ముంబై : బ్యాంకింగ్, ఐటీ, రియాల్టీ, ఆటో స్టాక్స్ లో కొనసాగుతున్న నష్టాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఒడిదుడుకులకు లోనవుతోంది. అదేవిధంగా మార్నింగ్ ట్రేడ్ లో 100 పాయింట్ల రేజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ సైతం 63.94 పాయింట్లు నష్టపోతోంది. సెన్సెక్స్ 25,426 వద్ద, నిఫ్టీ 7,796 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా నాలుగో త్రైమాసికంలో రూ.3,230 కోట్ల నష్టాలను నమోదుచేస్తూ శుక్రవారం ఫలితాలను విడుదలచేయడంతో, నేటి ట్రేడింగ్ 7శాతం మేర ఆ బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి. మార్కెట్ విశ్లేషకులు అంచనావేసిన కంటే దారుణంగా దీని లాభాలు పడిపోయాయి. బ్యాంకు ఆప్ బరోడాతో పాటు యూకో బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, దేనా బ్యాంకులు మొండి బకాయిల బెడదతో క్యూ4 ఫలితాల్లో నిరాశను చూపాయి. దీంతో నిఫ్టీ పీఎస్ యూ ఇండెక్స్ 3శాతం కిందకు జారింది.
మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లాభాల్లో నడుస్తుండగా.. ఎస్ బీఐ, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్ నష్టాలను నమోదుచేస్తున్నాయి. పసిడి, వెండి ధరలు నేటి మార్కెట్లో పుంజుకున్నాయి. పసిడి రూ.63 పెరిగి రూ.30,097గా నమోదవుతుండగా... వెండి రూ.392 పెరిగి రూ. 41,366గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.85గా ఉంది.
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
Published Mon, May 16 2016 10:39 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM
Advertisement
Advertisement