేవాడిని. కానీ నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు మా కుంటుంబ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి అర్థం అయ్యింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. బాగా చదివి.. మంచి ఉద్యోగం సాధించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని భావించాను. కష్టపడి చదివి.. అమెరికాలో ఉద్యోగం సాధించాను’’ అని తెలిపాడు. (చదవండి: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్) అమెరికా ప్రయాణం.. మురళి దివి తన అన్నల మాదిరిగానే కెమిస్ట్‌గా మారే మార్గంలో ఉన్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఈ క్రమంలో మురళి గ్రీన్ కార్డ్ పొంది 1976 లో అమెరికా వెళ్లాడు. ఫార్మసిస్ట్‌గా జీవితం ప్రారంభించాడు. అమెరికాలోని వివిధ కంపెనీలలో పని చేశాడు. చివరకు ఏడాదికి 65 వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. కానీ ఇంటి మీద బెంగ, మాతృభూమి నుంచి వచ్చిన పిలుపు మురళీ దివిని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి.. అనే దాని గురించి ఏం ఆలోచించుకోలేదు మురళి. అప్పుడే అనగా 1984లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రారంభం అయ్యింది. దానిలో చేరాడు మురళి. ఆరేళ్ల తర్వాత రెడ్డీస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా దివిస్ లాబొరేటరీస్‌ని ప్రారంభించాడు. (చదవండి: ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే.. ఎందుకంటే!) బిలియనీర్‌గా ఎదిగాడు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, అనగా 2013లో మురళి బిలియనీర్ అయ్యాడు. 2018-19లో, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచాడు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ గత 3 సంవత్సరాలలో 400% కంటే ఎక్కువ పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ-నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ప్రకారం, మురళీ దివి, అతడి కుటుంబం రూ .72,000 కోట్ల (9.9 బిలియన్ డాలర్లు) నికర సంపదతో ప్రపంచంలోని 384 వ ధనవంతులుగా నిలిచారు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు -
‘దివీస్’ ఆందోళనకారులపై కేసుల తొలగింపునకు సర్కారు ఆదేశాలు
సాక్షి, అమరావతి: దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై పెట్టిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని సంబంధిత యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్థానికులు, మత్స్యకారుల అభ్యంతరాలను పరిష్కరించి, వారి ఆమోదం తెలిపిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలో దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారుల ఆందోళనలు, సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దివీస్ యాజమాన్యం, పరిశ్రమల శాఖ అధికారులు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికుల అభ్యంతరాలన్నీ పరిష్కరించి, వారి ఆమోదం తెలిపే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదన్న ప్రభుత్వ ఆదేశాలకు దివీస్ ఫార్మా డైరెక్టర్ కిరణ్ దివి అంగీకరించారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను దివీస్ యాజమాన్యం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి తెలిపారు. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడంతోపాటు నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపై కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ రవీన్‌రెడ్డి, తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎండీ వివేక్‌యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలివీ ► దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై మోపిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలి. కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. ► మత్స్యకారులకు అవగాహన కల్పించి, వారు స్పష్టమైన అంగీకారానికి వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి. పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలను తప్పనిసరిగా స్థానికులకే ఇవ్వడంతో పాటు సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజ హితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ► అవసరమైతే స్థానికులకు ఉద్యోగాల నిమిత్తం నైపుణ్య సహకారం అందించేందుకు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు. ► దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు హామీ ఇవ్వాలి. ► దీనిని ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి ఎండీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీలో దివీస్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామం వద్ద ఇది ఏర్పాటు కానుంది. యూనిట్–3 ఫెసిలిటీ కోసం రూ.1,500 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 7న నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపింది. అంతర్గత వనరులను దశలవారీగా ఈ కేంద్రం కోసం వెచ్చించనున్నట్టు వెల్లడించింది. ప్రాజెక్టులో తొలి దశ కార్యకలాపాలు 12-18 నెలల్లో మొదలుకానున్నాయి. తయారీ ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన లైసెన్సులను కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నట్టు దివీస్ వెల్లడించింది. కాగా, మంగళవారం కంపెనీ షేరు ధర 0.36% ఎగసి రూ.3,620.50 వద్ద స్థిరపడింది. -
దివీస్ ల్యాబ్స్ Q2 భళా
ముంబై: ఫార్మా రంగ హైదరాబాద్ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం 45 శాతానికిపైగా జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 519.6 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 21 శాతం పెరిగి రూ. 1,749 కోట్లను అధిగమించాయి. ఈ కాలంలో కంపెనీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరినట్లు దివీస్ ల్యాబ్స్ ఫలితాల విడుదల సందర్భంగా తెలియజేసింది. పీబీటీ జూమ్ క్యూ2లో దివీస్ ల్యాబ్స్ పన్నుకు ముందు లాభం(పీబీటీ) 42 శాతం ఎగసి రూ. 693 కోట్లను దాటింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 174 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 16 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదైనట్లు దివీస్ వెల్లడించింది. ప్రస్తుత పెట్టుబడుల వ్యయ ప్రణాళికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రూ. 400 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కస్టమ్ సింథసిస్ ప్రాజెక్టులలో కొత్త బిజినెస్ అవకాశాలను అందుకోనున్నట్లు పేర్కొంది. వీటిని త్వరితగతిన పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. షేరు ఇలా ఏపీఐలు, ఇంటర్మీడియెట్స్ తదితర తయారీ కంపెనీ దివీస్ ల్యాబ్స్.. పలు దేశాలకు ప్రొడక్టులను ఎగుమతి చేస్తోంది. కాగా.. శుక్రవారం బీఎస్ఈలో దివీస్ ల్యాబ్స్ షేరు 1 శాతం బలపడి రూ. 3,238 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,265 వద్ద గరిష్టాన్ని తాకగా.. 3,189 దిగువన కనిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ దివీస్ షేరు 75 శాతంపైగా లాభపడటం గమనార్హం. -
నిఫ్టీలో దివీస్ ల్యాబ్- ఎస్బీఐ లైఫ్- షేర్ల జోరు
మార్కెట్ల నడకను ప్రతిబింబించే ప్రధాన ఇండెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీలో చోటు లభిస్తున్న వార్తలతో ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్.. బీమా రంగ కంపెనీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. సెప్టెంబర్ 25 నుంచీ ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ-50కి ఈ రెండు కంపెనీలూ ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇందుకు వీలుగా భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లను నిఫ్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ కౌంటర్లకు ఆకర్షణ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ వచ్చే నెల నుంచీ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించనున్న వార్తలతో దివీస్ ల్యాబొరేటరీస్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 3315 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,335 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది క్యూ1లో దివీస్ ల్యాబ్ నికర లాభం రూ. 272 కోట్ల నుంచి రూ. 492 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు పెరిగిన విషయం విదితమే. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చే నెల నుంచీ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించనున్న వార్తలతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.3 శాతం జంప్‌చేసి రూ. 881 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 890 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది క్యూ1లో ఎస్బీఐ లైఫ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 390 కోట్లకు ఎగసింది. స్థూల ప్రీమియం 14 శాతం పెరిగి రూ. 7,640 కోట్లకు చేరిన విషయం విదితమే. హెచ్డీఎఫ్సీ లైఫ్ తదుపరి నిఫ్టీలో చోటు సాధించిన రెండో కంపెనీగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నిలవనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
నిఫ్టీ-50లో ఎస్బీఐ లైఫ్, దివీస్, డాబర్!
ఏడాదికి రెండుసార్లు ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి ప్రాతినిధ్యంవహించే కంపెనీల జాబితాను ఎన్ఎస్ఈ.. సమీక్షిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా ఇండెక్స్ షేర్లలో మార్పులు చేపడుతుంటుంది. సాధారణంగా జనవరి 31, జులై 31న సవరణలు ప్రతిపాదిస్తుంటుంది. నిఫ్టీ-50లో విభిన్న రంగాలకు చెందిన 50 బ్లూచిప్ కంపెనీల షేర్లు ప్రాతినిధ్యం వహించే సంగతి తెలిసిందే. ఈ సారి సమీక్షలో భాగంగా మీడియా కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్, పీఎస్‌యూ.. గెయిల్ ఇండియా, టెలికం కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ నిఫ్టీలో చోటు కోల్పోవచ్చని తెలుస్తోంది. వీటి స్థానే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివీస్ ల్యాబ్, డాబర్ ఇండియా నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించవచ్చని ఐడీబీఐ క్యాపిటల్ నివేదిక తాజాగా అంచనా వేసింది. 3 నెలలే స్టాక్ ఎక్స్ఛేంజీలలో కొత్తగా లిస్టయ్యే సెక్యూరిటీల విషయంలో ఆరు నెలలకు బదులుగా మూడు నెలల గణాంకాలనే పరిగణించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఫ్లోటింగ్ స్టాక్ సర్దుబాటులో భాగంగా మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) విధానం ప్రకారం నిఫ్టీ షేర్లలో సవరణలుంటాయని ఐడీబీఐ నివేదిక తెలియజేసింది. ఇండెక్స్ విలువపై ప్రభావం చూపని షేర్ల విభజన, రైట్స్ ఇష్యూ తదితరాలకు సైతం ప్రాధాన్యత ఉంటుందని వివరించింది. లాభాల్లో ఏస్ ఈక్విటీ గణాంకాల ప్రకారం ఈ జనవరి నుంచి చూస్తే దివీస్ ల్యాబ్ షేరు 39 శాతం జంప్‌చేయగా.. డాబర్ 7.3 శాతం బలపడింది. అయితే ఎస్బీఐ లైఫ్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, జీ 5-52 శాతం మధ్య క్షీణించాయి. ఇండెక్స్‌లో ఎంపిక చేసుకునే కంపెనీలకు సంబంధించి వ్యాపార పునర్వ్యవస్థీకరణ, అనుబంధ సంస్థల విడతీత తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉంటుందని, అయితే రికార్డ్ డేట్ ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని ఐడీబీఐ క్యాపిటల్ నివేదిక వివరించింది. డీలిస్టింగ్ బాట పట్టిన వేదాంతా స్థానే ఇటీవల హెచ్డీఎఫ్సీ లైఫ్‌ను నిఫ్టీ-50 ఇండెక్స్‌లో పొందుపరచిన విషయం విదితమే. -
వచ్చే ఏడాది ఫార్మా రయ్!
న్యూఢిల్లీ: గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పేలవమైన పనితీరు చూపించిన ఫార్మా రంగం ఈ ఏడాది 20 శాతం రాబడులనిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు చూపించిన రంగాల్లో ఇది కూడా ఒకటి. ఇక ముందూ ఫార్మా మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫార్మా కంపెనీల షేర్ల ర్యాలీకి ప్రధానంగా తోడ్పడినది డాలర్‌తో రూపాయి 15 శాతం మేర విలువను కోల్పోవడం. రూపాయి తగ్గడం వల్ల ఎక్కువగా లాభపడే కంపెనీ దివీస్ ల్యాబ్స్. ఈ సంస్థకు 90 శాతం ఆదాయాలు డాలర్ రూపంలోనే సమకూరుతున్నాయి. ఇక తమ ఆదాయాల్లో సగం మేర డాలర్ల రూపంలో పొందుతున్న డాక్టర్ రెడ్డీస్, క్యాడిలా హెల్త్‌కేర్, అరబిందో ఫార్మాలు కూడా బలహీన రూపాయి కారణంగా లబ్ధి పొందేవే. అమెరికాలో పరిస్థితులు మెరుగు రూపాయి బలహీనతకు తోడు ఫార్మా రంగానికి కలిసివచ్చిన మరో అంశం అమెరికా మార్కెట్లో ధరల పోటీ తగ్గటం. ధరలపరంగా ఒత్తిళ్లు ఉన్న వాతావరణం గతేడాదితో పోలిస్తే మెరుగుపడింది. మరో రెండు త్రైమాసికాలు ఇదే కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. నియంత్రణ పరమైన రిస్క్‌లు తగ్గడం, కాంప్లెక్స్, స్పెషాలిటీ ఔషధాల్లోకి ప్రవేశించడం వల్ల ఆదాయాలు, లాభాలు మెరుగుపడతాయని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ అనలిస్ట్ దీపక్ మాలిక్ అంచనా వేశారు. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఫార్మా కంపెనీల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్‌కు చెందిన కునాల్ ధర్మేష చెప్పారు. అమెరికాలో ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. ఇక, కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోను క్రమబద్ధీకరించే చర్యలను కూడా అనుసరిస్తున్నాయి. కొన్ని మాలిక్యూల్స్‌పై నష్టాలు వస్తుండటంతో యూఎస్ఎఫ్డీఏ ఆమోదం లభించిన వాటిని సైతం ఉపసంహరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో భారత కంపెనీలు ఇలా 548 ఔషధాలను అమెరికా మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాయి. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఇది రెట్టింపు సంఖ్య. వీటిలో ఎక్కువ మందుల్ని వెనక్కి తీసుకున్నవి సన్ ఫార్మా, తెవా కంపెనీలే. వీటికి బదులు కంపెనీలు కాంప్లెక్స్ జనరిక్స్, తయారీకి కష్ట సాధ్యమైన, లాభదాయకమైన మాలిక్యూల్స్‌పై దృష్టి పెట్టాయి. తద్వారా తమ ఆదాయ, లాభాలను పెంచుకునే వ్యూహాలను అనుసరిస్తున్నాయి. సానుకూలతలు... సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల తర్వాత కంపెనీల యాజమాన్యం అందించిన వివరాల ప్రకారం... లుపిన్కు సంబంధించి ఇండోర్‌లోని పితాంపుర్ యూనిట్–2కు, గోవా యూనిట్‌కు 2019 మధ్యనాటికి యూఎస్ఎఫ్డీఏ నుంచి క్లియరెన్స్ రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు యూనిట్లకు 2017 నవంబర్‌లో యూఎస్ఎఫ్డీఏ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఇక డాక్టర్ రెడ్డీస్ యూనిట్ల క్లియరెన్స్‌కు సమయం పడుతుందని చెబుతున్నారు. విశాఖపట్నం దువ్వాడ అంకాలజీ ప్లాంట్‌లో గత నెల్లో ఎఫ్‌డీఏ తనిఖీలు ఆరంభం కాగా, దీనికి సంబంధించి సానుకూల ఫలితం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు అమెరికా మార్కెట్లో జనరిక్ కంపెనీలు ధరలను శాసించే స్థాయిలో కాకుండా, ముక్కలుగా ఉండటాన్ని గమనించొచ్చు. అగ్ర స్థాయి పది కంపెనీల చేతిలో 55 శాతం మార్కెట్ ఉండటం ఇందుకు నిదర్శనం. దీంతో వాటి మధ్య స్థిరీకరణకు దారితీస్తుందని... శాండజ్‌కు చెందిన జనరిక్ ఔషధాలను అరబిందో 900 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేయడం ఇందులో భాగమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత కంపెనీలకు రుణ భారం తక్కువగా ఉండటం, ఎక్కువ కంపెనీలు చేతిలో నగదు నిల్వలు కలిగి ఉండటంతో అమెరికాలో కొనుగోళ్ల అవకాశాలను సొంతం చేసుకుంటున్నాయని, ఇది పోటీ తగ్గేందుకు దారితీస్తుందని భావిస్తున్నారు. ఈ సానుకూలతల వల్ల జనరిక్ కంపెనీల ఆదాయాలు 15 శాతం పెరగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బ్రోకరేజీ సంస్థలు అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ పట్ల సానుకూలంగా ఉన్నాయి. -
స్వల్పలాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయంగా, దేశీయంగా స్తబ్ధుగా వస్తున్న సంకేతాలతో నేడు స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 26.65 పాయింట్ల లాభంతో 29545 వద్ద, నిఫ్టీ 11.70 పాయింట్ల లాభంలో 9138 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఐటీసీ, ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంకు , భారతీ ఎయిర్ టెల్, మహింద్రా అండ్ మహింద్రా, గెయిల్, ఐడియా సెల్యులార్, హిందాల్కో ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. విశాఖపట్నం యూనిట్-2కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దిగుమతి అలర్ట్ జారీచేయడంతో దివీస్ ల్యాబ్స్ 17 శాతం పడిపోయింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. 65.39 వద్ద ఎంట్రీ ఇచ్చింది. బంగారం ధర సైతం ఎంసీఎక్స్ మార్కెట్లో స్వల్పంగా 13 రూపాయలు పడిపోయి 28,496 వద్ద ట్రేడవుతోంది.