ఆఖరిక్షణాల్లో కోలుకున్న మార్కెట్లు
ముంబై : నెగిటివ్ వాతావరణంలో లాభ, నష్టాలకు మధ్య ఊగిసలాటలో నడిచిన గురువారం నాటి స్టాక్ మార్కెట్లు చివరి క్షణాల్లో కోలుకున్నాయి. అనిశ్చిత పరిస్థితుల నడుమ సెన్సెక్స్ 84.72 పాయింట్ల లాభంలో 27,859 వద్ద ముగిసింది. నిఫ్టీ 16.85 పాయింట్ల లాభంతో 8,592 దగ్గర సెటిల్ అయింది. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మద్దతుతో మార్కెట్లు ఆఖరి క్షణాల్లో లాభాలను నమోదుచేశాయి. ఫ్లాట్గా ప్రారంభమై దేశీయ సూచీలు, అనంతరం లాభ, నష్టాలకు మధ్య ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీసీ 1.93 శాతం ఎక్కువగా నమోదై సెన్సెక్స్ ప్యాక్లో కొంత లాభాల్లో కంపెనీగా నిలిచింది. లుపిన్ 2 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.32 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.12 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.12 శాతం లాభాలను నమోదుచేశాయి.
ఎస్బీఐ 2 శాతం మేర పడిపోయింది. ఎమ్ అండ్ ఎమ్ 1.86 శాతం, గెయిల్ 1.11 శాతం, సన్ ఫార్మా 1.03 శాతం నష్టాలను గడించాయి. అదేవిధంగా నిన్నటి ట్రేడింగ్లో సంచనాలు సృష్టించిన అదానీ పోర్ట్స్ 1.95 శాతం మేర పడిపోయి, సెన్సెక్స్ ప్యాక్లో రెండో అతిపెద్ద లూజర్గా నిలిచింది. నిఫ్టీ50 ఇండెక్స్లో, బ్యాంకు ఆఫ్ బరోడా కుదేలైంది. జూన్ క్వార్టర్ ఫలితాలతో షేర్లు 9.23 శాతం మేర క్షీణించాయి. జూన్ త్రైమాసిక ఫలితాలు మిక్స్డ్గా రికార్డు అవుతుండటంతో, దేశీయ సూచీలు నెమ్మదించాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాఫిట్ బుకింగ్స్ దేశీయ సూచీలకు బాగా దెబ్బ కొడుతుందని వెల్లడిస్తున్నారు. అటు ఆసియన్ మార్కెట్లు సైతం నష్టాలనే నమోదుచేశాయి.